దేశమంతా ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈ-వెహికల్‌) యుగం మొదలవుతోంది. ‘గ్రీన్‌ ఎనర్జీ’ని సద్వినియోగం చేసుకోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయం, పర్యావరణ సహిత రవాణా వ్యవస్థని పెంచాలన్న కేంద్ర ప్రభుత్వం లక్ష్యాల సాకార రూపంగా కరెంటు బళ్లు రోడ్డెక్కనున్నాయి. అమరావతి రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగర రహదారులపైకి మరో రెండు నెలల్లో విద్యుత్‌ వాహనాలు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే చేసుకున్న అవగాహన ఒప్పందం(ఎంఓయూ) మేరకు 500 ఎలక్ట్రిక్‌ బ్యాటరీ వాహనాలను ఇంధన సామర్థ్య సేవల సంస్థ (ఈఈఎస్‌ఎల్‌) సరఫరా చేయనుంది. టాటా, మహేంద్ర సంస్థల నుంచి వాహనాలను కొనుగోలు చేసి వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను ఈఈఎస్‌ఎల్‌ తీసుకుంది.

electric 11062018 2

మొదటి విడతగా వచ్చే వాహనాలను రాష్ట్రంలోని మూడు నగరాల్లోగల ప్రభుత్వశాఖల ఉన్నతాధికారుల వినియోగం కోసం కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దశల వారీగా మొత్తం పదివేల వాహనాలను ప్రభుత్వ అవసరాల కోసం ఉపయోగించుకోనున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర మోటారు వాహనాల వినియోగం తాజా లెక్కల ప్రకారం కోటికిపైగా పెరిగింది. లీటర్‌ డీజిల్‌ వినియోగంతో 2.5 కిలోల బొగ్గు పులుసు వాయువు గాలిలో కలుస్తూ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగంతో కర్బన ఉద్గారాలు జీరో శాతం ఉంటాయని, రూ.10 ధరకు లభించే యూనిట్‌ విద్యుత్తుతో ఆరు కిలో మీటర్ల దూరం కారులో ప్రయాణించొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

electric 11062018 3

విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ప్రవేశపెట్టాక దశల వారీగా అన్ని ప్రాంతాలకు విస్తరింపజేసేలా రాష్ట్రంలో నోడల్‌ ఏజెన్సీగా ఉన్న సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్‌) ప్రణాళికలు రూపొందించింది. 2020-21 నాటికి రాష్ట్రంలో లక్ష ఎలక్ట్రిక్‌ వాహనాలు రోడ్లపైకి తీసుకురావాలన్నది ప్రయత్నం. దిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ఇప్పటికే ఎలక్ట్రిక్‌ వాహనాలు రహదారులపై పరుగులు తీస్తున్నాయి. మూడు ప్రధాన నగరాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల రీఛార్జింగ్‌ కోసం 250 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. బస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్‌మాళ్లు, హోటళ్లు, ఆసుపత్రుల వద్ద వీటిని ప్రారంభిస్తారు. ఇలాంటి స్టేషన్లు కేవలం విద్యుత్తు ఉత్పాదక సంస్థలు మాత్రమే నిర్వహించాలన్న 2003 విద్యుత్‌ చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సవరణలు చేసింది. అందువల్ల ఆసక్తి ఉన్న ఎవరైనా ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం తరఫున త్వరలో ప్రకటన చేయనున్నారు. ఏపీ ‘ఎలక్ట్రానిక్‌ మొబిలిటీ విధానాన్ని’ గత నెలలో మంత్రిమండలి ఆమోదించడంతో త్వరలో జీవో విడుదల కానున్నది.

దవళేశ్వరం కట్టేటప్పుడు మనం లేము... శ్రీశైలం ఆనకట్ట కట్టేటప్పుడు మనం లేము... బెజవాడ ప్రకాశం బేరేజ్ కట్టేటప్పుడు మమనం లేము.. కానీ పట్టిసీమ, పోలవరం, అమరావతి, ఇవి కట్టేటప్పుడు మమనం ఉన్నాము.. అద్భుతాలు ఆవిష్కిరాం జరుగుతూ ఉంటే, మనం కాళ్ళ ముందే చూస్తున్నాం... సర్ధుడైన నాయకుడు వుంటే ఎంత క్లిష్టమైన పనైనా సాధ్యం అని నిరూపిస్తున్నారు.. ఈ రాష్ట్రానికి చెంద్రబాబు ఎందుకు అవసరమో పోలవరం పరుగులే ఒక ఉదాహరణ ... పోలవరంలో డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణ పనులు గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు.. కాని, ఇక్కడ నిన్న మరో అద్భుతం కూడా జరిగింది.. రికార్డు బద్దులు అయ్యింది. కాంక్రీటు పనులు చేపట్టిన నవయుగ సంస్థ సరికొత్త చరిత్రను లిఖించింది. కేవలం 16 గంటల్లో 8వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని చేసి జాతీయస్థాయి రికార్డును బద్దలుకొట్టింది.

polavaram 11062018 2

పోలవరం కాంక్రీటు పనులు మందకొడిగా సాగుతున్న తరుణంలో... రాష్ట్ర ప్రయోజనాల రీత్యా, పాత ధరలకే ఈ పనులు చేపట్టేందుకు నవయుగ సంస్థ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ రంగంలోకి దిగిన తర్వాతే పోలవరం కాంక్రీటు పనులు పరుగులు తీయడం మొదలైంది. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో 24 గంటల వ్యవధిలో 7300 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని జరిగింది. ఇప్పటిదాకా ఇదే జాతీయ రికార్డు. దీనిని ఆదివారం పోలవరం ప్రాజెక్టు అధిగమించింది. 16 గంటల్లో 8వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని జరిగింది. ఉదయం 7 గంటల నుంచి స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌లలో నిరాటంకంగా కాంక్రీట్‌ పనులు కొనసాగాయి. రాత్రి 11 గంటలకల్లా... అంటే 16 గంటల్లో 8000 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను ప్రాజెక్టులో ఉపయోగించారు. జాతీయ రికార్డును బద్దలుకొట్టారు. అంతేకాదు... సోమవారం ఉదయానికి మరో 4వేల క్యూబిక్‌ మీటర్ల పని జరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. అంటే... పదివేల క్యూబిక్‌ మీటర్లను కూడా అధిగమించి, ప్రపంచ రికార్డును సమీపిస్తారన్న మాట! అతి త్వరలోనే ప్రపంచ రికార్డు అయిన త్రీగోర్జె్‌సనూ అధిగమిస్తామని నవయుగ ఎండీ శ్రీధర్‌ తెలిపారు.

polavaram 11062018 3

చైనాలోని త్రీగోర్జె్‌సలో 24 గంటల్లో 13వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని చేశారు. ఇదే స్థాయిలో కాంక్రీట్‌ పనులు కొనసాగిస్తే పోలవరం నిర్మాణం సకాలంలో పూర్తవుతుందని, ప్రపంచ రికార్డు కూడా బద్దలవుతుందని ప్రాజెక్టు సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ రమేశ్‌బాబు పేర్కొన్నారు. కొత్త చరిత్ర సృష్టించిన నవయుగ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం అభినందించింది. మరో పక్క డయాఫ్రమ్‌ వాల్‌ పనులు కూడా పూర్తయ్యాయి. డ్యామ్‌కు పునాదిలాంటి డయా ఫ్రమ్‌వాల్‌! గోదావరి నదీ గర్భంలో రాతి పొర వచ్చేదాకా లోపలికి ఇసుకను తొలుస్తూ వెళ్లి... అక్కడి నుంచి ఒకటిన్నర మీటర్ల మందంతో.. 1750 మీటర్ల పొడవునా డయాఫ్రమ్‌ వాల్‌ను నిర్మించారు. కనిష్ఠంగా 40 మీటర్లు... గరిష్ఠంగా 93.5 అడుగుల లోతు నుంచి డయాఫ్రమ్‌ వాల్‌ను నిర్మించారు. అతి సంక్లిష్టమైన ఈ నిర్మాణం కేవలం 414 రోజుల్లోనే పూర్తయింది. దీంతో... ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది.

నవ్యాంధ్ర ఆర్ధిక రాజధాని విశాఖపట్నం... ఇది ఒక సుందర నగరం... ఎన్నో కంపెనీలు ఇక్కడకు వస్తున్నాయి... టూరిస్ట్ స్పాట్ గా కూడా పేరు ఉంది. ఇలాంటి విశాఖకు, ఇప్పుడు పెద్ద కష్టం వచ్చి పడింది. విశాఖ ఎయిర్ పోర్ట్ కు ఇబ్బంది వచ్చే చర్యలు మొదలయ్యాయి.. కేంద్రం పెడుతున్న టార్చర్ లో, ఇది మరో రకమో ఏమో కాని, విశాఖ ఎదుగుదలకు పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. విశాఖ ఎయిర్ పోర్ట్, తూర్పు నౌకాదళం ఆధీనంలో ఉంది. విమాన రాకపోకలకు నియంత్రించే అధికారం వారికి ఉంది. ఇప్పుడు రోజుకు 5 గంటలపాటు పౌర విమానాల రాకపోకలను నిషేధించే నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా అవతరిస్తున్న విశాఖ ప్రగతికి తీవ్ర ఇబ్బందికరంగా పరిణమించనుంది. ఏటా 24 లక్షల మందికి పైగా ప్రయాణికుల్ని దేశ, విదేశీ గమ్యస్థానాలకు చేరుస్తూ కీలక గుర్తింపు తెచ్చుకున్న ఈ విమానాశ్రయంలో రాకపోకలను నిషేధిస్తే ప్రయాణికులపై ఆర్థిక భారం పడటమే కాకుండా.. సమయం వృథా కానుంది.

vizag 10062018 2

తూర్పు నౌకాదళం సారథ్యంలో నడుస్తోన్న విశాఖ విమానాశ్రయం రన్‌ వేను యుద్ధ విమానాల శిక్షణ కోసం ఉపయోగించుకోవాలని నేవీ నిర్ణయించింది. దీని కోసం రోజుకు ఐదు గంటలు పౌర విమాన సేవలు నిలిపివేయాల్సి వస్తుంది. దీనిపై గత నెలలో విమానాశ్రయం అధికారులు, విమాన సంస్థలతో నేవీ సమావేశం ఏర్పాటు చేసింది. తాము సూచించిన వేళల్లో విమానాలు నడపవద్దని కోరింది. నవంబరు ఒకటవ తేదీ నుంచి పూర్తిగా విమానాశ్రయాన్ని స్వాధీనంలోకి తీసుకుంటామని, ప్రస్తుతం నడుస్తున్న విమానాలను రీ షెడ్యూల్‌ చేసుకోవాలని నావికాదళ అధికారులు స్పష్టం చేశారు. విమానాశ్రయ సమయాలు తగ్గిస్తే విమానాలు తగ్గి రాష్ట్ర ఆర్థిక ప్రగతి, నగర అభివృద్ధి దెబ్బతినే ప్రమాదం ఉన్నప్పటికీ అటు విమానాశ్రయ అధికారులుగానీ, ఇటు నౌకాదళ అధికారులుగానీ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను సంప్రదించ లేదు.

vizag 10062018 3

భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాక దీనిని తీసుకుంటే అభ్యంతరం లేదు. కాని అక్కడ రాకముందే ఇక్కడ రాకపోకలు తగ్గించేస్తే విశాఖలో వాణిజ్య వ్యవహారాలు తీవ్రంగా దెబ్బతింటాయి. నౌకాదళ అధికారుల నిర్ణయం కారణంగా ఐటీ, ఫార్మా, పర్యాటక, ఆతిథ్య రంగాలపై తీవ్ర ప్రభావం పడి ఆర్థిక ప్రగతి దెబ్బతినడమే కాకుండా విశాఖ వచ్చే వారి సంఖ్య తగ్గి కొన్ని విమానాలు రద్దయ్యే ముప్పు ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం రోజుకు 16 విమానాలు రద్దు అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే విదేశీయులను ఆకర్షిస్తున్న పర్యాటక రంగంతో పాటు ఫార్మా, సీఫుడ్‌, అపెరల్‌ ఉత్పత్తులపైనా ప్రభావం పడుతుంది. ప్రస్తుతం విశాఖపట్నం జీడీపీలో దేశంలో తొమ్మిదవ స్థానంలో వుంది. నేవీ నిర్ణయం వల్ల ఈ స్థానం కోల్పోయే ప్రమాదం ఉంది.

తమిళనాడులోని వేలాదిగా ఉన్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూసివేత దిశగా కొనసాగుతుండటంతో వేలాది మందికి ఉపాధి కరువయ్యే ప్రమాదం తలెత్తుతోంది. పరిశ్రమల మూసివేతకు అనేక కారణాలను ఆయా యాజమాన్యాలు చూపిస్తున్నాయి. వాటిలో వస్తు సేవలపన్ను చట్టం అమలు ఒకటని తమిళనాడు ప్రభుత్వం ఒక నివేదిక రూపొందించింది. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్ర మలు 49,329 యూనిట్లు మూసివేసారు. ఎంఎస్ ఎంఇ రంగంలో పనిచేసే ఉద్యోగులు 5,19,075 మందికి తగ్గిపోయారు. 2018-19 ప్రభుత్వ విధాన కీలక నివేదికను పరిశీలిస్తే మొత్తం రిజిస్టరు ఆయిన ఎంఎస్ఎంఇ యూనిట్లు తమిళనాడు రాష్ట్రంలో 2,17,981 యూనిట్లకు పడిపోయాయి. గత ఏడాది 2,67,310 యూనిట్లుగా ఉన్నట్లు ప్రభుత్వమే చెప్తుంది. ఈ రంగంలో ఉపాధి పొందిన కార్మికులు ఉద్యోగులు సైతం 18,97,619 మంది నుంచి 13,78, 544 మందికి తగ్గిపోయారు.

tn industries 10062018 2

తమిళ నాడులో ఈ పరిశ్రమల మూసివేత గతంలో ఎన్నడూ లేనంత అధ్వాన్నంగా ఉందని నివేదిక వెల్లడించింది. పారిశ్రామికశాఖ అధికారులు కార్పొరేట్ల చెల్లింపుల్లో జాప్యం, జీఎస్టీ సంబంధిత అంశాలు, ఆర్డర్లు లేకపోవడం, బ్యాంకుల వెనుకంజ వంటివి కారణాలుగా ఈ పరిస్థితికి కారణం అని చెప్తున్నారు. ఇక పారిశ్రామిక పెట్టుబడుల వాతావరణం కూడా రాష్ట్రంలో సానుకూలంగా లేదు. అనేక పెద్ద పెద్ద పారిశ్రామిక ప్రాజెక్టులు ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశకు తరలిపోయాయని తమిళనాడు ప్రభుత్వం అంచనా. చిన్న పరిశ్రమలు నరఫరా చేసిన ఉత్పత్తులకు కార్పొరేట్ల చెల్లింపుల్లో జాప్యం కూడా కొంత తోడవుతోంది. వీటిలో జీఎస్టీ రిటర్నులు సైతం కొంత సమస్యలు తెచ్చి పెట్టాయి.

tn industries 10062018 3

భారీ పారిశ్రా మిక పెట్టుబడులు రాష్ట్రానికి రావడంలేదని, తమిళనాడు ప్రభుత్వంలో అవినీతే ఇందుకు ప్రధాన కారణమని అన్నారు. పొరుగుననే ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 25వేల కోట్ల పెట్టుబడులు సాధించిందని, కియామోటార్స్, భారత్ఫోర్జ్, అశోక్ లేల్యాండ్, అపోలో టైర్స్ వంటివి, తమిళనాడు రావాల్సినవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లిపోయాయని అంటున్నారు. అలాగే, తమిళనాడు ప్రభుత్వంలో కొరవడిన అనిశ్చితి, ప్రభుత్వంలో సరైన నాయకత్వం లేకోపోటం, మరో పక్క పక్కనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, చంద్రబాబు లాంటి ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ సియం ఉండటంతో, పెట్టుబడులు అన్నీ అటు వేల్లిపోతున్నాయని తమిళనాడు ప్రభుత్వం భావిస్తుంది.

Advertisements

Latest Articles

Most Read