ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కొద్ది సేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. రేపు జరగనున్న నీతి ఆయోగ్‌ సమావేశంలో ఏపీ సీఎం పాల్గొననున్నారు. చంద్రబాబు భాజపా యేతర సీఎంలతో సమావేశమవుతున్నారు. ఏపీ భవన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పశ్చిమ్‌ బంగ సీఎం మమతా బెనర్జీ భేటీ అయ్యారు. ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వాజ్‌పేయీని పరామర్శించిన దీదీ నేరుగా ఏపీ భవన్‌కు చేరుకోగానే ఆమెకు సాదరస్వాగతం పలికిన సీఎం.. ఆ తర్వాత ఆమెతో సుమారు 20 నిమిషాల పాటు సమావేశమయ్యారు. వీరి భేటీలో పలు కీలక అంశాలను చర్చించినట్టు సమాచారం.

cbndelhi 16062018 2

అనంతరం కేరళ సీఎం పినరయి విజయన్‌, కర్ణాటక సీఎం కుమారస్వామితోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. ప్రస్తుతం నలుగురు సీఎంల కీలక భేటీ కొనసాగుతోంది. రేపు జరగబోయే నీతి ఆయోగ్‌ సమావేశంలో రాష్ట్రాలకు సంబంధించిన అధికారాల విషయంలో ఎలాంటి తేడా వచ్చినా ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై నేతలంతా కూలంకుషంగా చర్చించినట్టు సమాచారం. ఏపీ భవన్‌ వేదికగా జరిగిన ఈ భేటీలో దేశంలో తాజా రాజకీయ పరిణామాలపై నేతలు చర్చిస్తున్నారు. ఈ భేటీ అనంతరం రాత్రికి చంద్రబాబు, మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం కుమారస్వామి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వద్దకు వెళ్లనున్నారు. పలు సమస్యల పరిష్కారం కోసం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయంలో గత కొన్ని రోజులుగా దీక్షకు దిగిన కేజ్రీవాల్‌కు నేతలు సంఘీభావం తెలపనున్నారు.

cbndelhi 16062018 3

అయితే, కేజ్రీవాల్‌ను కలిసేందుకు మమత ఎల్జీ కార్యాలయాన్ని అనుమతి కోరగా.. అధికారులు మమతకు అనుమతి నిరాకరించారు. చంద్రబాబు, మమత, కుమారస్వామి కేజ్రీని కలిసేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఎల్జీ కార్యాలయం తీసుకున్న నిర్ణయంపై ఎలాంటి వైఖరి అనుసరించాలి?, కేజ్రీవాల్‌ను ఎలా కలవాలనే అంశాలపై నలుగురు ముఖ్యమంత్రులు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈరోజు ముస్లింలు రంజాన్‌ పండుగ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. మరోవైపు ఢిల్లీలో రేపు నీతి ఆయోగ్‌ సమావేశం జరగనుంది. దీంతో ఆ సమావేశం వాయిదా వేయాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేఖలు రాసినప్పటికీ నీతి ఆయోగ్‌ అందుకు ఒప్పుకోలేదు. తాజాగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయంపై మాట్లాడారు. ఈద్ ఉన్న విషయం కేంద్ర ప్రభుత్వ అధికారులకు తెలియదా? అని నిలదీశారు. అందుకే ఎవరికీ ఇబ్బంది లేకుండా తేదీని మార్చాలని గతంలో తాను కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు.

అదిగో లగడపాటి సర్వే, ఇదిగో లగడపాటి సర్వే అంటూ గత రెండేళ్ళుగా, ఎవరికి కావాల్సిన సర్వే ఫలితాలు వాళ్ళు ఇచ్చుకుంటూ, లగడపాటి పేరు మీద తోసేసేవారు.. లగడపాటి సర్వే అంటే అంత గురి జనలాకి, అందుకే అందరూ లగడపాటి సర్వే అంటూ వదిలేవారు. కాకపోతే అవన్నీ పుకార్లే అని అనేక సార్లు లగడపాటి చెప్పారు. అయితే, ఇప్పుడు ఆఫీషయల్ గా లగడపాటి సర్వే రిలీజ్ అయ్యింది. లగడపాటి తరుపున సర్వేలు చేసే ఆర్జీ ఫ్లాష్ టీమ్... శ్రీనివాస్ నేతృత్వంలో ఏపీ పల్స్‌ని ఒడిసి పట్టింది, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో అసలు పరిస్థితి ఏంటో వివరించారు. ఈ క్షణంలో ఎన్నికలు జరిగితే టీడీపీకి 110 సీట్లు వస్తాయని సర్వే తేల్చింది. వైసీపీకి 60 సీట్లు వస్తాయని... ఇతరులు మరో 5 సీట్లు సాధించే అవకాశం ఉందని తేల్చింది.

lagadpati 16062018 2

జగన్ పార్టీ 2014లో 174 సీట్లలో పోటీ చేసింది. 67 సీట్లు గెలిచింది. అంటే ఇప్పుడు 7 సీట్లు కోల్పోయింది ! అటు తర్వాత టీడీపీ 8 సీట్లు మెరుగు పడింది. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీ 102 సీట్లు సాధించింది. బీజేపీ అప్పట్లో 13 సీట్లలో పోటీ చేసింది. నాలుగు సీట్లు గెలిచింది. ఇప్పుడు ఇక కొత్తగా వచ్చిన జన సేన ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని తేలిపోయింది. ఇతరుల కోటాలో 5 సీట్లు మాతమ్రే కనిపిస్తున్నాయ్. 2014లో నవోదయపార్టీ మాత్రమే ఒక్క సీటు గెలవగల్గింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనితీరుకి ఎన్ని మార్కులు అనే ప్రశ్నకు, చంద్రబాబు సమర్థంగా పనిచేస్తున్నారు అని 53 శాతానికిపైగా జనం అభిప్రాయ పడ్డారు. లేదు పనిచేయడం లేదు అని అంటున్న వాళ్లు 46 శాతం ఉన్నారు. అంటే చంద్రబాబు పనితీరుపై వ్యతిరేకత 46 శాతం ఉంది. ఇందులో ఇప్పుడు వైసీపీ జనసేన కాంగ్రెస్ ఇతరులు పంచుకోవాల్సి ఉంటుంది.

lagadpati 16062018 3

ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నది ఏ పార్టీ, అని ప్రశ్నించగా, టీడీపీ సమర్థంగా పోరాడుతోంది అంటున్నవాళ్లు 43.84 శాతం కాగా, ఏపీ ప్రత్యేక హోదా కోసం వైసీపీ పోరాడుతోంది అంటున్నవాళ్లు 37.46 శాతం మంది ఉన్నారు. ఇక జనసేన ప్రత్యేక హోదా పోరాటం చేస్తోంది అంటున్నవాళ్లు 9.65 శాతం మంది. ఏపీకి మోదీ అన్యాయం చేసారా అంటే అని సర్వేలో ప్రశ్నిస్తే ఏపీ ఠక్కున స్పందించింది. అవును అంటూ 83 శాతానికిపైగా అవును అని చెప్పారు. లేదు...అన్యాయం చేయలేదు అంటున్నవాళ్ల శాతం 16శాతం మాత్రమే.

రాష్ట్రంలో నీటిపారుద‌ల‌కు సంబంధించిన అన్ని కాలువ‌ల‌ను వ‌ర్చువ‌ల్ విధానంలో ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హిస్తాన‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. శుక్ర‌వారం స‌చివాల‌యంలోని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ స్టేట్ క‌మాండ్ కేంద్రం నుంచి ఆయ‌న ప్ర‌కాశం బ్యారేజీలో పేరుకుపోయిన గుర్ర‌పుడెక్కను బ్యారేజీని వ‌ర్చువ‌ల్ విధానంతో ఆక‌స్మిక త‌నిఖీ చేశారు. బ్యారేజీలో గుర్ర‌పు డెక్క ఆకు పేరుకుపోయినా అధికారులు చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌డంపై ముఖ్య‌మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. నీటి పారుద‌ల శాఖ అధికారుల‌నుద్దేశించి మాట్లాడుతూ బ్యారేజీలో ప‌రిస్థ‌తి అలా ఉంటే మీరంతా ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. దుర్గ ఘాట్‌, త‌దిత‌ర ప్రాంతాలను కూడా ఆయ‌న వ‌ర్చువ‌ల్ త‌నిఖీ చేశారు. నాలుగు రోజ‌ల్లో ప్ర‌కాశం బ్యారేజీ నీరు ప‌రిశుభ్రంగా ఉండాల‌ని నీటి పారుద‌ల శాఖ ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు.

prakaasam 16062018 2

రాష్ట్రంలో సాగు నీటి కాలువ‌ల‌న్నీ కూడా ఇదే త‌ర‌హాలో ఇక‌పై వ‌ర్చువ‌ల్ త‌నిఖీ చేస్తాన‌ని తెలిపారు. డ్రోన్ కెమెరాలు ఉప‌యోగించి సాగు నీటి కాలవ‌ల‌న్నీ కూడా ఇదే త‌ర‌హాలో వ‌ర్చువ‌ల్ త‌నీఖీలు చేస్తాన‌ని, నీటి పారుద‌ల‌కు ఎక్క‌డా కూడా అడ్డంకులు లేకుండా చూడాల‌ని ఆదేశించారు. ఎక్క‌డైనా అధ‌కారులు నిర్ల‌క్ష్యం వ‌హిస్తే క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని హెచ్చ‌రించారు. రాష్ట్రంలో పింఛ‌న్ల పంపిణీ జ‌రుగుతున్న తీరును కూడా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆర్టీజీ కేంద్రంలో స‌మీక్ష నిర్వ‌హించారు. పింఛ‌న్ల పంపిణీ ఎలా జ‌రుగుతున్న‌ది, వాటిపై ప్ర‌జా సంతృప్తి శాతం ఎలా ఉంద‌నే అంశాల‌ను రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి బాబు ఏ వివ‌రించారు. పింఛ‌న్ల పంపిణీపై 79 శాతం సంతృప్తిని వ్య‌క్తం చేశార‌ని తెలిపారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ 21 శాతం మంది అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డానికి గ‌ల కార‌ణాలు విశ్లేషించి ఆ లోపాల‌ను భ‌ర్తీ చేయాల‌ని అన్నారు.

prakaasam 16062018 3

రాష్ట్రంలో ప్ర‌తి నెలా 47,20,253 మంది పింఛ‌న్లు అందుకుంటున్నార‌ని, పింఛ‌న్ల కోసం ప్ర‌భుత్వం ప్ర‌తి నెలా రూ.549 కోట్లు పంపిణీ చేస్తోంద‌న్నారు. వృద్ధుల‌కు వృద్ద్యాప్య పింఛ‌న్లు ఆస‌ర‌గా ఉంద‌ని, పింఛ‌న్ల పంపిణీలో ఎలాంటి అవినీతికి తావులేకుండా పంపిణీ చేస్తున్నామ‌న్నారు. కొన్ని చోట్ల వేలిముద్ర‌లు ప‌డ‌ని స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని, అక్క‌డ ముఖ గుర్తింపు (ఫేషియ‌ల్ రిక‌గ్నిషన్) విధానం అమలు చేస్తామ‌న్నారు. ప్ర‌తి నెల మొద‌టి ప‌ది రోజుల్లోనే దాదాపుగా పింఛ‌న్ల పంపిణీ పూర్తి అయ్యేలా చేస్తాన‌ని తెలిపారు. గ‌త ప్ర‌భుత్వాల హ‌యాంలో దెయ్యాలు పింఛ‌న్లు తీసుకునేవ‌ని, కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేద‌న్నారు. ఎంతో పార‌దర్శ‌కంగా పింఛ‌న్ల‌ను పంపిణీ చేస్తున్నామ‌న్నారు. దేశంలో ఎక్క‌డైనా ఇలాంటి వ్య‌వ‌స్థ ఉందా చెప్పండి అని ఆయ‌న మీడియా ప్ర‌తినిధుల‌ను ప్ర‌శ్నించారు. రాబోయే రోజుల్లో కూడా టెక్నాల‌జీని ఉప‌యోగించి అన్ని ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను కూడా ఇదే స్థాయిలో అమ‌లు చేస్తామ‌ని తెలిపారు. ప్ర‌భుత్వంలో కూడా ఇప్ప‌డు ఎవ‌రూ త‌ప్పించుకోలేర‌ని, అంద‌రూ నిజాయ‌తీ, నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేయాల్సిందేన‌ని తెలిపారు. స‌మావేశంలో ముఖ్య‌మంత్రి కార్యాల‌య కార్య‌ద‌ర్శులు రాజ‌మౌళి, గిరిజా శంక‌ర్‌, సెర్ప్ సీఈఓ కృష్ణ‌మోహ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

విభజన హామీలు అమలు, కోసం జనవరి నెల నుంచి చంద్రబ్బు పోరాటాన్ని ఉధృతం చేసారు. ఓ వైపు ప్రధాని మోదీ మోసాన్ని, మరోవైపు కేంద్రం చేసిన అన్యాయాన్ని ఎండగడుతూ ఢిల్లీపై యుద్ధమే ప్రకటించారు. ఇంకోవైపు టీడీపీకి రాజకీయంగా కూడా ఆ పార్టీకి జాతీయస్ధాయిలో మద్దతు పెరుగుతూ వస్తోంది. ఈ పరిణామాల మధ్య టీడీపీని ఒంటరి చేసి, చంద్రబాబును ఏకాకి చేసేందుకు విపక్ష వైసీపీ ఎన్ని చేయాలో అన్నీ చేస్తోందనే ఆరోపణలొస్తున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబు వ్యతిరేకులందరినీ వైసీపీ కలుస్తోందనే విమర్శలొస్తున్నాయి. ఢిల్లీ పీఎంఓలో ప్రధానిని కలిసినప్పటి నుంచి నిన్నటి మోత్కుపల్లి నరసింహులు భేటీ వరకు ఎంపీ విజయసాయిరెడ్డి ఒకటే ఎజెండాగా పనిచేస్తున్నారు. అంతేకాదు చంద్రబాబును బోనులో నిలబెట్టడమే తమ లక్ష్యమని అసలు ఉద్దేశాన్ని చెప్పేశారు ఆయన.

cbn 16062018 5

ఇటు చంద్రబాబుపై తీవ్ర విమర్శలతో టీడీపీ నుంచి బహిష్కరణకు గురయిన మోత్కుపల్లితో విజయసాయి భేటీ అయ్యారు. చంద్రబాబును గద్దెదింపడమే ఉమ్మడి లక్ష్యమని వీరిద్దరు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా అన్నీ పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. మరోవైపు తిరుమల శ్రీవారి ఆభరణాల లెక్కల్లో అవకతవకలు, కొండపై అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేసిన రమణదీక్షితులు కూడా జగన్‌ను కలిశారు. మిరాశి వ్యవస్ధను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని అందుకే ఆయన్ను కలిశానని దీక్షితులు చెప్పుకొచ్చారు. అంతేకాదు జగన్ న్యాయం చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

cbn 16062018 4

అంతకు ముందు దీక్షితులు ఢిల్లీ వెళ్లి అమిత్‌షాతో పాటు మరికొందరిని కలిసిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. కొండమీద జరిగే అన్యాయాలను చెప్పేందుకే వాళ్లను కలిశానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయంలో న్యాయపోరాటానికి సిధ్దమని ప్రకటించారు. ఆపరేషన్ గరుడలో భాగంగానే దీక్షితులను బీజేపీ ప్రయోగించిందని, మతవిధ్వేషాలు రెచ్చగొట్టి, వెంకన్న మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కలిసి బీజేపీ నేత రాంమాధవ్‌తో భేటీ అవ్వడం రాజకీయంగా సంచలనం సృష్టించింది.

Advertisements

Latest Articles

Most Read