రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అని, మాట ఇచ్చిన ప్రకారం మీరే ఆదుకోవాలి అంటూ, జనవరి నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధని మోడీని కలిసారు. దాదాపు 110 పేజీల నివేదిక, ప్రతి అంశం పై ఇచ్చారు. ఎధావిధగా, మీరు ఫ్లైట్ దిగి అమరావతిలో దిగే లోపే, ఈ సమస్యలు పరిష్కారం అయిపోతాయి అంటూ ప్రధాని మాటలు చెప్పి పంపించారు. ఏ మార్పు లేకపోవటం, అసలు సమస్యలు తీర్చకపోగా, మరింత ఎక్కువగా ఇబ్బంది పెట్టటంతో, ఎన్డీఏ ప్రభుత్వంతో తెగతెంపులు చేసుకుని బయటకు వచ్చేశారు చంద్రబాబు. అప్పటి నుంచి, ప్రాధాని మోడీనే లక్ష్యంగా, విమర్శలు గుప్పిస్తూ, ఇప్పటి వరకు ఏ నాయకుడు ఇంత ధీటుగామ, మోడీ లాంటి శక్తివంతమైన నేతను డీ కొట్టని విధంగా, పోరాటం చేస్తున్నారు. మరో పక్క బీజేపీ నేతలు కూడా, అబద్ధాలు చెప్తూ, విష ప్రచారం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో, విడిపోయిన తరువాత, మొదటి సారి మోడీ-బాబు ముఖాముఖి కాబోతున్నారు.
దేశంలో, రాష్ట్రాలు ఎదుర్కుంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దూరం పెరగటం, ఫెడరల్ స్పూర్తికి కేంద్రం తూట్లు పొడుస్తుంది అనే విమర్శలు రావటంతో, కేంద్రం దిగి వచ్చింది. ఈ నెల 16వ తేదీన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను రావాల్సిందిగా కబురు పెట్టింది. ఈ నెల 16వ తేదీన జరగనున్న నీతి ఆయోగ్ సాధారణ మండలి సమావేశం ఇందుకు వేదిక కానుంది. 16న జరిగే సమావేశంలో ప్రధానిని చంద్రబాబు అడగాల్సినవన్నీ అడిగేసే అవకాశం కూడా ఉంది. ఈ మండలిలో దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. ప్రధాని ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీలో పాలుపంచుకోవాలని చంద్రబాబు కూడా నిర్ణయించారు. కేంద్ర-రాష్ట్రాల మధ్య పన్నుల ఆదాయం పంపిణీ, రాష్ట్రాలకు గ్రాంట్ల విషయంలో నీతి ఆయోగ్‌కు కేంద్రం ఇచ్చిన టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్(టీవోఆర్)పై పలు రాష్ట్రాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. మన రాష్ట్రంతో పాటు కేరళ, పశ్చిమ బంగా, ఢిల్లీ, కర్ణాటక, పాండిచ్చేరి తదితర రాష్ట్రాలు గళమెత్తాయి.
సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ విమర్శిస్తోంది. నీతి ఆయోగ్ అనేది కేంద్రం-రాష్ట్రాల మధ్య పన్నుల విభజనకు సంబంధించిందే తప్ప.. అదేమీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు. దానికి విరుద్ధంగా ఫలానా నిబంధనల ప్రకారమే రాష్ట్రాలకు నిధుల పంపిణీ ఉండాలంటూ మోదీ ప్రభుత్వం నీతిఆయోగ్‌కు టీవోఆర్ ఇచ్చింది. నీతి ఆయోగ్ చేయాల్సిన పనిని కేంద్రం చేయడం ఏమిటని కేరళలో జరిగిన కొన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం మండిపడింది. ఆ ఆర్థికమంత్రుల రెండో సమావేశం అమరావతిలో నిర్వహించారు. ఇప్పుడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొననున్నారు. అక్కడే ప్రధానిని కేంద్రం వైఖరిపై ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిధుల పంపిణీకి 1971 జనాభా లెక్కలను కాకుండా 2011 లెక్కలను పరిగణలోకి తీసుకోవాలని కేంద్రం చెప్పడం జనాభా నియంత్రణ కోసం బాగా కృషిచేసిన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగించనుంది.