ప్రజాస్వామ్యబద్ధంగానే అన్ని వ్యవహారాలు జరగాలని, కానీ కర్ణాటకలో అలా జరగడం లేదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులో నీరు-ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ... "కర్ణాటకలో రెండు పార్టీలు కలిసి మెజార్టీ సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే, మెజార్టీలేని ఇతర పార్టీకి అవకాశం ఇచ్చారు.ఆ రోజు బీజేపీ చెప్పిన మాటలేంటీ? ఈ రోజు చేస్తోన్న పనులేంటీ? ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అన్యాయం చేస్తోందని అన్నారు. ఆ నాడు కాంగ్రెస్‌ పార్టీ వల్ల ఏపీలో ఎన్టీఆర్‌ నష్టపోయారు.

cbn 17052018 2

1984లో అప్రజాస్వామికంగా ఎన్టీఆర్‌ని పదవి నుంచి తీసేస్తే 30 రోజులు పోరాడి మళ్లీ ఆయనను సీఎం చేసిన ఘనత తెలుగు ప్రజలది, టీడీపీది. ఒక పద్ధతి ప్రకారం జరగాలి, ప్రజాస్వామికంగా ముందుకు వెళ్లాలి. కేంద్రంలో అధికారంలో ఉన్నామని కర్ణాటకలో గానీ, మన రాష్ట్రంలోగానీ ఎక్కడైనా ఇష్టానుసారంగా ప్రవర్తించడం మంచిది కాదు అని అన్నారు. తక్కువ వనరులు ఉన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తుంటే రాష్ట్రంలో ప్రతిపక్షాలు తమపై విమర్శలు చేయడం బాధాకరమన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడం, ఎవరికీ ఇబ్బందులు లేకుండా చేయడం, ఆర్థిక అసమానతల్ని తగ్గించడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

cbn 17052018 3

తాను ప్రజల సంక్షేమం కోసమే కష్టపడుతున్నట్టు చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు, వైకాపాలో అవినీతిపరులు కొందరు తనను విమర్శిస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. వారి విమర్శలు చూస్తుంటే.. ఎవరైనా ఒక దొంగ దొంగతనం చేసి జైలుకు వెళ్లి మళ్లీ బెయిల్‌పై ఇంటికి వచ్చి ఆ ఊళ్లో పెద్దమనిషిని అంటే ఆయన ఎంత బాధపడతాడో తానూ అంతే బాధపడుతున్నానన్నారు. ఏకవచనంతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అయినా ఆ మాటలన్నీ ప్రజల కోసమే పడుతున్నానన్నారు.

రాష్ట్రపతి కోవింద్‌ను ఐదు రాష్ట్రాల ఆర్ధికమంత్రులు కలిశారు. ఏపీ ఆర్థిక మంత్రి యనమల నేతృత్వంలో రాష్ట్రపతిని కేరళ, పంజాబ్, ఢిల్లీ, బెంగాల్ ఆర్ధిక మంత్రులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 15వ ఆర్ధిక సంఘం విధివిధానాలను‌ మార్చాలని మంత్రులు కోరారు. అలాగే కేంద్రం విధివిధానాల విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతికి వినతి పత్రం అందజేశారు. 2011 జనాభా నిష్పత్తి ప్రకారం నిధుల పంపకాల విధానంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అమరావతిలో చేసిన తీర్మానం నివేదికను రాష్ట్రపతికి మంత్రులు అందజేశారు.

rastrapati 17052018 2

కొన్ని రోజుల క్రితం, అమరావతిలో 5 రాష్ట్రాలు సమావేశం అయ్యాయి. ప్రగతిశీల రాష్ట్రాలు నీరుగారిపోయేలా కేంద్ర ప్రభుత్వ తీరు వుందని, సహకార సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా నడుచుకుంటోందని వివిధ రాష్ట్రాలకు చెందిన ఆర్ధిక మంత్రుల సదస్సు అభిప్రాయపడింది. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలపై కేంద్రం చూపుతున్న వివక్షకు 15వ ఆర్ధిక సంఘం విధివిధానాలు అద్దంపడుతున్నాయని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 15వ ఆర్థిక సంఘం రూపొందించిన టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్ (టీవోఆర్)ను వ్యతిరేకించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు సచివాలయంలో సమావేశం నిర్వహించారు. గత నెల 10న కేరళలోని తిరువనంతపురంలో మొదటిసారి ఈ సమావేశం జరగ్గా, రెండో సమావేశానికి అమరావతి ఆతిధ్యం ఇచ్చింది.

rastrapati 17052018 3

2011 జనాభా లెక్కల ప్రకారం నిధుల కేటాయింపు చేస్తామంటే జనాభా నియంత్రణ పాటిస్తూ, ఆర్ధికంగా పురోగతిలో వున్న రాష్ట్రాలు నష్టపోతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్రం తీరు ప్రగతిశీల రాష్ట్రాలకు శిక్ష విధించేట్టుగా వుందన్నారు. అభివృద్ధిలో ముందుండే రాష్ట్రాలు ఎట్టిపరిస్థితుల్లో నష్టపోవడానికి వీల్లేదని చెప్పారు. ఈ అన్యాయాన్ని సహించేది లేదన్నారు. న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. 15వ ఆర్ధిక సంఘం విధి విధానాలను మార్చాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతిని కలుద్దామని ముఖ్యమంత్రి సూచించారు. ఆ నిర్ణయం ప్రకారం, ఈ రోజు, 5 రాష్ట్రాలు వెళ్లి రాష్ట్రపతిని కలిసాయి.

చంద్రబాబు ఎప్పుడూ అంటూ ఉంటారు, మన పిల్లలకి సరైన ప్రోత్సాహం ఇవ్వలే కాని, ప్రపంచాన్ని జయిస్తారు అని... అలానే, ప్రభుత్వ ప్రోత్సాహంతో, ఇప్పుడు ఏకంగా, మౌంట్ ఎవరెస్ట్ నే అధిరోహించింది, మన ఆంధ్రప్రదేశ్ యువత... ఎవరెస్ట్ పై నవ్యాంధ్ర పాతాకం గర్వంగా ఎగిరింది... మౌంట్ ఎవరెస్టు పై కీర్తిపతాకం ఎగురేసారు మన విద్యార్థులు... ఎవరెస్ట్ శిఖరాన్ని గురువారం 5గురు ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులు అధిరోహించారు. వారిలో జె.ప్రవీణ్(పెదవేగి,ప.గో),భాను సూర్యప్రకాశ్(కొత్తూరు,తూ.గో), జి.రాజు(గోలుగొండ,విశాఖ), వెంకటేశ్(చిట్టేడు,నెల్లూరు), ప్రసన్న(అడ్డతీగల,తూ.గో) ఉన్నారు. వాతావరణం అనుకూలిస్తే తరువాత బ్యాచ్ మరో 5గురు శనివారం శిఖరాగ్రం చేరే అవకాశం ఉంది.21మంది విద్యార్థులు ఎవరెస్ట్ ఎక్కితే అది ఆల్ టైం రికార్డు అవుతుంది.గతంలో 9మంది విద్యార్ధుల రికార్డు కూడా ఆంధ్రప్రదేశ్ దే.

everest 17052018 2

రెండేళ్లుగా శిఖరారోహణలో సోషల్ వెల్ఫేర్,ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్ధులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శిక్షణ ఇస్తోంది. పర్వతారోహణ నిపుణుడు శేఖర్ బాబు ద్వారా వీరికి శిక్షణ ఇవ్వడం జరిగింది.మూడు దశలుగా విద్యార్ధులకు శిక్షణ అందించారు.పాఠశాల స్థాయిలో లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ తదితర శారీరక పోటీలలో 184మందిని తొలుత ఎంపిక చేశారు.విజయవాడ కేతనకొండ సిబిఆర్ అకాడమిలోవారికి ప్రాధమిక దశలో శిక్షణ ఇవ్వడం జరిగింది.వారినుండి మెరుగైన 65మందిని ఎంపిక చేశారు.రెండవ దశలో మనాలిలో,డార్జిలింగ్ లో మూడువారాలు శిక్షణ ఇచ్చారు. వీరినుండి 36మందిని ఎంపిక చేయడం జరిగింది.తరువాత దశలో లడఖ్ లో మైనస్ 30డిగ్రీల ఉష్ణోగ్రతలో శిఖరారోహణ తర్ఫీదు పొందారు.

everest 17052018 3

ఆ ఉష్ణోగ్రతను కూడా తట్టుకునే 22మందిని తీసుకుని ఎవరెస్ట్ అధిరోహించడం ప్రారంభించారు.అందులో ఒకరు మధ్యలో డ్రాప్ కాగా మిగిలిన 21మంది ఎవరెస్ట్ అధిరోహణలో ఉన్నారు.వారిలో 5గురు ఇప్పటికే గమ్యాన్ని చేరుకున్నారు. అత్యంత కఠినమైన శిక్షణను తట్టుకుని అనుకున్న గమ్యం చేరుకున్న విద్యార్ధులను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు,మంత్రి ఆనంద్ బాబు ప్రశంసించారు. ‘‘శిఖరారోహణ ద్వారా విద్యార్ధుల్లో ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాల పెంపునకు దోహదపడుతుంది.పట్టుదల పెరుగుతుంది,కష్టాలను తట్టుకునే దృఢత్వం అలవడుతుంది,భవిష్యత్తులో అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు ఇది బాటలు వేస్తుంది.శిఖరారోహణ ద్వారా రాష్ట్రానికి ప్రతిష్ట పెంచారు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్ధులను ప్రశంసించారు

“గుడిని మింగేవాడు ఒకడైతే – గుడిలోని లింగాన్ని మింగేవాడు మరొకడు” అన్నట్టుగా, మోడీ-అమిత్ షా కర్ణాటకలో వేస్తున్న వేషాలను పరిగణలోకి తీసుకుని, వారికే జర్క్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ... కర్ణాటక రాజకీయ సెగ ఇప్పుడు, బీహార్ గోవాను తాకింది.. గోవాలో కాంగ్రెస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు రేపు రాజ్‌భవన్‌కు వెళ్లి.. తమది కూడా అతిపెద్ద పార్టీనేనని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరనున్నారు. గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శుక్రవారం రాజ్‌భవన్ వరకూ మార్చ్ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ఈ డిమాండ్‌ను తెరపైకి తేవడానికి కన్నడ రాజకీయం కారణమైంది. ఈ పరిణామంపై గోవా కాంగ్రెస్ మండిపడుతోంది. కర్ణాటకలో వర్తించిన నిబంధన తమకు ఎందుకు వర్తింపజేయలేదని గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు.

bjp goa 17052018 2

మరో పక్క బీహార్ లో కూడా ఇదే డిమాండ్ తెర పైకి వచ్చింది. బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజశ్వియాదవ్ బీజేపీ పై తీవ్ర విమర్శలు చేశారు. కర్నాటకలో అతిపెద్ద పార్టీ అయినందున బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశమిచ్చినందున, బీహార్‌లోనూ మాకూ అవకాశమివ్వాలన్నారు. బీహార్‌లో మాదే అతిపెద్ద పార్టీ అని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పెద్ద పార్టీనే అవసరమైతే, బీహార్‌లో అతిపెద్ద పార్టీ ఆర్జేడీనే అన్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీకి కర్నాటకలో గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించారు. అందుకే రాష్ట్రపతి... బీహార్ ప్రభుత్వాన్ని రద్దుచేసి, సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన ఆర్జేడీకి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కల్పించాలన్నారు.

bjp goa 17052018 3

ఇది ఇలా ఉండగా, కర్ణాటక శాసనసభ ప్రాంగణమైన విధానసౌధ వద్ద కాంగ్రెస్, జేడీఎస్ నిరసన దగ్గర కాంగ్రెస్ జాతీయ నేతలు అశోక్ గెహ్లాట్, గులాంనబీ అజాద్, మాజీ సీఎం సిద్ద రామయ్య, జేడీఎస్ నేత కుమారస్వామి బైటాయించారు. సుప్రీం కోర్టులో అర్థరాత్రి హైడ్రామ తర్వాత గురువారం ఉదయం యడ్యూరప్ప ప్రమాణస్వీకారం జరిగింది. ప్రమాణస్వీకారంపై స్టే విధించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దాంతో పోరాటాలకు దిగాలని కాంగ్రెస్, జేడీఎస్ నిర్ణయించాయి. సంఖ్యాబలం లేకపోయినా బీజేపీ దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ట్వీట్ చేశారు. కర్ణాటకలో ప్రజాస్వామ్యం అపహస్యంపాలైందని ఆయన అన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. గవర్నర్ నిర్ణయంపై సిద్ద రామయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. మెజారిటీ సభ్యులు తమవైపే ఉన్నారని ఆయన చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read