ఒకటి కాదు, రెండు కాదు, అక్కడ సర్వం ఫేక్... ఉన్నది లేనిది, లేనిది ఉన్నది చేసే మాస్టర్ ఆర్ట్స్ లోటస్ పాండ్ పైడ్ బ్యాచ్ సొంతం... సన్నీ లియోన్ కు వచ్చిన జగన్ కూడా, ఫోటోషాప్ చేసి జగన్ కు వచ్చారు అనే చెప్పే ఘనులు ఉన్నారు అక్కడ... బీహార్ లో రోడ్లు చూపించి, ఇది చంద్రబాబు పాలన అంటారు.... తమిళనాడులో ఫోటోలు తమిళ్ రాసి ఉన్న ఫోటోలు చూపించి, చూసారా మా రాజశేఖర్ రెడ్డి పాలనలో, ఎంత మందికి చదువు చెప్పించామో అంటారు... ఈ పైడ్ బ్యాచ్ కి తోడు, సాక్షి ఛానల్ ఉండనే ఉంది. ఈ లోటస్ పాండ్ పైడ్ ఆర్టిస్ట్ బ్యాచ్ కి తోడు, 250 కోట్లు ఇచ్చి తెచ్చుకున్న బీహార్ గ్యాంగ్ కూడా లోకల్ జఫ్ఫా గాళ్ళకి తోడైంది... ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి, ప్రజలను అదే నిజం అని నమ్మించే లోటస్ పాండ్ పైడ్ ఆర్టిస్ట్ బ్యాచ్ లకి, 250 కోట్లు ఇచ్చి తెచ్చుకున్న బీహార్ గ్యాంగ్ కూడా లోకల్ జఫ్ఫా గాళ్ళకి తోడైంది...

jaganpaid 18062018 2

సోషల్ మీడియా మొత్తం ఫేక్ చేసి పడేస్తున్నారు. దీని కోసం వందల, వేలు దొంగ అకౌంట్స్ రెడీ చేశాడు ప్రశాంత్ కిషోర్. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఇలా అన్నీ ఫేక్ ఎకౌంటులతో నింపేసి, విష ప్రచారం చేస్తున్నాడు... ఇదే స్ట్రాటజీతో అప్పుడు మోడీని గెలిపించిన ప్రశాంత్ కిషోర్, ఇక్కడ అదే ఫార్ములా ఉపయోగించి, ఇప్పటికే బొక్క బోర్లా పడ్డాడు. చాలా మందికి వీరి ఘనకార్యాలు తెలిసాయి. అయినా సరే, వారు ఆ స్ట్రాటజీ వదిలి పెట్టలేదు, రోజుకి కొన్ని వందల సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు. అయితే, ఇన్నాళ్ళు వీటికి సరైన ప్రూఫ్ దొరకలేదు... కాని ఇప్పుడు ఈ ఫేక్ బ్యాచ్ దొరికిపోయింది. టీం జగనన్న పేరుతో, ఈ ఫేక్ పైడ్ బ్యాచ్ నడుస్తుంది. ఈ టీంలో జాయిన్ అయితే, డబ్బులే డబ్బులు...

jaganpaid 18062018 3

దీని కోసం ఒక యాప్ క్రియేట్ చేసారు. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా, ఈ యాప్ ద్వారా, వైసిపి సోషల్ మీడియా టీంలో జాయిన్ అయితే వంద రూపాయలు జాయినింగ్ బోనస్. అంతేకాదండోయ్ నెలాఖరున వాళ్ళు ఎన్ని లైకులు, కామెంట్లు, షేర్లు చేస్తే దానికి అన్ని రూపాయలు వాళ్ల పేటీఎం అకౌంట్ లో జమ చేస్తారంట. ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారి పెయిడ్ సోషల్ మీడియా కంపెనీ స్ట్రాటజీ. సిగ్గు ఎగ్గు లేకుండా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి పరువు, మన రాష్ట్ర పరువు తియ్యటానికి, ఈ బీహార్ గ్యాంగ్ చేత, లోటస్ పాండ్ జగత్(న్) కంత్రీ వేషాలు వేస్తున్నాడు... వేషాలు అయితే వేస్తున్నాడు కాని, సెల్ఫ్ గోల్ వేస్తూ, దొరికిపోతున్నారు... ఇవి వీరి పైడ్ ఫేక్ బ్రతుకులు.... వీళ్ళు చెప్పేవి అన్నీ అబద్ధాలే... ఒక్కటి కూడా నిజం ఉండదు... చివరకి, వీడియోలో వాయిస్ కూడా ఫేక్ చేసి నిజం అని నమ్మిస్తున్నారు...

రాయలసీమ పరిధిలో అనంతపురం జిల్లాలో నిర్మితమౌతున్న కియా మోటార్స్‌ సంస్థ నుంచి చిత్తూరు జిల్లా మీదుగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు వరకు నాలుగు లేన్‌లతో జాతీయ రహదారిని నిర్మించే బృహత్‌ ప్రణాళికకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లా, మదనపల్లె – తిరు పతి – నాయుడుపేట రోడ్డు నిర్మాణానికి అవసరమైన సర్వేలు, భూసేకరణ పనులు ఊపందుకున్నాయి. దాదాపు 200 కిలోమీటర్ల మేరకు నిర్మితమయ్యే ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణ వ్యయానికి సంబంధించిన ఎస్టిమేట్లు త్వరలో సిద్ధమయ్యే అవకాశం కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో గత నాలుగేండ్లుగా విస్తృతంగా కొనసాగుతున్న పారిశ్రామిక అభివృద్ది పనులలో భాగంగా కొరియా దేశానికి చెందిన కియామోటార్స్‌ పరిశ్రమ రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటుకావడం ప్రభుత్వం సాధించిన పెద్ద విజయంగా పేర్కొనవచ్చు.

సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలుమార్లు నిర్వహించిన పర్యటనలు, కియా మోటార్స్‌ యాజమాన్యంతో జరిపిన చర్చల ఫలితం గానే సాధ్యమైంది. ఆ కృషి ఫలితంగానే 2017 ఏప్రిల్‌ 20న ఆ యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. అనంతపురం జిల్లా పెనుగొండ గ్రామంలోని ఎర్రమంచి గ్రామం వద్ద ప్రభుత్వం కేటాయించిన 500 ఎకరాల స్థలంలో 13 కోట్ల వ్యయంతో 10 వేల మందికి ఉపాధి లక్ష్యంగా కియామోటార్స్‌ పరిశ్రమ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఆ సంస్థలో తయారు చేసే మోటారు వాహనాల రవాణాకు అటు బెంగుళూరు విమానాశ్రయంతో పాటు ఇటు కృష్ణపట్నం ఓడరేవు ఉత్తమ మార్గమౌతుందని వాణిజ్య రంగ నిపుణులు సూచించారు. ఆ సూచనల కు అనుగుణంగా అనంతరపురం జిల్లాలోని కియా మోటార్స్‌ నుంచి నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం ఓడరేవు వరకు ప్రస్తుతం ఉన్న రహదారిని జాతీయ రహదారిగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. చిత్తూరుజిల్లాలోని శ్రీకాళహస్తి, ఏర్పేడు, రేణి గుంట, సత్యవేడు మధ్య ప్రాంతాలలో అంచలంచ లుగా అభివృద్ది చెందుతున్న ఎలక్ట్రానిక్‌ హబ్‌, ఆటోమోటివ్‌ హబ్‌, ఇండస్ట్రీయల్‌ హ బ్‌లకు ఉపయోగపడే విధంగా జాతీయ రహదారిని నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది.

ఆ క్రమంలోనే అనంతరపురం జిల్లా నుంచి చిత్తూ రులోని మదనపల్లెను కలిపే 190 కిలోమీటర్ల 42 వ నెంబరు జాతీయ రహదారి నుంచి ఉన్న రహదారిని జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలని నిర్ణయిం చింది. ఆ రహదారి జాతీయ రహదారిని కలిపే ప్రస్తుత రోడ్డు మార్గాన్ని నాలుగు లేన్‌లుగా విస్తరించే బృహత్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నెల్లూరు జిల్లాలో నాయుడుపేట నుంచి కృష్ణపట్నం ఓడరేవు వరకు దాదాపు 40 కిలోమీటర్ల రహదారిని నాలుగు లేన్లతో నిర్మించడానికి ప్రణాళిక సిద్ధమైంది. మదనపల్లె- తిరుపతి, తిరుపతి-నాయుడుపేట, నాయుడుపేట- కృష్ణపట్నం మధ్యలో మూడు ప్యాకేజిలుగా దాదాపు 200 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులను చేపట్టే లక్ష్యంతో చిత్తూరు జిల్లా యంత్రాంగం నేతృత్వంలో ప్రస్తుతం సర్వేలు, భూ సేకరణ తదితర మౌళిక కార్య క్రమాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో అవకాశం ఉన్న చోట్ల భూ సేకరణ ద్వారా రోడ్ల విస్తరణ పనులు చేపట్టామని, వీలు కాని చోట్ల ప్రభుత్వ స్థలాల గుండా బైపాస్‌రోడ్లను నిర్మించడం ద్వారా సంబం ధిత అధికారి ఒకరు తెలిపారు. సర్వేలు, భూ సేకర ణలు పూర్తి అయిన తర్వాత వచ్చే సెప్టెంబర్‌ నెలలో మొత్తం ప్రాజెక్టు నిర్మాణ వ్యయానికి స ంబంధించిన అంచనాలు సిద్ధమౌతాయని కూడా ఆ అధికారి తెలిపారు.

అనధికార సమాచారం ప్రకారం దాదాపు రూ. 700 కోట్ల వ్యయంతో అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలను కలిపేవిధంగా భవిష్యత్‌ అవసరా ల కోసం నిర్మితమయ్యే ఈ రహదారి పూర్తి అయితే ఈ మార్గంలో రవాణా వ్యవస్థ మరింత మెరుగవడంతో పాటు ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గి పోతుంది. మొత్తం మీద అనంతపురం, మదనపల్లె, తిరుపతి, నాయుడుపేట, కృష్ణపట్నం నడుమ నాలు గు లేన్‌లతో నిస్తరించనున్న రహదారి వెనక బడిన రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఊపందుకుంటున్న పారిశ్రామిక ప్రగతికి ఊతమివ్వ డంతో పాటు సీమజిల్లాల రవాణా వ్యవస్థకు వరప్రసాదమౌతుందనడంలో సందేహం లేదు.

వైకాపా శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదంటూ ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తిప్పికొట్టారు. ఇదే సమయంలో ఆయన ఆయా నియోజకవర్గాల్లో ఏ మేరకు అభివృద్ధి జరుగుతోందో కూడా ఆదివారం వివరించారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రజలు ఎన్నో ఆశలతో ముఖ్యమంత్రిగా చంద్రబాబును అధికారంలోకి తెచ్చారని, అయితే కొన్ని నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించినప్పటికీ ఈ నాలుగేళ్లలో వారు ఉద్ధరించింది ఏమీ లేదన్నారు.

jagan 18062018 2

కీలకమైన శాసనసభ సమావేశాలకే వైకాపా ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారంటూ గుర్తుచేశారు. వీరిలో ఏ ఒక్కరు కూడా తన నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కావాలని అడిగిన పాపాన పోలేదన్నారు. ఏ నెలకానెల జీతాలు మాత్రం తీసుకుంటూ అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నారన్నారు. తమకు మాత్రం రాష్ట్ర అభివృద్ధే ప్రధాన ఎజెండా అని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలను పట్టించుకోకపోయినా తాము మాత్రం ప్రజలు ఏమాత్రం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. తన శాఖ తరపున వైకాపా ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఏమేరకు ఖర్చుచేసిందీ గణాంక వివరాలు సహా మంత్రి లోకేష్ వివరించారు.

jagan 18062018 3

మరో పక్క, ఏపీలో ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయంటూ వైసీపీ ఎంపీలు, నేతల ప్రశ్నలకు కూడా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఘాటైన సమాధానమిచ్చారు. ఇప్పటికే ఏపీకి 531 పరిశ్రమలు, లక్షా 29వేల 661 కోట్లు పెట్టుబడులు వచ్చాయని, 2.64 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని కేంద్ర పరిశ్రమల శాఖ గతంలో సమాధానమిచ్చిందని అన్నారు. అందుకే ఆ పార్టీవారిని అసెంబ్లీ నుండి పారిపోవద్దని సీఎం పదే పదే రిక్వెస్ట్ చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఎవరైనా ముందుకు వస్తే పరిశ్రమలు ఎక్కడ వచ్చాయో, ఉద్యోగాలు ఎక్కడ కల్పించామో చూపిస్తామన్నారు. పరిశ్రమల మంత్రి స్వయంగా వారిని తన వెంట తీసుకొని వెళ్తారంటూ.. మీరు సిద్ధమా అని లోకేష్ సవాల్ విసిరారు.

అధికార మదం అంటే ఇదే... నా చేతిలో అధికారం ఉంటే, నిన్ను ఎన్ని అయినా అంటాడు, నీ బాధని వెటకారం చేస్తాను, హేళన చేస్తాను అంటూ, గత సంవత్సరాలుగా ఉన్న మన రాజకీయ వ్యవస్థను చూస్తున్నాం... బాధ్యత, భయం అనేది లేకుండా, అధికార మదంతో బ్రతికేస్తారు... ఈ విషయంలో, మన బీజేపీ నాయకులు, నాలుగు ఆకులు ఎక్కువే చదివారు.. 2 సీట్లు నుంచి, ఇక్కడ వరకు వచ్చిన బీజేపీ, గతాన్ని మర్చిపోయి, చంద్రబాబు లాంటి నాయకుడుని, 13 జిల్లాల నాయకుడికి, ఒక జాతీయ పార్టీ సమాధానం చెప్తుందా అంటూ హేళన చెయ్యటం చూసాం.. మీ మోఖాలకి, పెద్ద రాజాధాని కావాలా ? మయసభ కట్టుకుంటారా, అంటూ అమరావతి పై హేళన చెయ్యటం చూసాం.. విభజన హామీలు కోసం పోరాటం చేస్తుంటే, మీకు 85 శాతం అన్ని హామీలు ఇచ్చేసాం, లక్షల కోట్లు ఇచ్చాం అంటూ, మాట్లాడటం చూస్తున్నాం... ఇవన్నీ అధికార మదంతో మాట్లడే మాటలే...

piyush 18062018 2

ఇప్పుడు రైల్వే మంత్రి గారు, మరో అడుగు ముందుకు వేసి, మన బాధను ఎంత వెటకారంగా మాట్లాడారో తెలుసా.... ఈ రోజు, రైల్వే మంత్రి పియూష్ గోయల్ ప్రెస్ మీట్ పెట్టారు. తన శాఖ గురించి, ఎదో చెప్పుకున్నారు. మన ఆంధ్రా విలేకరులు, విశాఖ రైల్వే జోన్‌ గురించి ప్రస్తావించగా చాలా వెటకారంగా సమాధానం చెప్పారు. "ఆసలు మీకు విభజన చట్టంలో ఏముందో తెలుసా ? విశాఖ రైల్వే జోన్‌ పై పరిశీలన చెయ్యమన్నారు. అందుకే పరిశీలన చేస్తూనే ఉన్నాం. ఇదే విషయాన్ని పరిశీలిస్తూనే ఉంటామని, పార్లమెంట్‌లోకూడా చెప్పామని" చెప్పారు. అంటే గత నాలుగేళ్ళుగా పరిశీలిస్తూనే ఉన్నారు... ఎన్ని ఏళ్ళు అయినా పరిశీలిస్తూనే ఉంటాం.. మీరు మళ్ళీ మళ్ళీ అడగకండి, చట్టంలో పరిశీలించమని ఉంది కాబట్టి, మేము పరిశీలిస్తూనే ఉంటాం అంటూ, పియూష్ గోయల్ వెటకారంగా సమాధానం చెప్తూ, 5 కోట్ల ఆంధ్రులని అవమాన పరిచారు.

piyush 18062018 3

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికగా ఉన్న రైల్వే జోన్‌ అంశంపై ప్రజలు సుదీర్ఘంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ఒడిషా రాష్ట్రం ఒప్పుకోలేదంటూ మొదట కేంద్రం మెలికపెట్టింది. అయితే విశాఖ పరిధి వరకు జోన్ ఇస్తే అభ్యంతరం లేదని ఆ రాష్ట్రం చెప్పింది. ఇందుకు ఏపీ కూడా సమ్మతించింది. అప్పటి నుంచి ఇదిగో ఇస్తున్నాం.. అధిగో అంటూ ఇస్తున్నాం అంటూ బీజేపీ నేతలు చెప్పకుంటూ వస్తున్నారు. తాజా పీయూష్ గోయల్ ప్రకటనతో విశాఖ రైల్వే జోన్ ఇవ్వడం కేంద్రానికి ఇష్టం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి గారు అధికార మదంతో చెప్పినట్టు, చట్టంలో పరిశీలించమని ఉంది కాబట్టి, పరిశీలిస్తూనే ఉంటారనమాట...

Advertisements

Latest Articles

Most Read