ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, అంటే ఈ రాష్ట్రంలో తెలీనివారు ఉండరు... ఈ రాష్ట్రంలో ఉన్న అతి కొద్ది మంది సీనియర్ నాయకుల్లో ఒకరు... శాసనసభాపతిగా, ఇటు నియోజకవర్గ ఎమ్మల్యేగా, రెండు పదవులకు వన్నె తెచ్చిన నాయకుడు... ఇవాళ చేసిన మంచి పని, మరోసారి ఆయన ప్రజా నాయకుడు అని ప్రూవ్ చేసింది... స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మరో సారి మానవత్వాన్ని చాటుకున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం ముపాళ్ల మండలం ఇరుకుపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను లారీ డీ కొట్టటంతో, ప్రమాదం జరిగింది.

kodela 08062018 2

కృష్ణాజిల్లా జగయ్యపేటకు చెందిన షేక్ కరిముల్లా మృతి చెందగా, అదే గ్రామానికి చెందిన యండ్రాతి ఆంజనేయులకి తీవ్ర గాయాలు అయ్యాయి. అదే సమయంలో స్పీకర్ కోడెల అటుగా వెళ్తున్నారు. ఈ సంఘటన చుసిన స్పీకర్ వెంటనే తన కాన్వాయ్ ఆపి, అక్కడకు వెళ్లి చూసారు. వివరాలు తెలుసుకున్న స్పీకర్, అంబులన్స్ వచ్చే లోపు, వారిని హాస్పిటల్ కు తీసుకువేల్లని నిశ్చయించారు. వెంటనే గాయాలు పాలయినా యండ్రాతి ఆంజనేయులును తన వ్యక్తి గత సిబ్బందిని సైతం పక్కన పెట్టి సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించచారు స్పీకర్ కోడెల. వెంటనే మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యీలను ఆదేశించారు స్పీకర్. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని పోలీసులను ఆదేశించారు స్పీకర్. 

kodela 08062018 3

ప్రోటోకాల్ కూడా పక్కన పెట్టి, స్పీకర్ ఇలా చెయ్యటంతో అందరూ శభాష్ అన్నారు. మనిషి ప్రాణాల కంటే, ఇవేమీ ఎక్కువ కాదని, మానవత్వాన్ని చాటుకున్న స్పీకర్ ని అక్కడ ప్రజలు అభినందించారు. విధి నిర్వహణలోనే కాదు, సాటి మనుషులను కాపదతంలోను ముందు ఉంటున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రులు... ఈ మధ్య మంత్రి జవహర్, పరిటాల సునీత, రోడ్ మీద ఆక్సిడెంట్ అయిన వారిని కాపాడి, స్వయంగా హాస్పిటల్ కు తీసుకువెళ్లటం చూసాం. ప్రజల పట్ల అందరు నాయకులు ఇదే దృక్పదంతో ఉండాలి అని కోరుకుటున్నారు...

మొన్న ఆగస్టులో.. నిన్న జూలైలో..ఇప్పుడు జూన్‌లో! ఒక్కో ఏడాది గడుస్తున్నకొద్దీ, కృష్ణమ్మ వైపు గోదారమ్మ పరుగు పెరుగుతోంది. నైరుతి రుతుపవనాల ప్రభావం రాష్ట్రం పై స్పష్టంగా ఉన్న నేపధ్యంలో, కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఈ మేరకు జలవనరుల శాఖ సంసిద్ధమైంది. అల్పపీడనం కారణంగా భారీవర్షాలు పడతాయని, గోదావరి నదికి వరద నీరు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 12వ తేదీన పట్టిసీమ నుంచి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. అక్కడ వదిలితే కృష్ణా జిల్లాకు వచ్చే సరికి మూడు రోజులు పట్టే అవకాశం ఉంది. గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో సాధారణ వర్షాలే పడినా.. పరివాహక ప్రాంతంలో ఎక్కడా పెద్దగా నీరు లేకపోయినా కృష్ణా డెల్టాలోని రైతాంగాన్ని పట్టిసీమ జలాలు ఆదుకున్నాయి. రికార్డు స్థాయిలో 100 శాతం మేర నాట్లు పూర్తి అయ్యాయి. డెల్టా పరిధిలోని నాలుగు జిల్లాల్లో వరి దిగుబడులు భారీగా వచ్చాయి. నాట్లు వేసిన నుంచి కోతల వరకు ఎక్కడా నీటికి ఇబ్బంది లేకపోయింది. దీంతో పాటు తుపాన్ల ప్రభావం కూడా లేకపోవడంతో ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా దిగుబడి ఇళ్లకు చేరింది.

pattiseema 08062018 2

గత ఏడాది జూన్‌లోనే తూర్పు, పశ్చిమ కాలువలకు నీటిని వదిలారు. ఈ సంప్రదాయాన్ని ఇప్పుడు కూడా పాటిస్తున్నారు. వరుసగా రెండు ఏడాది కూడా జూన్‌ నెలలోనే డెల్టాకు సాగునీటిని విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే వేసవిలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నీరు - చెట్టు కింద కాలువల్లో పనులు చేశారు. నీటిని వదిలినా ఇబ్బంది లేకుండా సిద్ధం చేశారు. ప్రధాన కాలువల్లో అడ్డంకులను సిబ్బంది తొలగించారు. ప్రకాశం బ్యారేజిలో ప్రస్తుతం 2.86 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా 8వేల క్యూసెక్కుల నీటిని తీసుకోనున్నారు. కానీ తొలుత పెద్దగా నీరు అవసవరం లేనందున 2వేల క్యూసెక్కులు ఇచ్చి, ఆతర్వాత రైతుల అవసరాలను బట్టి పెంచనున్నారు. బ్యారేజిలో నీటి మట్టాన్ని పెంచి ఆతర్వాత కాలువలకు వదిలేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. గత ఏడాదిలా మొదట తూర్పు కాలువ పరిధిలోని కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు ఇస్తారు. రెండు రోజుల వ్యవధిలో పశ్చిమ కాలువకు విడుదల చేస్తారు.

pattiseema 08062018 3

కృష్ణా డెల్టా కింద పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో మొత్తం 13.07 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో తూర్పు కాలువ పరిధిలో 7.36 లక్షల ఎకరాలు, పశ్చిమ కాలువ కింద 5.71 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా 11.12 లక్షల ఎకరాలలో వరి, చెరకు.. 24,213.8 ఎకరాలలో వేస్తారు. గత ఏడాది ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో 140 టీఎంసీలు పైగా ఆయకట్టుకు విడుదల చేశారు. దీంతో మంచి దిగుబడులు వచ్చాయి. గత సీజన్‌లో జులై ప్రారంభం నుంచే నాట్లు ప్రారంభం అయ్యాయి. నిలకడగా సాగునీటిని వదిలారు. ఆరు నెలల పాటు నిరాటంకంగా నీటిని అందించారు. చివరి భూములకూ సకాలంలో నీరు అందడంతో రైతులు గట్టెక్కారు. జలవనరుల శాఖ ప్రణాళికాబద్ధంగా ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేసింది. పట్టిసీమ ద్వారా వస్తున్న గోదావరి నీటికి స్వల్పంగా కృష్ణా జలాలు తోడు అయ్యాయి. చివరి భూములకు నీటి భరోసా లభించింది. డెల్టా ప్రాంతంలో అక్టోబరు, నవంబరు నెలల్లో తుపాన్లు వస్తాయి. ఆ సమయాలలో వరి పొలాల్లో నీరు నిలిచి అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ దుస్థితిని నివారించేందుకు ప్రభుత్వం గత ఏడాది జూన్‌లోనే విడుదల చేశారు. ముందే విడుదల చేయడం వల్ల దిగుబడులు కూడా పెరిగాయి. దీనిపై రైతుల్లో సానుకూలత వ్యక్తమైంది. ఈ సంవత్సరం కూడా ఇలాగే సాగునీటిని వదలాలని ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఆయకట్టులో దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది కూడా రైతుల్లో భరోసా నింపేందుకు ఇంకా ముందే విడుదల చేసి రైతుల కళ్లల్లో ఆనందం చూసేందుకు ప్రభుత్వం కార్యాచరణతో ముందుకు సాగుతోంది.

ప్రతిపక్ష నేత జగన్‌తో తిరుమల పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సమావేశమయ్యారు. లోటస్‌పాండ్‌కు వెళ్లిన రమణ దీక్షితులు, జగన్‌తో మంతనాలు జరిపారు. టీటీడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రవారం కోర్టుకు హాజరయ్యేందుకు ముందుగానే పాదయాత్రకు విరామిచ్చిన జగన్ గురువారం సాయంత్రం లోటస్‌పాండ్ చేరుకున్నారు. ఆ తర్వాత రమణ దీక్షితులు లోటస్‌పాండ్‌కు వచ్చారు. వీరిద్దరు ఏ విషయంపై చర్చించారనే దానిపై వైసీపీ వర్గాలు నోరుమెదపడం లేదు. కొద్దిరోజుల క్రితం కర్నాటక ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరుమలకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో దీక్షితులు మంతనాలు జరిపారు. ఆ తర్వాతే ఆరోపణలపర్వం ప్రారంభించారు. ముందుగా చెన్నైలో ఆ తర్వాత ఢిల్లీలో ఈ తరహా ఆరోపణలు చేశారు. అప్పడే టీటీడీ ఆయనకు రిటైర్డ్‌మెంట్ ప్రకటించింది. ఆ తర్వాత కూడా దీక్షితులు ఆరోపణలపర్వం కొనసాగించారు. ఇప్పుడు నేరుగా జగన్‌తో దీక్షితుల భేటీ కావటం కలకలం రేపుతోంది.

jagan 08062018 2


అంతా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారన్న ఆరోపణలకు బలం చేకూరింది. అయితే వైసీపీ వర్గాలు మాత్రం ఈ భేటీకి ప్రత్యేకత లేదని కొట్టిపారేస్తున్నాయి. తన పోరాటానికి జగన్ మద్దతు కోరేందుకు వచ్చారని చెబుతున్నారు. రమణదీక్షితులు మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి సన్నిహితులుగా ఉన్నారనే ఆరోణలున్నాయి. 2003లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం కావాలని అప్పట్లో కొండపై యాగం చేశారని ప్రచారం జరిగింది. నిబంధనలకు విరుద్ధమైనా పట్టించుకోలేదనే విమర్శలు ఆయనపై వచ్చాయి. ఇప్పటికీ దీక్షితులు తన ఇంట్లో శ్రీవారి చిత్రపటం పక్కన వైఎస్ చిత్రపటం పెట్టుకుంటారనే ప్రచారం ఉంది.

jagan 08062018 3

రమణ దీక్షితులు రాజకీయ ఎజెండాతో శ్రీవారి ఆలయం, పవిత్రత, ఆభరణాలపై ఓ పథకం ప్రకారం ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ విమర్శించారు. గురువారం సాయంత్రం రమణదీక్షితులు జగన్‌ను కలవడంపై స్పందించిన ఆయన మాట్లాడుతూ రమణ దీక్షితులు వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని అన్నారు. ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలవడం... అంటే టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు రావడం, కేంద్రంలో టీడీపీ మంత్రులు రాజీనామాలు చేసిన తర్వాత.. రాష్ట్ర హక్కుల కోసం టీడీపీ కేంద్రంపై పోరాటం చేయడంతో... ఇవన్నీ ముందుకు వచ్చాయని, 30 ఏళ్లు ప్రధాన అర్చకులుగా రమణ దీక్షుతులు శ్రీవారికి అన్ని రకాల సేవలు చేశారని, అప్పుడు లేని అనుమానాలు ఇప్పుడు వ్యక్తం చేస్తూ, భక్తుల మనోభావాలు ఇబ్బంది కలిగేవిధంగా మాట్లాడారంటే.. ఆయన వెనుక వివిధ రాజకీయ శక్తులు ఉన్నాయని ఆయన అన్నారు. ఇవాళ రమణ దీక్షితులు జగన్‌ను కలవడంతో ఒక్కొక్క ముసుగు తొలిగిపోతోందని బోండా ఉమ అన్నారు.

తమిళనాడులో మీటింగ్ పెట్టిన తర్వాత రమణ దీక్షితులు అమిత్ షాను కలిసారని, ఇవాళ లోటస్ పాండులో జగన్‌ను కలిసారని... అంటే రమణ దీక్షితులు వెనుక ఈ శక్తులన్నీ ఉన్నాయన్నది స్పష్టమవుతోందని బోండా ఉమ అన్నారు. రేపు ఎవరిని కలుస్తారో అని అన్నారు. రమణ దీక్షితులకు రాజకీయ నాయకులతో పనేంటని ఆయన ప్రశ్నించారు. ఇవన్నీ చూస్తుంటే వారంతా కలిసి ప్రభుత్వం పై విషం కక్కుతున్నారని, మహా కుట్ర జరుగుతోందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. రమణ దీక్షితులు ఏం చెప్పినా భక్తులు నమ్మరని బొండా ఉమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ప్రత్యెక ప్రాచుర్యం కల్పించేందుకు సీఆర్డీఏ శ్రద్ధ చూపిస్తుంది. ఇందులో భాగంగా జాతీయ రహదారిలోని కనకదుర్గ వంతెన పై రాజధానికి ముఖద్వారం వంటి తాడేపల్లి సమీపంలో పెద్ద ఫౌంటైన్ ఏర్పాటు చేసింది. దీనికి రెండు వైపులా 'ఐ లవ్ అమరావతి' అని ఇంగ్లీష్ లో ఉంటుంది. నియాన్ లైట్లతో ఇది అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా సిఆర్డీఏ అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ లాన్, 8 భారీ ఫౌంటైన్లను ఏర్పాటు చేసారు. ఇవి వివిధ ఆకారాలతో ఎనిమిది రంగులు మార్చుకుంటూ నీటిని విరజిమ్మే తీరుని ఆకట్టుకుంటుంది. దీనిని త్వరలో సియం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.

iloveamaravati 08062018 2

అంతే కాదు అమరావతిలో నిర్మిస్తున్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకి అటూ ఇటూ, అనేక ప్రాజెక్ట్ లు వస్తున్నాయి. ముఖ్యంగా ఆతిథ్య, పర్యాటక రంగానికి చెందిన ప్రాజెక్టులు ఎక్కువగా ఈ రహదారి పక్కనే వస్తున్నాయి. మరీ ముఖ్యంగా వెంకటపాలెం నుంచి కొండమరాజుపాలెం మధ్య ఈ రహదారి పక్కన ప్రస్తుతం ఎక్కువ గిరాకీ ఉంది. ఈ రహదారికి పక్కనే అమరావతి మెరీనా, మూడు నక్షత్రాల రిసార్ట్‌, రెండు 5 నక్షత్రాల హోటళ్లు, రెండు 4 నక్షత్రాల హోటళ్లు, ఒక సమావేశమందిరం, ఒక షాపింగ్‌ మాల్‌, హ్యూమన్‌ ఫ్యూచర్‌ పెవిలియన్‌, ఐటీ టవర్‌, మైస్‌ సెంటర్‌, కార్పొరేట్‌ స్ట్రీట్‌ వంటివి ఇప్పటి వరకు ఉన్న ప్రతిపాదనలు. వీటిలో చాలా ప్రాజెక్టులకు సీఆర్‌డీఏ ఇప్పటికే స్థలాలు కేటాయించింది. సీడ్‌ యాక్సెస్‌రోడ్డు తొలి దశలో ఉండవల్లి నుంచి అబ్బరాజుపాలెం వరకు 18.27 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్నారు.

iloveamaravati 08062018 3

అమరావతి మెరీనా: వెంకటపాలెం సమీపంలో 8.3 ఎకరాల్లో వస్తుంది. ఇది పర్యాటక ప్రాజెక్టు. చిన్న చిన్న బోట్లు నిలిపే స్థలాన్నే మెరీనాగా వ్యవహరిస్తారు. కృష్ణా తీరంలో వచ్చే ఈ ప్రాజెక్టు టెండరు దశలో ఉంది. వెంకటపాలెం దగ్గర్లో ఒక 5నక్షత్రాల హోటల్‌, ఒక 4నక్షత్రాల హోటల్‌, కొండమరాజు పాలెం దగ్గర్లో ఒక 5నక్షత్రాల హోటల్‌, ఒక 4నక్షత్రాల హోటల్‌ నిర్మాణానికి రెండు ప్రముఖ సంస్థలకు సీఆర్‌డీఏ స్థలాలు కేటాయించింది. ఉండవల్లి నుంచి వెళ్లేటప్పుడు రహదారికి ఎడమ పక్కన ఇవి వస్తాయి. 3.5 ఎకరాల్లో కనీసం 50 గదులతో రిసార్టు నిర్మిస్తారు. రహదారికి కుడిపక్కన వస్తుంది. కృష్ణా కరకట్టకు, నదికి మధ్యలో 1.5 ఎకరాలు, ప్రధాన అనుసంధాన రహదారికి, కరకట్టకు మధ్యలో 2 ఎకరాలు కేటాయించారు. వెంకటపాలెం దగ్గర్లోనే ఇది వస్తుంది. వెంకటపాలెం, మందడం గ్రామాల మధ్యలో 10 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో ఐటీ టవర్‌ నిర్మిస్తారు. డిజైన్లు రూపొందించే దశలో ప్రాజెక్టు ఉంది.

Advertisements

Latest Articles

Most Read