మీడియాపై పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్‌ జర్నలిస్టు ఫోరం తీవ్రంగా ఖండించింది.... ఇది పవన్ కు రాసిన ఉత్తరం "మీడియా పట్ల పవన్ కళ్యాణ్ తీరును ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తీవ్రంగా ఖండిస్తోంది .. ఎవరో యువతి ఆయన తల్లిని ధూషించిందని ఆ వార్తలు చానెళ్లలో కవర్ చేశారని ఆగ్రహం తో ఊగిపోతూ చానెళ్లను శాసించాలని చూడటం మంచి పద్దతి కాదు .. వాస్తవానికి మీ తల్లిని శ్రీరెడ్డి తిట్టిన తిట్టును ఏ చానెల్ కూడా సంస్కారంతో ప్రసారం చేయలేదు ..కానీ మీరు మాత్రం మీడియాలో మీ తల్లిని ధూషించింది ప్రసారం చేసినట్టు మీరు భ్రమించి ఆరోపణలు చేస్తున్నారు ..మీడియా ఎలా ఉండాలో ఏ వార్తలు ప్రసారం చేయాలో మీరు డిసైడ్ చేయొద్దు .."

pk letter 21042018

"చానెళ్లలో ఏ కంటెంట్ ఇవ్వాలో మీరెలా డిక్టేట్ చేస్తారు .??మీరు తీసే సినిమాలు ఎలా ఉండాలో మీడియా స్క్రిప్ట్ చూసి బావుందని చెబితే మీరు యాక్ట్ చేస్తారా ?? మీ సినిమాలు ఎలా ఉండాలో మేము చెప్పడం లేదు కదా .. మీరు పెట్టిన రాజకీయ పార్టీ ఎలా నడవాలో మేము చెప్పడం లేదు కదా .. జర్నలిజం ను మీరు శాసించడానికి ప్రయత్నించవద్దు .. అంతేగానీ చానెల్స్ పై దాడి చేయడం తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు .. ప్రజలకు సేవ చేసేందుకు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నామని చెప్పుకుంటున్న మీరు విమర్శలు ఆరోపణలు కూడా స్వీకరించడానికి సిద్దంగా ఉండాలి .. అంతేగానీ భౌతిక దాడులు చేయడం మీ పార్టీ సిద్దంతమా ..??"

pk letter 21042018

"తల్లిని ధూషించారని ఆవేదన వ్యక్తం చేస్తున్న మీరు ఇవాళ ఫిల్మ్ చాంబర్ దగ్గర ఒక మహిళా జర్నలిస్ట్ పై మీ అభిమానుల దాడిని సమర్ధిస్తున్నారా ??మీడియా ప్రతినిధులను చంపుతాము ..యాసిడ్ దాడులు చేస్తామంటూ మీ జనసైన్యం బెదిరిస్తోంది దీనికి నైతిక బాధ్యత వహిస్తారా ?? జనసేన పార్టీ ఇంకా ఉనికిలో లేకముందే మీరు మీడియాను బెదిరిస్తున్నారు .. మీ అనుచరుల చేత దాడులు చేయిస్తున్నారు .. మీ చెప్పుచేతల్లో మీడియాను పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు .. ఇవాళ మీ ఆధ్వర్యంలోనే మీ అభిమానులు ఏబీఎన్ వాహనాన్ని ధ్వంసం చేయడం , మిగిలిన మీడియా ప్రతినిధులను బెదిరించడం ఎంతవరకూ కరెక్టో మీరే చెప్పాలి .. టీవీ9 , ఏబీఎన్ , టీవీ 5 చానెళ్లను బ్యాన్ చేయాలని చెప్పడం ద్వారా మీరు మీ కార్యకర్తలకి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు ?? మహా టీవీ పై నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తూ చానెల్ కి యాజమాన్యాన్ని బెదిరించే ప్రయత్నం చేయడం సరికాదు ..గత కొద్దిరోజులుగా సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ తో ఎందరో మహిళలు వారి ఆవేదనను మీడియా ముందుకు వచ్చి కన్నీటి పర్యంతమైన సంఘటనలు మీకు కనిపించలేదా ?? సినిమా చాన్సులు ఇస్తామంటూ మైనర్ బాలికలను సైతం వదలకుండా లైంగిక దోపిడీకి పాల్పడితే సినిమా ఇండస్ట్రీలో పెద్దలుగా ఉన్న మీరు గానీ మీ కుటుంబ సభ్యులుగాబీ ఎందుకు స్పందించలేదు .. అదేమంటే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసుకోవాలని సలహా ఇచ్చిన మీరు మీ తల్లిగారి విషయంలో మరో మహిళ మీ తల్లిని తిట్టిందని ఎందుకు మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వలేదు ..??'మీడియాపట్ల అభ్యంతరాలుంటే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయొచ్చన్న జ్ఞానం మీకెందుకు కలగలేదు ??మీకొచ్చిన కష్టం యావత్తు రాష్ట్ర ప్రజలకు వచ్చిన కష్టం లాగా చిత్రీకరిస్తూ మీ అభిమానులను రెచ్చగొడాతారా ?? ఇదెంత వరకూ సమంజసమో పార్టీ అధ్యక్షుడిగా మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము... ఇట్లు .. అంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు , చెవుల క్రిష్ణాంజనేయులు.. జనరల్ సెక్రటరీ మారెళ్ల వంశీ క్రిష్ణ"

శ్రీ రెడ్డి.. ఈ అమ్మాయి ఎవరో కొన్ని రోజుల క్రితం వరకు, ఎవరకీ తెలియదు.. సినీ పరిశ్రమలో, స్త్రీలకు ఉండే వివక్ష పై, అర్ధ నగ్న నిరసన చేసి, అందరి దృష్టి ఆకట్టుకుంది... ఈమె ఒకప్పుడు జగన్ మోహన్ రెడ్డి, సాక్షి టీవీలో ఒక యాంకర్.. చిన్నా చితకా సినిమాల్లో చేసింది... జగన్ కు వీరాభిమాని... ఈమె పవన్ ని ఎదో వ్యక్తిగతంగా తిట్టింది... అది పరమ చెత్త పని... తల్లిని తిట్టింది అంటే, ఆమె ఎలాంటిదో అర్ధమవుతుంది... తన చేతే నేనే తిట్టించా అని వర్మ చెప్పాడు... మొన్న, ఇదంతా వైసిపీ చేపిస్తుంది అని శ్రీ రెడ్డి ఆడియో ఒకటి లీక్ అయ్యింది... పవన్ తన తల్లిని తిట్టారంటూ మూడు రోజుల తరువాత వచ్చి, ఇదంతా చంద్రబాబు చేపిస్తున్న కుట్ర అంటూ, హంగామా చేసి, రాజకీయాల్లోకి తన తల్లిని లాగి, రాజకీయం చేసే ప్రయత్నం చేసారు... అసలు శ్రీ రెడ్డితో చంద్రబాబు , ఎదో చేపిస్తున్నాడు అనే ఆలోచనే, పవన్ ఎంత కరెక్ట్ గా ఉన్నాడు అని చెప్పటానికి ఒక ఉదాహరణ...

cbn pavan 21042018

శ్రీ రెడ్డి అనే అమ్మయితో చంద్రబాబు ఇలాంటివి చేపించాడు అంటే ఎవడైనా నమ్ముతాడా ? ప్రస్తుతం చంద్రబాబు ఉన్న పరిస్థితి ఏంటి ? దేశ స్థాయిలో ఎవరూ చెయ్యని సాహసం చేస్తున్నారు... మోడీ లాంటి అతి బలమైన ప్రధానితో యుద్ధం చేస్తున్నారు... అటు నుంచి, ఎలాంటి ఒత్తిడిలు వచ్చినా తట్టుకుని, రాష్ట్రాన్ని కాపాడుతున్నారు... ఒక వైపు కేంద్రంతో పోరాడుతూనే, మరో వైపు రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పకుండా లైన్ లో పెడుతున్నారు.. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ది చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు... ఒక వైపు రాష్ట్ర జీవనాడు పోలవరం పూర్తి చేసే బాధ్యత, మరో వైపు అమరావతికి ఒక రూపు, మరో వైపు రాష్ట్రానికి పెట్టబడులు, మరో వైపు తోడేళ్ళ నుంచి, ఆపరేషన్ గరుడ నుంచి రాష్ట్రాన్ని రక్షించుకుంటూ, శాంతి బధ్రతలు అదుపులో పెట్టటం... చంద్రబాబ ఇన్ని చూసుకోవాలి... 5 కోట్ల మంది జీవితాలు, ఆయన చేతిలో ఉన్నాయి...

cbn pavan 21042018

ఇలాంటి చంద్రబాబు, ఎక్కడో హైదరబాద్ లో ఉండే, ఒక జూనియర్ ఆర్టిస్ట్ చేత, నీ పై కుట్ర పన్ని, నిన్ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా ? దీనికి 10 కోట్లు ఖర్చు చేసారా ? దీనికి కొన్ని చానల్స్ పని చేస్తున్నాయా ? చంద్రబాబు అంత ఖాళీగా ఫార్మ్ హౌస్ లో కూర్చుని, మందు తాగుతున్నాడు అనుకుంటున్నావా పవన్ ? ఆయన ఎన్ని గంటలకు సెక్రటేరియట్ కు వస్తారో, ఎన్ని గంటలకు ఇంటికి వెళ్తారో తెలుసా ? హైదరాబాద్ లో కూర్చుని, మా ముఖ్యమంత్రి మీద రాళ్ళ వెయ్యటం కాదా, నీ రాజకీయం కోసం, మా ముఖ్యమంత్రిని నిందించకు... ఎమన్నా ఉంటే బయట పెట్టు... ఎవరో అనుకునేది, నీ స్థాయి నాయకులు చెప్తే, చెండాలంగా ఉంటుంది... అప్పుడు, నీ మీద కూడా, ఎవరో అనుకుంటున్నారు అని ఆరోపణలు చేస్తే ? తెగే దాకా లాగితే, ఎవరికీ నష్టమో నీకే బాగా తెలుసు... ఆసలు శ్రీ రెడ్డికి, చంద్రబాబుకి లంకె ఎలా పెట్టావో కాని,నీకు తింగరితనం వేపకాయంత అనుకుంటున్నారు ఏపి ప్రజలు, కాదు కొబ్బరి కాయంత ఉంది...

ఒక తల్లిని ఎవడు తిట్టినా, వాడు మూర్ఖుడుతో సమానం.. అది ఎవడూ హర్షించడు.. పవన్ తల్లిని, సినీ ఇండస్ట్రీలో ఉండే ఎవరో తిడితే, వెంటనే అందరూ ఖండించారు... మహేష్ కత్తి విషయంలో కూడా, పవన్ వెంటే ఉన్నారు అందరూ... పవన్ తన తల్లిని తిట్టాడు అని బాధపడటంలో తప్పు లేదు... ఎవరైనా బాధ పడతారు... ఈ విషయంలో, అందరూ పవన్ వెంటే ఉంటారు... అయితే, పవన్ చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు మాత్రం, ఎవరూ హర్షించరు... ఒక తల్లిని తిట్టమని లోకేష్ చెప్పినా, టీవీ9 చెప్పినా, ABN చెప్పినా, ఎవరు చెప్పినా అది తప్పు... కాని, ఆధారాలు చూపించకుండా, వారు చేపించారు, వీరు చేపించారు అని, ఇది ఒక రాజకీయ కుట్రగా చిత్రీకరించి, తన తల్లిని రాజకీయాలు కోసం వాడుకుంటే, ఎవరూ హర్షించరు.. ఏమైనా ఆధరాలు ఉంటే చూపించి మాట్లాడాలి... గాల్లో, గాలి మాటలు అందరూ చెప్తారు...

pk fans 21042018

ఇలాంటి గాలి మాటలు మాట్లాడే వారు, ప్రతి రోజు సోషల్ మీడియాలో లక్షా తొంబై మంది ఉంటారు... వారి మాటలు పట్టుకుని, తప్పుఒప్పులు బేరీజు వెయ్యలేం... ఏదైనా వాస్తవాలతో మాట్లాడాలి... తన తల్లిని అన్నారని, మూడు రోజుల తరువాత బయటకు వచ్చి హడావిడి చేస్తున్న పవన్ కు, తన ఫాన్స్ చేస్తున్న రచ్చ కనిపించటం లేదా ? తల్లి ఎవరికైనా తల్లే... మరి, అలాంటి మాటలు మాట్లాడారని, మీరు ఇంత బాధపడుతూ, న్యాయ పోరాటం చేస్తా అంటూ, మీ ఫాన్స్ ని రెచ్చగొట్టి టీవీ వాళ్ళ కార్ లు, ఓబి వ్యాన్ లు ధ్వంసం చేపిస్తున్నారే.. మరి, మీ ఫాన్స్ తిట్టే బూతులుకి ఏమి చెయ్యాలి ? ఇప్పుడు ఇష్యూ శ్రీ రెడ్డి ఉదంతం కాబట్టి, ఒకసారి శ్రీ రెడ్డి సోషల్ మీడియా పోస్టింగ్ లు కింద , మీ ఫాన్స్ పెట్టే కామెంట్స్ చూడండి..

pk fans 21042018

మీకు వ్యతిరేకంగా ఏమన్నా రాస్తే, మా పైన, మా అమ్మల పైనా, కూతుళ్ళ పైనా, పెళ్ళాల పైనా, మీ ఫాన్స్ బూతులు తిడుతూ కామెంట్స్ పెడుతూ ఉంటారు... మరి, ఇది ఎవరు చేపిస్తున్నారు అనుకోవాలి ? మీ అమ్మని తిట్టమని చంద్రబాబు చెప్పాడు, టీవీ వాళ్ళు చెప్పారు అని మీరు అంటున్నారు కదా.. మరి, మీకు వ్యతిరేకంగా ఏమన్నా రాస్తే, మా పైన, మా అమ్మల పైనా, కూతుళ్ళ పైనా, పెళ్ళాల పైనా, మీ ఫాన్స్ తిడుతున్న బూతులు, మీరు చెప్తే రాస్తున్నారా ? మీ పార్టీ వాళ్ళు చెప్తే, ఆ బూతులు తిడుతున్నారా ? మేము ఎవరికి చెప్పుకోవాలి ? సామాన్యలకు, మీ లాగా లీగల్ గా వెళ్ళే స్థోమత కూడా ఉండదు.. మరి మీ ఫాన్స్ నుంచి, ఇలాంటి బూతులకు ఎవరు బాధ్యలు ? ఇది ఎవరి కుట్ర ? దీనికి సమాధానం చెప్తే, మీ తల్లి గారి పై, చేసిన విమర్శలు, వాళ్ళు ఎందుకు చేసారో, మీకు సమాధానం దొరుకుంతుంది... ఇలాంటి చెండాలం అంతా నడిపించే టైం, చంద్రబాబుకి ఉందని మీరు భావిస్తే, మీ తెలివికి వందనాలు... జై హింద్...

భాజపా దొంగాట, దూకుడుకు కళ్లెం వేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రజాదర్బార్‌ హాల్‌లో సాధికార మిత్రలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రానికి న్యాయం కోసం ముఖ్యమంత్రిగా ప్రధానితో పోరాడుతున్నా.. అందరూ సహకరించి ఏకతాటిపైకి రావాలి. ప్రజలను చైతన్య పరిచి పోరాటానికి సిద్ధం చేసేందుకే దీక్ష చేశా. లాలూచీ రాజకీయాల వల్ల మనం నష్టపోతాం. ఈ రాష్ట్రం ఐకమత్యంగా ఉంటే, ఐదుకోట్ల మంది ముక్తకంఠంతో పోరాడితే ఇవాళ కాకపోతే రేపైనా న్యాయం జరుగుతుంది. కేంద్రం చాలా అహంభావంతో ఉంది. విజ్ఞత కలిగిన నాయకుడిగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నా. తప్పకుండా కేంద్రం దిగొచ్చేలా చేస్తాం అని అన్నారు.

cbn meeting 21042018

వచ్చే ఎన్నికల తర్వాత ప్రధాని ఎంపిక విషయంలో... తమ నిర్ణయమే కీలకంగా ఉంటుందని సీఎం చంద్రబాబు చెప్పారు. కథువాలాంటి ఘటనలను నివారించడంలో కేంద్రం విఫలమైందని దుయ్యబట్టారు. కేంద్రం తీరువల్ల దళితుల్లో అలజడి చెలరేగిందని, బీజేపీకి రాష్ట్రంలో ఒక్క ఓటు రాదు...ఒక్క సీటు రాదని ఆయన జ్యోసం చెప్పారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే విరుచుకుపడుతున్నారని బాబు మండిపడ్డారు. కేంద్రం దిగొచ్చేలా చేస్తామని, మన లక్ష్యాన్ని సాధించి తీరుతామని స్పష్టం చేశారు. మోదీకి నాలుగు సీట్లు తక్కువ వచ్చి ఉంటే మన మాట వినేవారని, పటేల్‌ విగ్రహానికి 2500 కోట్లు ఇచ్చారు.. రాజధానికి రూ. 1500 కోట్లే ఇచ్చి లెక్కలు చెప్పలేదంటున్నారని, ఒక విగ్రహానికి ఇచ్చిన విలువ రాష్ట్రానికి ఇవ్వరా అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు.

cbn meeting 21042018

ప్రధాని అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని, ఇబ్బందులు ఉన్న రాష్ట్రాలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలన్నారు. తిరుపతి వెంకన్ననే నమ్ముకున్నామని, వడ్డీతో సహా అన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి చేస్తూనే మన హక్కుల కోసం పోరాడతామని, మోదీ గుజరాత్ సీఎం కాదు...దేశ ప్రధాని... దేశం మొత్తానికి మోదీ న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఒకప్పుడు డబ్బు సంపాదన కోసం కష్టపడే వాళ్ళమని, ఇప్పుడు ఏటీఎంలలో డబ్బు తీసుకోవడానికి కష్టపడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. "బంద్‌కు పిలుపు ఇచ్చి రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీయొద్దు. అలా చేస్తే పరోక్షంగా ప్రధాని మోదీకి సహకరించినట్లే అవుతుంది. రాష్ట్రం అంటే బాధ్యత లేదు కాబట్టే అఖిలపక్ష సమావేశానికి అన్ని సంఘాలు వచ్చినా పార్టీలు రాలేదు. లాలూచీ రాజకీయాలు ఉన్నాయి కాబట్టే కొన్ని పార్టీలు కూడగట్టుకుని రాలేదు" అని చంద్రబాబు అన్నారు.

Advertisements

Latest Articles

Most Read