నిన్న పవన్ కల్యాణ్‌ మాట్లాడిన మాటల పై చంద్రబాబు స్పందించారు... పవన్ కల్యాణ్‌ పై ఎవరూ వ్యక్తిగత విమర్శలు చేయవద్దని, ప్రతి దానికి సరైన రీతిలో, మనం చేస్తున్న పనులు ముందు పెట్టి పవన్ కు సమాధానం చెప్పమని, టీడీపీ శ్రేణులకు చంద్రబాబునాయుడు చెప్పారు... గురువారం ఆయన ఎంపీలు, అసెంబ్లీ వ్యూహ కమిటీ ప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు... మన విమర్శలు హుందాగానే ఉండాలన్నారు. ఎవరు నన్ను తిట్టినా, తిట్టించినా అవి నాకు ఆశీర్వాదాలేనని, ఎవరూ ఆవేశకావేశాలకు లోనుకారాదని చంద్రబాబు సూచించారు. ఇది కీలక సమయం అని, మన లక్ష్యం రాష్ట్ర ప్రయోజనాల మీదే ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఇలాంటి రాజకీయాలు, విమర్శలు వస్తూనే ఉంటాయని, ఎదుర్కుంటునే ఉంటామని చెప్పారు...

cbn 15032018 2

నిన్న రాత్రి కూడా, పవన్ మీటింగ్ తరువాత కొందరు మంత్రులు, పార్టీ సీనియర్లతో ఆయన టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రానికి రావాల్సిన సాయం రాబట్టడానికి తెలుగుదేశం పార్టీ తన సర్వ శక్తులూ ఒడ్డి కేంద్రంపై పోరాడుతుంటే ఈ సమయంలో త మపై దాడి చేయాల్సిన అవసరం ఏమిటని ముఖ్యమంత్రి చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. ఈ సమయంలో మమ్మల్ని తిట్టడం ఏమిటి? మేం కేంద్రంపై పోరాటం చేస్తుంటే మాపై గురి పెట్టి మాట్లాడిస్తోంది ఎవరు? ఎవరి తరపున మాట్లాడుతున్నారు? రాష్ట్రానికి అన్యాయం చేసిన వారిని ఒక్క మాట అనడానికి నోరు రాకపోతే ఎలా? కేంద్ర ప్రభుత్వం పై ప్రజల్లో ఇంత ఆగ్రహం వ్యక్తమవుతుంటే వాళ్ల వైఖరి గురించి మాటైనా లేకుండా మాపై పడుతున్నారంటే అర్థమేంటి’ అని ఆయన ప్రశ్నించారు.

cbn 15032018 3

‘కులాల మధ్య చిచ్చు పెడుతున్నామని మాపై విమర్శలు చేశారు. బీసీలకు నష్టం కలగకుండా కాపులకు రిజర్వేషన్‌ కల్పిస్తామని మేం మా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. అదే మాట ప్రకారం ఒక పద్ధతి ప్రకారం బీసీ కమిషన్‌ వేసి అధ్యయనం చేసి ఆ నివేదిక కేంద్రానికి పంపాం. పోయిన ఎన్నికల్లో పవన్‌ మా తరపున ఎన్నికల ప్రచారం చేశారంటే మా ఎన్నికల ప్రణాళికకు మద్దతు ఇచ్చినట్లే కదా? మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? మత్స్యకారులను ఎస్టీల్లో చేరుస్తామని కూడా మా మేనిఫెస్టోలోనే పెట్టాం. ఇప్పుడు కొత్తగా చెప్పలేదు. ఈ నాలుగేళ్ల కాలంలో మీరెప్పుడూ ఇలా మాట్లాడలేదు. ఉద్ధానమో.. మరో సమస్యో మీరు లేవనెత్తితే మీపై గౌరవంతో స్పందించాం. వాటిపై చర్యలు తీసుకున్నాం. మేమెప్పుడూ మీపై అగౌరవం చూపలేదు. అలాంటిది.. ఇప్పుడు.. ఇలాంటి సమయంలో మాపై దాడి చేయడం సమంజనమేనా? రాష్ట్రం కోసం పోరాడుతున్న వారికి మీరిచ్చే మద్దతు ఇదేనా’ అని పవన్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి... మొన్నటి దాక, తెలుగుదేశం పార్టీతో ఉన్న పవన్ కళ్యాణ్, నిన్న రాత్రి సడన్ గా ప్లేట్ మార్చేసారు... మోడీని ఒక్క మాట అనకుండా, ప్రత్యెక హోదా పై, విభజన అంశాల పై ఏమి చేస్తాడో చెప్పకుండా, కేవలం రాష్ట్రం కోసం కష్టపడుతున్న చంద్రబాబునే టార్గెట్ చేస్తూ, మూడు గంటలు ప్రసంగించారు... ఇప్పటికే ప్రజలకు మోడీని ఒక్క మాట అనకుండా, కేంద్రం పై ఎదురు తిరుగుతున్న చంద్రబాబుని ఎందుకు అంటున్నారో, పవన్ ఎజెండా ఏంటో అని అనుకుంటున్నారు...

pavan jagan 15032018 1

ఇదే సందర్భంలో, మరో వార్త బయటకు వచ్చింది... వైసీపీ ఎంపీ వరప్రసాద్ కొన్ని ఆసక్తికర విషయాలు బయట పెట్టారు... జనసేన, జగన్ ఇద్దరూ కలిసి భవిష్యత్తు రాజకీయం చేస్తున్నారని చెప్పారు... ఈ రోజు ఉదయం ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ లో, ఈ విషయం చెప్పారు... తనని కొంత కాలం క్రిందట, పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి కలవాలని రమ్మన్నారని చెప్పారు.. పవన్ పిలుపు మేరకు, ఆయన్ను కలవటానికి వెళ్లనాని చెప్పారు... ఈ సందర్భంలోనే, పవన్ తనను కొన్ని ప్రశ్నలు అడిగారని, జగన్ నన్ను ఎందుకు టార్గెట్ చేస్తుంది అని పవన్ అడిగారని చెప్పారు వైసీపీ ఎంపీ వరప్రసాద్.

pavan jagan 15032018 1

మీరు మా జగన్ ను విమర్శలు చేస్తున్నారు, అవినీతి పార్టీ అంటున్నారు, అందుకే మీ మీద విమర్శలు చేస్తున్నాం... పోలవరం సందర్శనాకు మేము వెళ్తున్నామని తెలిసి, మీరు ముందే వెళ్లి హై జాక్ చేస్తే మాకు కోపం రాదా అని అన్నానని వైసీపీ ఎంపీ వరప్రసాద్ చెప్పారు...మీరు ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడుతున్నారని, అందుకే మీ పై విమర్శలు అని చెప్పానని చెప్పారు... అయితే దీనికి స్పందించిన పవన్, తానూ తెలుగుదేశంతో ఎంత మాత్రం లేను అని, అవసరం అయిన సమయంలో జగన్ తో కలిసి, జగన్ కు మద్దతు ప్రకటిస్తానని పవన్ చెప్పారని చెప్పారు... ఎన్నికల తరువాత, ఏమైనా సీట్లు తక్కువ అయితే, తానకు ఉన్న ఎమ్మల్యేలతో, జగన్ కు మద్దతు ఇస్తానని పవన్ హామీ ఇచ్చారని చెప్పారు... ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకోసం పోరాడుతున్న పవన్‌కల్యాణ్‌కు మద్దతిస్తామని వైసీపీ ఎంపీ వరప్రసాద్ పేర్కొన్నారు... ఇది విషయం, ఇంకా ఎన్ని చిత్రాలు చూడాలో...

సీఎం చంద్రబాబు నివాసంలో తెదేపా సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూపీ, బిహార్‌లో లోక్‌సభ స్థానాల ఉప ఎన్నిక ఫలితాలతో పాటు వైకాపా వ్యవహార శైలి, విభజన హామీలు నెరవేర్చడంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, తదితర అంశాలపై చర్చిస్తున్నారు.. యూపీ, బిహార్‌ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలను సీఎం నేతలను అడిగి తెలుసుకున్నట్టుగా సమాచారం. వివిధ రౌండ్లలో ఆయా పార్టీలకు వస్తోన్న ఓట్ల సరళిని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి, దేశంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయని నేతలతో అన్నారు...

cbn review 14032018 2

మరో పక్క తెలుగుదేశం నేతలు కూడా, బీజేపీ ఓటిమి పై, వారు ఆంధ్రప్రదేశ్ కు చేసిన అన్యాయం గుర్తు చేసుకుని, విమర్శలు చేస్తున్నారు... విభజన హామీలు నెరవేర్చకుండా ప్రజల మనోభావాలను కించపరిచేలా వ్యవహరిస్తున్న భాజపాకు ఉత్తర్‌ప్రదేశ్‌లో దెబ్బ తగిలిందని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. గోరఖ్‌పూర్‌లో అత్యధికంగా ఉన్న తెలుగు వారు భాజపాకు గుణపాఠం చెప్పారన్నారు. శ్రీకాకుళం, విజయనగరం నుంచి ఎక్కువగా గోరఖ్‌పూర్‌కు వలస వెళ్లారని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను భాజపా మోసం చేసిన ప్రభావం అక్కడ పడిందన్నారు.

cbn review 14032018 3

మరో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రధాని ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. మోసం ఒక రాష్ట్రానికి చేసినా, ఒక వ్యక్తికి చేసినా మోసమేనన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో మాకు పనిలేదు యూపీ ఉందని భాజపా భ్రమపడిందని, ఇవాళ సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయే పరిస్థితి నెలకొందన్నారు. తెలుగు వారికి జరిగిన అన్యాయం పక్క రాష్ట్రాల వారికి అర్థమైందని, అందుకే భాజపా ఓడిపోయిందన్నారు. భాజపాకు ఈ ఓటమి ఒక గుణపాఠంగా ఉండాలని తెలిపారు. ఈ ఫలితాల తర్వాత అయినా భాజపాలో మార్పు రావాలని, హోదా అమలు చేయాలని ఆయన కోరారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ స్థితికి రావటానికి కారణమైన కెసిఆర్ ని, ఆహా ఓహో అంటూ భజన చేస్తున్నప్పుడు ఈ మనషి ఎలాంటోడో కొంచెం అర్ధమైంది... నేను వైఎస్ఆర్ కి విశ్వాసం ఉన్న కుక్కని అని అనే ఉండవల్లి లాంటి వాడు పక్కన చేరినప్పుడు, అమరావతి పై విషం చిమ్మే ఐవైయ్యార్ కృష్ణా రావు లాంటి వాడిని పక్కన కూర్చో బెట్టుకున్నప్పుడు కూడా ఈ మనిషి గురించి అర్ధం కాలేదు... 4 ఏళ్ళు హైదరాబాద్ లో కులికి కులికి వచ్చి, ఇప్పుడు వచ్చి 4 ఏళ్ళలో నువ్వేమి చేస్తున్నావ్ అని అడుగుతున్నాడు పవన్... నువ్వేమి చేసివి ఈ 4 ఏళ్ళ నుంచి అంటే ? ఏమి చెప్తావ్... ఒక మహేష్ కత్తి అనే ఒక చిన్న పురుగు దెబ్బకి నెల రోజులు బయటకి రాని నువ్వు, కూడా మాట్లాడతావా ?

pk 14032018 2

అరుణ్ జైట్లీకి ఇంగ్లీష్ లో చెప్పిన నువ్వు, మోడీ అనే వాడికి హిందీలో కాని...ఇంగ్లీషులో కాని...గుజరాతీ లో కాని ఒక్క మాట ఎందుకు చెప్ప లేక పోయావ్ ? మోడీ అంటే ఎవడికి భయం ? నిత్యం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మోడీ మోడీ మోడీ అని పేరు పెట్టి, నువ్వు అన్యాయం చేసావ్ అంటుంటే కనిపించటం లేదా ? ఎవరు భయపడుతున్నారు ? 3 గంటలు మాట్లాడి, ఒక్క సారి అయినా మోడీ అనే మాట అన్నావా ? నువ్వా మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడేది ? కరప్షన్ గురించి నీ దగ్గర అంట సమాచారం ఉంటే, ఎందుకు కోర్ట్ కి వెళ్ళలేదు ?

pk 14032018 3

24 గంటలు కరెంటు ఇస్తున్నాడు అని కెసిఆర్ ని కలిసి మరీ పోగిడావే, ఒక్కసారి అయినా పట్టిసీమ గురించి మాట్లాడవా ? హైదరాబాద్ నుంచి వచ్చి, మా రాష్ట్ర పరువు తియ్యటానికి వస్తున్నావా ? ఇదే కరప్షన్ నీకు కెసిఆర్ దగ్గర కనిపించలేదా ? తెలంగణా నుంచి మాకు 5 వేల కోట్లు విద్యుత్ బకాయలు ఉన్నాయి, ఒక్కసారి అయినా అడిగే దమ్ము నీకు ఉందా ? ఉమ్మడి ఆస్తులు పంచమనే దమ్ము నీకు ఉందా ? కెసిఆర్ ని ఒక్క మాట అనటం నీకు చేత కావటం లేదా ? మోదీ ఎదురుగా నిలబడి మిష్టర్ ప్రైమ్ మినిష్టర్ అని గొంతెత్తి నిరసన తెలిపింది, చంద్రబాబు నాయకత్వంలో ఉన్న గల్లా జయదేవ్... నీకు దమ్ము ఉంటే ముందు మోడీని ఒక మాట అను... చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఏమి చేసాడో, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు పవన్... కనీసం ఒక్క మాట మోడీ అనే మాట నీ నోటి వెంట వచ్చిందా ? మోడీ ని ఒక్క మాట కూడా అనని, నీ ఎజెండా కూడా తెలుసు... పూర్తి వివరాలు త్వరలోనే వస్తాయి... గెట్ రెడీ.. చివరగా అమరావతి జోలికి వస్తే తొక్క తీస్తాం.. ప్రాధాన ప్రతి పక్షం జగన్ కూడా ఇలాగే ఏడ్చి, చివరకు ఏమవుతున్నాడో చూడు... అమరావతి మీద ఏడుపులు ఆపు...

Advertisements

Latest Articles

Most Read