శ్రీ వారి పింక్ డైమెండ్ పోయింది అని, అది జెనీవాలో ఇటీవల వేలం వేశారని, 500 కోట్లకు అమ్ముడు పోయింది అంటూ, రమణ దీక్షితులు గారు, ఆయనకు బాకా కొడుతూ బీజేపీ, వైసీపీ, జనసేన నేతలు ఎలా విష ప్రచారం చేస్తున్నారో చూస్తున్నాం.... చంద్రబాబు పై నిత్యం విషం చిమ్మే జగన్ పత్రిక దాని, ఆంధ్ర బ్య్యూరో, వాళ్ళు అది జెనీవాలో అమ్ముడు పోని వజ్రమేనా, ఈ దీక్షితులు చెప్తున్న వజ్రం అని వార్తలు రాసారు. ఇక అది పట్టుకుని, బీహార్, చింతలబస్తీ బ్యాచ్ సోషల్ మీడియాలో ఒకటే హడావిడి... అయితే, ఇది అవాస్తవం అని తేలింది.. ఆధారాలుతో సహా, బయట పెట్టారు...

diamond 22052018 2

ఆ జెనీవా వజ్రం గురించి అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్, ఒక ఆర్టికల్ రాసింది... జెనీవాలో అమ్మకానికి పెట్టిన 37.30 క్యారెట్ పింక్ వజ్రం (రాజ్-పింక్) 2015 సంవత్సరంలో ఆఫ్రికాలో దొరికింది.. ముడి వజ్రం చాలా పెద్దది. దాదాపు ఒక సంవత్సరం పాటు విశ్లేషణ చేసి సాన పెట్టి , అంగుళీయ రూపంలో వేలం ద్వారా అమ్మకానికి పెట్టారు. ప్రపంచ విఖ్యాత వేలం సంస్థ సోతెబీ‌స్ ద్వారా యీ అమ్మకం ప్రక్రియ జెనీవాలో జరిగింది. సరియైన పాటదారు రాక వేలంలో అమ్ముడు పోలేదు... అమ్మకందారు ఇరవై నుండి ముప్పై మిలియన్ అమెరికన్ డాలర్ల ధర వస్తుందని ఆశించాడు. ఆ ధర రాకపోవడంతో అమ్మకం జరుగలేదు. 14 మిలియన్ అమెరికన్ డాలర్ల ధర్ మాత్రమే వచ్చింది.. ఆ పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు https://af.reuters.com/article/worldNews/idAFKBN1DF30H

diamond 22052018 3

2015 లో ఆఫ్రికాలో దొరికిన ముడి వజ్రం సానపెట్టబడిన తర్వాత 2017 సంవత్సరంలో అమ్మకానికి వచ్చింది... 2015లో ఆఫ్రికాలో దొరికిన వజ్రం, అది దశాబ్దాల క్రితం మైసూర్ మహారాజా గారు వెంకన్న స్వామికి ఇచ్చిన కెంపు, మన దీక్షితులు గారికి, సాక్షి లాంటి విషం చిమ్మే చానల్స్ కు రూపాంతరం చెంది, వజ్రంగా మారి 500 కోట్ల రూపాయలకు ఎలా అమ్ముడు పోయిందో ? ఏడుకొండల వాడా వెంకట"రమణా" గోవిందా గోవిందా, నీ వస్తువుల గురించే అసత్యాలాడే వారు ఏమౌతారో ? నువ్వే చూసుకోవాలి స్వామీ...

తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నిన్న, మొన్న కొన్ని కొత్త అంశాలు బయటికి వచ్చాయని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ అన్నారు. టీటీడీ వివాదంపై మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్ని అంశాలపై చట్టపరంగా ముందుకెళ్తామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుమల పవిత్రతకు భంగం కలగకూడదని సీఎం చెప్పారన్నారు. శ్రీవారి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని... ఆలయ ప్రతిష్ఠకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తితిదేపై ఆరోపణలు చేస్తుండటం.. దీనికి మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో పాటు మరికొందరు వంత పాడుతున్న నేపథ్యంలో..

ttd eo 22052018 2

తితిదే నిర్వహణపై అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి పాలకమండలి ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌తో పాటు ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ... ఆలయ పవిత్రతకు భంగం కలిగించకుడా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తమను ఆదేశించినట్లు తెలిపారు. శ్రీవారికి వచ్చే నిధులన్నింటినీ సక్రమంగా వినియోగిస్తున్నామని.. ఎలాంటి దుర్వినియోగం చేయడం లేదన్నారు. శ్రీవారికి జరిగే కైంకర్యాలన్నీ సక్రమంగానే జరుగుతున్నాయన్నారు.

ttd eo 22052018 3

రమణ దీక్షతులు ఆరోపిస్తున్నట్లుగా శ్రీవారి బూందీ పోటులో ఎలాంటి తవ్వకాలు జరగలేదన్నారు. స్వామివారి నగలకు సంబంధించి 1952 నుంచి పక్కా లెక్కలు ఉన్నాయని.. ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. శ్రీవారి ఆభరణాల్లో ఏది ఎవరిచ్చారన్న సమాచారం సమగ్రంగా లేకపోయినా.. 1952 రికార్టుల్లో ఉన్ననగలన్నీ భద్రంగా ఉన్నాయన్నారు. తితిదే ఛైర్మన్ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ మాట్లడుతూ..ఇటీవల జెనీవాలో వేలం వేసిన గులాజీ రంగు వజ్రం శ్రీవారిదేనంటూ రమణ దీక్షితులు అనుమానం వ్యక్తం చేయడంపై స్పందించారు. అసలు అలాంటి వజ్రమే స్వామివారికి ఉన్నట్లు లెక్కల్లో లేదని.. లేని వజ్రాన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు.

గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి కుర్చీ కోసం, పాదయాత్ర చేస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్‌, ప్రస్తుతం తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడులో పాదయాత్ర చేస్తున్నారు.. ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు అలా నడుచుకుంటూ, వెళ్లి పోయి, సాయంత్రం ఒక మీటింగ్ చెప్పేసి, ఆ రోజుకి పాదయాత్ర ముగిస్తున్నారు... అయితే, ఈ రోజు జగన్ పాదయత్రలో ఒక వింత సంఘటన చోటు చేసుకంది.. ఈ రోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడులో పాదయాత్ర చేస్తున్న జగన్ ను చూసేందుకు కొంత మంది వైసిపీ కార్యకర్తలు వచ్చారు.. జగన్ తో కలిసి కొంత దూరం నడిచేందుకు ఉత్సాహం చూపారు...

jagan 22052018 2

ఈ సందర్భంలో, వారు జగన్ కు దగ్గరికి వెళ్ళకుండా సెక్యూరిటీ సిబ్బంది ఎప్పటికప్పుడు పక్కకి తోసేస్తున్నారు.. అయితే, ఇక్కడ వరకు ఎవరికీ ఇబ్బంది లేదు... ఎవరి సెక్యూరిటీ వాళ్లకి ముఖ్యం కాబట్టి, ఎంత అభిమానులని అయినా పక్కకు తోసేస్తారు.. అయితే, ఇక్కడ పక్కకి తోసే క్రమంలో, అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, ఆ అభిమానుల మేడలో ఉన్న చైన్ లు కొట్టేస్తున్నారు... దీంతో, జగన్‌ పాదయాత్రలో సెక్యూరిటీ సిబ్బంది చైన్‌ దొంగిలించారంటూ వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేసారు... సెక్యూరిటీ సిబ్బంది వైఖరిని నిరసిస్తూ కార్యకర్తల ధర్నా చేసారు... మా చైన్లు మాకు ఇప్పించాలి అంటూ, ఆందోళన చేసారు...

jagan 22052018 3

నిజానికి ఎప్పటి నుంచో, ఈ ఆరోపణలు ఉన్నాయి... అయితే ఎవరన్నా జేబు దొంగలు ఇలా చేస్తున్నారేమో అని ఇన్నాళ్ళు అందరూ అనుకున్నారు.. కాని, ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది స్వయంగా, చైన్లు కొట్టేయటం చూసిన అక్కడి అభిమానులు అందోళన చేస్తున్నారు... మా తల్లి దండ్రులు కష్ట పడి సంపాదించిన డబ్బు అని, మా బంగారం మాకు ఇచ్చేయాలని ఆందోళన చేసారు... ఈ సెక్యూరిటీ అంతా, పులివెందుల నుంచి వచ్చిన ప్రైవేటు సెక్యూరిటీగా తెలుస్తుంది... ఇప్పటికే, వీరు ఆడ పిల్లల పై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.. అయినా ప్రతి ఊరు తిరిగి హామీలు ఇచ్చే జగన్, ఇలాంటి దొంగలను ఊరు ఊరు తిప్పుతూ, ప్రజలకు ఏమి సందేశం ఇస్తున్నారు ?

అధికవడ్డీ ఆశచూపి బోర్డు తిప్పేసిన అగ్రిగోల్డ్ సంస్థలో మరో కీలక అరెస్ట్ జరిగింది. అగ్రిగోల్డ్ మోసం బయటకు వచ్చినప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న వైస్ ఛైర్మన్ అవ్వా సీతారామారావు ఎట్టకేటలకు పట్టుబడ్డాడు. సీఐడీ పోలీసులు దిల్లీలో అరెస్ట్ చేశారు. సీతారాం గతంలో అగ్రిగోల్డ్ కు డైరక్టర్‌గా వ్యవహరించాడు. కంపెనీ లావాదేవీలను తెరవెనుక నుండి నడిపించేవాడు. అగ్రిగోల్డ్ పై కేసు నమోదు తర్వాత సీతారాం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ముందస్తు బెయిల్ కోసం ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్‌ను సంప్రదించాడు. అయితే హైకోర్టు బెయిల్ నిరాకరించటంతో మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం జైల్లో ఉన్న తనవారిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు నిఘా పెట్టారు.

cid 22052018 2

అగ్రిగోల్డ్ సంస్థలను వేలంలో కొనేందుకు ముందుకొచ్చిన ఎస్సెల్ గ్రూప్ సంస్థలను సీతారామారావు ప్రభావితం చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. సీఐడి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న సీతారాంను ఎట్టకేలకు సీఐడీ పోలీసులు గూడ్‌గావ్‌లో అరెస్ట్ చేశారు. నిందితుడ్ని స్థానిక కోర్టులో హాజరుపర్చి ట్రాన్సిట్ వారెంట్‌పై రేపు ఉదయం విజయవాడకు తీసుకువచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. అగ్రిగోల్డ్ అసలు ఆస్తులెంత? లావాదేవీలు ఎలా జరిగాయి? అనే విషయాలపై సీతారామారావును పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది.

cid 22052018 3

గత కొంతకాలంగా తప్పించుకుని తిరుగుతున్న సీతారామారావును అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఆయన ఢిల్లీలో తలదాచుకున్నారని తెలుసుకుని ట్రాప్ చేశారు. ఏపీ నుంచి వెళ్లిన సీఐడీ అధికారులు ఢిల్లీలో సీతారామారావును అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మొదటి నుంచి సీతారామారావు ప్రమేయంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. పోలీసుల అదుపులో ఉన్న సీతారామారావును విజయవాడకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో వైస్ ఛైర్మన్ అవ్వాస్ సీతారామారావును అరెస్టు చేయడం పట్ల అగ్రిగోల్డ్ బాధితుల పోరాట సంఘం అధ్యక్షుడు ముపాళ్ళ నాగేశ్వరరావు, తిరుపతిరావు హర్షం వ్యక్తం చేశారు.

Advertisements

Latest Articles

Most Read