చాలా రోజుల తరువాత, గవర్నర్ నరసింహన్, చంద్రబాబుతో భేటీ కానున్నారు... ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది... ఇప్పటికే రాజ్ భవన్ వేదికగా, ఆంధ్ర రాష్ట్రం పై కుట్రలు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి... పవన్ కళ్యాణ్ ని, బీజేపీకి దగ్గర చేసింది నరసింహన్ అని, కేంద్ర పెద్దల ఆదేశాల ప్రకారం, పవన్ తో స్క్రిప్ట్ నడిపించే బాధ్యత గవర్నర్ తీసుకునట్టు, మీడియాలో కూడా ప్రచారం సాగుతుంది... మరో పక్క, చంద్రబాబు కంద్రంలో నుంచి బయటకు వచ్చి, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి, పెద్ద ఎత్తున కేంద్రం పై ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే... ఈ పరిణామాల నేపధ్యంలో, గవర్నర్ విజయవాడ వచ్చి, చంద్రబాబుతో భేటీ కావటంతో, అందరూ ఇటు వైపు చూస్తున్నారు...

govener 22042018

గవర్నర్ ఏదన్నా, రాయబారంతో వస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి... ప్రధాని మోడీ, విదేశి పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత, ఆయనకు ఇచ్చిన బ్రీఫింగ్ లో, మొదటిది చంద్రబాబు దీక్ష గురించి... పెద్ద ఎత్తున జాతీయ మీడియా కూడా కవర్ చెయ్యటం, చాలా మంది జాతీయ నాయకులు, ట్విట్టర్ ద్వారా, చంద్రబాబుకి సంఘీభావం ప్రకటించిన విషయం బీజేపీ పెద్దలను కలవర పెడుతుంది... అన్నిటికి అంటే మించి, ఇప్పుడు జాతీయ స్థాయిలో కొత్త పరిణామం చోటు చేసుకోబోతుంది... ఎప్పుడూ లేనిది, దేశంలో అన్ని విపక్షాలు కలిసి, ఆంధ్రప్రదేశ్ విభజన హామీల పై, ప్రధానికి లేఖ రాయనున్నాయి... ఇలా ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు... చంద్రబాబు, ఈ దిశగా అన్ని పార్టీలని ఒప్పించటంలో సఫలం అయ్యారు... ఇలా జరిగితే, ప్రధాని కచ్చితంగా దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది...

govener 22042018

ఈ అన్ని పరిణామాలు నేపధ్యంలో, చంద్రబాబుకి ఎమన్నా రాయబారం అందించటానికి గవర్నర్ వస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. అయితే తెలుగుదేశం వర్గాలు మాత్రం, ఏది ఏమైనా, విభజన హామీల పై స్పష్టత, అన్నిటికీ చట్ట బద్దత, టైం బౌండ్ గా హామీలు ఉంటేనే, ఏమైనా స్పందిస్తామని, లేకపోతే అసలు చర్చలే ఉండవని, ఈ విషయం ఇది వరుకే కేంద్రానికి తెగేసి చెప్పమని అంటున్నాయి.. 11 గంటలకు చంద్రబాబు, గవర్నర్ ఒక హోటల్ లో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా విభజన హామీలు, ప్రత్యేక హోదా, రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరి తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చించవచ్చని సమాచారం. గవర్నర్ తో సమావేశం అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడే అవకాశం ఉంది.

ప్రత్యేక హోదాతో పాటు విభజన డిమాండ్లను సాధించేందుకు ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా మరోవైపు ఢిల్లిలో వివిధ రాజకీయ పార్టీలు ఇదే డిమాండ్లపై ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబు తన జన్మదినోత్సవం రోజున విజయవాడలో నిర్వహించిన 12 గంటల మౌన నిరశన దీక్ష హస్తినలో వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల్లో వేడి పుట్టించింది. ఫలితంగానే చంద్రబాబుకు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌కు తాజా పరిణామాల నేపథ్యంలో సంఘీ భావంగా నిలవాలనే నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ చాంబర్‌లో అందుబాటులో ఉన్న వివిధ పార్టీల నేతలు సమావేశమై ఈ మేరకు విధానపరమైన నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. కాంగ్రెస్‌తోపాటు భావసారూప్యత కలిగిన ఇతర రాజకీయ పార్టీలన్నింటినీ కలుపుకోనిపోవాలని నిర్ణయించారు.

cbn 22042018 2

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఒత్తిడి పెంచితేనే జఠిలంగా మారిన హోదా, విభజన అంశాల సమస్య ఒక కొలిక్కి వస్తుందని వారు భావించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమా చారం అందించారు కూడా. తొలుత ఏపీ డిమాండ్లపై చంద్రబాబునాయుడు దీక్షను కూడా ప్రస్తావిస్తూ ఒక లేఖ రాయాలని నిర్ణయించారు. స్పందనను బట్టి ప్రధానమంత్రిని కలుసుకొని ఒత్తిడి పెంచాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు అన్ని పార్టీలతో కలిసి అఖిలపక్ష బృందాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి కూడా వచ్చారు. అయితే ఏయే పార్టీలను ఏపీ విషయంలో కలుపుకోవాలనే విషయమై మరో రెండు, మూడు రోజుల్లో స్పష్టతకు వచ్చే అవకాశాలున్నాయి.

cbn 22042018 3

దీక్ష జరుగుతున్న సమయంలో కూడా పలువురు నేతలు ఢిల్లి నుంచి ఫోన్‌ చేయడం కూడా ప్రాధాన్యతను సంతరించుకోంది. అయితే, చంద్రబాబు దీక్షలో ఉండటంతో, మాట్లాడలేక పోయారు. సాయంత్రం, తిరిగి వారందరికీ ఫోన్ లు చేసినట్టు సమాచారం. ఇదే విషయం నిన్న చంద్రబాబు మంత్రులతో చెప్పారు. దీక్షలో ఉండ డం వల్ల తాను మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందని అందుబాటులో ఉన్న నేతలతో భేటీ సందర్భంగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన అంశాలపై ఒక లేఖ రాయాలని ఢిల్లిలో కొన్ని రాజకీయ పార్టీలు నిర్ణయించడం ఆహ్వానించదగ్గ పరిణామమని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. తాను ఇటీవల జరిపిన ఢిల్లి పర్యటనతో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై దేశ వ్యాప్తంగా చర్చ ప్రారంభమైందని, నరేంద్ర మోడీకి ప్రమాద ఘంటికలేనని పేర్కొన్న ముఖ్యమంత్రి నిరశన దీక్షతో ఏపీకి జరిగిన అన్యాయంపై ఎలుగెత్తి చాటినట్లయిందని పేర్కొన్నట్లు తెలిసింది. సైకిల్‌ యాత్రలతో పాటు తిరుపతి బహిరంగ సభతో ఉద్యమం క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జాతీయ పార్టీల మద్దతు ఉంటే నరేంద్రమోడీ దిగిరావాల్సిందేనని, లేఖ రాయడం అనేది కొత్త పరిణా మమేనని అన్నారు. తన జన్మదినోత్సవం రోజు దీక్షకు పూనుకోవడం దేశ ప్రజలను ఆకర్షించగా దీక్ష ప్రారంభం కాగానే కేంద్రంలోని ప్రతిపక్ష పార్టీల్లో కూడా కదలిక రావడం శుభపరిణామంగా భావిస్తున్నారు.

జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ అభిమానులు రెచ్చిపోయారు. ఫిలింనగర్‌లోని ఫిలించాంబర్‌ వద్ద విధ్వంసం సృష్టించారు. ఫిలిం చాంబర్‌ అద్దాలు పగులగొట్టారు. మీడియాపై దాడి చేశారు. మీడియా వాహనాలు, ఏబీఎన్‌ ఓబీ వ్యాన్‌, కారును ధ్వంసం చేశారు. మరికొన్ని వాహనాలపై పెద్ద పెద్ద బండ రాళ్లు రువ్వారు. వాటిలో ఉన్న జర్నలిస్టులకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఇది ఒక పధకం ప్రకారం జరిగినట్టు సిసి కెమెరా దృశ్యాలు పట్టించాయి... ముఖానికి కర్ఛీ్‌ఫలు కట్టుకుని, ఒక్కొక్కరు రెండు షర్ట్‌లను ధరించి మీడియా వాహనాలపై రాళ్లు రువ్వారు... దాడి చేసి, లోపలకు వెళ్లి, మరో చొక్కా ధరించి, మళ్ళీ వచ్చి దాడి చేసారు... దీంతో ఇది ఒక కుట్ర ప్రకారమే జరిగినట్టు అర్ధమవుతుంది... గురువారం అర్ధరాత్రి నుంచి పవన్‌ కల్యాణ్‌ తన ట్విటర్లో చేసిన ట్వీట్లు ఈ విధ్వంసానికి కారణం...

abn 21042018 2

కేసు నమోది చేసిన పోలీసులు, దర్యాప్తు చేసి, పవన్‌కళ్యాణ్‌ అభిమానులను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన వారిలో భానుప్రసాద్‌ (ఉప్పల్‌) సాయి కిరణ్‌రెడ్డి (రామంతపూర్‌), హరిక అష్ణారెడ్డి (చైతన్యపురి), అంబటి గోపి ఫణీంద్ర (కూకట్‌పల్లి), కంటిపూడి రామ‌కృష్ణ‌ (కూకట్‌పల్లి) ఉన్నారు. మరో పక్క మీడియా పై దాడిని, ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా, నిర్మాత జీవిత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఖండించారు. మీడియా వాహనాలపై దాడి దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఓబీ వ్యాన్‌, జర్నలిస్టులపై దాడిని ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, టీయూడబ్ల్యూజే ప్రతినిధి క్రాంతి ఖండించారు.

abn 21042018 3

నిన్న ఉదయం పవన్‌తోపాటే ఆయన అభిమానులు కూడా వందల సంఖ్యలో ఫిలిం చాంబర్‌కు చేరుకున్నారు. ఆయన ఫిలిం చాంబర్లో చర్చలు జరుపుతుండగానే, కొంతమంది ముఖానికి కర్ఛీ్‌ఫలు కట్టుకుని, కొన్ని మీడియా సంస్థలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆవేశంగా బయటకు వచ్చారు. మీడియా వాహనాలపై దాడి చేశారు. అభిమానులు మీడియా వాహనాలను ధ్వంసం చేసిన పది నిమిషాలకు పవన్‌ కల్యాణ్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మీడియా వాహనాలను ధ్వంసం చేసిన ఇద్దరిని పట్టుకుని ఏబీఎన్‌ సిబ్బంది పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు.

మనిషి దగా మనసు దగా... ముందు దగా వెనుక దగా... అడుగడుగునా దగాదగా... అచ్చేదిన్ అతి పెద్ద దగా... వీళ్లా అవినీతిని రూపు మాపేది ??వీళ్లా నల్ల ధనాన్ని వెనక్కు తెచ్చేది ?? వీళ్లా అవినీతి పరుల భరతం పట్టేది ?? అతి తీవ్రమైన ఆర్ధిక నేరాలలో ,అవినీతి కేసులలో నిందితుడి గా వున్న గాలి జనార్ధన రెడ్డి సన్నిహితులందరికి కర్ణాటక ఎలక్షన్స్ లో బీజేపీ టికెట్స్ .. అంతే కాదు, ఈ రోజు ఏకంగా, గాలి జనార్ధన్ రెడ్డి, బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గుని సంచలనం సృష్టించారు... జైలు నుంచి వచ్చిన తరువాత, మొదటిసారి బీజేపీ నాయకులతో ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ల ఆశీర్వాదం తీసుకున్న గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొని బీజేపీ అవినీతి పై పోరాటం చేస్తుంది అనే వారికి ఝలక్ ఇచ్చారు.

bjp 21042018

బీఎస్. యడ్యూరప్పను చూసిన వెంటనే గాలి జనార్దన్ రెడ్డి ఆయనకు పాదాబివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. నిత్యం నవ్వుతూ ఉండే యడ్యూరప్ప గాలి జనార్దన్ రెడ్డిని చూసిన వెంటనే మరికొంచెం ఎక్కువగా నవ్వుతూ ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. యడ్యూరప్పతో మాట్లాడిన తరువాత పక్కనే ఉన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు పాదాబివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్న గాలి జనార్దన్ రెడ్డి తరువాత శ్రీరాములు నామినేషన్ సందర్బంగా బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు.

bjp 21042018

అవినీతి పరులకు శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం ఇవ్వమని, గాలి జనార్దన్ రెడ్డికి బీజేపీ ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పడంతో అందరూ నిజమే అనుకున్నారు... కాని ఈ రోజుతో, విషయం ప్రజలకు తెలిసిపోయింది. ఒక పక్క, నరేంద్ర మోడీ, అవినీతి పై యుద్ధం అంటూ దేశం అంతా తిరిగి చెప్తూ, 42 నెలల పాటు జైలులో ఉండి వచ్చిన వ్యక్తిని, తన పార్టీ తరుపున పోటీ చేసే అవకాశం ఇస్తున్నారని తెలియటంతో, దేశ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు... గతంలో జనార్ధన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. అప్పట్లో బీజేపీ తరఫున ఎమ్మెల్సీ హోదాతో గాలి జనార్ధన్ రెడ్డి మంత్రి పదవిని చేపట్టారు... అయితే ఇలాంటి సీన్ త్వరలో మన రాష్ట్రంలో కూడా చూడబోతున్నాం... ఒక పక్క మోడీ, అటు పక్క జగన్, ఇటు పక్క పవన్ తో, జూన్ నెలలోనే, ఈ దృశ్యం ఆవిష్కృతం కానుంది.

Advertisements

Latest Articles

Most Read