"Right now news has come that BS Yeddyurappa has resigned as Karnataka's CM, are all of you happy? All those who believe in democracy are happy" ఇది చంద్రబాబు విలేఖరులకు చెప్పిన సమాధనం... అనంతరం, యడ్యూరప్ప రాజీనామా అంశాన్ని సాధికార మిత్ర సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించారు. యడ్డీ రాజీనామా చేయడం అందరికీ సంతోషంగా ఉందా అంటూ సాధికార మిత్ర కార్యకర్తలను చంద్రబాబు ప్రశ్నించారు. సంతోషంగా ఉందంటూ సాధికార మిత్ర కార్యకర్తలు బదులిచ్చారు. యడ్యూరప్ప రాజీనామా ప్రజాస్వామ్య విజయం అని చంద్రబాబు అన్నారు. యడ్యూరప్ప రాజీనామా చేయడం అందరికీ సంతోషమే అని అన్నారు. " రాష్ట్రానికో విధానం అన్నట్టుగా వ్యవహరిస్తోంది బీజేపీ. గోవాలో ఓ తరహాలో.. కర్ణాటకలో మరో తరహాలో వ్యవహరిస్తోంది బీజేపీ. ప్రధాని, బీజేపీ అధినేత లాంటి వారు రంగంలోకి దిగారు.. కానీ విఫలం చెందారు" అని చంద్రబాబు అన్నారు.

cbn 19052018 11 2

"ఏపీకి అన్యాయం చేసిన వారిని మట్టి కరిపించాలని పిలుపిచ్చా. గాలి జనార్దన్ రెడ్డి లాంటి అవినీతి పరులను బీజేపీ రంగంలోకి దింపింది. గాలి అంటేనే మనకు భయం. వంద కోట్లు ఇస్తాం. లైఫ్ సెటిల్ చేస్తామంటూ గాలి ప్రలోభ పెట్టారు. ప్రధాని లాంటి నేతలు.. జాతీయ నేతల్లాంటి వారు అవినీతిని ప్రొత్సహిస్తే యువతకేం సందేమిస్తారు..? యడ్డీ రాజీనామా చేశారనగానే మహిళల ముఖాలు వెలిగిపోయాయి. కర్ణాటకలో ఏం జరుగుతుందోననే ఆందోళన అందరిలోనూ కనిపించింది. ప్రజాస్వామ్యం విజయం సాధించిన రోజు. " అని చంద్రబాబు అన్నారు.

cbn 19052018 131

"కర్నాటక అయిపోయింటే ఆ తర్వాత మనపై పడేవారు. తమిళనాడులోనూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రజాస్వామ్యవాదిగా కర్ణాటక ఎపిసోడు పై స్పందిస్తున్నా. నా పుట్టిన రోజు నాడే దీక్ష చేసే పరిస్థితికి తెచ్చారు. ఏపీకి న్యాయం చేయమంటే ఏ మాత్రం పట్టించుకోలేదు. గవర్నర్ మెజార్టీ ఉన్న వాళ్లని పిలవకుండా యడ్జీతో ప్రమాణ స్వీకారం చేయించారు. కర్నాటకలో బీజేపీ నేతలు ఓటుకు పది వేలిచ్చారనే ప్రచారం ఉంది. అవినీతి పరుల భరతం పట్టండని పిలుపిచ్చా. కర్ణాటకలోని తెలుగు వారు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు. కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలకు వంద కోట్ల రూపాయలు.. మంత్రి పదవుల విషయంలో వల వేసిన సంఘటనలు ప్రపంచం చూసింది. ప్రొటెం స్పీకరుగా సీనియర్ ఎమ్మెల్యేను నియమించడం ఆనవాయితీ.. కానీ దీన్ని కర్ణాటకలో బీజేపీ ఉల్లంఘించింది. కర్ణాటక అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం చేయమని సుప్రీం ఆదేశించడం మంచిదైంది." అని చంద్రబాబు అన్నారు...

దేశ చరిత్రలోనే అతి దరిద్రమైన ఆట, కర్ణాటకలో ఆడి, మోడీ, అమిత్ షా చివరకు ఏమి సాధించారు ? గాలి జనార్ధన్ రెడ్డి లాంటి వాడిని చేరదీసి, పక్కన పెట్టుకుని, నిస్సిగ్గుగా ప్రచారం చేసారు... మెజారిటీ రాకపోయినా, గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసారు... చివరకు 150 కోట్లు ఆఫర్ చేసారు... అర్ధరాత్రి సుప్రీం కోర్ట్ తలుపులు తెరుచుకున్నాయి.. దేశంలో ఎంత దౌర్భాగ్యం లేకపోతే, అర్ధరాత్రి తలుపులు తెరుచుకుంటాయి ? అమిత్ షా, మోడీ కుట్రలని తిప్పి కొడుతూ, సుప్రీం కోర్ట్ ఒక్క రోజే బల నిరూపణకు టైం ఇచ్చింది... దీంతో బేర సరాలకు టైం సరిపోలేదు... చివరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా మూడు రోజుల క్రితమే ప్రమాణస్వీకారం చేసిన బీఎస్ యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేశారు. అమిత్ షా, మోడీ కుట్రలని తట్టుకుని, దేశం గెలిచింది...

modishah 19052018 2

నీతీనిజాయితీ, విలువలూ విస్తరాకులూ, దేశభక్తీ జనోద్ధరణా అంటూ కబుర్లు చెప్పే బీజేపీ పార్టీకి అవన్నీ ఉత్తిత్తి కబుర్లు.. తాటాకు దరువులు.. ఆచరణలో దానివి దగుల్బాజీ పనులూ, దరిద్రపుగొట్టు కుయుక్తులూ .. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామిక విలువలన్నిటినీ తుంగలో తొక్కటానికి, అడ్డదిడ్డంగా బరితెగించటానికి 30, 40 ఏళ్ళ కాలం పట్టింది! విలువల వలువలను నట్ట నడివీధిలో నిర్లజ్జగా వదిలిపెట్టటానికి బీజేపీకి మోడీ హయాంలో మూడేళ్లు కూడా పట్టలేదు. అన్ని విలువలకూ పాతరేసి _ అధికార దాహం ఒక్కటే తన పరమాశయమని బీజేపీ పార్టీ రంకెలేస్తున్న నిస్సిగ్గు జాతర రోజూ దేశంలో నడుస్తూనే ఉంది .. కర్ణాటక ఇప్పుడు కాషాయ కంగాళీకి నిలువెత్తు వేదిక.

modishah 19052018 3

మోడీ, అమిత్ షా & పరివారం...బలం లేకున్నా అధికారం కోసం నానా గడ్డీ కరుస్తారు .. ప్రలోభాలూ బెదిరింపులూ దేబిరింపులూ .. ఎంతకన్నా దిగజారతారు... తమ నీతిమాలిన వ్యూహాల్లో గవర్నర్లను ఇష్టమొచ్చినట్టు ఉపయోగిస్తారు... అసెంబ్లీలో ప్రమాణ స్వీకారానికి ఎక్కువసార్లు గెలిచిన mla ని ప్రోటెం స్పీకరుగా పెట్టటం సాంప్రదాయం... అలా అయితే_ కర్ణాటకలో 8 సార్లు గెలిచిన కాంగ్రెస్ mla దేశ్ పాండే ని నియమించటం పధ్ధతి... దానిని కాలదన్ని 3 సార్లు గెలిచిన rss వాది బొప్పయ్యను నియమించారు... సిగ్గుమాలిన బీజేపీకి ఇంకా చెప్పటానికి నీతి కబుర్లు ఏమన్నా మిగిలాయా? నాలుగేళ్ల కాలంలో దాని నిజస్వరూపం మొత్తం దేశానికి ప్రదర్శించేసింది !! చాలు చాలు ఇక ... !! చెప్పటానికి నీతులు ఏమీ మిగల్లేదు !! గెలిస్తే గెలవొచ్చు గానీ, గెలిచేంత గొప్పది కాదు బీజేపీ .. ఓడినోడి వైఫల్యాలు గెలిచినోడికి పాఠాలే తప్ప, ప్రశంసలు కావు. దేశం చూస్తోంది .. దేశం మేల్కొంటోంది !!

అధికారం కోసం, దేశంలో వ్యవస్థలని నాశనం చేస్తున్న అమిత్ షా, మోడీల అసలు రంగు దేశ ప్రజలు చూస్తున్నారు.. నాలుగు రోజులు నుంచి, ఎలా ఎమ్మల్యేలను లొంగదీసుకుంటున్నారో చూస్తున్నాం... నిన్న గాలి జనార్ధన్ రెడ్డి, 150 కోట్లు ఒక్క ఎమ్మల్యేకు ఆఫర్ ఇస్తూ, దొరికిపోయాడు.. అయితే, ఈ రోజు ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప బేరసారాలు చేస్తూ దొరికిపోయాడు... పలువురు భాజపా నేతలు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నట్లు పలు ఆడియో సీడీలను ఇప్పటికే విడుదల చేసిన కాంగ్రెస్‌.. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి యడ్యూరప్ప తమ ఎమ్మెల్యేతో మాట్లాడిన సంభాషణలను విడుదల చేసింది..

yeddi tapes 19052018 3

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బీసీ పాటిల్‌తో యడ్యూరప్ప మాట్లాడినట్లు కాంగ్రెస్‌ పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆడియో టేపును తాజాగా విడుదల చేసింది. కాంగ్రెస్‌ ప్రతినిధి ప్రియాంక చతుర్వేది తన ట్విటర్‌ ఖాతాలో ఈ ఆడియోను పోస్ట్‌ చేశారు. బీసీ పాటిల్‌, యడ్యూరప్ప మధ్య జరిగిన సంభాషణ.. యడ్యూరప్ప: మంత్రి పదవితో పాటు రూ.5 కోట్లు ఇస్తా... పాటిల్ : ఇక ముందు నా పొజిషన్ ఏంటి? యడ్యూరప్ప: నువ్వు మంత్రి అవుతావు... పాటిల్ : నాతో పాటు ఇద్దరు..ముగ్గురు ఉన్నారు... యడ్యూరప్ప: నీ వెంట ఉన్న వారిని తీసుకొని రా.. నాపై విశ్వాసం ఉంది కదా, ఒకసారి కొచ్చి వెళ్తే ఇక దొరకవు.. పాటిల్ : అది జరగని విషయం... యడ్యూరప్ప: ఇంట్లో వాళ్లకి సమస్య ఉందని వెనక్కి వచ్చేయ్‌... పాటిల్ : ఐదు నిమిషాల్లో మీకు ఫోన్‌ చేసి చెబుతా... యడ్యూరప్ప: శ్రీరాములుకు ఫోన్‌ చేసి చెప్పు...

yeddi tapes 19052018 2

మరో పక్క, ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుమారుడు కూడా ప్రలోభాలకు పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. నికి సాక్ష్యం ఇదిగో అంటూ ఓ ఆడియోను విడుదల చేసింది. యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర తమ ఎమ్మెల్యేలకు రూ.5కోట్లు, మంత్రి‌ పదవి ఆఫర్‌ చేశారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. విజయేంద్ర మాట్లాడుతున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి విడుదల చేసింది. మరికొద్ది గంటల్లో యడ్యూరప్ప బలపరీక్ష జరగనున్న నేపథ్యంలో ఈ ఆడియో మరింత ఆసక్తికరంగా మారింది...

నీతీనిజాయితీ, విలువలూ విస్తరాకులూ, దేశభక్తీ జనోద్ధరణా అంటూ కబుర్లు చెప్పే బీజేపీ పార్టీకి అవన్నీ ఉత్తిత్తి కబుర్లు.. తాటాకు దరువులు.. ఆచరణలో దానివి దగుల్బాజీ పనులూ, దరిద్రపుగొట్టు కుయుక్తులూ .. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామిక విలువలన్నిటినీ తుంగలో తొక్కటానికి, అడ్డదిడ్డంగా బరితెగించటానికి 30, 40 ఏళ్ళ కాలం పట్టింది! విలువల వలువలను నట్ట నడివీధిలో నిర్లజ్జగా వదిలిపెట్టటానికి బీజేపీకి మోడీ హయాంలో మూడేళ్లు కూడా పట్టలేదు. అన్ని విలువలకూ పాతరేసి _ అధికార దాహం ఒక్కటే తన పరమాశయమని బీజేపీ పార్టీ రంకెలేస్తున్న నిస్సిగ్గు జాతర రోజూ దేశంలో నడుస్తూనే ఉంది .. కర్ణాటక ఇప్పుడు కాషాయ కంగాళీకి నిలువెత్తు వేదిక.

tape 5 19052018 3

తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి 4 టేప్ లు రిలీజ్ చేసింది.. అందులో గాలి జనార్ధన్ రెడ్డి, స్వయంగా ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా ఉన్న సంగతి తెలిసిందే.. తాజాగా కాంగ్రెస్ 5వ టేప్ రిలీజ్ చేసింది... ఇందులో ప్రతి నిమిషం మన ఆంధ్రప్రదేశ్ గురించి కబురులు చెప్పే, బీజేపీ జాతీయ నాయకుడుని అని చెప్పుకునే మురళీధర రావు కూడా ఉన్నాడు.. నువ్వు మా పార్టీలొఇ వచ్చేసేయ్యి.. లకపోతే ప్రోటెం స్పీకర్ చేత, నీకు ఓటు లేకుండా చేస్తాం అంటూ బిసి పాటిల్ అనే కాంగ్రెస్ ఎమ్మల్యేను బెదిరించారు... మొత్తానికి, ఒక్క రాష్ట్రం కోసం, బీజేపీ ఎలా దిగజారిందో దేశ ప్రజలు చూస్తున్నారు...

tape 5 19052018 2

మోడీ, అమిత్ షా & పరివారం...బలం లేకున్నా అధికారం కోసం నానా గడ్డీ కరుస్తారు .. ప్రలోభాలూ బెదిరింపులూ దేబిరింపులూ .. ఎంతకన్నా దిగజారతారు... తమ నీతిమాలిన వ్యూహాల్లో గవర్నర్లను ఇష్టమొచ్చినట్టు ఉపయోగిస్తారు... అసెంబ్లీలో ప్రమాణ స్వీకారానికి ఎక్కువసార్లు గెలిచిన mla ని ప్రోటెం స్పీకరుగా పెట్టటం సాంప్రదాయం... అలా అయితే_ కర్ణాటకలో 8 సార్లు గెలిచిన కాంగ్రెస్ mla దేశ్ పాండే ని నియమించటం పధ్ధతి... దానిని కాలదన్ని 3 సార్లు గెలిచిన rss వాది బొప్పయ్యను నియమించారు... సిగ్గుమాలిన బీజేపీకి ఇంకా చెప్పటానికి నీతి కబుర్లు ఏమన్నా మిగిలాయా? నాలుగేళ్ల కాలంలో దాని నిజస్వరూపం మొత్తం దేశానికి ప్రదర్శించేసింది !! చాలు చాలు ఇక ... !! చెప్పటానికి నీతులు ఏమీ మిగల్లేదు !! గెలిస్తే గెలవొచ్చు గానీ, గెలిచేంత గొప్పది కాదు బీజేపీ .. ఓడినోడి వైఫల్యాలు గెలిచినోడికి పాఠాలే తప్ప, ప్రశంసలు కావు. దేశం చూస్తోంది .. దేశం మేల్కొంటోంది !!

Advertisements

Latest Articles

Most Read