ఒక బాధ్యత లేని వ్యక్తి ప్రవర్తన, మన నిజ జీవితాల్లో చాలా మందిని చూస్తూ ఉంటాం... విచక్షణ లేకుండా, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతా, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తా అంటూ, విపరీత మనస్తత్వం కలవారాని, మనం ఎంతో మందిని మన జీవితంలో చూస్తూ ఉంటాం... కాని, ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టి, ఒక పెద్ద సినీ హీరో అయ్యిండి, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ బ్రతికేస్తున్నాడు... ఇక్కడ సమస్య పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు.... ఇలా పవన్ కళ్యాణ్, గాలిగా ట్విట్టర్ లో పోస్టులు పెడుతుంటే, అదే రకమైన భావజాలంతో ఉన్న తన ఫాన్స్ ఇంకా రెచ్చిపోతారు.. సమాజంలో ఇప్పటికే, విచ్చలవిడితనం పెరిగిపోయి ఉంది.. పవన్ లాంటి వాడు, నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తే, ఇంకా తన ఫాన్స్ ఎలా రెచ్చిపోతారో అర్ధమవుతుంది... ఒక లీగల్ నోటీసుకు సమాధానం ఇస్తూ, ఎంత నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడో చూడండి.

pavan 23042018 1

రెండు రోజుల కృతం, తనను టార్గెట్ చేసేందుకు కొన్ని మీడియా చానెళ్లు కుట్ర పన్నాయని శ్రీనిరాజు ఆ కుట్రలో భాగస్వామి అని పవన్ ట్వీట్లు చేసాడు... శ్రీనిరాజు తాజా ఫొటో ఇలా ఉంటుందని కూడా పవన్ ట్వీట్ చేశాడు... శ్రీ సిటీ, చంద్రబాబు ఎదో గిఫ్ట్ గా ఇచ్చినట్టు ఒక ట్వీట్ చేసాడు పవన్... నిజానికి శ్రీ సిటీ, మొత్తం వ్యవహారం నడించింది కాంగ్రెస్ టైంలో. అయితే శ్రీనిరాజు ఈ వ్యవహారం పై, పవన్ కు లీగల్ నోటీసు పంపించారు... మీరు చేసిన ట్వీట్ లు, తప్పుడు సంకేతాలు ఇస్తున్నాయని, ఆ ట్వీట్ లు డిలీట్ చెయ్యాలని, లేకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవుతానని, శ్రీని రాజు లీగల్ నోటీసు పంపించారు... దీనికి పవన్, రిప్లై ఇస్తూ ఇవాళ తాను పంపించిన రిప్లై ట్విట్టర్ లో పెట్టారు...

pavan 23042018 1

దాని సారంశం, నా ట్విట్టర్ నా ఇష్టం.. నేను నా ఇష్టం వచ్చినట్టు రాసుకుంటా... నా ఫ్రీడమ్ అఫ్ స్పీచ్... ఒక ట్వీట్ కు కూడా, నువ్వు నాకు లీగల్ నోటీసు పంపించాలా... ఎదో ఊహించుకుంటున్నారు... నేను రాసిన ట్వీట్ లలో, తప్పు ఏమి లేదు... నా ట్విట్టర్ లో, నా ఇష్టం వచ్చినట్టు రాసుకునే స్వేఛ్చ నాకు ఉంది అంటూ, శ్రీని రాజుకు రిప్లై ఇచ్చాడు పవన్... ఇంకో ట్వీట్ లో, చంద్రబాబుని అంటే నీకు ఎందుకు కోపం శ్రీని రాజు అని రాసాడు పవన్... శ్రీని రాజు ఫోటో పెట్టి, తన పేరు లాగాడు కాబట్టి, లీగల్ నోటీసు వచ్చింది... మరి పవన్ కు ఆ మాత్రం తెలియదా ? లేక ప్రతి దాంట్లో చంద్రబాబుని లాగటమా ? మొన్న లోకేష్ విషయంలో కూడా, ఎవరో ఎదో అనుకుంటున్నారు అది నేను చెప్పా అని పవన్ చెప్పటం ఏదైతే ఉందో, పవన్ ఎలాంటి మనస్తత్వం కలవాడో అర్ధమవుతుంది... ఇలాంటి మనుషులు, సమాజానికి ఎంతో ప్రమాదకరం... ఇష్టం వచ్చినట్టు బ్రతికేయ్యండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించండి అని తన ఫాన్స్ కు చెప్పకనే చెప్తున్నాడు...

మే 7న అమరావతిలో జరిగే సమావేశం, మోడీని భయపెడుతుంది... చంద్రబాబు వేసిన ఎత్తుకు, మోడీ, షా భయపడుతున్నారు... రాజకీయంగానే కాకుండా, రాష్ట్రాలకు చేస్తున్న వివక్ష పై, అన్ని రాష్ట్రాలని చంద్రబాబు ఏకం చేస్తున్నారు... ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలను ఒక్కతాటి పై తెచ్చిన చంద్రబాబు, ఈ సారి దేశంలో వివిక్షకు గురవుతున్న మిగతా రాష్ట్రాలను కూడా రమ్మని కబురు పంపించారు.. మే 7న విజయవాడలో ఈ సమావేశం జరగనుంది... అయితే ఈ సమావేశం జరిగితే, అన్ని రాష్ట్రాలకు మోడీ చూపిస్తున్న వివక్ష క్లియర్ గా ప్రజలకు చెప్పనున్నారు... ఇది కర్ణాటక ఎన్నికల పై కూడా పడుతుంది.. అంతే కాదు, బీజేపీ యేతర రాష్ట్రాలను చంద్రబాబు ఏకం చేస్తే, చంద్రబాబు ఇమేజ్ పెరిగిపోతుంది. అందుకే, ఈ సమావేశం జరగకుండా ఉండటానికి, మోడీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు... రెండు రోజుల క్రితం ఇంటలిజెన్స్ చీఫ్, నిన్న గవర్నర్ వచ్చి, చంద్రబాబు పై దూకుడు తగ్గించ మంటున్నారు...

modi 23042018

మే 7న అమరావతిలో జరిగే సమావేశం ఎందుకు ? కేంద్ర సర్కారు పై దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్న ఇక పోరాటంలో దేశంలోని ఇతర బిజెపి యేతర రాష్ట్రాలు కూడా చేతులు కలుపబోతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఇటీవల తిరువనంతపురంలో భేటీ కాగా, రెండో భేటీని విజయవాడ వేదికగా నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈసారి దేశంలోని అన్ని బిజెపియేతర రాష్ట్రాలను ఒకే వేదిక పైకి తీసుకువచ్చి పోరాటాన్ని ఉధృతం చేయాలని సంకల్పించారు. ఈ బాధ్యతను ఎపి రాష్ట్ర ఆర్థిక శాఖకు అప్పగించారు. దీంతో ఇతర రాష్ట్రాలను ఆహ్వానించే పనిలో రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు బిజీ అయ్యారు. ఈసారి చర్చల్లో ఆర్ధిక నిపుణులను కూడా భాగస్వాములను చేస్తూ వారినీ ఆహ్వానిస్తున్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల దక్షిణాది రాష్ట్రాలు ఆర్ధికంగా నష్టపోతున్న నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు, అధికారులు తిరువనంతపురంలో భేటీ అయిన సందర్భంలో తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు గైర్హాజరయ్యాయి.

modi 23042018

మిగిలిన నాలుగు రాష్ట్రాలు పలు అంశాలపై చర్చించాయి. మరోసారి మరింత లోతుగా చర్చించేందుకు భేటీ కావాలని అక్కడే నిర్ణయించగా ఈ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. తొలుత విశాఖపట్నంలో ఈ భేటీని నిర్వహించాలనుకున్నా, చివరిగా విజయవాడకు వేదికను మార్పు చేశారు. ఈ భేటీకి కొత్తగా ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మిజోరాం రాష్ట్రాలను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. దేశంలో బిజెపితో పొత్తు లేని రాష్ట్రాలను కూడా గుర్తించి ఈ సమావేశానికి ఆహ్వానించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. తిరువనంతపురం వేదికగా కొంతమంది ఆర్ధిక నిపుణులు అత్యంత లోతుగా సమస్యల పై చర్చించారు. దీంతో అధికారులకు కూడా అవగాహన పెరిగింది. అందుకే విజయవాడ సమావేశానికి రాష్ట్రానికి చెందిన ఆర్ధిక నిపుణులను కూడా ఆహ్వానించేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిసింది. ఇప్పటికే ప్రముఖ ఆర్టిక నిపుణుడు గోవిందరావుతో పాటు మరి కొందరి పేర్లను గుర్తించారు. అయితే వారిలో కొందరు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం వల్ల సమావేశాన్ని మే 7న నిర్వహించాలని నిర్ణయించారు. వాస్తవానికి ఈ నెల 24వ తేదీనే ఈ భేటీ నిర్వహించాలని భావించారు.

టీడీపీ ఎమ్మెల్యే అనిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్‌గా తన నియామకాన్ని వెనక్కు తీసుకోవాలంటూ సిఎం చంద్రబాబుకు లేఖ రాశారు. తన కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడం ఇష్టం లేదని లేఖలో రాశారు. తాను హిందువునని, తన ఇష్టదైవం వేంకటేశ్వర స్వామి అని ఆమె స్పష్టం చేశారు. తాను అనేకసార్లు తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకున్నానని చెప్పారు. తాను క్రిష్టియన్‌ను కాదన్నారు. టీటీడీ మెంబర్‌గా అనితను నియమించిన వెంటనే సోషల్ మీడియాలో వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. అనిత తనను తాను క్రిష్టియన్ అని ఆ వీడియోల్లో ప్రకటించుకున్నట్లు ఉంది.

anita 22042018 2

తాను దేవుడిని నమ్ముతానని, తన బ్యాగ్‌లో, కారులో బైబిల్ ఉంటుందని అనిత చెప్పినట్లు వీడియోలో ఉంది. దీంతో దుమారం రేగింది. అయితే, తాను హిందువునేనంటూ అనిత ముందుకు వచ్చారు. తన కులం సర్టిఫికెట్ కూడా చూపించారు. తాను అన్ని మతాల విశ్వాసాలను పాటిస్తానని చెప్పారు. అయినా సరే ఇది రాజకీయ వివాదంగా మారడంతో ఆమె మనస్తాపం చెందారు. దీంతో తనను టీటీడీ సభ్యురాలి పదవి నుంచి తొలగించాలంటూ సీఎం చంద్రబాబునాయుడుకి లేఖ రాశారు. దీంతో ప్రభుత్వం ఆమెను బోర్డు నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది... విపక్షాలు ఈ నిర్ణయంతో షాక్ తిన్నాయి... ఈ విషయంలో చంద్రబాబుని రాజకీయంగా ఆడుకోవచ్చు అని భావించారు...

anita 22042018 3

ఇది అనిత లేఖ సారంశం... నా మీద నమ్మకం తో దళిత మహిళని అయిన నన్ను నా ఇష్ట దేవమైన వెంకటేశ్వర స్వామి సేవ చేసుకొనే అవకాశం టీటీడీ బోర్డు మెంబెర్ గా నిమించినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేసుకుంటున్న. కానీ కొన్ని దుష్ట శక్తులు నా మీద నేను నమ్మే మతం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నేను హిందువు ని అయినప్పటికీ కట్ పేస్ట్ చేసిన వీడియో ని సోషల్ మీడియా లో పెట్టి కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారు...ఈ దరిమిలా...నా నాయకుడు ఐన చంద్రబాబు నాయుడు గారిని ఎమి చేయలేక 14 సెకెనుల వీడియో ని చూపించి గవర్నమెంట్ ని సీఎం గారిని తప్పు పట్టడం చేస్తున్నారు. అందువలన నేనే ఈ టీటీడీ బోర్డు మెంబెర్ గా తప్పుకుంటున్నానని వినమ్రతతో తెలియచేస్తున్నా.నన్ను ఎంతో అభిమానించి ఆదరించి నాకు ఎంతోమానసిక ధాయిర్యాన్ని ఇచిన నా తెలుగు దేశం కార్యకర్తలకి నా పాదాభివందనములు తెలియచేసుకుంటూ ఎల్లప్పుడూ మీ ఆశీర్వాదం కోరుకుంటూ మీ సహోదరి అనిత

రాష్ట్ర వ్యాప్తంగా చకచకా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన హామీ మేరకు మూడవ సోమవారం అయిన 23న పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసిన ముందు నుంచి ప్రతి నెలా మూడవ సోమవారం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి పనులను స్వయంగా పరిశీలిస్తానని తొలిదశలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇవ్వడం తెలిసిందే. దానికి తగ్గట్టుగా ఈ సోమవారం ఆయన పోలవరం పర్యటనకు నిర్ణయించారు. అయితే ఈ రోజు మాత్రం, పోలవరంలో అతి కీలకమైన పనులకు శ్రీకారం చుట్టనున్నారు చంద్రబాబు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పనులు.. ప్రణాళిక ప్రకారం అత్యంత వేగంగా సాగుతున్నాయి. అనుబంధ పనులను పూర్తి చేయడానికి జలవనరుల శాఖ, నవయుగ కంపెనీ అడుగులు వేస్తున్నాయి.

polavaram 23042018

దీనిలో భాగంగా స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 2019లో కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు నీరందించేందుకు ఇప్పటికే స్పిల్‌వే కాంక్రీట్‌ పనులు, డయాఫ్రం వాల్‌, కాపర్‌ డ్యామ్‌ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనులు ప్రారంభిస్తున్నారు. స్పిల్‌వే నుంచి వచ్చే నీటిని మొత్తం ఈ స్పిల్‌ చానల్‌ ద్వారా తిరిగి గోదావరిలోకి కలుపుతారు. ప్రాజెక్టుకు సంబంధించి ఈ వేసవి అత్యంత కీలకమైన సమయంగా అటు అధికారులు, ఇటు ఇంజనీర్లు కూడా భావిస్తున్నారు. దానికి తగ్గట్టే ఈసీజన్‌కు ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన నిర్మాణ ప్రక్రియను పూర్తి చేసే లక్ష్యంతో ఇప్పటికే కాంట్రాక్టు ఏజెన్సీలు, అధికారులు ముందడుగు వేశారు. ఈ కాలంలో గోదావరి ప్రవాహం భారీగా తగ్గుముఖం పట్టే అవకాశం వున్నందున ఈ రోజుల్లోనే ఎక్కువ పనిచేసే అవకాశం వుంటుంది.

polavaram 23042018

ఈ వేసవి సీజన్‌లో అనుకున్న రీతిలో పనులు ముందడుగు వేస్తే పోలవరం ప్రాజెక్టు దాదాపుగా సహకారమైనట్లేనన్న అంచనా కూడా వ్యక్తమవుతోంది. ఏ రకంగా చూసినా ప్రస్తుతం జరగనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం పర్యటన అన్ని విధాలా కీలకమనే భావించాల్సి వుంటుంది. ఇనే్నళ్లుగా పడిన కష్టానికి దాదాపుగా ఒక ఆకారం వచ్చే అవకాశాలు ఈ వేసవి సీజన్ పనులతో భారీగా మెరుగుపడతాయని చెబుతున్నారు. అదే జరిగితే ప్రాజెక్టు అంశం దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినట్లే భావించాల్సి వుంటుంది. స్పిల్‌ చానల్‌ నిర్మాణంలో మొత్తం 3.20 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టిని బయటకు తరలించాల్సి ఉంది. ఇందుకోసం వందల సంఖ్యలో వాహనాలను భారీ డంపర్లు, ఎక్స్‌వేటర్లను మోహరించారు. రాత్రి పగలు పని చేస్తూ ఇప్పటి వరకు 2.18 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనిని పూర్తిచేశాయి.

polavaram 23042018

ఇంకా 1.2 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తీయాల్సి ఉంది. స్పిల్‌ చానల్‌లో మొత్తం 2.92 కిలోమీటర్ల పొడవునా.. కిలోమీటరు వెడల్పులో కాంక్రీట్‌ వేయనున్నారు. దీని నిర్మాణంలో 18.80 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను వినియోగించనున్నారు. ఈ పనులను 7,520 బ్లాక్‌లుగా విభజించి కాంక్రీట్‌ వేస్తారు. పది మీటర్ల వెడల్పు, పది మీటర్ల పొడవు, ఒక మీటరు ఎత్తుతో వేసి దానిని ఒక బ్లాక్‌గా గుర్తిస్తారు. ఆ విధంగా నిర్మాణానికి 4,13,600 టన్నుల సిమెంట్‌ను, 17 లక్షల క్యూబిక్‌ మీటర్ల మెటల్‌ను, 9 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను వినియోగించనున్నారు.

Advertisements

Latest Articles

Most Read