రాష్ట్ర ప్రయోజనాలను కాంక్షిస్తూ సీఎం చంద్రబా బు చేసిన దీక్షలో గుంటూరుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు పావులూరి శివరామకృష్ణయ్య కూడా ఆసాంతం పాల్గొన్నారు. రాష్ట్రం పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. 96 ఏళ్ల వయసులో కూడా ఆయన ఎంతో పట్టుదలతో ఉదయం గం.5.30కే గుంటూరు నుంచి విజయవాడకు వచ్చారు. దీక్ష ప్రారంభ సమయం కంటే పావు గంట ముందే చేరుకున్నారు. చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించి ఆయన పక్కనే ఆశీనులై సాయంత్రం 7 గంటల వరకు మంచినీళ్లు కూడా ముట్టకుండా, కూర్చున్న చోట నుంచి కదలకుండా దీక్ష నిర్వహించి తాను వయసు రీత్యా వృద్ధుడినేకాని మానసికంగానూ, ఆరోగ్యపరంగానూ యువకుడినేని చాటుకున్నారు.

cbn pattudala 21042018

చంద్రబాబు దీక్ష ముగింపు సందర్భంగా చేసిన ప్రసంగం ప్రారంభంలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ శివరామకృష్ణయ్య పట్టుదలను ప్రశంసించారు. గుజరాత్‌లోని మహాత్మాగాంధీ సేవాగ్రాంలో హిందీ కోర్సు చదివిన శివరామకృష్ణయ్య ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించారు. నవ్యాంధ్రప్రదేశ్‌ తొలి స్పీకర్‌గా వ్యవహరిస్తున్న కోడెల శివప్రసాదరావు, మాజీ సీఎం కొణిజేటి రోశయ్య వంటివారు శివరామకృష్ణయ్య శిష్యులే. గుంటూరు జిల్లా అమృతలూరు మండలం గోవాడలో జన్మించిన పావులూరి, ఆచార్య ఎన్‌జీ రంగా సహచరుడిగా గాంధీకి దగ్గరయ్యారు. కావూరులోని వినయాశ్రమంలో కొద్ది కాలం మహాత్మాగాంఽధీతో కలసిపనిచేసే అవకాశం లభించింది.

cbn pattudala 21042018

దీంతో ఆయన మహాత్మాగాంధీ శిష్యుడిగా మారిపోయారు. ఆ తరువాత క్విట్‌ ఇండియా ఉద్యమంలో గౌతు లచ్చన్న, బెజవాడ గోపాలరెడ్డి వంటి వారితో పాల్గొని ఆలీపూర్‌ జైలులో ఉన్నారు. ఎంతో సాధారణ జీవితం గడిపే శివరామకృష్ణయ్య ఈ వయస్సులో కూడా ప్రయాణం చేయాల్సివస్తే కొడుకులో, మనవళ్లో పంపే కార్ల కోసం ఎదురు చూడరు. ఓపిగ్గా బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. ప్రధాని మోదీకి సద్బుద్ధి కలగచేయాలని, సీఎం చేస్తున్న ధర్మపోరాట దీక్షకు పార్టీలకు అతీతంగా అందరు కలిసి మద్దతు ఇవ్వాలని శివరామకృష్ణయ్య పిలుపునిచ్చారు. చంద్రబాబు పుట్టినరోజు అయినా సరే మోదీ మనస్సును గాంధేయ సిద్దాంతాలతో కరిగించాలని దీక్ష చేపట్టడం విశేషమన్నారు.

మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మా పార్టీలో చేరుతున్నారు అంటూ హడావిడి చేస్తున్న బీజేపీ బ్యాచ్ కి, తాజాగా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు మింగుడు పడటం లేదు... లక్ష్మీనారాయణ ఇమేజ్ తో, చంద్రబాబు వోటు చీల్చి, చంద్రబాబుని మళ్ళీ సియం అవ్వకుండా చేస్తాం అంటూ, హడావిడి చేస్తున్న బీజేపీ నేతకలు, ఇప్పుడు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయ్యింది... ఒక పక్క బీజేపీ నేతలు ప్రత్యెక హోదా అవసరం లేదు అని ప్రచారం చేస్తుంటే, లక్ష్మీనారాయణ మాత్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం అంటూ, తాజాగా వ్యాఖ్యలు చేసారు. శనివారం విశాఖ వచ్చిన ఆయన సీతమ్మధారలోని వినాయక ఆలయాన్ని సందర్శించారు. వేదపండితులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

lakshmi 21042018

ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. సుస్థిర ప్రభుత్వం, మంచి పరిపాలన ప్రజలకు అందాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు నేరుగా చేరాలని దేవుడిని కోరుకున్నాని చెప్పారు. రాష్ట్ర విభజన చట్టంలో హామీలపై వివిధ మార్గాల్లో... రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను వినిపిస్తోందని, తాను రాజకీయాల్లోకి వచ్చే ముందు మీడియాకు వెల్లడిస్తానని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. రాష్ట్రంలో సమస్యలపై అధ్యయనం చేసిన తరువాత... తన ప్రణాళికను ప్రకటిస్తానని జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు.

lakshmi 21042018

జీవితం చాలా సుఖంగా అనిపించింది. ఆ క్షణంలోనే రిజైన్ చేయలని భావించి మరుసటి రోజే తన ఉద్యోగానికి రిజైన్ చేశానన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… తాను ఉద్యోగం చేస్తున్న సమయంలో చాలా కంఫర్ట్ గా అనిపించింది. ఆ క్షణంలోనే డిసైడ్ అయి.. తన పదవికి రాజీనామా చేసి సామాజిక సేవ చేయాలని భావించాను అన్నారు. ఎన్నో గొప్ప కేసులలో దర్యాప్తు చేసిన జేడీ లక్ష్మీనారాయణ ఉద్యోగ కాలంలో మంచి పదవి… రూ.3లక్షల జీతం, కారు, డ్రైవర్, ఇలా ఎక్కడికి వెళ్లినా గౌరవం ఇవన్నీ తనకు చాలా సుఖం అనిపించిందని అన్నారు. అందుకే సుఖం అని భావించిన ఆ క్షణంలోనే రిజైన్ చేయాలని భావించినట్లు వెల్లడించారు లక్ష్మీనారాయణ. అలాగే సామాజిక చేయాలన్న భావనతోనే తాను పదవికి రాజీనామా చేసినట్లు వివరించారు. ఇటీవల వీఆర్‌ఎస్‌ కు దరఖాస్తు చేసుకున్న లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తారంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

అనుకున్నదే జరుగుతుంది.. ఆపరేషన్ గరుడ ఊపందుకుంది... ఒక పక్క పవన్ కళ్యాణ్ టెన్షన్ క్రియేట్ చేస్తుంటే, మరో పక్క రాష్ట్రంలోని బీజేపీ నేతలు బరి తెగించి వ్యాఖ్యలు చేస్తున్నారు... ఈ రోజు, చంద్రబాబు పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు సంచలన రేకెత్తిస్తున్నాయి... ఈ ఏడాదిలో చంద్రబాబుకు బీజేపీ చుక్కలు చూపిస్తుందని వ్యాఖ్యానించారు.... 2004లో అలిపిరి దాడి గుర్తుందా... 2019లో అదే రిపీట్ అవుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.. అంటే, అలిపిరి తరహాలో చంద్రబాబు పై దాడి చేస్తాం అంటూ, చెప్పకనే చెప్తున్నారు... దేశంలో మోదీకి చంద్రబాబు మొదటి శత్రువని చెప్తూ, వచ్చే ఏడాదిలో బాబుకు చుక్కులు చూపిస్తామని సోము వీర్రాజు పేర్కొన్నారు... అంతే కాదు, పవన్ తల్లిని కూడా తిట్టించే కార్యక్రమాన్ని చంద్రబాబు చేయించారని అంటూ, పవన్ కు వత్తాసు పలికారు సోము వీర్రాజు..

cbn 21042018

ఇవన్నీ చూస్తూ ఉంటే, ఏదో అతి భారీ కుట్ర జరుగుతుంది... అలిపిరి తరహా రుచి చూస్తావ్ అని డైరెక్ట్ గా మీడియాతో అంటున్నాడు అంటే, వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు.. ఎంతకైనా.... దాడులు చేసి చంద్రబాబుని భౌతికంగా దాడి చేస్తామనా ? ఏమి చెప్తున్నావ్ వీర్రాజు... ఏంటి మీ కుట్ర ? ఇప్పటికే చంద్రబాబు పదే పదే చెప్తున్నారు... తమిళనాడు తరహా రాజకీయం చేస్తున్నారన... ఇప్పటికీ జయలలిత మరణం పై అనుమానాలు ఉన్నాయి... ఈ నేపధ్యంలో, సోము వీర్రాజు మాటలు సంచలనం కలిగిస్తున్నాయి... వచ్చే ఏడాది అంతా, చంద్రబాబుకి చుక్కలు చూపిస్తాం అంటూ అహంకారపు మాటలు మాట్లాడుతున్నాడు వీర్రాజు...

cbn 21042018

ప్రజలు పిచ్చోళ్ళు కాదు.... ఇప్పటికే మీ నాటకాలు అర్ధమయ్యాయి... మీరు ఎన్ని కుల గొడవలు లేపుతారో, ఎంత మారణహోమం చేస్తారో, తెలియనది కాదు... మీ గుజరాత్ లో ఎంత మారణహోమం చేసారో, దాని వెనుక ఉంది ఎవరో అందరికీ తెలుసు వీర్రాజు... మీ ఆటలు ఇక్కడ సాగవ్... కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతి ఒకసారి గుర్తు చేసుకోండి... చంద్రబాబు గారు, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి... వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు... మీరు ఈ రాష్ట్ర భవిష్యత్తు... ప్రతి ఒక్కరు మీ మీదే ఆశలు పెట్టుకుని ఉన్నాం... ఇలాంటి కుట్రలు తిప్పి కొట్టండి... మీరు ఢిల్లీలో ఉన్న వారి సంగతి చూసుకోండి, ఈ గల్లీ గాళ్ళ సంగతి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసుకుంటారు... ఈ కుట్రలను తట్టుకుని రాష్ట్రం నిలబడాలి.... ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి... కుల గొడవలు రేపే ఎత్తులు ఇప్పటికే వేసారు... అందుకే ఒకడు, తెగ రెచ్చిపోతున్నాడు...

ఎక్కడో హైదరాబాద్ అనే సిటీ... అది తెలంగాణా రాష్ట్రం... ఎవరో సినిమా ఫీల్డ్ లో ఉన్న ఒక ఆర్టిస్ట్... తనకు జరిగిన అన్యాయం పై పోరాడుతుంది... అర్ధ నగ్న నిరసన తెలిపింది... పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నాడు, సినిమాల్లో పెద్ద హీరో కాబట్టి, మీరు చొరవ తీసుకోండి అని ఒక మాట అంది... దానికి మన హీరో గారు, మీడియా సమావేశంలో ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, నేనేమి చెయ్యను, వెళ్లి పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుకో, టీవీల ముందు ఈ హడావిడి ఏంటి అంటూ, జుట్టు పైకి ఎగరేసుకుంటూ సమాధానం చెప్పారు... మన హీరో గారి సమాధానానికి, ఆ మహిళ రియాక్ట్ అయ్యింది... నువ్వు కూడా ప్రత్యెక హోదా పై నిరసనలు ఎందుకు, ప్రజా సమస్యల పై నిరసనలు ఎందుకు, వెళ్లి పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి, ఇంట్లో కూర్చోవచ్చుగా, ఈ హడావిడి ఎందుకు అంటూ, రియాక్ట్ అయ్యి, పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేసింది...

pavan logic 21042018

ఆ మహిళ చేత ఆ వ్యక్తిగత విమర్శలు చేపించింది నేనే అంటూ, ముంబైలో ఉండే రాం గోపాల్ వర్మ చెప్పాడు... రాం గోపాల్ వర్మ, పవన్ కళ్యాణ్ ని ఎలా ఎసుకుంటాడో గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం... వర్మకి, మెగా ఫ్యామిలికి ఎప్పుడూ గొడవలే... ఇలాంటి పరిస్థుతుల్లో, పవన్ ఒక సినిమా వాడు, ఆటను బెంగాలి అమ్మాయిలతో మసాజ్ లు చేయించుకుంటాడు అని చెప్పింది ఒక సినిమా అమ్మాయి, వర్మ సినిమా వాడు... శ్రీ రెడ్డి చేసిన ఎదో వ్యాఖ్యలకు, పవన్ స్పందిస్తే, పవన్ స్పందన పై ఆ అమ్మాయి, పవన్ ని వ్యక్తిగతంగా తిడితే, ఈ సినిమా గోలను తీసుకువచ్చి, రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు పవన్... ఇవన్నీ, చంద్రబాబు చేపించాడు అంటూ ట్వీట్ లు పెట్టాడు...

pavan logic 21042018

నిన్ను అలా రియాక్ట్ అవ్వమని చంద్రబాబు చెప్పాడా ? నువ్వు అలా రియాక్ట్ అయితే, ఆ అమ్మాయి ఎవరో రియాక్ట్ అయ్యింది... ఇదంతా జరిగింది హైదరాబాద్ లో... అయితే, పవన్ వచ్చి, చంద్రబాబుని నిందిస్తున్నాడు... నిన్ను గెలిపించింది ఇందుకేనా చంద్రబాబు అంటున్నాడు ? నువ్వు రొచ్చులో ఉండే హైదరాబాద్ లో, ఎవరు ముఖ్యమంత్రి ? అసలు హైదరబాద్ లో జరిగే దానికి, చంద్రబాబుకి ఏమిటి సంబంధం... హైదరాబాద్ లో మీరు రోడ్డున పడి కొట్టుకుంటే, చంద్రబాబుని ఎందుకు గెలిపించాడు అంటావ్ ఏంటి ? ఈ తింగర లాజిక్ లు ఏంటి ? చంద్రబాబు ఎదో చేసాడని గాలి మాటలు కాకుండా, ఏదన్నా ప్రూఫ్ ఉంటే బయట పెట్టు... లేకపోతే నువ్వు ఉండే హైదరబాద్ లో, ఉండే ముఖ్యమంత్రి చేత, ఎంక్వైరీ వేపించు... ఢిల్లీలో నీ గుట్టు ఎవడి చేతిలో ఉందో, అతని చేత బాబు పై సిబిఐ ఎంక్వైరీ వేయించు... అంతే కాని, ఈ తింగరి లాజిక్ లు బయట పెట్టి, మా ముఖ్యమంత్రి టైం వేస్ట్ చెయ్యమాక...

Advertisements

Latest Articles

Most Read