పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న సదుద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెలాఖరు నుంచిఅన్న క్యాంటీన్లను ప్రారంభించనుంది. ఈ అన్న క్యాంటీన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం కొన్ని కీలకమైన మార్గదర్శకాలు జారీ చేసింది. న్న క్యాంటీన్లు ఏడాదిలో 365 రోజులూ పని చేసేలా ప్రభుత్వం బుధవారం మార్గదర్శకాలు జారీ చేసింది. పూటకు కనీసం 350 మందికి అల్పాహారం/ఆహారం అందించేలా రూపొందిస్తున్న వీటి నిర్వహణ పరిశీలనకు వాస్తవిక సమీక్ష వ్యవస్థ (రియల్‌ టైం మోనిటరింగ్‌ సిస్టం)ను ప్రవేశపెడుతున్నారు. 50వేల జనాభా పైబడిన 71 పట్టణాల్లో వీటిని 203చోట్ల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

anna canteens 07062018 2

మొదటి విడతగా 40 క్యాంటీన్లను వారంరోజుల్లో ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒకటి, రెండు నెలల్లో మొత్తం ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. దేశంలో తమిళనాడు, కర్ణాటక తర్వాత పేదలకు ప్రత్యేకంగా వీటిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం కలిపి రూ.15కే అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.131 కోట్లు ఖర్చు చేయనుంది. తగిన సదుపాయాలతో ఒక్కో క్యాంటీన్‌ నిర్మాణానికి రూ.36 లక్షలు చొప్పున మరో రూ.80 కోట్లు వెచ్చిస్తున్నారు. 750 చదరపు అడుగుల విస్తీర్ణం (ఎస్‌ఎఫ్‌టీ)లో చేపట్టే భవనాల్లో తాగునీటి సదుపాయం, విద్యుత్తు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాటు, ఇంటర్నెట్‌, ఎల్‌సీడీలు, సీసీ టీవీలు, చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేయనున్నారు.

anna canteens 07062018 3

ఆధార్‌ అనుసంధానించి ప్రజల నుంచి బయోమెట్రిక్‌ తీసుకొని ఎలక్ట్రానిక్‌ విధానంలో టోకెన్లు జారీ చేస్తారు. ఆహారం తయారీ, పంపిణీ టెండర్‌ను అక్షయపాత్ర దక్కించుకుంది. వాస్తవిక సమీక్ష వ్యవస్థ(ఆర్టీఎం)తో వీటి పనితీరును సచివాలయం నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు గమనించవచ్చు. ఆహార పదార్థాల నాణ్యత నుంచి ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేలా ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సచివాలయం సమీపంలోని మందడం గ్రామంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన అన్న క్యాంటీను విజయవంతంగా కొనసాగుతుంది.

అంతర్జాతీయ సంతోష స్థాయుల్లో ఆంధ్రప్రదేశ్‌ గతేడాదితో పోల్చితే ఒక్కసారిగా 30 స్థానాలు పైకి ఎగబాకి, 44వ స్థానానికి చేరింది! ఏటేటా ఐక్యరాజ్యసమితి ప్రకటించే సస్టెయినబుల్‌ డెవలప్ మెంట్‌ ఇండెక్స్‌లో గతంలో మన రాష్ట్రం 74వ స్థానంలో ఉండేది. అయితే ప్రజల్లో సంతోష, సంతృప్తకర స్థాయులను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలు సత్ఫలితాలనివ్వడంతో, ప్రస్తుతం 44వ స్థానంలో నిలిచింది. ఇక, రాష్ట్రంలోని జిల్లాల్లో అత్యంత సంతోషకర జిల్లాగా కృష్ణా ఎంపికైంది. ప్రతి సంవత్సరం ఐరాస అంతర్జాతీయస్థాయిలో హ్యాపీనెస్‌ ఇండెక్స్‌ను కొలుస్తుంది. ఇందుకోసం అది ప్రధానంగా ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. అవి.. సామాజిక మద్దతు, ఆదాయ స్థాయులు, అవినీతిరహితం, అభివృద్ధి, జీవనానందం ఆధారంగా సంతోష స్థాయులను నిర్ణయిస్తుంది.

ap rank 07062018 2

ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దటానికి రాష్ట్ర ప్రభుత్వం దార్శనికతతో పనిచేస్తోంది. 2022 నాటికి రాష్ట్రాన్ని దేశంలోని 3 అత్యుత్తమ రాష్ట్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలోనే నెంబర్-1 రాష్ట్రంగా (అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా) తయారు చేయటమే లక్ష్యంగా నిర్ణయించుకుంది. విశ్వస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా సంతోషదాయక సమాజాన్ని సృష్టించటమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలోని 13 జిల్లాలలో ప్రజల సంతోషాన్ని, సంక్షేమ స్థాయులను కొలమానంగా తీసుకొని సర్వే చేశారు. ప్రజల సంతోష సూచిక స్థాయులను అంచనావేయటానికి అంతర్జాతీయ సమాజం నుంచి ఐక్యరాజ్యసమితి, ఒ.యి.సి.డి (organization for Economic Co-Operation and Development) ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు నిర్ధేశించిన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకున్నారు.

ap rank 07062018 3

నాలుగేళ్ల నాడు అంటే 2012లో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ-జనరల్ బాన్‌కీమూన్ సుస్థిర అభివృద్ధి పరిష్కారాల వ్యవస్థ (Sustainable Development Solutions Network..(SDSN))ను ప్రారంభించారు. సుస్థిర అభివృద్ధి సాధనలో భాగంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (SDG) రూపకల్పన, అమలుకు ఆచరణలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికే సుస్థిర అభివృద్ధి పరిష్కారాల వ్యవస్థ (SDSN) వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఈ అధ్యయనానికి తీసుకున్న గీటురాళ్లనే ప్రాతిపదికగా తీసుకుని దేశ సగటుతో, ప్రపంచ దేశాల ర్యాంకింగ్స్‌తో పోల్చి ఆంధ్రప్రదేశ్‌లో సంతోష స్థాయులను (హ్యాపీనెస్ లెవెల్స్) అంచనా వేయటం జరిగింది. దేశంలో ప్రజా సంతోష సూచిక నిర్ధారణకు విశ్వస్థాయి పద్ధతులను అనుసరించి ఫలితాలను రాబట్టిన రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే.

ఎన్టీఆర్ వైద్య పరిషత్ కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌లో మారుమూల ప్రాంతాలకు కూడా భారీ స్థాయిలో ఉచిత రేడియాలజీ సేవలు అందిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో ప్రజలు, డాక్టర్ల నిష్పత్తి తక్కువని, ఉన్న డాక్టర్లలో కూడా స్పెషలిస్టులు నగర ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉంటారని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ పరిస్థితుల్లో అందరికీ వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని 8 జిల్లా, 31 ప్రాంతీయ, 132 గ్రామీణ ఆసుపత్రులు, ఎక్స్ రే యూనిట్లు అందుబాటులో ఉంచినట్లు వివరించింది. అయితే, కార్డియాలజిస్ట్ లు తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. అందువల్ల ప్రజలు ఎక్కువగా ప్రైవేట్‌ డయాగ్నస్టిక్ సెంటర్లకు వెళుతున్నారని, అందువల్ల వారికి వ్యయం ఎక్కువగా అవుతున్నట్లు తెలిపింది.

ap health 07062018 2

ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని తమ ఎన్టీఆర్ వైద్య విధాన పరిషత్ కార్యక్రమం కింద ఉచిత రేడియాలజీ సేవలు ప్రారంభించినట్లు వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటనలో పేర్కొంది. ఈ సేవలను మారుమూల ప్రాంతాలకు కూడా అందిస్తున్నట్లు తెలిపింది. ప్రధాన కేంద్రం నుంచి రేడియాలజీ కార్యక్రమం నిర్వహిస్తారని, ఇక్కడినుంచి మారుమూల ప్రాంతాలకు ఈ సేవలు అందిస్తారని తెలిపింది. ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా ఎక్స్ రే ఫిల్మ్, డయాగ్నైజ్ నివేదికను ఆ కేంద్రానికి పంపుతారని పేర్కొంది. అక్కడ ఉండే నిపుణులైన రేడియాలజిస్ట్ లు ఎక్స్ రేని పరిశీలించి సవివరమైన నివేదిక రూపొందిస్తారని పేర్కొంది. దానిని తిరిగి ఆయా ఆసుపత్రులకు పంపుతారని చెప్పింది.

ap health 07062018 3

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా, ప్రాంతీయ, గ్రామీణ ఆసుపత్రుల్లో ఈ కార్యక్రమాన్ని పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో అమలు చేస్తున్నట్లు వివరించింది. ఈ కార్యక్రమం కింద అన్ని వివరాలు రియల్ టైమ్ విధానంలో సమన్వయం చేస్తుంటారని పేర్కొంది. అన్ని వివరాలు సీఎం డ్యాష్ బోర్డులో అందుబాటులో ఉంటాయని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చెప్పింది. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 10,61,572 ఎక్స్ రేలు తీసినట్లు, పది లక్షల మంది రోగులు ప్రయోజనం పొందినట్లు వివరించింది. ఈ కార్యక్రమం ద్వారా రోగులకు ఖర్చు తగ్గడమే కాకుండా వారికి సమయం కూడా కలిసి వస్తుందని తెలిపింది. ఈ కార్యక్రమం కింద మార్చి నెలలో 45,973 మంది ప్రయోజనం పొందినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.

ముఖ్యమంత్రి కుర్చీ కోసం పాదయత్ర చేస్తున్న జగన్, ఈ రోజు కూడా మార్నింగ్ వాక్ మొదలు పెట్టారు. అయితే అనుకోని సంఘటన ఎదురు అయ్యింది. జగన్ యాత్రలో ఉన్న ఒక ఆకతాయి చేసిన పనికి, పాదయాత్రలో ఉన్న అందరూ పరిగెత్తారు. జగన్ తో పటు, ఉన్న సెక్యూరిటీ మినహా అందరూ పారిపోయారు. పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం నడిపల్లికోట కొండాలమ్మ గుడి వద్ద జగన్ 183రోజు పాదయాత్రను ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ ఆకతాయి అక్కడే ఉన్న తేనెతుట్టెను రాయితో కొట్టాడు. దీంతో పాదయాత్రలో పాల్గొన్న వారిపై తేనెటీగలు దాడి చేశాయి. దాదాపు 50మంది వరకు తెనెటీగల బారిన పడ్డారు.

jagan 07062018 2

కాగా ఈ ఘటనతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది జగన్‌‌ను రక్షించారు. జగన్ చుట్టూ ఉన్న సెక్యూరిటీ వారు, తుళ్లు, చీరలు పట్టుకుని, జగన్ చుట్టూ విసురుతూ, తేనిటీగలు జగన్ మీదకు దాడి చెయ్యకుండా ప్రయత్నం చేసారు. అయినా కొన్ని వెళ్లి జగన్ ను ఇబ్బంది పెట్టాయి. అయితే, ఆ ఆకతాయి ఎవరు అని అరా తీయగా, వైసీపీ వీరాభిమనే అని తేలింది. సరదాగా అక్కడ ఉన్న తేనెతుట్టెను రాయితో కొట్టాను అని, అవి ఈ విధంగా దాడి చేస్తాయి అనుకోలేదని, అతను అన్నాడు. అయితే, కొంత మంది అక్కడ ఉన్న వారు మాత్రం, సరదాగా మాట్లాడుకుంటూ, ఇది కూడా చంద్రబాబు కుట్ర అని చెప్తే పోలా అంటూ, సటైర్లు వేసారు.

jagan 07062018 3

మరో పక్క రాజీనామాల పై జగన మాట్లడారు, రాష్ట్రంలోని 25 మంది ఎంపీలు రాజీనామా చేసి ఉంటే ప్రత్యేక హోదా వచ్చేదని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి వ్యాఖ్యానించారు. ఇది సీఎం చంద్రబాబుకు తెలిసినా.. కేసులు పెడతారన్న భయంతో టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించడంలేదని ఆరోపించారు. నాకు కేసులు అంటే భయం లేదు, కాబట్టే మేము ధైర్యంగా బీజేపీ పై పోరాడుతున్నాం అంటూ వ్యాఖలు చేసారు. ఈ కామెంట్ విన్న విలేకరులు అవాకయ్యారు. జగన్ బీజేపీ పై పోరాటం చెయ్యటం ఏంటో అనుకుని, మనకు తెలీకుండా, ఎప్పుడైనా ఎమన్నా వ్యాఖ్యలు చేసారేమోలే అని సరి పెట్టుకుని, తేనిటీగలను దులుపుకుంటూ, ముందుకు సాగారు.

Advertisements

Latest Articles

Most Read