రాష్ట్రంలో అందరికీ పింఛన్లు ఇస్తున్నామని, ఒంటరి మహిళలకు కూడా పింఛను ఇవ్వనున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారందరికీ పింఛన్లు ఇస్తున్నామన్నారు. నవ నిర్మాణ దీక్ష సందర్భంగా ఒక మహిళ 'అందరినీ ఆదుకుంటున్నారు.. నన్ను మాత్రమే వదిలేశారు' అని తనతో చెప్పిందన్నారు. అది నిజమేననిపించిందని, త్వరలోనే ఒంటరి మహిళకూ పింఛను ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అయితే పెళ్లయి, భర్త వదిలేసిన వారికే ఇస్తామని స్పష్టం చేశారు. ఏడు రోజులపాటు జరిగిన నవనిర్మాణ దీక్షలు, మహా సంకల్ప యాత్ర, గ్రామ దర్శిని కార్యక్రమాలు కొత్త అనుభూతిని ఇచ్చాయన్నారు. నవ నిర్మాణ దీక్షలు 16,375 గ్రామాల్లో నిర్వహించారని, ప్రతీ రోజూ 30 లక్షల నుండి 35 లక్షల వరకూ ఈ సభలకు ప్రజలు తరలివచ్చారన్నారు.

cbn 11062018 2

రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని గ్రామ సభల్లో పాల్గొని ప్రజలతో మమేకమయ్యానని, అభివృద్థి పనులపై ఆరా తీశానని తెలిపారు. ప్రభుత్వ పథకాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారన్నారు. 40 ఏళ్ళ నా రాజకీయ అనుభవంలో ఈ నాలుగేళ్ళలో చేసిన అభివృద్ధే చాలా తృప్తి నిచ్చిందన్నారు. రాష్ట్రమంతా సిమ్మెంట్‌ రోడ్లు వేయడం ఒక చరిత్ర అని, ఇంకా మిగిలిన వాటిని కూడా ఈ ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. 19 లక్షల ఇళ్లలో కొన్ని పూర్తి చేశామని, మిగిలినవి ఈ ఏడాది పూర్తి చేస్తామన్నారు. తాను పాదయాత్ర చేసిన సందర్భంగా తాగునీటి సమస్య, మైళ్ళ దూరం నీటి కోసం వెళ్ళే పరిస్థితులను గమనించానన్నారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదని, అన్ని నీటి వసతులూ కల్పించామన్నారు. రాష్ట్రంలో 7లక్షల 25వేల పంట కుంటలు తవ్వడం వల్ల 2 మీటర్ల మేర భూగర్భ జలాల్ని పెంచగలిగామన్నారు.

cbn 11062018 3

దీనివల్ల రూ.500 కోట్లు విలువైన కరెంట్‌ను ఆదా చేశామని, లక్షలాది ఎకరాలకు నీరిచ్చే వీలు కలిగిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు అండర్‌ గ్రౌండ్‌ పనులు పూర్తయ్యాయని, ఇప్పటికే డయాఫ్రం వాల్‌ని పూర్తి చేశామన్నారు. మైక్రో ఇరిగేషన్‌లో 90 శాతం సబ్సిడీ ఇచ్చిన ఏకైక రాష్ట్రం మనదేనన్నారు. బిజెపి, వైసిపి నాటకాలను ప్రజల ముందు పెడతామన్నారు. ఇసుక, మట్టి గురించి విమర్శలు చేసే జగన్‌, బొత్సా, విజయసాయిరెడ్డిలు రూ.45వేల కోట్ల గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. అవినీతి పరులకు తనను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్‌ చేసిన తప్పుకు ప్రజలు శిక్షించారని, అదే పరిస్థితి వైసిపి, బిజెపిలకు ఎదురవుతుందని చెప్పారు. విభజన హామీలపై తమ పోరాటం ఆగదని సిఎం అన్నారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం, కాకినాడలో దివీస్‌, ఫుడ్‌పార్కు వంటి పరిశ్రమలు రాకుండా అడ్డుపడుతూ రైతులను రెచ్చగొడుతున్నారన్నారు.

అగ్రిగోల్డ్‌ టేకోవర్‌ మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో బాధితుల కష్టాలు తీరే అవకాశం కనుచూపు మేరలో కనబడటం లేదు. అగ్రిగోల్డ్‌ను టేకోవర్‌ చేయడానికి ముందుకొచ్చిన సుభాష్‌ చంద్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలోని జీటీవి ఎస్సెల్‌ గ్రూపు ఆస్తుల విషయంలో చేసిన గందరగోళ ప్రకటనలు మదింపు ప్రక్రియను మరింత ఆలస్యం చేస్తున్నాయి. ఆస్తులకంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయని, తాము అగ్రిగోల్డ్‌ను టేకోవర్‌ చేయలేమని ఈ నెల 4న హైకోర్టులో పిటిషన్‌ వేసి చేతులెత్తేసిన ఎస్సెల్‌ గ్రూపు 24 గంటలు గడవక ముందే మరలా యూ టర్న్‌ తీసుకుంది. ఈ నెల 5న తమ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి హైకోర్టును అనుమతి కోరడంతో కోర్టు సానుకూలంగా స్పందించింది.

agrigold 11062018 2

చర, స్థిరాస్తులను పూర్తిగా మదింపు చేయకుండానే ఆస్తులు తక్కువ, అప్పులు ఎక్కువని బాధితులకు నష్టం కలిగించే ప్రకటనలు గతంలో చేసింది. అగ్రిగోల్డ్‌ కేసును పర్యవేక్షిస్తున్న సిఐడి అదనపు డిజి ద్వారకాతిరుమలరావు ఆగ్రిగోల్డ్‌కు కోట్లాది రూపాయిల ఆస్తులున్నాయని, బాధితులు భయపడాల్సిన అవసరం లేదని గతంలో జరిగిన డిపాజిటర్ల సమావేశంలో ప్రకటించారు. అప్పులు ఎక్కువగా ఉన్నాయని ప్రకటించి, ఆ తరువాత తాము టేకోవర్‌ ప్రక్రియలో ఉంటామంటూ కోర్టుకు తెలియజేయడంపై బాధితులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కారణాలతో ఆస్తుల మదింపు, టేకోవర్‌ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడానికి ఎస్సెల్‌ గ్రూపు ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారని కొందరు బాధితులు ఆరోపిస్తున్నారు. ఎంత డిపాజిట్‌ చేస్తే అంత మేరకు మాత్రమే సుభాష్‌చంద్ర ఫౌండేషన్‌కు ఆస్తుల్ని బదలాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

agrigold 11062018 3

ప్రభుత్వం ముందుకు వచ్చి, ఆగ్రిగోల్డ్ బాధితులకు మేమే సాయం చేస్తాం, తక్కువ ఉన్న డిపాజిట్ దారులకు మేమే ఇస్తాం అనటంతో, ఈ ప్రక్రియని ఆలస్యం చెయ్యటానికి, మాకు వద్దు అని అంటున్న, ఎస్సెల్‌ గ్రూపు మళ్ళీ వచ్చి మేము తీసుకుంటాం అంటుంది. ఇవన్నీ చూస్తుంటే, ఇది కావాలని, ప్రభుత్వం ఏ రకమైన సహాయం చెయ్యకుండా, కొన్నాళ్ళ పాటు, అంటే ఎన్నికలు దగ్గర పడే దాక, ఆలస్యం చేసే ప్లాన్ లో భాగంగానే, ఎస్సెల్‌ గ్రూపు మళ్ళీ వచ్చినట్టు, ఈ ఎస్సెల్‌ గ్రూపు బీజేపీ ఎంపీది కావటం, ఇవన్నీ అనుమానాలను బలం చేకురుస్తున్నాయి. సుభాష్‌ చంద్ర ఫౌండేషన్‌కు చెందిన జీటీవి ఎస్సెల్‌ గ్రూపు అగ్రిగోల్డ్‌ను టేకోవర్‌ చేస్తామని గతేడాది సెప్టెంబర్‌లో ముందుకొచ్చింది. దీంతో బాధితులు హర్షం వ్యక్తం చేశారు. రూ.10 కోట్లు డిపాజిట్‌ చేసి సిఐడి ఆధ్వర్యంలో ఆస్తుల మదింపు కార్యక్రమంలోనూ కొంతకాలం పాల్గొంది. ఆగ్రిగోల్డ్‌ ఆస్తుల విషయంలో అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి, జైళ్లలో ఉన్న అగ్రిగోల్డ్‌ డైరక్టర్లతో భేటీ అవ్వడానికి కూడా ఎస్సెల్‌ గ్రూపునకు హైకోర్టు అనుమతులు మంజూరు చేసింది. తొమ్మిది నెలల తరువాత తాము టేకోవర్‌ చేయలేమని చెప్పి మరలా ఒక రోజు వ్యవధిలోనే టేకోవర్‌ ప్రక్రియలో ఉంటామంటూ మాట మార్చింది. దీంతో ఎస్సెల్‌ గ్రూపు ఆధ్వర్యంలో టేకోవర్‌ సాధ్యాసాధ్యాలపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపణలతో అధికార తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టాలనే బీజేపీ వ్యూహాం బెడిసికొట్టిందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. గత కొద్ది రోజులుగా రమణ దీక్షితులు వ్యవహారంతో ఉక్కిరిబిక్కిరి అయిన తెదేపా నేతలు, రమణ దీక్షితులు జగన్ తో భేటీ తర్వాత ఖుషీగా ఉన్నారు. రమణ దీక్షితులు వ్యవహారాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేసి లబ్దిపొందాలని చూసిన బీజేపీ నేతలు జగన్ తో సమావేశం తర్వాత నోరు మెదపని పరిస్తితి నెలకొంది. ఇప్పుడీ విషయం నుంచి ఏ విధంగా బయటపడాలనే దాని పై బీజేపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.

amtishah 11062018 2

తిరుమల తిరుపతి దేవస్థానంలో నగలు మాయమైనట్లు, ఆలయంలో ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయంటూ గత నెలలో తితిదే మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపణలు చేశారు. గుప్త నిధుల కోసమే ఆలయంలో తవ్వకాలు జరుపుతున్నారంటూ రమణ దీక్షితులు బాంబు పేల్చారు. రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. రమణ దీక్షితులు ఆరోపణలపై విచారణకు బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహా రావు, రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ సహా పలువురు బీజేపీ నేతలు రమణ దీక్షితులు ఆరోపణలపై విచారణకు డిమాండ్ చేశారు.

amtishah 11062018 3

ఈ వివాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు బీజేపీ నేతలు అన్ని విధాలుగా ప్రయత్నించారు. వీరికి ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆరోపణలు కూడా మద్ద తుగా నిలిచాయి. రమణ దీక్షితులు ఆరోపణలు రాజకీయ దుమారం లేపడంతో ప్రభుత్వం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంది. అయితే వీరు వారుస పెట్టి చేస్తున్న పనులు మాత్రం, అందరూ కలిసి తిరుమల పై పన్నిన కుట్రగా అర్ధమవుతుంది. అమిత్ షా తిరుమల వెళ్లి వచ్చిన తరువాత రోజే రమణ దీక్షితులు మీడియా ముందుకు రావటం, తరువాత బీజేపీ నాయకులను కలవటం, పరాకాష్ట అన్నట్టు, మొన్న జగన్ ను కలవటం , ఇవన్నీ చూస్తుంటే, అన్నీ ప్లాన్ ప్రకారమే చేస్తున్నారని అర్ధమవుతుంది. ఇప్పుడు జగన్, దీక్షితుల భేటీ గురించి సమర్ధించలేక, బీజేపీ నేతలు ఇబ్బంది పడుతున్నారు..

రాష్ట్రాల హక్కులపై మరో దాడికి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. రాష్ట్రాలకు కీలక ఆదాయ వనరుగా ఉన్న సహజవాయువును జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదించింది. త్వరలో జరగనున్న జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశంలో ఈ విషయాన్ని చర్చించాలని నిర్ణయించింది. జిఎస్‌టి కౌన్సిల్‌ సంయుక్త కార్యదర్శి ధీరజ్‌ రస్తోగి ఈ విషయాన్ని ధృవీకరించారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక వర్క్‌ షాపులో మాట్లాడుతూ ఆయన 'జిఎస్‌టి పరిధిలోకి సహజవాయువును ప్రయోగాత్మకంగా తీసుకురావాలని భావిస్తున్నాం. విమాన ఇంధనాన్ని కూడా భవిష్యత్‌లో జిఎస్‌టిలోకి తెచ్చే అవకాశం ఉంది' అని చెప్పారు. ఈ నిర్ణయంతో జిఎస్‌టి బిల్లు ఆమోదం కోసం పెట్రో ఉత్పత్తులతో పాటు, మద్యం విక్రయాలను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురామని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన మాటను తప్పినట్టైంది.

center 11062018 2

కేంద్ర సర్కారు ఈ తీరుపట్ల పలు రాష్ట్ర్ర ప్రభుత్వాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని, రాష్ట్రా లకు కనీస సమాచారం ఇవ్వకుండా ఇటువంటి ప్రకటన ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. గత ఆర్థిక సంవత్సరంలో సహజవాయువు ద్వారా రాష్ట్ర ఖజానాకు 523 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తాజా ప్రతిపాదన అమలులోకి వస్తే ఈ మొత్తాన్ని నష్టపోవాల్సివస్తుంది. అసలే ఆర్థిక కష్టాలతో సతమతమౌతున్న రాష్ట్రానికి ఇది మరింత భారంగా మారనుంది. యనమల రామకృష్డుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సహజవాయువులను కూడా జిఎస్‌టిలోకి చేర్చడం సరికాదని వ్యాఖ్యానిరచారు.

center 11062018 3

వివిధ అరశాలపై పత్రికా ప్రకటనలు జారీ చేయడానికి మురదుగా జిఎస్‌టి కోసం ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం అనుమతి తీసుకోవాల్సి ఉరటురదని ఆయనగుర్తు చేశారు. ప్రధానంగా కృష్ణా, గోదావరి బేసిన్‌లోనున్న సహజవాయు నిక్షేపాల ద్వారా రాష్ట్రానికి కొరత రాయల్టీ నిధుల ఆదాయం లభిస్తోరది. తాజా నిర్ణయం రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉరదన్నారు. 'పెట్రో ఉత్పత్తులు చాలా కీలకమైనవి. కేంద్ర ప్రభుత్వంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలకూ వీటి ద్వారా వచ్చే ఆదాయం చాలా ముఖ్యమైనది. అయితే, సహజవాయువు చాలా భిన్నమైన అంశం.దీనిని జిఎస్‌టి పరిధిలోకి రావడానికి దాదాపుగా ఏకాభిప్రాయం ఉంది. అందువల్ల జిఎస్‌టిలోకి వచ్చే పెట్రో ఉత్పత్తుల్లో ఇది మొట్టమొదటిదైంది. భవిష్యత్‌లో ఈ జాబితా మరింత పెరగవచ్చు' అని జిఎస్‌టి కౌన్సిల్‌ కార్యదర్శి ధీరజ్‌ రస్తోగి అన్నారు.

Advertisements

Latest Articles

Most Read