40 ఏళ్ళు ఆ కుటుంబం, పులివెందులని ఏలింది... తాత సిల్వర్ స్పూన్ తో పుట్టాడు అని ప్రచారం చేసుకుంటూ ఉంటారు... తండ్రి, ముఖ్యమంత్రిగా కూడా చేసారు... ఇక మనోడు అయితే, ఎంపీగా చేసి, నాలుగేళ్ల నుంచి ఎమ్మల్యేగా చేస్తున్నాడు... ఆ ఊరికి చేసింది ఏంటి అంటే, కనీసం నీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి.. అలాంటి పరిస్థుతుల్లో, తన ప్రధాన ప్రత్యర్ధి ఊరికి నీళ్ళు ఇచ్చే, నా ఊరికి నీళ్ళు తీసుకువెళ్తా అని చెప్పిన చంద్రబాబు, చేసి చూపించారు... కరువు కాటకాలకు నిలయమైన పులివెందుల ప్రాంతంలో 40 ఏళ్ళ రైతుల నిరీక్షణ, నిన్నటితో తీరింది... పులివెందుల బ్రాంచి కెనాల్ కుడి, ఎడమ కాలువలకు కృష్ణా జలాలను పారేలా చేసి ఈ ప్రాంత రైతుల్లో సతోషాన్ని నింపారు, చంద్రబాబు...

pulivendula 13042018 1

నిన్న పెంచికల బసిరెడ్డి రిజర్వాయర్ వద్ద లింగాల కుడి కాలువకు మంత్రులు ఉమా, సోమిరెడ్డి, ఆదినారాయణరెడ్డి నీరు విడుదల చేసారు.. అనంతరం, అక్కడ ఏర్పాటు చేసిన మీటింగ్ లో మాట్లాడారు... దేవినేని ఉమా మాట్లాడుతూ, జిల్లాకు అవుకు సొరంగం గుండెకాయ వంటిదనీ, ఇది పూర్తయితేనే అవుకు, గండికోట జలాశయానికి నీరు చేరుతుందన్నారు. తన కమిషన్‌ కోసం ఈ పనులకు జగన్‌ అడ్డుపడ్డారని, బిల్లుల చెల్లింవులు జరగకుండా 9 నెలలు అడ్డుపడ్డారని ఆరోపించారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా జగన్‌లో మార్పు రాలేదన్నారు.

pulivendula 13042018 1

శాసనమండలి మాజీ ఉపాధ్యక్షుడు సతీష్‌రెడ్డి మాట్లాడుతూ కృష్ణా జలాలు ఈ ప్రాంతానికి వస్తాయా? ప్రాజెక్టులు పూర్తవుతాయా అనే సందేహం అందరిలో ఉండేదని, అనుమానాలను పటాపంచలు చేస్తూ కృష్జాజలాలను విడుదల చేయడం చారిత్రాత్మకమన్నారు. కలెక్టరు బాబూరావు మాట్లాడుతూ కడప చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 30 టీఎంసీల కృష్ణా జలాలను తెచ్చుకున్నట్టు చెప్పారు. రోజుకు 200 క్యూసెక్కుల చొప్పున 90 రోజుల పాటు నీటిని విడుదల చేస్తామన్నారు. ఫలితంగా 23 వేల ఎకరాలకు సాగునీరిస్తామని ప్రకటించారు. ఎమ్మెల్సీ బీటెక్‌ రవి మాట్లాడుతూ ఇది.. పులివెందుల ప్రాంతాన్ని కృష్ణాజలాలతో సస్యశ్యామలం చేయడానికి నాంది పలికిన రోజన్నారు.

భారత క్రికెట్ దిగ్గజం, మాజీ రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌ లో పాల్గొనేందుకు చంద్రబాబు సింగపూర్ వెళ్ళిన సంగతి తెలిసిందే. అక్కడ చంద్రబాబును ​ టెండూల్కర్ కలిసారు. చంద్రబాబుని చుసిన వెంటనే, "మై బెస్ట్ చీఫ్ మినిస్టర్" అంటూ బాబుని పలకరించారు... చంద్రబాబు, తనతో పాటు వచ్చిన మంత్రుల్ని, ఏపి ప్రతినిధులని పరిచయం చేసారు.. సచిన్ దత్తత తీసుకున్న ఆంధ్రప్రదేశ్‌‌లోని పుట్టంరాజు కండ్రిగ గ్రామం అభివృద్ధికి సంబంధించిన అంశంపై చర్చించారు.. ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో సహకరిస్తుందని సచిన్‌కు సీఎం తెలిపారు. ఈ గ్రామం అబివృద్ధిపై సచిన్, చంద్రబాబుల మధ్య కాసేపు చర్చ జరిగింది.

sachin 13042018 1

కాగా, హెచ్‌టీఎల్‌ఎస్‌లో పాల్గొన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలు, ప్రణాళికలను వివరించారు. రాబోయే నాలుగైదేళ్లలో రాష్ట్ర ప్రాథమిక విద్య ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా మారుస్తామని, దీనికోసం అరటి, మామిడి పంటలను అక్కడ విస్తరిస్తున్నామని వివరించారు. అలాగే, ఐటీ రంగంలోనే కాకుండా అనేక అంశాలలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని టాటాసన్స్‌బోర్డు చైర్మన్ నటరాజన్‌ చంద్రశేఖరన్ తెలిపారు. సీఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం నటరాజన్‌తో సమావేశమయ్యారు. ఏపీలో టీసీఎస్ కార్యకలాపాలు పెద్దఎత్తున చేపట్టాలని ఈ సందర్భంగా సీఎం వినతి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన నటరాజన్ ఏపీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

sachin 13042018 1

అమరావతికి రావడానికి నటరాజన్ స్పష్టమైన ఆసక్తిని వ్యక్తం చేశారు. అమరావతి కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అమరావతిలో విద్యుత్ బస్సులు, కార్లు వంటి ఆధునిక రవాణా వ్యవస్థలో భాగస్వాములం అవుతామని ఆయన వెల్లడించారు. ఏపీలో సంపూర్ణ కాలుష్యరహిత రవాణా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని సీఎం తెలుపగా ఈ రంగంలో పెట్టుబడులకు ఎంతో ఆసక్తిగా ఉన్నామన్న నటరాజన్ చెప్పారు. 3 వారాల్లో అమరావతికి వస్తామని, హోటళ్లు, స్మార్ట్‌ సిటీస్, రవాణా వంటి అంశాలపై చర్చిస్తామని సీఎం చంద్రబాబుకు నటరాజన్ తెలిపారు.

సింగపూర్ పర్యటనలో ఉన్న చంద్రబాబు, ఫస్ట్ హెట్‌టీ-మింట్ ఆసియా లీడర్ షిప్ సమ్మిట్‌లో పాల్గున్నారు... ఈ సందర్భంగా, చంద్రబాబు ఒక ప్రశ్నకు చెప్పిన సమాధానంతో, ఆయన స్టేట్స్మెన్ అనే విషయం మరో సారి రుజువైంది... దక్షిణాది రాష్టాల పట్ల కేంద్రం వివక్ష అవలంబిస్తోందన్నారు. దీనిపై మీ అభిప్రాయం, ఏంటి అని ప్రశ్న అడగగా, దానికి చంద్రబాబు స్పందిస్తూ, "అది చర్చించడానికి ఇది వేదిక కాదు. ఆ అంశంపై మనం భారత్ లో కూర్చుని మాట్లాడుకుందాం. కానీ నేను ఒక్క విషయం స్పష్టం చేయదలిచాను. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు శిక్షకు గురికాకూడదు. ఇది దేశాభివృద్ధినే ఆటంకపరుస్తుంది." అంటూ సమాధానం చెప్పి ఆపేశారు... పరాయి దేశంలో, అంతర్జాతీయ వేదికల పై, మన ప్రధాని గురించి తక్కువ చేసి మాట్లాడకూడదు అనే ఉద్దేశంతో, చంద్రబాబు ఇలా సమాధానం చెప్పి, ఎంతో హుందాగా వ్యవహరించారు...

cbn on modi 13042018

అలాగే వివిధ అంశాల పై చంద్రబాబు స్పందించారు... పోలవరం గురించి మాట్లాడుతూ, "విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. నీటి ఆయోగ్ సిఫారసులతో త్వరగా పూర్తిచేయాలన్న లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నాం. ఇప్పటికే 53% నిర్మాణం పూర్తయింది. జూన్ 2019 నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లిస్తాం. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఇతర రాష్ట్రాలకూ నీరందించవచ్చు. గోదావరి నది ద్వారా ఏటా 3 వేల టీఎంసీల వరద నీరు వృధాగా సముద్రంలో కలుస్తోంది. ఈ నీటిలో కొంత భాగాన్ని ఉపయోగించుకుని నిన్న పట్టిసీమ పూర్తిచేశాం. రేపు పోలవరం పూర్తిచేస్తాం." అంటూ పోలవరం పై స్పందించారు...

cbn on modi 13042018

అలాగే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంశం మీద సీఎం స్పందిస్తూ "రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మేం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మా రాష్ట్రం నెంబర్-2 ఉంది. నెంబర్-1 కాగలమని ఆత్మవిశ్వాసం ఏర్పడింది. తర్వావత వరుసగా రెండేళ్ల నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మా రాష్టానికి ప్రపంచ బ్యాంకు నెంబర్-1 రేటింగ్ ఇచ్చింది. వ్యాపారానికి అన్నీ సానుకూలతలే ఉన్నాయి. ఏ రకమైన వేధింపులు లేవు. వేగంగా అన్ని అనుమతులిస్తున్నాం. వచ్చే మార్చినెల నాటికి కియా కార్ల పరిశ్రమ ఉత్పత్తిని ప్రారంభించనుంది. రండి. మా రాష్ట్రానికి వచ్చి స్వయంగా పరిశీలించి వ్యాపార అనుకూలతలో మా రాష్ట్రం ఏ రకంగా అగ్రగామిగా ఉందో మీరే పరిశీలించండి. మీకిదే మా ఆహ్వానం. ఐటీలో మేం అభివృద్ధి సాధించాం. పౌరుడు పౌరసేవలు పొందాలంటే ఐటీ ఆధారంగా గడప దాటకుండా సేవలు పొందే అవకాశాలు కల్పించాం. ప్రభుత్వ విభాగాలకు సంబంధించి ఏ సేవలనైనా ఎక్కడి నుంచైనా పొందే అవకాశం ఆన్ లైన్ ద్వారా కల్పించాం." అంటూ సమాధానం చెప్పారు...

సింగపూర్‌ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు... బ్రిటన్‌ మాజీ ప్రధాని, ‘టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ ఛేంజ్’ నిర్వాహకుడు టోనీ బ్లెయిర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒకప్పటి తన హైదరాబాద్‌ సందర్శనను, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుతో కలిసి మహబూబ్‌నగర్ జిల్లా‌లోని ఓ గ్రామాన్ని పరిశీలించిన వైనాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. కొత్త రాష్ట్రం ఎలా ఉందని అడిగి వివరాలు తెలుసుకున్నారు. చంద్రబాబు నాయకత్వంలో కొత్త రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తున్న తీరు తనకు తెలుసునని టోనీ పేర్కొన్నారు. కొత్త రాజధాని నిర్మాణానికి రైతులు ముందుకొచ్చి తమకు సమీకరణ విధానంలో భూములు ఎలా అందించిందీ టోనీ బ్లెయిర్‌కు చంద్రబాబు వివరించారు. 

blair 13042018 1

పెట్టుబడుల ఆకర్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వచ్చే 15, 20 ఏళ్ల పాటు 15 శాతం సుస్థిర వృద్ది లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తున్న వైనం, ఫైబర్ కనెక్టివిటీ, ఆహారశుద్ధి రంగంలో ఏపీలో ఉన్నఅపార అవకాశాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనం 50 శాతం చేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న ప్రతి కార్యక్రమం గురించి వివరంగా తెలుసుకునేందుకు బ్లెయిర్ ఆసక్తి కనబరిచారు. ఎప్పుడైనా భారతదేశం వెళ్లినప్పుడు ఏపీని తప్పకుండా సందర్శించాలని ఆనాటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్ తనకు చెప్పిన సంగతిని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సందర్శనకు వచ్చానని తెలిపారు.

blair 13042018 1

నూతన రాష్ట్రాభివృద్ధికి ఎటువంటి విజన్‌తో ముందుకెళ్తున్నారని చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ విద్యారంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు, అమలవుతున్న కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరిచారు. ప్రపంచవ్యాప్తంగా పాలన వ్యవస్థలో అమలు చేసే ఉత్తమ విధానాలపై బ్లెయిర్‌ నేతృత్వంలో పనిచేస్తున్న సంస్థ దృష్టి నిలిపింది. రియల్‌టైమ్ గవర్నెన్స్, కాంప్రహెన్సీవ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, విద్యుత్ సంస్కరణలు, సౌర, పవన విద్యుత్ విధానాలు, నూరుశాతం ఓడీఎఫ్, ఐవోటీ, డ్రోన్లు, అప్లికేషన్లతో వ్యవసాయ రంగానికి సాంకేతికత జోడింపు వంటి ప్రభుత్వం తీసుకున్న చర్యలను బ్లెయిర్‌కు చంద్రబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించాలని ఆహ్వానించారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఏపీ సందర్శనకు‌ ఆసక్తి కనబరిచారు. భారత్‌లో ఇప్పటికే తమ సంస్థ 200 విద్యాలయాలతో కలిసి పనిచేస్తోందని.. ఏపీతోనూ కలిసి పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ముందుగా తమ బృందాన్ని పంపించి తరువాత తాను వస్తానని టోనీ బ్లెయిర్‌ చంద్రబాబుకు తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read