ఇంతకాలం ప్రధాని మోడీ దాచి ఉంచిన రాఫెల్ విమానాల కొనుగోలులో చోటుచేసుకున్న కుంభకోణం గుట్టు రట్టయింది. రాఫెల్ యుద్ధ విమానాలను ఉత్పత్తి చేసే ఫ్రాన్స్ కంపెనీ దస్సాల్ట్ ఏవియేషన్ 2016లో వెలువరించిన తన వార్షిక నివేదికలో అసలు విషయాన్ని బైటపెట్టింది. పార్లమెంటుకు సైతం ఈ ఒప్పందం వివరాలను ప్రధాని వెల్లడించలేదు. జాతీయ భద్రత, దేశ ప్రయోజనాల రక్షణకు సంబంధించిన రహస్యం తదితర అంశాలన్నీ ఈ ఒప్పందంలో చోటుచేసుకున్న కుంభకోణం వెలుగులోకి రాకుండా చెప్పినవే... బీజేపీ నాయకత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీగానే అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. విమానాలను విక్రయించిన కంపెనీయే వాస్తవాలను వెల్లడించడంతో మోడీ ప్రభుత్వం బండారాలు బైటపడ్డాయి.

modi 02042018 1

ఈ ఒప్పందం వల్ల ప్రభుత్వ ధనాగారానికి రూ.12,630కోట్ల నష్టం సంభవించింది. ఈజిప్టు, ఖతార్లకు మనకు విక్రయించడానికంటే 11నెలల ముందే వారికి విక్రయించారు. ఆ దేశాలకు విక్రయించిన దానికంటే ఒక్కొక్క జెట్ ఖరీదు రూ. 350కోట్లు అదనంగా మనకు విక్రయించారు. 36 రాఫెల్ జెట్లను 2016లో 7.5 బిలియన్ యూరోలకు మనకు ఇచ్చేందుకు కంపెనీ అంగీకరించింది. 2015లో ఖతార్, ఈజిప్టులకు 48 జెట్లను 7.9 బిలియన్ యూరోలకు విక్రయించింది. మనకు విక్రయించిన విమానాల ఖరీదు రూ. 1,670.70 కోట్లుకాగా, ఈజిప్టు, ఖతార్లకు విక్రయించిన విమానాల ఖరీదు రూ. 1319.80కోట్లు అవుతుంది. అంటే ఒక్కొక్క జెట్ ఖరీదులో తేడా రూ. 351 కోట్లు ఉంది. యూపీఏ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని మోడీ రద్దు చేయకుండా ఉన్నట్లయితే మనకు రూ.41,212 కోట్లు పొదుపు అయ్యేది.

modi 02042018 1

2015 ఏప్రిల్లో నరేంద్ర మోడీ 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. 2012లోనే వీటి కొనుగోలుకు టెండర్లు పిలిచినప్పుడు అమెరికా, ఐరోపా, రష్యాలు కూడా విక్రయించేందుకు ముందుకువచ్చాయి. దస్సాల్ట్ ఏవియేషన్ తయారు చేసిన 18 జెట్ విమానాలను కొనుగోలు చేయడం మరో 108 బెంగుళూరులోని హెచ్ఏఎల్ కంపెనీ అసెంబుల్ చేయడం జరగాలని నిర్ణయించారు. అయితే రెండు ఇంజిన్లు కలిగిన 126 రాఫెల్ జెట్లను కొనడం చాలా ఖరీదవుతుందని సాకుచెప్పి, కుదిరిన ఒప్పందాన్ని మోడీ రద్దు చేసారు. అంతేకాదు.. సాంకేతిక పరిజ్ఞానాన్ని సంతరించుకునేందుకు ప్రయత్నించకుండా మోడీ రెడీగా ఉన్న 36జెట్ విమానాల కొనుగోలుకు నిర్ణయించారు. 2016 జనవరిలో కొనుగోలు ఒప్పందాన్ని ధృవీకరించారు. 2016 సెప్టెంబరులో మోడీ పారిస్ లో పర్యటించిన సందర్భంగా జెట్ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని ప్రకటించారు. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు రాఫెల్ జెట్ విమానాల ఒప్పందాన్ని బైట పెట్టడానికి వీలులేదని రక్షణమంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటుకు చెప్పారు. మోడీ ప్రభుత్వం దాచివేసినాదాగని వాస్తవాలను విమానాలను విక్రయించిన కంపెనీ బైట పెట్టింది.

ఎన్డీఏ నుంచి బయటకు రాగానే, చంద్రబాబు ఫెడరల్ ఫ్రంట్ పెడతారని, థర్డ్ ఫ్రంట్ పెడతారాని ఇలా అనేక ఊహాగానాలు వస్తున్నాయి... ఈ రోజు చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపధ్యంలో, ఈ ఊహాగానాలు మరింత ఎక్కువ అయ్యాయి... నేషనల్ మీడియాలో ఇప్పటి నుంచే, చంద్రబాబు ఢిల్లీ పర్యటన పై రకరకాల వార్తలు వేస్తున్నారు... చంద్రబాబు బీజేపీ, కాంగ్రెస్ సపోర్ట్ లేని పార్టీలు అన్నీ ఏకం చెయ్యటానికి ఢిల్లీ వస్తున్నారని, దేశ రాజకీయాలు మారిపోయే పరిస్థితి ఉంది అంటూ, వార్తలు వేస్తున్నారు... అయితే, ఈ వార్తల పై చంద్రబాబు స్పందించారు... సోమవారం టీడీపీ ఎంపీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు..

cbn 02042018 1

ఈ సందర్భంగా, ఈ విషయం చంద్రబాబు దృష్టికి రావటంతో, ఆయన స్పందించారు.. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని...అందుకోసమే ఢిల్లీ యాత్ర చేపట్టినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాజకీయాలను హైలెట్ చేయవద్దని...రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని హైలెట్ చేయండని జాతీయ మీడియాకు సీఎం విజ్ఞప్తి చేశారు.... ఎంపీలు కూడా, ఇదే విషయాన్ని మీడియాతో గట్టిగా చెప్పాలని, మీరు మీడియాతో మాట్లాడిన ప్రతి సారి, ఈ విషయం చెప్పండి, మనకు ప్రస్తుతం రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పారు...

cbn 02042018 1

సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకోవడమే తమ సామర్ధ్యమని తెలిపారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే రెండురోజుల ఢిల్లీ పర్యటన చేపట్టినట్లు చెప్పారు. ఈ పర్యటన రాజకీయ ప్రయోజనాల కోసం కాదని స్పష్టం చేశారు. ఎంపీలంతా కేంద్రం నుంచి రావాల్సిన రాష్ట్ర ప్రయోజనాలపై పోరాడాలని సూచించారు... ఈరోజు సాయంత్రం ఢిల్లీ వస్తున్నానని... రేపు, ఎల్లుండి ఢిల్లీ వేదికగా రాష్ట్ర ప్రయోజనాల సాధనపై దృష్టి సారించనున్నట్లు ఎంపీలతో చంద్రబాబు అన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో వివిధ పార్టీల సభాపక్ష నేతలను కలువనున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై వ్యక్తిగతంగా వివరిస్తానన్నారు. కాంగ్రెస్‌ రాష్ట్రానికి అన్యాయం చేస్తే.. బీజేపీ నమ్మించి మోసం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు.

నాలుగు రోజుల సెలవలు తరువాత, రేపు పార్లమెంట్ మళ్ళీ ప్రారంభం కానుంది... గత 20 రోజుల నుంచి, వాయిదాలతో సాగుతన్న పార్లమెంట్, రేపు కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటూ, ఢిల్లీ వర్గాలు లీకులు ఇస్తున్నాయి... పోయిన వారం కూడా, ఇలాగే లీకులు ఇచ్చారు... ఇది నిజమే అని అనుకుని, అన్ని పార్టీలు సభలో అవిశ్వాసం పై చర్చించటానికి రెడీ అయ్యాయి.. కాని, యధావిధిగా వాయిదాలు వేసుకుని వెళ్ళిపోతున్నారు... ఈ రోజు మళ్ళీ, ఢిల్లీ వర్గాల నుంచి లీకులు వస్తున్నాయి... ప్రభుత్వం అవిశ్వాసం పై చర్చకు సిద్ధంగా ఉందని, అన్నాడీయంకే ఎంపీలు ఆందోళన చెయ్యకుండా, బుజ్జగిస్తున్నారు అంటూ, లీకులు ఇస్తున్నాయి...

delhi 01042018

చర్చ జరపాలని ప్రభుత్వం కూడా నిర్ణయించుకుందని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే సోమవారం లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ ఖాయంగా కనిపిస్తోంది. కాని వాస్తవం మాత్రం వేరేలా ఉందని, రాజకీయ విశ్లేక్షకులు అంటున్నారు... ఇప్పుడున్న పరిస్థితుల్లో అవిశ్వాసం పై చర్చకు వెళ్ళే ధైర్యం మోడీ చెయ్యరని అంటున్నారు... దానికి కారణాలు కూడా చెప్తున్నారు... టీడీపీ, వైసీపీ ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చాయి. ప్రాంతీయ పార్టీలు కావడంతో కేంద్రం పెద్దగా పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్, సీపీఎం పార్టీలు అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కొంత ఆలోచనలో పడింది. ఒకవేళ అవిశ్వాసంపై లోక్‌సభలో చర్చ జరిగితే ప్రధాన పార్టీలు దేశంలోని అనేక సమస్యలను ప్రస్తావించే అవకాశం ఉంది. వ్యాపారవేత్త నీరవ్‌ మోదీ స్కాం.. ఇతర అంశాలు చర్చకు వస్తాయి. నోట్ల రద్దు నుంచి సీబీఎస్‌ఈ పేపర్ లీక్ వరకు అనేక సమస్యలు ప్రస్తుతం దేశంలో ఉన్నాయి.

delhi 01042018

వీటన్నింటినీ చర్చించాల్సి వస్తే ప్రభుత్వ వైఫల్యాలన్నీ బయటకు వస్తాయి. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల్లో దీని ప్రభావం పడుతుందని బీజేపీ భావిస్తే మాత్రం చర్చకు వెనుకడుగు వేయెచ్చు అని అంటున్నారు.. మరో పక్క, బీజేపీ ఎంపీలు కొంతమంది ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యవహారశైలిపై ఆగ్రహంతో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. రిజర్వేషన్లను తొలగించేందుకు పార్టీలో చర్చ జరుగతుందని ఆరోపిస్తూ యూపీకి చెందిన సావిత్రి భాయి అనే ఎంపీ తిరుగుబాటు చేశారు. మరోవైపు మోదీ తీరుపై ఆగ్రహంతో ఉన్న సీనియర్ నేతలు శతృఘ్నసిన్హా, అరుణ్‌శౌరి, జశ్వంత్ సింగ్ లాంటి నేతలు పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీతో చర్చలు జరిపారు. దీంతో ఓటింగ్ జరిగితే పరువు పోతుందనే ఉద్దేశంలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.

పెన్ డ్రైవ్ లు అంటే, సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం కాదు... మన రాష్ట్రానికి సంబంధించిన పెన్ డ్రైవ్... మొన్న అఖిల పక్ష సమావేశంలో కూడా, ఇలాగే డేటా అంతా పెన్ డ్రైవ్ లలో పెట్టి, అందరికీ ఇచ్చారు... ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కూడా, ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివిధ పార్టీలకు వివరించడానికి అవసరమైన ప్రజెంటేషన్లు, పుస్తకాలను సమగ్ర వివరాలతో తయారు చేయించారు. కొందరు నిపుణులతో సమావేశమై.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను సిద్ధం చేసుకున్నారు. ఎంపీలకు అందజేయడానికి ఒక పుస్తకం కూడా సిద్ధం చేయించారు.

cbn 02042018

విభజన వల్ల ఏపీకి కలిగిన నష్టం, దాని భర్తీకి కేంద్రం విభజన చట్టంలో పెట్టిన హామీలు, అవి కాక పార్లమెంట్ వేదికగా ఇచ్చిన వాగ్దానాలు... అవి అమలైన తీరు తదితర సమాచారాన్ని ఇందులో పొందుపర్చారు... ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున అందుబాటులో ఉన్న నాయకులందర్నీ కలవాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అక్కడ ఎవరెవర్నీ కలవాలి? సీఎంతో పాటు వెళ్లే ప్రతినిధి బృందంలో అఖిలపక్షాలు, సంఘాల నాయకులు ఎవరెవరు ఉంటారనే దానిపైన ఈ రోజు పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది...

cbn 02042018

టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుకు మద్దతు తెలిపిన పార్టీల నాయకులు, ఆయా పార్టీల ఎంపీలను కలిసి వారికి కృతజ్ఞతలు చెబుతూ మరిన్ని వివరాలు ఇవ్వాలన్నది సీఎం యోచన. విభజన చట్టంలోని అంశాలు, హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని చంద్రబాబు జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఢిల్లీలో రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. ఎన్డీయేకు టీడీపీ గుడ్ బై చెప్పిన తర్వాత ఢిల్లీ రాజకీయాల్లో పూర్తిస్ధాయి కదలిక వచ్చింది. ఎప్పుడూ లేని విధంగా బీజేపీకీ వ్యతిరేకంగా పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. ఎన్నికల పొత్తుల గురించి ఆలోచించకుండా.. ఇప్పటికైతే కేంద్రాన్ని టార్గెట్ చేయడానికి ఏకమవుతున్నాయి.

Advertisements

Latest Articles

Most Read