అనంతపురం జిల్లాలో ప్రారంభించిన కియ కార్ల తయారీ పరిశ్రమ యమ స్పీడుగా రూపుదిద్దుకొంటోంది. 2019లో కార్లను ఉత్పత్తి చేసి, రోడ్డెక్కించడం లక్ష్యంగా పనులు పరుగులు తీస్తున్నాయి. ఇది ఇలా ఉండగానే, ఇప్పుడు కియా మరో గుడ్ న్యూస్ వినిపించింది. ఇది విని మన రాష్ట్ర ద్రోహులు కుయ్యో మొర్రో అనటమే... అనంతపురంలో నిర్మిస్తున్న ప్లాంట్‌లో ఎలక్ర్టిక్, హైబ్రిడ్ కార్లను కూడా తయారు చేయాలని దక్షిణ కియా యోచిస్తోంది. 2021నాటికి ఎలక్ర్టిక్ వాహనాన్ని దేశీయ మార్కెట్లోకి విడుదల చేయాలన్న లక్ష్యంతో కంపెనీ ఉంది. కియా మోటార్స్ కార్పొరేషన్‌కు చెందిన కియా మోటార్స్ ఇండియా వచ్చే మూడేళ్ల కాలంలో దేశీయ మార్కెట్లో మూడు మోడళ్లను విడుదల చేయానుకుంటోంది. వీటి ద్వారా దేశీయ మార్కెట్లోకి కంపెనీ ప్రవేశిస్తుంది. మొద ట ఎస్యువి, ఎస్పి కాన్సె్‌ప్టలను విడుదల చేస్తుంది. వీటిని ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
‘‘అనంతపురం ప్లాంట్‌లో ఎలక్ర్టిక్, హైబ్రిడ్ వాహనాలను తయారు చేయాలనుకుంటున్నాం’’ అని కియా మోటార్స్ ఇండియా సిఇఒ, మేనేజింగ్ డైరెక్టర్ కూక్ హ్యున్ షిమ్ పిటిఐ ఇంటర్వ్యూలో తెలిపారు. ఎలక్ర్టిక్ కార్ల మార్కెట్లో మార్గదర్శిగా ఉండాలనుకుంటున్నామని, ఇందుకు తగిన ప్రయత్నాలు చేస్తామని ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే 2021నాటికి పూర్తి ఎలక్ర్టిక్ వాహనాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని షిమ్ పేర్కొన్నారు. తాము ఇప్పటికే ఎలక్ర్టిక్ వాహనాలను యూరప్ , అమెరికా మార్కెట్లలో విక్రయిస్తున్నామని, వీటికి సంబంధించిన మొత్తం టెక్నాలజీ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. చార్జింగ్కు సంబంధించిన మౌలిక సదుపాయాలు, బ్యాటరీ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ వంటి సమస్యలు 2021నాటికి పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. వచ్చే మూడేళ్లకాలంలో మూడు మోడళ్లను భారత మార్కెట్లోకి విడుదల చేయాలనుకుంటున్నామని షిమ్ పేర్కొన్నారు.
తమ గ్లోబల్ పోర్ట్‌ఫోలియోలో 16 బ్రాండ్స్ ఉన్నాయని, వీటిలో ఏ మోడల్‌ను భారత మార్కెట్లోకి లోకలైజేషన్ తర్వాత విడుదల చేయాలన్న దానిపై అధ్యయనం చేస్తున్నామన్నారు. ఎస్యువి, ఎంపివి మార్కెట్లో కియా ఇప్పటికే సత్తా చాటుకుంటోందని, ఇలాంటి వాహనాలకు భారత మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఉందని షిమ్ పేర్కొన్నారు. హ్యాచ్బ్యాక్స్, కాంపాక్ట్ కార్లు కూడా తమ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా కియా వాహనాలను అందుబాటులో ఉంచాలనుకుంటున్నామని, ఇందులో భాగంగా సరైన డీలర్ పార్ట్నర్లను ఎంపిక చేసే ప్రక్రియ సాగుతోందని ఆయన చెప్పారు. 120 మంది సప్లయర్లతోనూ చర్చలు జరుపుతున్నామన్నారు. తమ ప్లాంట్‌లో హ్యుండయ్ కంపెనీ కార్లను తయారు చేసే అవకాశం ఉండదన్నారు. కియా కార్లకు భారత్‌లో అధిక డిమాండ్ ఉంటుందని ఆశిస్తున్నామని, కంప్లీట్లీ నాక్డ్ డౌన్ (సికెడి) రూపంలో విడిభాగాలను తెచ్చి ఇక్కడి ప్లాంట్‌లోనే కొన్ని మోడళ్లను అసెంబుల్ కూడా చేస్తామని ఆయన చెప్పారు.