ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అమిత్ షా తో చేస్తున్న యుద్ధం పై ప్రశంసించారు... ఈ మేరకు ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో స్పందించారు... నిన్న చంద్రబాబు అసెంబ్లీలో, అమిత్ షా లేఖకు స్పందించిన తీరు, దేశమంతటా మెచ్చుకుంటున్నారు... ఇప్పటికీ ఆ రియాక్షన్ లు వస్తూనే ఉన్నాయి... అమిత్ షా, మోడీ కి ఆ రీసౌండ్ వినిపిస్తూనే ఉంది... చంద్రబాబు ఆ రేంజ్ లో వాయిస్తాడని ఎవరూ ఊహించలేదు... అదీ ఎదో పొలిటికల్ మీటింగ్ లో కాకుండా, అసెంబ్లీలో ప్రతిడి రికార్డెడ్ గా ఉండే చోట, అమిత్ షా ని వాయించారు...
ఇదే సమయంలో, నిన్న చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని మెచ్చుకుంటూ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక ట్వీట్ చేసారు... చంద్రబాబు అమిత్ షా ని ట్యాగ్ చేసి, అబద్దాలు చెప్పకండి అని వేసిన ట్వీట్ ను, రీ ట్వీట్ చేస్తూ , ఇలా స్పందించారు..."Shri @AmitShah has no understanding of the Constitution & the division of central taxes bet. centre & states. He keeps lying about Karnataka receiving 2 lakh crores when we got 90k cr. till 2017-18, the first 3 years of 14FC. And he thinks what we got was charity & not our right!"
నిన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా చంద్రబాబుని అభినదించిన సంగతి తెలిసిందే... కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు పోరాడుతున్నారని ఆమె కితాబిచ్చారు. అసత్యాలు ప్రచారం చేసే నాయకులు చాలామంది ఉన్నారని, అది వారికి అలవాటుగా మారిందని బీజేపీని ఉద్దేశించి ఆమె పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు నిజాలు బయటపెడుతున్నందుకు అభినందిస్తున్నానని మమతా బెనర్జీ పేర్కొన్నారు. వెరీ గుడ్ అన్నారు. చాలామంది సోకాల్డ్ నేతలు అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. అది అలవాటుగా మార్చుకున్నారన్నారు.తాము రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్రాలను బుల్డోజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మమతా బెనర్జీ ఆగ్రహించారు. ఇది ఫేక్ ఫెడరలిజం అని విమర్శించారు.