జగన్ మోహన్ రెడ్డి గారు, మరియి ఆయన కొత్త స్నేహితులు, ఎక్కడ ఉన్నా, రేపు రేపు ఉదయం ప్రకాశం బ్యారేజీ దగ్గరకు రావల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనవి చేస్తున్నారు. ఎందుకంటే, వీరికి పట్టిసీమ అంటే ఏంటో తెలియదు. అవి ఎక్కడ నుంచి, ఎక్కడకి వేల్తాయో తెలియదు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు క్లాసు తీసుకున్నా వీరికి అర్ధం కాదు. అందుకే రేపు వస్తే, ప్రాక్టికల్ గా చూపించి ట్యూషన్ చెప్పే అవకాసం ఉంటుంది. అప్పుడైనా, ఇలాంటి మంచి ప్రాజెక్ట్ పై, ఎందుకు విషం చిమ్ముతున్నామా అని ఆలోచిస్తారేమో. రేపే ఎందుకంటే... రేపు కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు తరలిరానున్నాయి. పట్టిసీమ నుంచి ప్రస్తుతం 16 పంపుల ద్వారా గోదావరి వడివడిగా కృష్ణా జిల్లాలోకి ప్రవేశించనుంది. మిగిలిన 8 పంపులను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చి కృష్ణా డెల్టా అంతటికీ వీలైనంత త్వరగా సాగునీరు అందించేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సోమవారం సచివాలయంలో పోలవరం ప్రాజెక్టుతో సహా రాష్ట్రంలో తలపెట్టిన 54 ప్రాధాన్య ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు కోట్ల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఈ సీజన్‌కు సన్నద్ధం కావాలని సూచించారు. విస్తరిస్తున్న ఉద్యాన పంటల సాగు, మత్స్య పరిశ్రమల అవసరాన్ని కూడా తీర్చాలన్నారు. భూగర్భ జలాలు 35 మీటర్ల కన్నా దిగువను ఉన్న ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా వ్యవసాయ బోర్లు వేసేందుకు అనుమతులు నిలిపివేయాలని ఆదేశించారు. తాగునీటికి బోర్లు వేసుకునేందుకు మాత్రం అనుమతి ఇవ్వాలన్నారు. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 55.38 శాతం పూర్తయిందని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. కుడి ప్రధాన కాలువ 89.96, ఎడమ కాలువ 61.28 శాతం నిర్మాణం పూర్తయిందన్నారు. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 61.17శాతం, కాఫర్ డ్యాం జెట్ గ్రౌంటింగ్ పనులు 86.60 శాతం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. నీరు-ప్రగతి, వ్యవసాయ రంగంపై టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి ట్యాంకర్లతో తాగునీటి రవాణా అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది తాగునీటి రవాణా బాగా తగ్గిందన్నారు. తాగునీటి సమస్యను గుర్తించిన 500 గ్రామాల్లో ఇన్‌జక్షన్ బోర్ వెల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
నీతి ఆయోగ్ భేటీలో రాష్ట్రం సాధించిన వృద్ధిని వివరించామని, జల సంరక్షణ, పంటల మార్పిడి, పండ్ల తోటల వృద్ధిపై ప్రెజెంటేషన్ ఇచ్చామని చెప్పారు. ఈ నెలలో ఇంతవరకు ఉపాధి నిధులు రూ.576 కోట్లు ఖర్చు చేశామని, గత నెలలో రూ.వెయ్యి కోట్లు లక్ష్యాన్ని అధిగమించామని చెప్పారు. ఉపాధి హామీకి మెటిరియల్ కాంపోనెంట్ నిధులు రూ.830 కోట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. రేషన్ డీలర్లతో ఏర్పాటు చేసిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ రేషన్ కోసం రాలేని పరిస్థితుల్లో ఉన్న వారికి అవసరమైతే వారి గృహాలకే డీలర్ వెళ్లి రేషన్ అందించాలన్నారు. రేషన్ దుకాణదార్ల ఆదాయాన్ని పెంచుతామని, మరిన్ని వస్తువులను విక్రయించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. పౌర సరఫరాల సేవలతో ప్రజా సంతృప్తి శాతాన్ని 90శాతానికి తీసుకెళ్లాలన్నారు. చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుకల పథకాల్లో ప్రజల్లో సంతృప్తి ఉందని, మిగిలిన పథకాల్లోనూ ఇదే తరహా సంతృప్తి రావాలని సూచించారు.