ఉండవల్లిలోని ప్రజాదర్బార్‌లో బుధవారం అంగన్వాడీ కార్యకర్తలు, సాధికారమిత్రలతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గున్నారు. ఐదు కోట్ల మంది సంతృప్తిగా ఉండేందుకు, సమస్యల పరిష్కారం జరిగేందుకు సాధికార మిత్రలు సేవాభావంతో పనిచేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 1.42 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి 35 కుటుంబాలకు ఒక సాధికార మిత్రను నియమించాం. ప్రతి సాధికార మిత్ర తన పరిధిలోని కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో చూసి అన్నీ అందేలా సాయం చేయాలి. ఎక్కడా, ఎవరికీ ఇబ్బంది లేకుండా చేయడం.. వారి పవిత్ర బాధ్యత’ అని తెలిపారు. రాష్ట్రంలో 90 శాతం ప్రజలు సంతృప్తిగా ఉండేలా చేయడమే తన లక్ష్యమని, అందుకోసం ఐదు లక్షల మంది సాధికార మిత్రల సైన్యం తనతో ఉందని తెలిపారు. ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం ఆదర్శంగా తయారుకావాలన్నారు. ప్రతి కుటుంబం నెలకు రూ.10 వేల ఆదాయం ఆర్జించేలా.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా అనుసంధానం చేసి అందేలా చూడాలని చెప్పారు. సమస్యలు, లోపాలుంటే ప్రభుత్వానికి చెప్పి పరిష్కరించాలన్నారు.

cbn 21062018 2

అయితే, ఈ సందర్భంలో, ఇద్దరు సాధికార మిత్రలు చేసిన ప్రసంగంతో, చంద్రబాబు ఫిదా అయ్యారు. కర్నూల్ జిల్లా నుంచి వచ్చిన, సావిత్రి అనే సాధికార మిత్ర మాట్లాడుతూ "‘సారూ! నేనిదే ఫస్ట్‌ మాట్లాడడం. నాకిచ్చిన 35 కుటుంబాలకు వెళ్లా. ఇద్దరికి ఇళ్లు మంజూరైనా బిల్లుల్లేవు. 8 మంది వృద్ధులకు పింఛన్లు లేవు. ఆ ఇద్దరికీ రూ.90వేలకు పైగా బిల్లులు మంజూరు చేయించా. ఆధార్‌ కార్డు ఆన్‌లైన్‌ కాకపోవడం వల్ల పింఛను రాలేదని తెలిసింది. ఇతర సాధికార మిత్రలతో కలిసి వెళ్లి ఆధార్‌ అనుసంధానం చేయించా. 15వ తేదీన దరఖాస్తు చేస్తే ఒకటో తేదీనే పింఛను వచ్చేసింది. అందరికీ వచ్చేసింది. నువ్వు, నీ కుటుంబం చల్లగా ఉండాలమ్మా అని తాతలు అన్నారు. ఈ దీవెనలు చంద్రన్నకు చెప్పాలి.. ఆయన పనే ఇది.. మళ్లీ వస్తాడని చెప్పా.’ అని అన్నారు.

cbn 21062018 3

అలాగే, కర్నూల్ జిల్లా నుంచి వచ్చిన, సుజాత అనే సాధికార మిత్ర మాట్లాడుతూ ‘నాకు కేటాయించిన ప్రతి ఇంటికీ తిరిగా. ఒక కుటుంబంలో భర్తకు రెండు కిడ్నీలు పోయాయి. డయాలసిస్‌ చేయిస్తున్నారు. చిన్న వయసే. భార్య నాతో చాలా బాధగా ఏడుస్తూ కష్టాలు చెప్పింది. ఆమె టీటీసీ చేసింది. ఆమె కష్టం చూసి ఏడుపొచ్చింది. ముఖ్యమంత్రి సదస్సుకు వెళ్తున్నా. నీ కష్టం చెప్తానని వచ్చా. మీరే ఏదైనా చేయాలి...’ దీని పై ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. కిడ్నీ బాధితుడికి రూ.2 లక్షలు తక్షణ సాయంగా ప్రకటించారు. సాధికార మిత్రలు తమ పరిధిలోని కుటుంబాలపై పూర్తి అవగాహన తెచ్చుకుంటే ఎలాంటి సేవ చేయగలరన్నదానికి ఈ ఇద్దరు సాధికార మిత్రలే ఉదాహరణని చెప్పారు.

ఏపీలో ఒక్క మెమోతో విద్యా శాఖకు చెందిన 21 వేల మంది ఉద్యోగులను తొలగించడం వింతగా ఉంది. ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని’ అని బీజేపీ నేతలు విష్ణుకుమార్ రాజు, విష్ణువర్థన్ రెడ్డి నిన్న విమర్శించిన విషయం తెలిసిందే. ఈ విమర్శలకు ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర రావు కౌంటర్ ఇచ్చారు. సాక్షర భారత్ మిషన్ కార్యక్రమాన్ని నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వమేన‌ని ఫ‌లితంగా 19,336 మంది గౌరవ వేతనం నష్టపోతారని ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు తెలిపారు. వెల‌గ‌పూడిలోని సచివాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలోని వాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయని, అది నిజం కాదని ఆయన వివరణ ఇచ్చారు. సాక్షర భారత్ మిషన్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ పథకమని, అది 2009లో ప్రారంభమైందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల నిష్పత్తి 60:40 గా ఉంటుందని తెలిపారు.

center 20062018 2

కేంద్రం ఈ పథకాన్ని 2016లో, 17లో నిలిపివేస్తున్నట్లు చెబుతూ ఆ రెండేళ్లూ పొడిగిస్తూ వచ్చిందన్నారు. చివరకు ఈ ఏడాది మార్చిలో దీనిని నిలిపివేశారని చెప్పారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 18,862 మంది గ్రామ కోఆర్డినేటర్లు, 494 మంది మండల కోఆర్డినేటర్లు పని చేస్తున్నారన్నారు. గ్రామ కోఆర్డినేటర్ కు నెలకు రూ.2,000, మండల కోఆర్డినేటర్ కు రూ.6,000 గౌరవవేతనం ఇచ్చినట్లు వివరించారు. ఈ కార్యక్రమం స్థానంలో పడో-పడావో కార్యక్రమం చేపట్టడానికి కేంద్రం రంగం సిద్ధం చేసిందన్నారు. ఈ కార్యక్రమాన్ని నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వమని, అయితే బీజేపీ నేతలు విష్ణు కుమార్ రాజు, విష్ణువర్ధన రెడ్డిలు 21 వేల మందిని రాష్ట్ర ప్రభుత్వం తొలగించినట్లు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

center 20062018 3

కేంద్రం ఈ కార్యక్రమాన్ని నిలిపివేయడం ద్వారా మధ్యప్రదేశ్ లో గత అక్టోబర్ లో 20వేల మందిని, గుజరాత్ లో 22వేల మందిని, రాజస్థానంలో 20వేల మందిని, చత్తీస్ గడ్ లో కూడా వేల మందిని తొలగించారని, దేశం మొత్తం మీద లక్ష మంది వరకు తొలగించారని వివరించారు. రాష్ట్ర అక్షరాశ్యత మిషన్ అథారిటీ వద్ద ఉన్న రూ.3.35 కోట్లు, రూ.54.92 లక్షలను తిరిగి ఇచ్చివేయాలని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జాతీయ అక్షరాశ్యత మిషన్ అథారిటీ ఆదేశించిందన్నారు. రాష్ట్రంలోని వాలంటీర్లను తొలగించకుండా కొనసాగించేందుకు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు సార్లు కేంద్రానికి విజ్ఙప్తి చేస్తూ లేఖలు రాసినట్లు తెలిపారు. దీనిపై కేంద్రమే ఒక నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారు. వారిని వాలంటీర్లుగా తొలగించకుండా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుందని, ముఖ్యమంత్రి ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తున్నారని జూపూడి చెప్పారు.

ఢిల్లీలో వైసీపీ - బీజేపీ నేతలు చర్చలు చేస్తూ దొరికిపోవటం, ఇప్పుడు మరో మలుపు తిరిగింది. పీఏసీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఆయన ఢిల్లీలో బీజేపీ నేత రాంమాధవ్‌ని కలిసి కీలక పత్రాలు అందజేసిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు సీరియస్‌గా తీసుకున్నారు. ఇవాళ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ని కలిసి బుగ్గనపై ఫిర్యాదు చేశారు. బుగ్గన పీఏసీ ఛైర్మన్‌గా సభా హక్కులను ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెదేపా నేతలు ఎస్వీ మోహన్‌రెడ్డి, హనుమంతరాయ చౌదరి స్పీకర్‌కు నోటీసులు అందజేశారు. భాజపా నేత రాం మాధవ్‌కు దిల్లీలో కొన్ని కీలక పత్రాలను బుగ్గన అందజేశారని వారు ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెదేపా నేతలు ఎస్వీ మోహన్‌రెడ్డి, హనుమంతరాయ చౌదరి స్పీకర్‌కు నోటీసులు అందజేశారు. భాజపా నేత రాం మాధవ్‌కు దిల్లీలో కొన్ని కీలక పత్రాలను బుగ్గన అందజేశారని వారు ఆరోపించారు.

buggana 20062018 2

బీజేపీ ఎమ్మల్యే ఆకుల సత్యన్నారాయణ, వైసీపీ ఎమ్మల్యే బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి భేటీ పై వార్తలు రావటంతో, ముందు అవి ఖండించారు.. తరువాత సిసి టీవీ ఫూటేజ్ రావటంతో, కలిసి టిఫిన్ చేసాం అని చెప్పారు, కాని రాం మాధవ్ ను కలవలేదు అని చెప్పారు. రాం మాధవ్ ఇంటికి వెళ్లినట్టు లాగ్ బుక్ లో ఉండటంతో, రాం మాధవ్ ఇంటికి వెళ్ళలేదు అని, రాం మాధవ్ ఇంటి దగ్గర ఒక కార్ దిగి, ఇంకో కార్ ఎక్కామని చెప్పారు. మొత్తానికి, ఇరు పార్టీలు కలిసి, రాం మాధవ్ ఇంట్లో భేటీ అయినట్టు, అక్కడ పీఏసీ చైర్మన్‌ హోదాలో, బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి, అసెంబ్లీలోని కొన్ని కీలక పత్రాలు, రాం మాధవ్ కు ఇచ్చినట్టు వార్తలు వచ్చయి. అయితే, ఇప్పుడు ఇవి బుగ్గన మెడకు చుట్టుకుంది.

buggana 20062018 3

ఇదే విషయం పై శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి యనమల కూడా స్పందించారు. పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి కేంద్రానికి కోవర్టుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లి వెళ్లి భాజపా పెద్దలతో బుగ్గన భేటీ కావడం వైకాపా, బీజేపీ కుట్రలకు పరాకాష్ట అని మండిపడ్డారు. పీఏసీ చైర్మన్‌ రాష్ట్రానికి సంబంధించిన విషయాలను ఫిర్యాదు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీ చైర్మన్‌ ఏదైనా విషయాలుంటే స్పీకర్‌కు తెలియజేయాలని అనంతరం శాసనసభలో దాని గురించి చర్చించా లన్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక పాత్రలు, బీజేపీ పెద్దలకు చేరవేయడాన్ని గర్హించారు. లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రకాశం బ్యారేజీ ద్వారా కృష్ణా డెల్టాకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నీరు విడుదల చేశారు. కృష్ణా డెల్టా తూర్పు ప్రధాన కాలువపై కొత్తగా నిర్మించిన నియంత్రిక ద్వారా సీఎం నీరు విడుదల చేసారు. దీనిద్వారా రోజుకు వెయ్యి క్యూసెక్కుల నీరు బ్యారేజీ నుంచి కృష్ణా తూర్పు కాలువ ద్వారా విడుదల చేయనున్నారు. కృష్ణా కాలువలో ముఖ్యమంత్రి గంగపూజ నిర్వహించారు. గతేడాది కంటే వారం రోజుల ముందే కాలువలకు నీరు విడుదల చేసినట్లు తెలిపారు. కృష్ణా డెల్టా ఆధునీకరణ పనుల పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. కృష్ణా తూర్పు డెల్టాలో 7.36లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.

cbn 20062018 3

పశ్చిమ డెల్టా కాలువకు మరో రెండు రోజుల తర్వాత సాగునీరు విడుదల చేయనున్నారు. కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీ నుంచి ఈ ఏడాది జీరో అవుట్ ప్లో ఉందని.. చరిత్రలో ఇలాంటి దారుణమైన పరిస్థితి తొలిసారని సీఎం వ్యాఖ్యానించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా కృష్ణా నది ద్వారా బ్యారేజీకి నీరు రావడం లేదన్నారు. కృష్ణా నదిపై ఎగువ ప్రాంతంలో ప్రాజెక్టులు పెరిగి కిందకు నీరు వచ్చే పరిస్థితి లేదని కొన్నేళ్లుగా కృష్ణా డెల్టాలో అదను తప్పి సాగు చేయాల్సిన పరిస్థితి ఎదురైందని.. పట్టిసీమ నిర్మాణం ద్వారా ఈ సమస్య అదిగమించామన్నారు. గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా వచ్చిన నీటితో కాలువలకు నీరిస్తున్నామని... ముందుగా నీటి విడుదల వల్ల తుఫానులు రాకముందే పంట చేతికొస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

cbn 20062018 4

రాష్ట్రంలో భూగర్భ జలాలు పెంచేలా చర్యలు చేపట్టామన్నారు. సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా నీరు అందించే ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. అభివృద్ధి అడ్డుకోవడమే ప్రతిపక్షం పనిగా పెట్టుకుందని.. అభివృద్ధి ఫలాలు అందుకున్న వారు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సీఎం పిలుపునిచ్చారు. దేశంలోనే నీటి నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ ఘనత సాధించిన ఇంజనీర్లు, అధికారులు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, శాసన సభాపతి మండలి బుద్దప్రసాద్, ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు బుద్దా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Latest Articles

Most Read