వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుని మళ్ళీ అరెస్ట్ చేయటానికి ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని రఘురామకృష్ణం రాజు ఇంటి దగ్గర ఏపి సిఐడి అధికారులను రఘురామకృష్ణం రాజు సెక్యూరిటీ గమనించారు. రఘురామరాజు ఇంటి ముందు నిఘా కోసం సిఐడి అధికారులు రావటంతో, వాళ్ళు ఎవరో తెలియక, ఇక్కడ ఎందుకు ఉన్నారు అని గట్టిగా అడగటంతో, తాము సిఐడి అధికారులమని చెప్పటంతో అసలు విషయం బయట పడింది. రఘురామ కృష్ణం రాజు ఆర్ఎస్ఎస్ నేత దత్తాత్రేయ హస్బోలే హైదరాబాద్ లో ఒక కార్యక్రమం చేస్తూ ఉండటంతో, ఆ కార్యక్రమంలో పాల్గునటానికి ఆయన హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్ వస్తున్నారని తెలుసుకుని, రఘురామకృష్ణం రాజు ని హైదరాబాద్ లో మళ్ళీ అరెస్ట్ చేయటానికి ఏపి సిఐడి అధికారులు ఆయన పైన నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. అయితే రఘురామకృష్ణం రాజు గత కొన్ని రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్నారు. హైదరాబాద్ కూడా రావటం లేదు. సంక్రాంతి పండుగ ముందు, రఘురామకృష్ణం రాజు పైన మరో కేసుని సిఐడి అధికారులు బుక్ చేసారు. అయితే అప్పట్లోనే ఆయన ఇంటికి వెళ్లి, పండగ టైంలో, విచారణకు రావాల్సిందిగా కోరారు.

rrr 260022022 2

అయితే దానికి రఘురామకృష్ణం రాజు ఒప్పుకోలేదు. ఆయన వెంటనే ఢిల్లీ వెళ్ళిపోయారు. అక్కడ నుంచి సిఐడి అధికారులకు తాను రాలేను అని మెసేజ్ పెట్టారు. ఈ లోపు పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభం కావటంతో, సిఐడి అధికారులు మళ్ళీ రావాలని, అయానను కోరలేదు. ఈ నేపధ్యంలోనే, ఇప్పుడు రఘురామరాజు హైదరాబాద్ వస్తున్నారని తెలుసుకుని, మళ్ళీ హైదరాబాద్ లో ఆయన ఇంటి ముందు నిఘా పెట్టారు. అయితే రఘురామరాజు సిబ్బంది, అతన్ని పట్టుకుని గట్టిగా అడగటంతో, తాము సిఐడి అధికరులమని, రఘురామకృష్ణం రాజుని అరెస్ట్ చేయటానికి వచ్చామని చెప్పారు. ఇదే విషయం రఘురామరాజు కూడా, కొద్ది సేపటి క్రితం ఒక వీడియో విడుదల చేసి, అసలు విషయం చెప్పారు. అయితే ఇక్కడ ఉంటే ఇబ్బంది అని గ్రహించిన రఘురామరాజు, సిఐడి అధికారుల కళ్ళు గప్పి, ఇంటి నుంచి బయటకు వచ్చి, ఎయిర్ పోర్ట్ కు వెళ్లి,అక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. మరి రఘురామరాజుని సిఐడి ఎలాంటి వ్యూహంతో అరెస్ట్ చేస్తుందో చూడాలి.

వైఎస్ వివేక కేసులో రోజు వస్తున్న వార్తలు, ఈ కేసులో జరిగిన పరిణామాల గుట్టు విప్పుతున్నాయి. సిబిఐ దూకుడు పెంచటంతో, అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. వివేకా వాచ్మెన్, వివేక డ్రైవర్, సిఐ, ఇలా అనేక మంది స్టేట్మెంట్లు ఇస్తుంటే, ఇవన్నీ సిబిఐ కావాలని చెప్పిస్తుంది అంటూ, వైసీపీ ఎదురు దా-డి చేస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు సొంత కుటుంబం నుంచే ఇలాంటి వ్యాఖ్యలు వస్తూ ఉండటంతో, వైసీపీ డిఫెన్సు లో పడుతుంది. నిన్న సొంత కుటుంబంలో పెద్ద వైఎస్ ప్రాతప్ రెడ్డి, ఆ రోజు జరిగిన విషయాలు అన్నీ సిబిఐకి చెప్పిన స్టేట్మెంట్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో అనేక విషయాలు ఉన్నాయి. గుండెపోటు ఎపిసోడ్ మొత్తం నడిపించింది అవినాష్ రెడ్డి అని ఆయన చెప్పారు. అలాగే రక్తం మరకలు తుడిచి వేయటం, కుట్లు వేయటం లాంటి విషయాలు కూడా సిబిఐకి చెప్పారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ మొత్తం అవినాష్ నడిపించారు అనే విధంగా ఆయన స్టేట్మెంట్ ఉంది. అయితే ఇప్పుడు వైఎస్ కుటుంబం నుంచే మరో వ్యక్తి సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ సంచలనంగా మారింది. అవినాశ్‍రెడ్డి పెదనాన్న మనవడు వైఎస్ అభిషేక్ రెడ్డి సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఆయన సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ లో అనేక విషయాలు ఉన్నాయి.

viveka 26022022 2

ఆ రోజు వివేక ఇంటికి ఉదయాన్నే వెళ్లానని అభిషేక్ రెడ్డి సిబిఐకి చెప్పారు. గుండె నొప్పి వచ్చి చనిపోయారని ఫోన్ చేసారని అభిషేక్ రెడ్డి చెప్పారు. అయితే వివేక ఇంటికి వెళ్ళినప్పుడు బయట కొంత మంది వ్యక్తులు ఉన్నారని, అవినాష్ రెడ్డి ఫోన్ లో మాట్లాడుతున్నారని, ఇంటి లోపలకు వెళ్లి చూస్తే, బెడ్ రూమ్ లో రక్తం ఉందని, బాత్ రూమ్ లో వివేక బాడీ ఉందని అన్నారు. ఆయన రక్తపు మడుగులో ఉన్నారని, వివేక నుదిటి పైన తీవ్రమైన గాయాలు ఉన్నాయని అన్నారు. అయితే అక్కడ సీన్ చూస్తే ఎక్కడ గుండె పోటు వచ్చి చనిపోయినట్టు లేదని, ఎందుకు గుండె పోటు అని ప్రచారం చేసారో అర్ధం కాలేదని అన్నారు. అయితే అక్కడే రక్తం తుడిచి, కుట్లు కూడా వేసారని సమాచారం వచ్చిందని, ఇదంతా ఎందుకు చేస్తున్నారో అర్ధం కాలేదని అన్నారు. ఆ రోజే ఒక టీవీ ఛానల్ లో లైవ్ లో మాట్లాడిన తాను, దీని పై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, సిబిఐ ఎంక్వయిరీ వేయమని అడిగినట్టు చెప్పారు. అసలు గుండెపోటు అని ఎందుకు చెప్పారో అర్ధం కావటం లేదని అభిషేక్ రెడ్డి తెలిపారు.

ఇప్పటికే వైఎస్ ఫ్యామిలీలో జగన్ మోహన్ రెడ్డికి, షర్మిలకు మధ్య విబేధాలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే వైఎస్ సునీత కూడా జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకం అయ్యారు. వైఎస్ వివేక కేసు విషయంలో కూడా, జగన్ మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని వెనకేసుకుని రావటం పైన కూడా వైఎస్ ఫ్యామిలీలో విబేధాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. ఇంటి ఆడ బిడ్డ న్యాయం కోసం ఢిల్లీలో అలా పాకులాడటం చూసి, వైఎస్ కుటుంబంలో కొంత మంది జగన్ పై ఆగ్రహంగా ఆన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వైఎస్ కుటుంబంలో ఉన్న పెద్ద వైఎస్ ప్రతాప్ రెడ్డి సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ తో, ఈ విషయం పై క్లారిటీ వస్తుంది. అవినాష్ రెడ్డి పాత్ర గుర్తించి, ఆయన సిబిఐకు మొత్తం చెప్పేసారు. దీంతో, ఇప్పుడు మళ్ళీ వైఎస్ కుటుంబంలో వివాదాలు బయట పడ్డాయి. వైఎస్ ప్రతాప రెడ్డికి 78 ఏళ్ళు . ఆయన జగన్ మోహన్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి పెదనాన్న అవుతారు. వైఎస్ వివేక చిన్నన్న కొడుకు వైఎస్ ప్రతాప రెడ్డి. వైఎస్ ప్రాతాప రెడ్డి సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో, వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర గురించి, పూసగుచ్చినట్టు మొత్తం సిబిఐకు తెలియ చేసారు. ప్రాతప రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ తో, సిబిఐకి కావలసిన ఆధారాలు లభించినట్టు, అవినాష్ రెడ్డికి ఉచ్చు గట్టిగా బిగిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.

avinash 2502022 2

వైఎస్ ప్రతాప రెడ్డి పలు కీలక విషయాలు చెప్పారు. వైఎస్ వివేక తన వద్దకు తరుచూ వచ్చే వారని, ఈ సారి ఎంపీ టికెట్ విజయమ్మకు కానీ, షర్మిలకు కానీ ఇవ్వాలని పట్టుబట్టే వారని, అవినాష్ రెడ్డిని జమ్మలమడుగుకు పంపించాలని ఆయన చెప్పే వారని చెప్పారు. అలాగే అవినాష్ రెడ్డి ఫ్యామిలీకి, ముందు నుంచి వివేక అంటే కోపం అని, వివేకాకి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర రెడ్డికి విబేధాలు ఉన్నాయని చెప్పారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓడిపోవటంలో, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పాత్ర ఉన్నట్టు చెప్పారు. ఇక వివేక హ-త్య జరిగిన రోజు, మనోహర్ రెడ్డి ఫోన్ చేస్తే అక్కడకు వెళ్లానని, గుండె నొప్పి అని అవినాష్ రెడ్డి అందరికీ చెప్తున్నాడని, అయితే అక్కడ సీన్ చూస్తే మాత్రం, గుండె నొప్పిగా లేదని అన్నారు. అక్కడ హడావిడిగా రక్తం తుడవటం, కుట్లు వేయటం, ఫోటోలు తీస్తుంటే అరవటం, ఇవన్నీ చూసి తేడాగా ఉందని, అక్కడ జరుగుతున్నవి చూడలేక, ఇంటికి వచ్చేసా అని వైఎస్ ప్రాతాప రెడ్డి, సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ లో మొత్తం వివరించారు.

ఈ రోజు భీమ్లా నయాక్ సినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు కూడా సినిమా టికెట్ల అంశం సెటిల్ అవ్వలేదు. చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి హేమా హేమీలు వచ్చి, బ్రతిమిలాడినా, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేట్ల పై క్లారిటీ లేదు. ఇది ఒక పక్కన అయితే, సహజంగా పెద్ద హీరో సినిమా వస్తుంటే, మొదటి రోజు బెనిఫిట్ షోలు వేయటం, లేదా అదనంగా షో లు వేయటం సర్వ సాధారనం. ఏ ప్రభుత్వంలో అయినా ఇలాగే చేసారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి బెనిఫిట్ షో లకి అనుమతి ఇవ్వలేదు. అలాగే ఎక్కువ షో లకు కూడా అనుమతి లేదు. ఎలాగూ టికెట్ ధరలు పెంచటానికి లేదు. సి సెంటర్స్ లో అయితే 5 రూపాయల టికెట్ కూడా అమ్మాల్సిన పరిస్థితి. దీనికి తోడుగా, భీమ్లా నాయక్ సినిమా ఆడుతున్న ధియేటర్లలో ఎంఆర్ఓలను పెట్టి, బెనిఫిట్ షో లు వేస్తున్నారా, టికెట్ ధరలు తక్కువే ఉన్నాయా అంటూ చూడాలని, ప్రభుత్వం ఆదేశించటం, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలో అఖండ, పుష్ప సినిమాలకు కూడా ఇలాగే ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి కూడా ఇలాగే ఇబ్బందులు పెట్టారు. కావాలనే కక్ష సాధింపు ధోరణిలో భాగంగానే ఇలా చేసారని అభిప్రయాలు వ్యక్తం అవుతున్నాయి.

cbn 25022022 2

జగన్ మోహన్ రెడ్డి వైఖరి పై చంద్రబాబు ఈ రోజు ట్వీట్ చేసారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను జగన్ మోహన్ రెడ్డి నాశనం చేస్తున్నారని, ఏ వ్యవస్థను వదలటం లేదని అన్నారు. వ్యక్తులను టార్గెట్ చేయటానికి, వ్యవస్థలను నాశనం చేస్తున్నావ్ అని అన్నారు. కొత్త కంపెనీలు రాక పెట్టుబడులు లేవని, ఉన్న సినిమా రంగాన్ని కూడా ఎందుకు వేధిస్తున్నారు అంటూ ప్రశ్నించారు. మీ భారతీ సిమెంట్స్ లో ఎలా రేట్లు పెంచి అమ్ముతున్నారు, అక్కడ లేని నియంత్రణ సినిమాల విషయంలోనే ఎందుకు అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటే, అధికార యంత్రాంగాన్ని మీ కక్ష తీర్చుకోవటం కోసం ఉపయోగిస్తారా ? అని చంద్రబాబు ప్రశ్నించారు. చంద్రబాబు ట్వీట్ కు వైసీపీకి ఎంతలా కాలింది అంటే, వరుస పెట్టి మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి, చంద్రబాబు పై విరుచుకు పడ్డారు. పేర్ని నాని అయితే, ఏమి చెప్పాలో తెలియక, జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు ఎప్పుడైనా ఇలా ట్వీట్ చేసావా అంటూ, అసంబద్ధం అయిన వాదన ముందుకు తెచ్చి, చంద్రబాబుకు కౌంటర్ ఎలా ఇవ్వాలో తెలియక, ఇలాంటి వాదన ముందుకు పెట్టారు.

Advertisements

Latest Articles

Most Read