అలిపిరి అయినా, అమెరికా అయినా, ఆంధ్రోడు అంటే, బీజేపీ నేతలు భయపడుతున్నారు.. మాకు అన్యాయం జరిగింది, చూడండి అంటే, వీరి అహంకారపు మాటలు, ఆంధ్రుడికి మరింత ఆగ్రహం తెప్పిస్తుంది... మీకు అన్నీ ఇచ్చేసాం అని ఒకడు... మీకు ఇదే ఎక్కువ అని ఒకడు... మీకు మయసభ కావాలా అని ఒకడు.. ఇలా ఎవరి ఇష్టం వచ్చినట్టు, అహంకారపు మాటలతో ఆంధ్రా వాడిని చులకన చేసి మాట్లాడుతున్నారు.. దీని పర్యవసానమే, అమిత్ షా లాంటి నేతకు కూడా అలిపిరిలో, తీవ్ర నిరసన... చివరకు మా అమిత్ షా మీద దాడి చేసారు అని చెప్పుకుని, సింపతీ కోసం ప్రయత్నించాల్సిన పరిస్థితి... మొన్నటికి మొన్న, అమెరికా వెళ్ళిన జీవిఎల్ నరసింహరావుకు కూడా, అక్కడ ప్రవాసాంధ్రులు నిరసనల స్వగతం పలికారు...
మాకు అన్యాయం జరిగింది, మా సంగతి ఏంటి అని అడిగినప్పుడు, మేము ఇది చేసాం, మేము అది చేసాం అని జీవీఎల్ చెప్తుంటే, అక్కడ ఉన్న ఆంధ్రులు అబద్ధాలు చెప్పవద్దు, మేము విసిగిపోయాము అని చెప్పి, అక్కడ నిరసన తెలియచేసారు.. ఇప్పుడు అమెరికా వచ్చిన రాం మాధవ్ వంతు... దక్షిణాది దండ యాత్ర మొదలైంది, ఇక కాచుకోండి, అని కర్ణాటక ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాక ముందే, హడావిడి చేసిన రాం మాధవ్, అమెరికాలోని విర్జినియా నగరానికి వచ్చారు.. ఈ సందర్భంగా అక్కడ ఆంధ్రావారు, రాం మాధవ్ మీటింగ్ జరుగుతున్న ఆడిటోరియం దగ్గరకు వెళ్లారు..
అయితే, అక్కడ ఉన్న కొంత మంది బీజేపీ నేతలు, మీరు తెలుగుదేశం వారు, మిమ్మల్ని లోపలకి పంపించము అని అడ్డుకున్నారు... మేము తెలుగుదేశం కాదని, ఆంధ్రా వారిమని, మిమ్మల్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరు, తెలుగుదేశం వారు ఎలా అవుతారని, మేము రాం మాధవ్ ను కలిసి, మా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పై, సాటి తెలుగువాడిగా ఆయనకు చెప్తామని ఎంత చెప్పినా, అక్కడ బీజేపీ వారు వినలేదు.. ఇది ఓపెన్ ఈవెంట్ కదా, ప్రతి భారతీయుడు రమ్మని, ఆహ్వానం పంపారు కదా అని చెప్పినా, అక్కడ పోలీసుల చేత అడ్డుకున్నారు... అయితే మన వారు అక్కడే బయట ఉండి, నిరసన వ్యక్తం చేసారు... బీజేపీకి ఆంధ్రా వాడు కనిపిస్తుంటే భయం వేస్తుందని, జరిగిన అన్యాయం గురించి అడిగితే, సమాధానం చెప్పలేక పారిపోతున్నారని, కనీసం లోపలకి కూడా రానివ్వటం లేదు అంటే, రాం మాధవ్ కు ఆంధ్రా వాళ్ళు అంటే ఎంత భయమో అర్ధమవుతుంది అని, అక్కడ ప్రవాసాంధ్రులు అన్నారు.. మొత్తానికి, ఎక్కడకు వెళ్ళినా, బీజేపీ నాయకులకు ఆంధ్రోడి సెగ తగులుతుంటే, తప్పించుకుని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది.