ప్రపంచానిదొక దారి, ఉలిపికట్టదొక దారి అన్నట్లు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్షాల తీరు ఉంది... సింగపూర్.. ఆ దేశం పేరు చెబితేనే నమ్మకం, రక్షణ, క్రమశిక్షణ, నిబద్ధత, అవినీతిరహితం, అభివృద్ధికి కొలమానము, ప్రజల కష్టపడేతత్వం ... గుర్తుకొస్తాయి... అటువటి సింగపూర్ దేశం అభిమానం చూరగొనడమే కష్టం .. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిని అపూర్వముగా,అమోఘంగా అద్భుతంగా అత్యున్నతంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చమద్రబాబు నాయుడి కృషికి, పట్టుదలకు సింగపూర్ సహకరించడానికి సిద్ధంకావడం, ముందుకు రావడం, తోడ్పాటునందించడం అపూర్వమ్, అనిర్వచనీయం ...
సింగపూర్ దేశం పేరు చెబితే ప్రపంచంలో ప్రతి పౌరుడు గౌరవిస్తారు, అభిమానిస్తారు... అటువంటి సింగపూర్ ప్రభుత్వంతో అమరావతి అభివృద్ధికి పలు ఎంవోయూలు చేసుకోవడం ఆంధ్రప్రజలకు గర్వకారణం. కానీ అమరావతి అభివృద్ధిలో సింగపూరును భాగస్వామ్యం చేయడంపై ఏపీలోని ప్రతిపక్షాలు అడ్డగోలు విమర్శలకు దిగడం గర్హనీయం. రాష్ట్రం అభివృద్ధి చెందడం ప్రతిపక్షాలకు కంటగింపుగా మారింది... అదే ప్రధాన్ని నరేంద్రమోదీ మానసపుత్రిక నగరం దోలేరా నిర్మాణంలో సింగపూరి ప్రభుత్వం సాయం తీసుకుంటుంటే రాష్ట్ర ప్రతిపక్షం ఒక్క మాట మాట్లాడదు... ప్రధానిచర్యను ధైర్యంగా విమర్షించలేని ప్రతిపక్షం దోడనీతిని పాటిస్తోంది...
శాంతి కపోతం ఎగురవేయడంలో వేదికగా మారిన సింగపూరు ను ప్రపంచవ్యాప్తంగా చూస్తోంది.. సింగపూరులో ఖఛ్చితంగా ట్రాఫిక్ రూల్స్, చట్టాల ముందు అందరూ సమానమే... అందుకే ప్రపంచంలో రెండు భిన్న ధృవాలైన అమెరికా అధ్యక్షుడు, ఉత్తర కొరియా అధ్యక్షుడు శాంతి కోసం సింగపూర్‌ని వేదికగా ఎంచుకున్న సంఘటనను సీఎం సమన్వయ కమిటీ సమావేశంలో ప్రస్తావించారు. అలాoటి సింగపూర్ ఆంధ్రప్రదేశ్‌ని పూర్తిగా నమ్మి సహకరిస్తుంటే విపక్షాలు విమర్శలు చేయడం వారి అజ్ఞానానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఇప్పటికైనా సింగపూరు తో అమరావతిని అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలను, పనితీరును ప్రశంసించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.