గత కొంత రోజులుగా, అమిత్ షా, మోడీ తమ సహజ శైలికి భిన్నంగా వ్యవహరించటం చూస్తున్నాం.. ఎంతో అహంకారంగా ఉండే మోడీ - అమిత్ షా, ఏనాడు మిత్రపక్షాలని గౌరవించే వారు కాదు. చంద్రబాబు లాంటి మిత్రపక్షాన్ని వదులుకున్నారు అంటేనే, వాళ్ళ పరిస్థితి అర్ధం అవుతుంది. ఎంతో ఓర్పుగా ఉన్న చంద్రబాబుకే, వీరి స్వభావంతో విసిగిపోయి బయటకు వచ్చారు. అలాంటి అమిత్ షా, ఎప్పుడు లేని విధంగా, స్వయంగా మిత్రపక్షాల దగ్గరకు వెళ్లి మరీ కలుస్తున్నారు. శివసేన ఛీ కొడుతున్నా, వెళ్లి మరీ వారిని కలిసారు. అంతే కాదు మాకు ఎవరూ అవసరం లేదు అనే స్థాయి నుంచి, కొత్త మిత్రుల కోసం కూడా వెంపర్లాడుతున్నారు. ఈ మార్పు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కాని దీని వెనుక చాలా పెద్ద స్టొరీ ఉందని, దైనిక్ భాస్కర్ అనే ప్రముఖ హిందీ పత్రిక సంచలన కధనం ప్రచురించింది.

modiishah 09062018 2

దైనిక్ భాస్కర్ అనే ప్రముఖ హిందీ పత్రిక కధనం ప్రకారం, బీజేపీ ఈ మధ్య ఒక అంతర్గత సర్వే చేపించింది. ఆ సర్వేలో షాక్ అయ్యే రిజల్ట్స్ వచ్చయి. నాలుగేళ్ల తర్వాత దేశంలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో తమ ప్రభుత్వానికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని బీజేపీ అగ్రనాయకత్వానికి తెలిసొచ్చింది. ఆ పార్టీ చేయించుకున్న అంతర్గత సర్వేలో గత ఎన్నికల్లో గెలిచిన 282 లోక్ సభ సీట్లలో 152 స్థానాల్లో పరిస్థితి బాగోలేదని తేలింది. అంటే ఆ పార్టీకి నికరంగా 132 సీట్లు మాత్రమే వస్తాయి. ఉత్తరాదిలో ఆ పార్టీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటోందని తేలింది. బీజేపీ విజయానికి బాటలు వేసిన ఉత్తరప్రదేశ్‌లో గత ఎన్నికల్లో బీజేపీ 71 పార్లమెంట్ సీట్లను గెలుచుకుంది. కానీ ఈసారి మాత్రం అక్కడ 48 సీట్లు కోతపడబోతున్నాయని సర్వేలో తేలింది.

modiishah 09062018 3

సర్వేను ఉటంకిస్తూ ప్రముఖ హిందీ దినపత్రిక దైనిక్‌ భాస్కర్‌ కథనాన్ని ప్రచురించింది. సర్వే ఫలితాలు చూసి ప్రధాని మోదీ, అమిత్‌షా కంగుతిన్నారు. దీంతో నష్టనివారణ కోసం ఆరెస్సెస్‌తో అమిత్‌షా మంత్రాంగం జరుపుతున్నారు. విభిన్న వ్యూహాల అమలుకు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా సమాచారం. ఈ సర్వే ప్రకారం, రాజస్తాన్ లో గత ఎన్నికల్లో బీజేపీ 25 పార్లమెంట్ సీట్లను గెలుచుకుంది. కానీ ఈసారి మాత్రం అక్కడ 13 సీట్లు కోతపడబోతున్నాయని సర్వేలో తేలింది. మధ్య ప్రదేశ్ లో గత ఎన్నికల్లో బీజేపీ 26 పార్లమెంట్ సీట్లను గెలుచుకుంది. కానీ ఈసారి మాత్రం అక్కడ 16 సీట్లు కోతపడబోతున్నాయని సర్వేలో తేలింది. మహారాష్ట్రలో గత ఎన్నికల్లో బీజేపీ 23 పార్లమెంట్ సీట్లను గెలుచుకుంది. కానీ ఈసారి మాత్రం అక్కడ 17 సీట్లు కోతపడబోతున్నాయని సర్వేలో తేలింది. https://www.bhaskar.com/union-territory/chandigarh/news/latest-chandigarh-news-030503-1917611.html

ఆగ్రిగోల్ద్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అగ్రిగోల్డ్‌కు సంబంధించిన ఆస్తులను జిల్లా కమిటీ ద్వారా విక్రయించాలని ఉమ్మడి హైకోర్టు నిర్ణయించింది. జిల్లా కలెక్టర్‌, జిల్లా రిజిస్ట్రార్‌, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిలతో కూడిన కమిటీ వేలం ప్రక్రియ నిర్వహించాలని, వీరికి సీఐడీ అధికారి ఒకరు సహకారం అందించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మొదటి విడతలో కృష్ణా జిల్లాలో గుర్తించిన అయిదు ఆస్తుల వేలానికిగాను కమిటీకి సిఫారసు చేసింది. రూ.కోట్ల డిపాజిట్‌లు స్వీకరించి చేతులెత్తేసిన అగ్రిగోల్డ్‌ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్‌ రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది.

agrigold 09062018 2

గత విచారణలో.. జిల్లా కమిటీల ద్వారా ఆస్తులను విక్రయించాలన్న ఆంధ్రప్రదేశ్‌ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ ప్రతిపాదనకు ధర్మాసనం ఆమోదం తెలిపింది. అయితే జిల్లా జడ్జి స్థానంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఉంటారని వెల్లడించింది. మొదటి విడతగా కృష్ణా జిల్లా గాంధీనగర్‌లోని వాణిజ్య షెడ్‌, స్థలం కలిపి 1712 చదరపు గజాలు, మచిలీపట్నంలో ప్లాట్‌, విజయవాడ మొగల్రాజపురంలో భవనం, మచిలీపట్నంలో ప్లాట్‌, వీర్లపాడు మండలంలో వ్యవసాయ భూమి, విజయవాడ పాయకాపురంలో ఖాళీ ప్లాట్‌లను వేలం వేయాలని కమిటీకి సూచించింది. దీనిపై రెండు వారాల్లో నోటిఫికేషన్‌ జారీ చేయాలని, రెండు తెలుగు పత్రికల జిల్లా ఎడిషన్‌లలో వేలం గురించి తక్కువ ఖర్చుతో సంక్షిప్త ప్రకటన ఇవ్వాలని, పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచి అదే విషయాన్ని ప్రకటనలో తెలియజేయాలని సూచించింది.

agrigold 09062018 3

సీఐడీ మొత్తం 10 ఆస్తులను సిద్ధం చేసి విలువలను కోర్టుకు సమర్పించగా, అవి తక్కువగా ఉన్నాయంటూ అగ్రి యాజమాన్యం తెలిపింది. 10 ఆస్తుల్లో రెండు ఆంధ్రాబ్యాంకు తాకట్టులో ఉన్నాయని, ఒకటి ఇప్పటికే అమ్మివేసినట్లు వారి తరఫు సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ చెప్పారు. ఆస్తుల జప్తు జరగకముందే విక్రయించినట్లు చెప్పారు. అది రిజిస్టర్‌ కాలేదని ఏపీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ విక్రయ దస్తావేజును సమర్పించాలంటూ యాజమాన్యం తరఫు న్యాయవాదిని ఆదేశించింది. ప్రభుత్వం, యాజమాన్యం సమర్పించిన ఆస్తుల విలువలు రెండు మినహా మిగిలినవి దగ్గరగా ఉండటంతో వాటి విక్రయానికి అనుమతించింది. ధరలో వ్యత్యాసం ఎక్కువగా ఉన్న వాటి గురించి వచ్చే విచారణలో పరిశీలిస్తామని పేర్కొంటూ విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.

ఎలక్ట్రానిక్స్ రంగంలో ఆంధ్రప్రదేశ్ పేరు మారుమోగుతోంది.. ముఖ్యంగా మొబైల్స్ తయారీ రంగంలో దూసుకుపోతుంది... చంద్రబాబు ముఖ్యమంత్రి కాక ముందు, ఒక్క సెల్ ఫోన్ కూడా మన రాష్ట్రంలో తయారయ్యేది కాదు. కాని ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సంవత్సరానికి 6 కోట్ల సెల్ ఫోన్లు మన రాష్ట్రంలో తయారవుతున్నాయి. దేశంలో ఎలక్ర్టానిక్స్‌ ఉత్పత్తులను పెంచేందుకు భారీ ప్రణాళిక రూపొందించాం. ఈ ప్రక్రియకు ఆంధ్రప్రదేశే కీలకం కానుంది అని ఇండియన్‌ సెల్యులార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పంకజ్‌ మహేంద్రో అన్నారు. తిరుపతిలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు తదితర అంశాలపై చర్చించేందుకు మహేంద్రో శుక్రవారం అమరావతికి విచ్చేశారు. ఆంధ్రప్రదేశ్‌ గత నాలుగేళ్లలో సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ర్టానిక్‌ పరికరాల ఉత్పత్తిలో అత్యంత పురోగతి సాధించింది. ఏటా 6 కోట్ల మొబైల్‌ ఫోన్లు ఉత్పత్తి చేస్తూ దేశంలోనే అత్యధిక తయారీ రాష్ర్టాల్లో రెండో స్థానానికి ఎగబాకింది.

phones 09062018 2

అంతే కాదు... భారత్‌లో ఎలక్ర్టానిక్స్‌ తయారీ పెట్టుబడులకు అత్యంత అనువైన రాష్ట్రంగానూ నిలిచింది. సుపరిపాలన, నాయకత్వం, విశ్వసనీయత, ఉద్యోగుల లభ్యత, శాంతిభద్రతలు తదితర 43 అంశాల్లో పాయింట్లు కేటాయిస్తే అందులో ఏపీ నంబర్‌వన్‌గా నిలిచింది. దేశంలో ప్రస్తుతం ఏటా 22.5 కోట్ల సెల్‌ఫోన్లు తయారవుతున్నాయి. 2019 నాటికి దాన్ని 50 కోట్లకు పెంచాలన్నది లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌లో సుపరిపాలనకు అత్యధిక పాయింట్లు లభిస్తున్నాయి. తిరుపతి-శ్రీకాళహస్తి జోన్‌కు పలు సెల్‌ఫోన్‌ కంపెనీలు వచ్చాయి. ఈ ప్రభుత్వం ఫాక్స్‌కాన్‌ లాంటి అతిపెద్ద కంపెనీని తీసుకురాగలిగింది. పలు ఇతర సెల్‌ఫోన్‌ కంపెనీలూ వచ్చాయి.

phones 09062018 3

దీంతో రాబోయే కాలంలో దిగ్గజ సెల్‌ఫోన్‌ తయారీ కంపెనీలు, ఎలక్ర్టానిక్స్‌ పరికరాల తయారీ రంగ సంస్థల్ని ఆకర్షించేందుకు ఒక మార్గం ఏర్పడింది. ఏపీ పురోగతి దేశానికీ ఉపకరిస్తుందనే ఉద్దేశంతో తిరుపతిలో ఒక సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటుచేస్తున్నాం. సెల్‌ఫోన్లపై పరిశోధన, లేటెస్ట్‌ డిజైన్లపై ఇది దృష్టిపెడుతుంది. మరోవైపు ఇప్పటికే తిరుపతి సమీపంలో వెంకటేశ్వర ఎలక్ర్టానిక్స్‌ తయారీ క్లస్టర్‌ (ఈఎంసీ)ని ఏర్పాటుచేయగా.. పలు సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించాయి. ఇలాంటి మరో భారీ ఈఎంసీని ఆ సమీపంలోనే ఏర్పాటుచేయబోతున్నాం. ఈ నాలుగేళ్లలో దిగ్గజ సెల్‌ఫోన్‌, ఎలక్ర్టానిక్స్‌ కంపెనీలను తీసుకురావడంలో ఏపీ విజయం సాఽధించింది. భవిష్యత్తులో ఈ రంగంలో చైనాను ఢీకొట్టే అవకాశం ఏపీకి ఉంది. ప్రపంచంలో అత్యధిక సెల్‌ఫోన్లు తయారుచేసే దేశాల్లో ఇటీవలే భారత్‌ రెండోస్థానంలోకి వచ్చింది. వియత్నాంను అధిగమించి ఈ స్థానం దక్కించుకుంది. అయితే నెంబర్‌వన్‌గా కావడమే లక్ష్యం. దానికి ఏపీనే కీలకం.

రాం మాధవ్, జీవీఎల్ తో పాటు, ఢిల్లీ నుంచి చంద్రబాబు పై అవాక్కులు చావాక్కులు పేలే నేత మురళీధరరావు.. ఈయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు... అయితే దేశంలో బీజేపీకి వస్తున్న వ్యతిరేకత చూసో కాని, మొత్తానికి ఇప్పుడిప్పుడే భూమి మీదకు దిగుతున్నారు. చుక్కలు చూపిస్తాం, జైల్లో పెడతాం, కేసులు పెడతాం అంటూ హడావిడి చేసిన బీజేపీ నేతలు, నెమ్మదిగా చల్లబడుతున్నారు. ఇదంతా చంద్రబాబు సత్తా ఏంటో చూసిన తరువాతే.. కర్ణాటకలో వేసిన దెబ్బ కాని, అన్ని ప్రాంతీయ పార్టీలను ఒక తాటి పైకి తేవటం కాని, ఇవన్నీ చూసి, చంద్రబాబు తక్కువాడు కాదనే అంచనాకు వచ్చారు. ‘చంద్రబాబును ఓడించడం మామూలు విషయం కాదు. ఆయన్ని ఓడించడానికి ముందు చాలా శక్తులను ఓడించాలి. ఇంకా ఎన్నో ప్రణాళికలు వేయాల్సి ఉంది. ఆయనను మళ్లీ ముఖ్యమంత్రి కానివ్వకుండా చేయడమే మా ధ్యేయం’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు పేర్కొన్నారు.

muralidhar 09062018 2

శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందు ఎన్డీయే నుంచి తెలుగుదేశం బయటపడుతుందని తాము ఊహించామని... కానీ, తమ అంచనాలకు భిన్నంగా చంద్రబాబు వ్యూహాత్మకంగా ఏడాదికి ముందే తమకు విడాకులు ఇచ్చారని అన్నారు. రాజకీయంగా చూస్తే చంద్రబాబు చేసింది తప్పని తనకు అనిపించడం లేదని తెలిపారు. ఎన్నికలనాటికి ఏ అంశాలు ప్రధానంగా మారతాయో ఇప్పటి నుంచే చెప్పడం కష్టమన్నారు. ‘‘ఎన్నికల్లో ఓడిపోతే తెలుగుదేశం పార్టీ అస్తిత్వానికే ముప్పు ఏర్పడుతుందనే చంద్రబాబు రాజకీయ క్రీడ మొదలు పెట్టారు. అయితే... బీజేపీ, మోదీ, అమిత్‌షాలను అంచనా వేయగల నాయకుల్లో చంద్రబాబు ఒకరు. ఏ పరిణామాన్నీ తేలిగ్గా వదలకుండా తుదిదాక పోరాడే శక్తి ఆయనలో ఉంది’’ అని మురళీధర రావు విశ్లేషించారు.

muralidhar 09062018 3

తెలుగుదేశం తన వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించినప్పటికీ బీజేపీ ఇంకా రాష్ట్ర రాజకీయాల్లో రంగంలోకి దిగలేదని ఆయన చెప్పారు. చంద్రబాబులాంటి బలమైన నేతను ఓడించేందుకు కొత్త పార్టీలు, వేదికలు ముందుకు వస్తాయని... వివిధ సామాజిక సమీకరణాలు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో చిరంజీవి విఫలమైనట్లు పవన్‌ కూడా విఫలమవుతారన్న అంచనాలు సరైనవి కావని... అప్పటికీ ఇప్పటికీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు భిన్నంగా ఉన్నాయని ఆయన చెప్పారు. వివిధ వర్గాలను తనతో తీసుకెళ్లగలిగిన సామర్య్థాన్ని పవన్‌ కల్యాణ్‌ ప్రదర్శించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ని ముందుకు నడిపిస్తుంది మేమే అని ఇన్ డైరెక్ట్ గా చెప్పకనే చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read