కనకదుర్గ ఫ్లై ఓవర్ కు, కేంద్రం కొర్రీలు పెడుతూనే ఉంది... తాజాగా, వీఎంసీ కార్యాలయం దగ్గర వయాడక్ట్‌ను నిర్మించాలన్న ప్రతిపాదనను మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు అండ్‌ హైవేస్‌ తిరస్కరించింది. దుర్గగుడి ఫ్లై ఓవర్‌కు సబ్‌వేను అనుసంధానం చేయటానికి గతంలో ప్రతిపాదించిన రీయిన్‌ ఫోర్సుడు ఎర్త్‌ రిటైనింగ్‌ వాల్‌ స్థానంలో పిల్లర్ల పై వయాడక్ట్‌ను నిర్మించాలనుకున్నారు. ఈ ప్రతిపాదనను గత అక్టోబరులో సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకి లేఖ రాసారు. వయాడక్ట్‌ ప్రతిపాదనను ఆమోదించడం లేదని, ఒకవేళ వయాడక్ట్‌ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటే ఆ ఖర్చును ఏపీ సర్కారే భరించాలని నితిన్‌ గడ్కరీ నుంచి లేఖ వచ్చింది. ఇక్కడ రిటైనింగ్‌ వాల్‌ నిర్మించడం వల్ల సుమారు 3.60 ఎకరాల స్థలం రెండు ముక్కలుగా విడిపోయి నిరుపయోగంగా మారిపోతుందని అధికారులు తెలిపారు.

flyover 18042018 1

కృష్ణానది దగ్గర ఘాట్లు కూడా కనిపించకుండా మూసుకుపోతాయని పేర్కొన్నారు. రిటైనింగ్‌ వాల్‌ స్థానంలో మూడు స్పాన్లతో వయాడక్ట్‌ను నిర్మించడం వల్ల 3.60 ఎకరాలు ఒకే బిట్‌గా ఉండి వాణిజ్య కార్యకలాపాలకు అనువుగా ఉంటుందని చెబుతున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సార్లు ఈ విషయం చెప్పినా, కేంద్రం పట్టించుకోలేదు... దీంతో విసిగెత్తిపోయిన రాష్ట్ర ప్రభుత్వం, కృష్ణా తూర్పు కాల్వ నుంచి రాజీవ్‌గాంధీ పార్కు వరకు చేపట్టవలసిన అప్రోచ్‌ పోర్షన్‌ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.19.07 కోట్ల నిధులను రాష్ట్రాభివృద్ధి పథకం కింద కేటాయించటానికి నిర్ణయించింది. ప్రస్తుతం ఫ్లై ఓవర్‌ పనులు పురోగతిలో ఉన్నాయి. కుమ్మరిపాలెం జంక్షన్‌ నుంచి హెడ్‌వాటర్‌ వర్‌ ్క్స వరకు ప్రధాన పనులు పూర్తయ్యాయి. కాల్వలో పిల్లర్స్‌ నిర్మాణం కూడా పూర్తి కావస్తోంది. ఈ దశలో అప్రోచ్‌ పనులను వేగవంతంగా చేపట్టాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీనికి నిధులు సర్దుబాటు కావాల్సిన ఉన్న తరుణంలో ప్రభుత్వం రూ. 19.07 కోట్ల నిధులను స్టేట్‌ స్కీమ్స్‌ కింద ఇవ్వటానికి నిర్ణయించింది.

flyover 18042018 1

కృష్ణా పుష్కరాల సందర్భంగా మెగా రివర్‌ ఫ్రంట్‌ ఘాట్ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడికి వచ్చినపుడు అప్పటికే నిర్మించిన సబ్‌వేలను చూసిన తర్వాత అప్రోచ్‌ గోడ విధానంలో ఉండటం సరికాదని సీఎం భావించారు. దీనివల్ల ఘాట్లు, కృష్ణానది ఎవరికీ కనిపించవని, ముఖ్యమైన ప్రాంతంలో మూసుకుపోయినట్టు ఉంటుందని భావించా జాతీయ ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ (మోర్తు) కు పిల్లర్స విధానంలో అప్రోచ్‌ పనులు చేపట్టేందుకు ప్రతిపాదించారు. సీఎం కూడా దీనిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని కేంద్రంతో సంప్రదించినా ఉపయోగం లేకుండా పోయింది. అనేక దఫాలు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోలేదు. ఫలితంగా చివరికి శ్లాబ్‌ విధానంలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.. అయితే, ఈయన్ను తప్పించటానికి దాదాపు నెల రోజులు నుంచి బీజేపీలోని ఒక వర్గం భారీ స్కెచ్ వేసినట్టు హరిబాబు వర్గీయులు చెప్తున్నారు.. రాష్ట్రానికి సంబందించిన ఒక వ్యక్తి, జాతీయ స్థాయిలో బీజేపీలో ఎంతో కీలకంగా ఉంటున్నాడు.. అతని ఆదేశాలు మేరకే, ఈ ఆపరేషన్ జరిగిందని, హరిబాబు పై అనుమానాలు సృష్టించి, అవమానాలు పాలు చేసి బయటకు పంపించే ప్లాన్ తెలుసుకునే, హరిబాబు మనస్థాపం చెంది, రాజీనామా చేసినట్టు ఆయన వర్గీయలు చెప్తున్నారు.. హరిబాబు ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలు చేసేవారు కాదని, సబ్జెక్టు పైనే విమర్శలు చేసే వారని, అంత హుందాతనం ఉన్న వ్యక్తులు, ఈ రోజు బీజేపీ పార్టీకి పనికి రావట్లేదు అని,బూతులు తిట్టే వారిని ప్రోత్సహించటం కోసం, హరిబాబుని బాలి పశువుని చెయ్యాలనుకున్నా, ఆయన ఎంతో హుందాగా స్పందిస్తూ, యువకులకు అవకాసం ఇవ్వటం కోసమే రాజీనామా చేసానని చెప్పారని, ఆయన వర్గీయులు అంటున్నారు..

haribabu 18042018

కేంద్ర మంత్రి వర్గంలో చోటు అనేది, ఉత్తుత్తి మాటలు అని, పోయినసారి మంత్రి పదవి ఇస్తున్నాం రమ్మని చెప్తే, ఫ్యామిలీతో సహా ఢిల్లీకి వెళ్తే, చివరి నిమిషంలో వేరే వారికి ఇచ్చి, అవమానించారని గుర్తు చేస్తున్నారు.. ‘కేంద్రం రాష్ట్రానికి ఏమేం చేసిందో వివరించండి’ అని చెప్పిందే చెప్పడం మినహా రాష్ట్రానికి సాంత్వన చేకూర్చే ప్రకటనేదీ చేయలేదు. విశాఖకు రైల్వే జోన్‌ తీసుకొచ్చి తీరతానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చి ఎంపీగా నెగ్గిన హరిబాబు.. ఆ విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వకపోవడంతో లోలోపల మధనపడుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రజల్లోకి వెళ్లలేని నిస్సహాయత.. వీటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన... పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడమే ఉత్తమమని భావించినట్లు తెలుస్తోంది.

haribabu 18042018

అయితే కొత్త అధ్యక్షుడి పై కూడా బీజేపీ పెద్ద కసరత్తే చేస్తుంది... 15 రోజుల క్రితం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు రామ్‌మాధవ్‌, రాంలాల్‌తో పాటు మరికొంత మంది ముఖ్యనేతలను మాణిక్యాలరావు కలిశారు. ప్రత్యర్థి పార్టీలు, ప్రజా సంఘాలపై ఎదురుదాడి చేసే నాయకుడికే రాష్ట్ర పగ్గాలు అప్పగించే అవకాశం ఎక్కువగా ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. కుల రాజకీయాలకు పెట్టింది పేరైన ఏపీలో అధికార పక్షం(కమ్మ), ప్రతిపక్షం(రెడ్డి), కొత్తగా వచ్చిన మూడో పక్షం(కాపు)పైనా కుల ముద్ర ఉంది. పార్టీలో రాష్ట్ర అధ్యక్ష పదవిని ఒక కులానికి చెందినవారికే ఇవ్వాలని కొంత కాలంగా చేస్తున్న వాదన కొందరికి మింగుడుపడడంలేదు. మాణిక్యాలరావు, వీర్రాజుల్లో ఒకరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీమకు ఈసారి కూడా అవకాశం దక్కనట్లే

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి గురించి అందరికీ తెలిసిందే... ఏది ఎందుకు మొదలు పెడతాడో తెలియదు, ఎందుకు ఆపేస్తాడో తెలియదు... ఇదే కోవలో, జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ అని వేసి, కేంద్రం ఇంత ఇవ్వాలి అని తేల్చారు.. కాని, తరువాత నుంచి కేంద్రాన్ని ఒక్క మాట అనటానికి కూడా సాహసించటం లేదు.. ఈ వ్యవహారంతో చిర్రెత్తిన లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారయణ కూడా, పవన్ మీద నమ్మకం లేక, సొంతగా ఒక కమిటీ వేసుకుని, కేంద్రం చేస్తున్న అన్యాయం పై పోరాడుతున్నారు... పవన్ వ్యవహార శైలికి కారణం, బీజేపీతో పవన్ చేసుకున్న ఒప్పందమే అని విశ్లేషకులు అంటున్నారు.. మోడీని ఒక్క మాట కూడా అనకపోవటం, నేషనల్ మీడియాకు ఎక్కి, మోడీ నాకు ఆదర్శం అని చెప్పి, చంద్రబాబుని తిట్టటం, ఈ ఆరోపణలకు బలం చేకూర్చాయి...అయితే, ఇప్పుడు పవన్ చేసిన మరో పని చర్చనీయంసం అయ్యింది...

pavan 18042018

ఈ నెల 16న అనంతపురం జిల్లలో పవన్ పర్యటన అని, అక్కడ ప్రత్యెక హోదా పై, ఆందోళన చేస్తారు అంటూ, హడావిడి చేసారు... పవనే స్వయంగా ఈ విషయం కూడా చెప్పారు.. అయితే, చివరి నిమిషంలో పర్యటన రద్దు అయ్యింది. ఎడమ కంటికి కొద్దిపాటి డస్ట్ ఇన్‌ఫెక్షన్ కారణంగా పర్యటన రద్దు చేసుకున్నట్టు జనసేన కార్యాలయం లీక్ ఇచ్చింది... అయితే, ఆ ముందు రోజు ఎదో సినిమా ఫంక్షన్ కి వెళ్ళటం, ఆ తరువాత రోజు హైదరాబాద్ లో అసిఫాకు మద్దతుగా దీక్ష అంటూ, ఒక గంట హడావిడి చేసారు పవన్... అయితే తరువాత రోజు చెయ్యాల్సిన అనంత పర్యటన మాత్రం వాయిదా పడింది... కొద్దిపాటి ఇన్ఫెక్షన్ కే, పర్యటన వాయిదా వేసేంత బలహీనుడు అయితే పవన్ కాదని, దీని వెనుక ఎదో బలమైన కారణం ఉంది అని అంటున్నారు... దీనికి బలం చేకూరుస్తూ మరో, నిర్ణయం తీసుకున్నాడు , పవన్...

pavan 18042018

15న అనంతపురం, 24న ఒంగోలు, మే 6న విజయనగరంలో పట్టణాల్లో నిర్వహించ తలపెట్టిన, మేధావులతో సమావేశాలని కూడా రద్దు చేసారు... ఇది కూడా పవనే ప్రకటించారు... హోదా పై, మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాలు అంటూ చెప్పి, అన్ని కార్యక్రమాలనూ నిలిపివేసినట్టు పవన్ కల్యాణ్ తెలిపారు. రైతు, కార్మికుల సమస్యలపై పోరాటానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని పవన్ చెప్పారు... ప్రత్యేక హోదా సాధన కోసం, ఎవరైనా, ఏ కార్యక్రమానికైనా చేస్తే తాము మద్దతిస్తామని అన్నారు.. ఇవన్నీ చూస్తుంటే, బీజేపీ నుంచి ఆదేశాలు రావటంతో, ఇక హోదా పై పవన్ పోరాటం ఆగిపోయినట్టే అని అనుకుంటున్నారు... బీజేపీ సూచనల మేరకు, ఇక హోదా పై కాకుండా, కేంద్రాన్ని ఇబ్బంది పెట్టకుండా, రాష్ట్రంలో సమస్యల పై, చంద్రబాబు పై పోరాటానికి పవన్ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది... లేకపోతే, కామెడీ కాకపొతే, చిన్న ఇన్ఫెక్షన్ వస్తే, పోరాట యోధులం అని చెప్పుకునే వారు, వారం రోజులు ఇంట్లో కూర్చుంటారా ? అంతా ఢిల్లీ మహిమ...

సరిగ్గా నెల రోజుల క్రితం మార్చ్ 13న, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డీజీపీ మాల‌కొండ‌య్య‌కు ఒక లేఖ రాసారు... త‌నకు భ‌ద్ర‌త కావాలని, గ‌తంలో తెలుగురాష్ట్రాల్లో కొన్ని స‌భ‌లు నిర్వ‌హించిన‌ప్పుడు భ‌ద్ర‌త స‌మ‌స్య త‌లెత్తింద‌ని అన్నారు. తనపై దాడి జరిగితే ప్రజా జీవితంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశముందని, త‌న‌పై దాడి జ‌రిగితే అందుకు ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వహించాలి అంటూ, లేఖ రాసారు... అసలు, ఈ పదాలు ఎంతటి ఖటినమైన పదాలో చూడండి... "త‌న‌పై దాడి జ‌రిగితే అందుకు ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వహించాలి" అంటూ తన అభిమానులని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి, ఎదో జరిగిపోతున్నట్టు సృష్టించి, ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం చేసారు... అయినా, చంద్రబాబు ప్రభుత్వం, ఇవేమీ పట్టించుకుండా, పవన్ కోరిన విధంగా బధ్రత ఇచ్చింది...

pavan 18042018 1

2+2 గన్‌మెన్లను పవన్ కల్యాణ్ కు భద్రత కల్పించటానికి ప్రభుత్వం కేటాయించింది... మళ్ళీ ఇతగాడు ఉండేది హైదరబాద్ లో, అయినా సరే, బాధ్యతగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే, పవన్ అడిగిన మేరకు సెక్యూరిటీ కేటాయించింది... మనోడు, ఇలాంటి రాజకీయాలు కెసిఆర్ తో తాడితే, తాట తీస్తాడు కాబట్టి, చంద్రబాబుతోనే ఇలాంటి వేశాలు వేస్తాడు... సరే, మొత్తానికి, ఇలా సెక్యూరిటీ ఇచ్చి నెల రోజులు అయ్యింది.. నెల రోజులు ఎక్కడికి వచ్చినా, పక్కన గన్‌మెన్లను పెట్టుకుని తిరిగాడు పవన్... మళ్ళీ ఏమైందో ఏమో, ఈ రోజు సెక్యూరిటీని వెనక్కి పంపింసినట్టు మీడియాకు లీకులు ఇచ్చారు. తనకు భద్రతగా ఉన్న సెక్యూరిటీని [పవన్, వెనక్కి పంపించారని మీడియాకు చెప్పారు. తనకు ఏపీ ప్రభుత్వం కల్పించిన భద్రత సిబ్బంది వద్దని స్పష్టం చేసినట్టు చెప్పారు.

pavan 18042018 1

నిన్న రాత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వెంటనే ఏపీ హోంశాఖకు లేఖ ద్వారా తెలియజేస్తూ.. వారిని విజయవాడ కమిషనర్ ఆఫీస్ కు పంపించారు. ఇన్నాళ్లు భద్రత కల్పించిన సెక్యూరిటీ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. పవన్ కల్యాణ్ తన భద్రతా సిబ్బందిని వెనక్కి పంపించటం వెనక తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ కు ఏపీ ప్రభుత్వం భారీ బందోబస్త్ ఇచ్చింది. అప్పట్లో ఇది చాలా పెద్ద బ్రేకింగ్ కూడా అయ్యింది. అయితే, జనసేన ఇస్తున్న లీకులు ప్రకారం, ప్రభుత్వం వారి చేత నిఘా పెట్టించింది అని, పార్టీ కార్యకలాపాలు లీక్ అవుతున్నాయనే ఉద్దేశ్యంతోనే పవన్ ఈ నిర్ణయం తీసుకొన్నారని చెప్తున్నారు. అయినా, ఈ వాదన చాలా వింతగా ఉంది. ఇలా ఆలోచిస్తే, అసలు జగన్ ఏమైపోవాలి ? ఈ దేశంలో ఉన్న విపక్ష నాయకులు ఏమైపోవాలి ? కేంద్ర ఆధీనంలో ఉండే బ్లాక్ కాట్స్ బద్రత ఉన్న చంద్రబాబు ఏమైపోవాలి ? తన పార్టీలో ఉండే ఎవరో ఎదో లీక్ చేస్తుంటే, అది సెక్యూరిటీ మీదకు నెట్టి, ప్రభుత్వాన్ని ప్రతి సందర్భంలో అప్రతిష్ట పాలు చెయ్యటం ఈయనకు అలవాటే... అదేమంటే, ఎవరో ఎదో అనుకుంటున్నారు, నేను చెప్పను అంటాడు... ఈయనగారి మీద అందరూ అనుకునేయి చెప్తే, ఏమైపోతాడో.. అయినా, నెల రోజుల క్రితం నాకు ఎదో ప్రమాదం జరిగిపోతుంది, బద్రత కావలి అని హడావిడి చేసి, ఇప్పుడు ఈ మెలోడ్రామా ఎందుకు ? దేని మీద నిలకడ ఉండదా ?

Advertisements

Latest Articles

Most Read