ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరుగుతున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమీక్షా సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. కాగా... ఈ సమావేశానికి కేంద్రమంత్రులతో సహా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు విచ్చేశారు. ఈ సందర్భంగా గత సంవత్సరం చేసిన అభివృద్ధి పనులు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమావేశంలో సమీక్షించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశంలో గళమెత్తారు. ఈమేరకు 13 పేజీల సమగ్ర నివేదికను, 20 నిమషాల సమయంలో మాట్లాడారు.

niti ayog 17062018 2

విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా నష్టపోయింది అని, ప్రత్యెక హోదా సహా, ఏ విభజన హామీ కూడా నెరవేరలేదు అని, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో మీరే చెప్పాలి అంటూ నిలదీసారు. అమరావతికి నిధులు, పోలవరం ప్రాజెక్టుకు మంజూరు చేయాల్సిన నిధుల గురించి ఆయన మాట్లాడారు. విభజనతో ఏపీ ప్రజలు కష్టాలు పడుతున్నారని అన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారని, కానీ అమలు చేయలేదని ఆయన విమర్శించారు. విభజనతో ఆర్థికంగా ఏపీ నష్టపోయిందని, రెవెన్యూలోటును భర్తీ చేయాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. జీఎస్టీ వల్ల రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పై, 15వ ఆర్థిక సంఘం విధివిధానాల సవరణలకు కూడా చంద్రబాబు పట్టుబట్టారు.

niti ayog 17062018 3

ముఖ్యమంత్రులకు 7 నిముషాల సమయం కేటాయించారు. ఈ సమయంలో చంద్రబాబు, 7 నిమషాలు పూర్తి కాగానే, మీ టైం అయిపొయింది అని రాజనాథ్ సింగ్ చెప్పటంతో, నేను చెప్పాల్సింది చాలా ఉంది అంటూ, ముఖ్యమంత్రి ప్రసంగం కొనసాగించారు. ఏపీ ప్రత్యేక రాష్ట్రమని, విభజన జరిగిన తర్వాత ఏపీని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందని, కాబట్టి తన స్పీచ్‌ను ప్రత్యేకంగా చూడాలంటూ సుమారు 20 నిముసాల పాటు చంద్రబాబు ప్రసంగించారు. అయితే, అంతకు ముందు, ఎజెండాలో లేని అంశాన్ని ప్రస్తావించకూడదు అంటే నిరసన వ్యక్తం చేసేందుకు కూడా చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇది తెలుసుకుని, కేంద్రం, చంద్రబాబు మాట్లాడినంత సేపు, ఏమి అనకుండా, టైం అయ్యింది అని మాత్రమే చెప్పింది, అయితే దానికి కూడా చంద్రబాబు ధీటుగా స్పందిస్తూ, నేను మాట్లడాలి అని చెప్పి, 20 నిమషాలు ప్రసంగం చేసారు.

రాష్ట్రంలో రాజకీయం మాంచి హీట్ మీద ఉన్న టైంలో, రాష్ట్ర ప్రజలకి, రైతాంగానికి ఒక మాంచి పోజిటివ్ న్యూస్ వచ్చింది. పోయిన ఏడాది కంటే, మూడు రోజుల ముందే, పట్టిసీమ పరవళ్ళు మొదలయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమ ఎత్తిపోతల పథకంలోని మోటార్లను ఆన్‌చేసి గోదావరి నీటిని పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు తరలించే ప్రక్రియను శనివారం సాయంత్రం ప్రాజెక్టు సీఈ వి శ్రీ్ధర్, ఎస్‌ఈ విఎస్ రమేష్‌బాబులు ప్రారంభించారు. గోదావరి నీటి మట్టం పెరగడంతో ఎత్తిపోతల్లోని నాలుగు మోటార్లను ఆన్‌చేసి 1400 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ఎత్తిపోతలలోని 2, 6, 11, 16 నెంబర్ల మోటార్లను ఇంజినీరింగ్ అధికారులు ఆధునిక టెక్నాలజీ ద్వారా ఆన్ చేశారు. శనివారం సాయంత్రం 4.14 గంటలకు ఈ ప్రవాహం మొదలైంది.

pattiseema 17062018

ఈ సందర్భంగా సీఈ శ్రీ్ధర్ మాట్లాడుతూ గత సంవత్సరం జూన్ 19న ఎత్తిపోతలలోని మోటార్లను ఆన్‌చేస్తే, ఈ సంవత్సరం మూడు రోజుల ముందుగా మోటార్లను ఆన్ చేసి కృష్ణా డెల్టాకు గోదావరి నీటిని తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. గత సంవత్సరం జూన్ 19నుంచి నవంబర్ 29వ తేదీ వరకూ 105.8 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలించామని, ఈ సంవత్సరం అంతకన్నా ఎక్కువ టీఎంసీల నీటిని తరలించగలమనే ఆశాభావంతో ఉన్నామన్నారు. గోదావరి నదిలో నీటి లభ్యతను బట్టి ఎత్తిపోతల్లోని 20 మోటార్లను అంచెలంచెలుగా ఆన్‌చేసి రోజుకి 8,400 క్యూసెక్కుల గోదావరి నీటిని తరలిస్తామన్నారు.

pattiseema 17062018

మోటార్లను ఆన్ చేసిన అనంతరం డెలివరీ పాయింట్ వద్దకు వెళ్లిన సీఈ, ఎస్‌ఈ, తదితర అధికారులు కుడి కాలువలోకి వెళుతున్న గోదావరి నీటికి పూజలు నిర్వహించి, అక్కడున్నవారికి మిఠాయిలు పంచారు. ఎస్‌ఈ రమేష్‌బాబు మాట్లాడుతూ ధవళేశ్వరం బ్యారేజ్ వద్దనుంచి 35 వేల క్యూసెక్కుల సముద్రపు నీరు సముద్రంలో కలుస్తుందన్నారు. కాలువలకు 8,500 క్యూసెక్కుల నీటిని మళ్లిస్తున్నారని, ఎగువ గోదావరి నదిలో నీటి లభ్యతను బట్టి ఆదివారం ఆరు మోటార్లు ఆన్ చేసే అవకాశం ఉందన్నారు. గోదావరి నదీ నీటి మట్టం ఎత్తిపోతల పథకం వద్ద 14.65 మీటర్లు నమోదైందని ఎస్‌ఈ రమేష్‌బాబు తెలిపారు. వీరి వెంట కుడి కాలువ ఈఈ కె శేషుబాబు, ఇరిగేషన్ ఈఈ ఆదిశేషు తదితరులు ఉన్నారు. మరో మూడు రోజుల్లో, ఈ నీరు ప్రకాశం బ్యారేజీ వద్దకు రానుంది.

దేశ రాజధాని ఢిల్లీలో, నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తీవ్ర అవమానం జరిగింది. నలుగురు ముఖ్యమంత్రులు, ఢిల్లీ ముఖ్యమంత్రిని కలిసి సంఘీభావం తెలపాలి అనుకుంటే, ఢిల్లీ పోలీసులు, గవర్నర్ అవమాన పరుస్తూ, నలుగురు ముఖ్యమంత్రులకు పర్మిషన్ ఇవ్వలేదు. అంతకు ముందు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పశ్చిమ్‌ బంగ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్‌, కర్ణాటక సీఎం కుమారస్వామి, ఆంధ్రా భవన్ లో కలిసారు. ఈ భేటీ అనంతరం రాత్రికి చంద్రబాబు, మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం కుమారస్వామి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వద్దకు వెళ్ళటానికి, ఢిల్లీ గవర్నర్ కు ఉత్తరం రాసారు. రాత్రి 9 గంటలకు కలుస్తామని చెప్పారు.

cbn 16062018 4cm 2

అయితే నలుగురు సియంలు బయలుదేరిన తరువాత, అనూహ్యంగా, గవర్నర్ భావనానికి వెళ్ళే దారులు అన్నీ పోలీసులు బ్లాక్ చేసారు. అక్కడకు వెళ్ళటానికి పర్మిషన్ లేదని చెప్పారు. గవర్నర్ పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పారు. దీంతో, చేసేది లేక, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ ఇంటికి వెళ్లి, ఆయన తల్లి, భార్య, పిల్లలను పరమార్సించారు. అయితే, ఈ పరిణామం పై, నలుగురు సియంలు చాలా కోపంగా ఉన్నారు. నలుగురు ముఖ్యమంత్రులు కలిసి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవాలి అంటే, ఇన్ని ఆంక్షలు పెడతారా ? ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ, కేంద్రం పై మండి పడ్డారు. ఇదంతా, మోడీ చేస్తున్న కుట్రగా చెప్పారు. అయితే, ఈ విషయం పై ధర్నా చేస్తే ఎలా ఉంటుంది అనే విషయం పై చర్చిస్తున్నారు.

cbn 16062018 4cm 3

పలు సమస్యల పరిష్కారం కోసం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయంలో గత కొన్ని రోజులుగా దీక్షకు దిగిన కేజ్రీవాల్‌కు నేతలు సంఘీభావం తెలపటానికి వెళ్ళాలనుకున్నారు. మరో పక్క, దిల్లీ పాలనలో లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) తీరును నిరసిస్తూ గత కొన్ని రోజులుగా ఎల్జీ కార్యాలయంలో దీక్ష కొనసాగిస్తున్న దిల్లీ సీఎం, మంత్రులపై కేసు నమోదైంది. దీక్షతో ఎల్జీ విధులకు ఆటంకం కల్గించారని ఆరోపిస్తూ అధికారులు నగరంలోని పటేల్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా, మంత్రులు సత్యేంద్ర జైన్‌, గోయల్‌ రాయ్‌పై పోలీసులు 124 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.

చంద్రబాబుని దింపాలి... చంద్రబాబు మళ్ళీ గెలవ కూడదు.. చంద్రబాబుని ఓడించాలి.. ఇవి ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ పెద్దల కలవరింతలు... తమకు ఎదురు తిరిగిన చంద్రబాబు పై, కక్ష తీర్చుకుంటం కోసం, ఒక పెద్ద ఆపరేషనే చేస్తున్నారు.. ఇందుకోసం ఏ అవకాసం వదులుకోవటం లేదు.. మోత్కుపల్లి లాంటి చిన్న నేతను కూడా, వాడుకుంటున్నారు అంటే, వీళ్ళ ఆత్రం అర్ధమవుతుంది.. ఇందులో భాగంగా, ఇప్పటి వరకు తెర వెనుక ఉన్న వ్యవహారలు, ఇప్పుడు ఓపెన్ అవ్వనున్నాయి.. ప్రతి సారి దొంగ చాటుగా కలిసి, దొరుకిపోతున్నాం అని ఏమో, ఇక డైరెక్ట్ గా రంగంలోకి దిగనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకి వ్యతిరేకంగా కలిసి వచ్చే వారందరితో నడిచేందుకు బీజేపీ పావులు కదుపుతుంది. ఇప్పటికే జగన్ పార్టీ, అన్ ఆఫిషయల్ గా,బీజేపీతో కలిసి పని చేస్తుంది. అనేక సార్లు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను కలిసి, డైరెక్ట్ గా రంగంలోకి దిగనున్నారు.

puran 17062018 2

అన్ ఆఫిషయల్ గా, కాకుండా ఆఫిషయల్ గా పవన్ తో కలిసి పని చెయ్యటానికి, రెడీ అవుతుంది బీజేపీ.. పవన్ టార్గెట్ కూడా చంద్రబాబే కాబట్టి, అందరూ కలిసి పని చేయ్యనున్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్‌ను కలిసి చర్చలు జరిపే బాధ్యతను దగ్గుబాటి పురందరేశ్వరికి బీజేపీ అధిష్టానం అప్పగించింది. వారం రోజుల్లో వైజాగ్‌లో పవన్‌ను కలిసి చర్చలు జరపనున్నారని సమాచారం. చంద్రబాబుకు వ్యతి రేకంగా జనసేనను కూడా తమవైపు తిప్పుకునే వ్యూహంలో బీజేపీ ఉంది. ఉత్తరాంధ్ర యాత్రలో ఉన్న పవన్‌ను ఆ ప్రాంతంలోనే కలిసేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపించినట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో పురందరేశ్వరి విశాఖపట్నంలో పవన్‌ను కలుస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

puran 17062018 3

బీజేపీతో ఎన్నికల్లో కలిసే అంశంపై ఆయన అభి ప్రాయాల మేరకు పార్టీ అధిష్టానం స్పందించనుంది. పురంద రేశ్వరి చర్చల అనంతరం పవన్‌ కళ్యాణ్‌ను కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ కలుస్తారని సమాచారం. పవన్‌ కళ్యాణ్‌కు ఎంతో సన్నిహితంగా ఉండే ప్రకాశ్‌ జవదేకర్‌ ఆయనతో చర్చలు జరిపిన తర్వాత పరిస్థితు లను బట్టి అమిత్‌ షా కూడా పవన్‌తో మాట్లాడుతారని తెలుస్తోంది. 019లో ఆంధ్రాలో చంద్రబాబును దెబ్బతీసే వ్యూహం తో ఉన్న భాజపా ఇప్పటికే వైకాపాతో సఖ్యత నెరపుతూ పవన్‌ కళ్యాణ్‌ను కూడా తమ జట్టులో చేర్చుకునే ప్రయత్నాలు ఆరంభించింది. జగన్, పవన్ ఇద్దరూ, అమిత్ షా గుప్పిట్లో ఉన్నారు కాబట్టి, ఇక వీరు కలిసి పని చెయ్యటం లాంచానమే. విడి విడిగా పోటీ చేస్తే, ఓట్లు చీలి, చంద్రబాబు లాభపడతారు కాబట్టి, అందరూ కలిసి పోటీ చేసి, చంద్రబాబుని దించాలి అనే ఉద్దేశంలో ఉన్నారు. మరి, ప్రజా తీర్పు ఎలా ఉంటుందో ఎన్నికలు, వీరి కలియికని ప్రజలు ఎలా అర్ధం చేసుకుంటారో చూడాలి అంటే, ఎన్నికల వరకు ఆగాల్సిందే...

Advertisements

Latest Articles

Most Read