మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. దీర్ఘాకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయీని ఇటీవల ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్‌ పాలకమండలి సమావేశం ముగిసిన అనంతరం చంద్రబాబు నేరుగా ఎయిమ్స్‌ ఆస్పత్రికి చేరుకొని ఆయనను పరామర్శించారు. వాజ్‌పేయీ ఆరోగ్య పరిస్థితి గురించి చంద్రబాబు అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల క్రితం కూడా, వాజ్‌పేయి ఆరోగ్యం పై ఢిల్లీ అధికారులతో మాట్లాడానని బాబు ట్విట్టర్‌లో తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వెళ్లాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు చెప్పారు.

cbn aims 17062018 2

వాజ్‌పేయి తీవ్ర అస్వస్థతకులోను కావడంతో పోయిన వారం ఆయనను హుటాహుటిన ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఎంతోకాలంగా ఆయన శ్వాసకోశ సంబంధ వ్యాధితోనూ, మూత్రపిండాల సమస్యతోనూ బాధపడుతున్నారు. ఆయన ఊపిరితిత్తుల్లో ఒకటి సరిగా పనిచేయడం లేదు. ప్రస్తుతం ఆయనకు డయాలసిస్‌ చేస్తున్నారు. సాధారణ వైద్యపరీక్షల నిమిత్తం, రొటీన్‌ చెకప్‌ కోసమే ఆయనను ఆసుపత్రికి తరలించారని బీజేపీ చెబుతున్నప్పటికీ- వాజపేయి దీర్ఘకాల అస్వస్థత దృష్ట్యా ఆయన ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది.ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పర్యవేక్షణలో వైద్యబృందం ఆయనకు సేవలందిస్తోంది. ఛాతి ఇన్ఫెక్షన్‌, మూత్రపిండ సమస్యలతో ఆయనను తీసుకొచ్చారని.. రక్తశుద్ధి (డయాలసిస్‌)తో పాటు అత్యవసర విభాగం (ఐసీయూ)లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

cbn aims 17062018 3

1998-2004 మధ్య ప్రధానిగా పనిచేసిన వాజ్‌పేయీ అనంతరం ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో క్రమేపీ ప్రజాజీవితానికి దూరమయ్యారు. గత కొన్నేళ్లుగా ఆయన లైఫ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ తో తన ఇంటివద్దే చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ఎయిమ్స్‌కు తరలించడంపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు చెలరేగుతున్నాయి. 2009 నుంచీ ఆయన అచేతన స్థితిలోనే ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే 2015లో వాజ్‌పేయీకి భారతరత్న పురస్కారాన్ని కూడా ఆయన ఇంటివద్దే అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అందజేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎయిమ్స్‌లో చికిత్స అందిస్తున్న డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా వాజ్‌పేయీకి 30 ఏళ్లుగా వ్యక్తిగత వైద్యుడు.

నిన్న సాయంత్రం, లగడపాటి, ఆర్జీస్‌ ఫ్లాష్‌ టీమ్‌ సర్వే ఫలితాలు, రాష్ట్రం మొత్తం చర్చనీయంసం అయ్యాయి. నిక్కచ్చి అంచనాలకు పెట్టింది పేరైన లగడపాటి రాజగోపాల్‌ తరఫున సర్వేలు నిర్వహించే ఆర్జీస్‌ ఫ్లాష్‌ టీమ్‌ సర్వేను, ఏబీఎన్ ఛానల్ ప్రసారం చేసింది. ఎన్నికల నాటికి ఎలాంటి పరిస్థితులుంటాయన్న సంగతి పక్కనపెడితే... ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏమవుతుందనే ప్రశ్న ఎప్పుడూ ఆసక్తికరమే, దీనికి సమాధానం ఈ సర్వే చెప్పింది. ఈ క్షణంలో ఎన్నికలు జరిగితే టీడీపీకి 110 సీట్లు వస్తాయని సర్వే తేల్చింది. వైసీపీకి 60 సీట్లు వస్తాయని... ఇతరులు మరో 5 సీట్లు సాధించే అవకాశం ఉందని తేల్చింది. జగన్ పార్టీ 2014లో 174 సీట్లలో పోటీ చేసింది. 67 సీట్లు గెలిచింది. అంటే ఇప్పుడు 7 సీట్లు కోల్పోయింది ! అటు తర్వాత టీడీపీ 8 సీట్లు మెరుగు పడింది. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీ 102 సీట్లు సాధించింది.

lagadapati 170966018

బీజేపీ అప్పట్లో 13 సీట్లలో పోటీ చేసింది. నాలుగు సీట్లు గెలిచింది. ఇప్పుడు ఇక కొత్తగా వచ్చిన జన సేన ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని తేలిపోయింది. ఇతరుల కోటాలో 5 సీట్లు మాతమ్రే కనిపిస్తున్నాయ్. ఆర్జీస్‌ ఫ్లాష్‌ టీమ్‌ సంస్థ సర్వే అంటే, 100% కరెక్ట్ అవుతుంది అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. 2005 నుంచి ప్రజల నాడిని పసిగట్టడంలో నిమగ్నమైంది. 2016 నవంబరులో, అప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే 2014నాటి ఫలితమే పునరావృతమవుతుందని ఈ సర్వేలో తేలింది. ఇక... నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొన్న సమయంలో... టీడీపీ 56.78 శాతం ఓట్లు సాధించి విజయభేరి మోగిస్తుందని ఈ సర్వే చెప్పింది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆర్జీస్‌ ఫ్లాష్‌ టీమ్‌ చేసిన అనేక సర్వే అంచనాలు నిజమయ్యాయి! అందుకే... ఈ సంస్థ సర్వేలకు అంత క్రేజ్‌...

lagadapati 170966018

అయితే, ఈ సర్వే ఫలితాలు, నిన్నటి నుంచి రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంది. తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలుస్తుంది అనే పోజిటివ్ ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్ళింది. దీంతో ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి తట్టుకోలేక పోతున్నట్టు సమాచారం. 5 కోట్లు ఖర్చు పెట్టి, రాజమండ్రి బ్రిడ్జి నింపిన ఆనందం మరవక ముందే, ఈ సర్వే రావటంతో జగన్ తట్టులేక పోతున్నారు. అందుకే, ఇది ప్రజల్లో బలంగా వెళ్ళక ముందే, దీనికి కౌంటర్ ఇవ్వాలని ప్రశాంత్ కిషోర్ కి చెప్పినట్టు తెలుస్తుంది. 2014 ఎన్నికలకు ముందు, జగన్ 140 సీట్లు గెలుచుకుంటారు అంటూ సర్వే చేసిన సంస్థ పేరుతో, వారంలో మరొక సర్వే రావాలని, సాక్షిలో కాకుండా, మరో ఛానల్ లో ప్రసారం అవ్వాలని, కనీసం 150 సీట్లు జగన్ కు ఇచ్చి, పవన్ కు రెండో స్థానం ఇచ్చి, టిడిపికి మూడో స్థానం ఇవ్వాలని, అది తీసుకుని, విపరీత ప్రాచారం చెయ్యాలని, జగన్ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. మరో వారం రోజుల్లో, ఈ సర్వే మారో మొగనుంది....

నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం సాక్షిగా ప్రధాని నరేంద్రమోడీకి, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని నిలదీశారు ఏపీ సీఎం చంద్రబాబు. విభజన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఏపీకి కేంద్రం తీరని అన్యాయం చేసిందని విమర్శలు గుప్పించారు. గత నాలుగేళ్లుగా కేంద్రం సహాయం చేయకున్నా ఏపీ సొంతంగా అభివృద్ధి చెందుతూ వచ్చిందని అన్నారు. పోలవరం నిర్మాణానికి నిధులు సత్వరమే ఇవ్వాలని అన్నారు. అలాగే నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి కూడా కేంద్రం నిధులివ్వాలని డిమాండ్ చేశారు. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో తొలుత ప్రధాని మోడీ అధ్యక్షోపన్యాసం చేశారు. తరువాత అక్షర క్రమంలో ముందుగా ఏనీ సీఎం చంద్రబాబుకు ప్రసంగించే అవకాశం లభించింది. తన ప్రసంగంలో చంద్రబాబు కేంద్రంపై విమర్శల వర్షం కురిపించారు.

niti 17062018 2

రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఇసుమంతైనా సహకారం అందించడంలేదని దుయ్యబట్టారు. హోదా విషయంలో కేంద్రం మాటతప్పిందని ఫైర్ అయ్యారు. ఒక దశలో కేంద్ర హోంమంత్రి, నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం సమన్వయకర్త రాజ్ నాథ్ సింగ్ చంద్రబాబు ప్రసంగానికి అడ్డు తగిలారు. మీకిచ్చిన సమయం అయిపోయింది. ముగించండని ఆదేశించారు. అయితే చంద్రబాబు ఆయనకు దీటుగా బదులిచ్చి….దేశంలోనే ఏపీ ప్రత్యేకమని గట్టిగా చెప్పి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఏకపక్షంగా రాష్ట్ర విభజన జరిగిందనీ, ఏపీ తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, భూ సేకరణకు నిధులు ఇవ్వడంలో జాప్యం తగదన్నారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం కోసం రాష్ట్రం ఖర్చు చేసిన నిధులను వెంటనే కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీఎస్టీపై కూడా ఆయన ఘాటు విమర్శలు చేశారు. జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు సొంతంగా పన్నులు విధించుకునే అవకాశం లేకపోయిందన్నారు. జీఎస్టీ వల్ల రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలుగుతోందని చెప్పారు. ఇక విశాఖ రైల్వే జోన్ విషయంలో కూడా కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సమంజసంగా లేదని విమర్శించారు.

niti 17062018 3

అయితే, మన రాష్ట్రానికి రెండు రాష్ట్రాల మద్దతు లభించింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని బీహార్ సీఎం నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో మాట్లాడిన వీరిరువురూ కూడా ఏపీకి, ఏమీ సీఎం కు సంఘీ భావం ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా హామీ రాజ్యసభ సాక్షిగా ఇచ్చారనీ, దానికి నెరవేర్చి తీరాలని సమావేశంలో మతమ ప్రసంగాలలో విస్పష్టంగా పేర్కొన్నారు. అలాగే తమ తమ రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. అయితే మీడియా ముందు ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పే కెసిఆర్, అక్కడ మాత్రం మౌనంగా ఉన్నారు. మొత్తానికి, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నీతి ఆయోగ్ వేదికగా ఆంధ్రప్రదేశ్ సమస్యలను జాతీయ స్థాయిలో అందరి దృష్టీ అకర్షించేలా చేయడంలో సఫలీకృతులయ్యారని నితీష్, మమతల ప్రసంగాల ద్వారా తేటతెల్లమైంది.

ఆగష్టు ఒకటితో సర్పంచ్ ల పదవీకాలం ముగుస్తుందని,ఆ గడువు లోపే తదుపరి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. గ్రామ పంచాయతీలకు వచ్చే సాధారణ ఎన్నికలలోపు ఎన్నికలు జరుగుతాయో లేదో అని సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం అవుతున్నది. ఇందులో భాగంగా పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి తన యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడం ప్రారంభించారు. ఆగస్టు 1వ తేదీతో సర్పంచ్‌ల పదవీ కాలం ముగియబోతున్నది. ఈ లోపుగానే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలంటూ పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్‌తో శనివారం ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహించారు.

elections 17062018 2

ఇక త్వరితగతిన పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలు ప్రకటించాల్సి ఉంది. అలాగే నెలాఖరులోపు వార్డుల వారీగా రిజర్వేషన్లు కూడా ప్రకటించాల్సి ఉంది. పరిస్థితులు అనుకూలిస్తే జూలై మాసంలోనే పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలకు ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇందుకు తగిన విధంగా రాష్ట్రంలో కసరత్తు జరుగుతుంది. దీనిలో తొలి అంకమైన ఓటర్ల జాబితా ప్రచురణ షెడ్యూల్‌ ప్రకారం అన్ని పంచాయతీల్లో వార్డుల వారీగా ప్రదర్శిం చాల్సి ఉంది. అందుకు తగ్గ ఏర్పాట్లు దాదాపు అన్ని పంచాయతీల్లోనూ జరుగుతున్నాయి.

elections 17062018 3

ఒక వేల ఆగష్టు దాటితే, ప్రస్తుత పాలక వర్గాల పదవీ కాలం ముగిశాక అన్ని పంచాయితీలకు స్పెషల్‌ ఆఫీసర్లను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు ఒకటితో పాలకవర్గాల పదవీ కాలం ముగుస్తోంది. అంటే రెండు నుంచి కొత్త పాలక వర్గాలు రావాల్సి ఉంటుంది. ఈ లోగా ఎన్నికలు జరిగితేనే అందుకు అవకాశం ఉంటుంది. దీనిపై సందిగ్ధం నెలకొనడంతో పంచాయితీలలో హడావుడి మొదలైంది. "ఇప్పటి వరకు ఓటర్ల జాబితాలు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సామాజిక స్థితి నమోదుతోనే ప్రచురణ చేయడం జరిగేది. ఈ సారి కేవలం ఓటర్ల జాబితాలు మాత్రమే పంచాయతీల్లో ప్రదర్శించాలని ఆదేశాలు వచ్చాయి. ఆ మేరకు జిల్లాలో ఓటర్ల జాబి తాలు తయారు చేస్తాం." అని అధికారులు అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read