నవ్యాంధ్ర జీవినాడి పోలవరం పై కేంద్రంలోని బీజేపీ పెద్దలు మొదటి నుంచి గేమ్ ఆడుతూనే ఉన్నారు... గత సెప్టెంబర్ లో, చంద్రబాబు అసెంబ్లీ వేదికగా, కేంద్రం పోలవరం పై చేస్తున్న నాటకాలు బయట పెట్టే దాక, వీరి నిజ స్వరూపం తెలియలేదు... పోలవరం అనేది ఎంత కష్టమైన ప్రాజెక్ట్ అనేది అందరికీ తెలుసు.. అందుకే కేంద్రం తప్పించుకుని, సెప్టెంబర్ 8, 2016న రాష్ట్ర ప్రభుత్వానికి అప్ప చెప్పి, చేతులు దులుపుకున్నారు... వారు ఊహించింది, ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళదు, నెపం చంద్రబాబు మీద నెట్టవచ్చు అని.. కాని చంద్రబాబు, ఈ అవకాశాన్ని వాడుకుని, ఆయన అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అన్నీ బయటకు తీసారు.. ప్రతి సోమవారం, పోలవరం పై రివ్యూ పెట్టుకున్నారు... పెద్ద పెద్ద మిషన్లు ఇంపోర్ట్ చేపించారు... కొన్ని క్లిష్టమైన పనులు విదేశీ కాంట్రాక్టుర్లకు అప్పచెప్పారు... దీంతో అనూహ్యంగా, పోలవరం ప్రాజెక్ట్ పరుగులు పెట్టింది...

polavaram 18032018 2

దీంతో చంద్రబాబు కూడా 2018కి గ్రావిటీ ద్వారా నీరు ఇస్తాం అంటూ ప్రకటించారు... కాని, ఢిల్లీ లెవెల్ లో కుట్రలు జరుగుతున్నాయనే విషయం పసిగట్ట లేక పోయారు... మంచిగా నటిస్తూ, నమ్మించి మోసం చేసే మనుషులు గురించి తక్కువ అంచనా వేసారు... ఎప్పుడైతే పోలవరం పనులు లైన్ లో పడ్డాయో, సరిగ్గా వర్షా కాలం అయిపోయి, పోలవరం కన్స్ట్రక్షన్ సీజన్ మొదలయ్యే టైంలో, కేంద్రం అడ్డు పుల్ల వేసింది... కాఫర్ డ్యాం ఎందుకు అంటూ, వింత వాదన తెచ్చింది... కాంట్రాక్టర్ సరిగ్గా పని చెయ్యటం లేదు , మార్చండి అంటే, వినలేదు.. అలా చంద్రబాబు, ఢిల్లీతో పోరాడి పోరాడి, ఈ రెండు విషయాలు సాధించారు... కాఫర్ డ్యాంకు పర్మిషన్ వచ్చింది, కొత్తగా నవయుగ వచ్చింది.. కాని కేంద్రం ఎందుకు ముందు ఆగమంది, మళ్ళీ తానే ఎందుకు పర్మిషన్ ఇచ్చింది ? ఎందుకంటే, కీలకమైన 3 నెలలు కాలం డిలే చెయ్యటానికి.. వారు అనుకున్నది జరిగింది, దీంతో పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యే డేట్ 2019కి వెళ్ళింది...

ఇప్పుడు ఏమి జరుగుతుందో తెలుస్కునే ముందు, రెండు విషయాలు తెలుసుకుందాం... వీరు ముందు నుంచి ఎలా కుట్ర పన్నారు అనేదానికి ఇవే ఉదాహరణలు... ముందుగా జగన్, పవన్, ఇద్దరూ చెప్పిన మాట, ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ చంద్రబాబు బినామీ అని, అందుకే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావటం లేదు అని... వీళ్ళు ఇలా ఆరోపణ చేసారో లేదో, ఈ గోల ఎందుకు అనుకున్న చంద్రబాబు ఆ కాంట్రాక్టర్ ని మార్చెయ్యండి అని కేంద్రంతో పోరాడారు... చివరకు నవయుగ ఎంటర్ అయ్యింది... ఇక అంతే అప్పటి నుంచి, ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ చంద్రబాబు బినామీ అనే మాట మరో సారి జగన్ కాని, పవన్ కాని అనలేదు... తరువాత చేసిన ఆరోపణ, పోలవరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిపోయింది అని... వెంటనే చంద్రబాబు, అన్ని లెక్కలు వెబ్సైటు లో ఉన్నాయి చూసుకోండి అని చెప్పగానే, రెండో రోజు నుంచి అటు జగన్ కాని, ఇటు పవన్ కాని, పోలవరంలో అవినీతి జరిగింది అనే మాట ఎత్తలేదు... అంతకు ముందు పోలవరంలో తవ్విన మట్టి డంపింగ్ సమస్య ఉంది అంటూ, మా పొలాల్లో మట్టి వేస్తున్నారు అంటూ, కొంత మంది పవన్ ను కలిసారు... అవి అన్నీ తప్పు అని, నిబంధనలు ప్రకరం నడుచుకుంటున్నాం అంటూ ప్రభుత్వం వివరణ ఇచ్చింది.. తరువాత ఇదీ మర్చిపోయారు...

polavaram 18032018 3

ఇప్పుడు తాజగా చుస్తే, నవయుగ వచ్చిన తరువాత పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయి.... ఇప్పటికే 55శాతం పనులు పూర్తయ్యాయి... స్పీడ్ చూస్తుంటే, 2019కి గ్రావిటీ ద్వరా నీళ్ళు ఇచ్చే అవకాశం మెండుగా ఉంది... దీంతో కేంద్ర ప్రభుత్వం ఎలా అయినా పోలవరం ప్రాజెక్ట్ ఆపాలనే పట్టుదలతో ఉంది... దీన్నే ఆపరేషన్ గరుడలో ఒక భాగంగా తీసుకున్నారు.. పోలవరం ఆపేసి, రాష్ట్రంలో ఒక అనిశ్చితి, చంద్రబాబు పట్ల అప నమ్మకం తీసుకు రావాలనే ప్లాన్ వేసారు... అందులో భాగంగా, పోలవరం అవినీతి అనే విషయం పైకి తేవాలని, అన్ని రికార్డులు తిరగేసారు... అన్ని లెక్కలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి... అవినీతి అని చెప్పి, పోలవరం ఆపే పరిస్థితి లేదని తెలుసుకున్నారు.. అందుకే, ఇక్కడ మూడు మార్గాలు ఎంచుకున్నారు...

మొదటిది, ఇది వరకు పవన్ దగ్గరకు వచ్చిన, తవ్విన మట్టి డంపింగ్ ఇష్యూ.... దీని కోసం, జగన్ ని వాడుకున్నారు... జగన్ సన్నిహితుడు చేత, ఈ డంపింగ్ ఇష్యూ పై ఒక కేసు వేయించారు... అందులో చెప్పింది ఏంటి అంటే, పోలవరం ప్రాజెక్ట్ కోసం తవ్విన మట్టి పర్యావరణానానికి హాని చేస్తుంది, అందుకే ఆ మట్టి ప్రాజెక్ట్ దగ్గరలో కాకుండా, ప్రాజెక్ట్ కి 50 కి,మీ దూరంలో డంప్ చెయ్యాలని పిటీషన్ వేసారు... ఇది కనుక కోర్ట్ అడ్మిట్ చేస్తే, ఖర్చు తడిచి మోపెడు అవుతుంది... అంతే కాక ఇప్పటికే డంప్ చేసిన మట్టి కూడా తరలించాలని కూడా పిటిషన్ లో ఉంది... ఇలా చెయ్యాలంటే, పోలవరం అంచనాలు మళ్ళీ పెరిగిపోతాయి... కేంద్రం ఇప్పటికే నిధులు ఇవ్వటం లేదు... ఇప్పుడు ఇది డంప్ చేసిన తరువాతే, ప్రాజెక్ట్ మొదటి పెట్టాలని, అప్పటి వరకు ఆపెయ్యాలనే వాదన కూడా తీసుకువస్తున్నారు...

polavaram 18032018 2

రెండోది, భూములకు ఇచ్చే పరిహారంలో, అవినీతి జరుగుతుందని, వాటి పై ఎంక్యిరి వేసి, విచారణ చెయ్యాలని, అప్పటి దాక, భూసేకరణ ఆపెయ్యలని కూడా, ఇక్కడ నుంచి కొంత మంది లెటర్ లు రాసారు... ఇది తేలే వరకు ములకు ఇచ్చే పరిహారం డబ్బులు ఇవ్వద్దు అంటే కేంద్రాన్ని కోరుతున్నారు... ఇలా కూడా, పోలవరం ఆపెయ్యలని చూస్తున్నారు...

ఇక మూడోది, తెలంగాణా, ఒరిస్సా ద్వారా చేస్తున్నారు... తెలంగణా నుంచి ఆంధ్రాలో కలిపినా 7 ముంపు మండలాలు కాక, అవి దాటి ఇంకా ముంపు ఉంది అంటూ, ముంపు పై పుణెలోని కేంద్ర జల విద్యుత్తు పరిశోధనా సంస్థ(సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) లేదా మరో సంస్థతో కేంద్రం అధ్యయనం చేయించేలా చూడాలని తెలంగాణ సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. పోలవరం బ్యాక్‌వాటర్‌ ప్రభావంపై అధ్యయనం చేయించిన తెలంగాణ.. దీనిపై మరింత స్పష్టత కోసం కేంద్ర సంస్థతో అధ్యయనం చేయించాలని ఒడిశా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తు పై ప్రతివాదిగా కొద్ది రోజుల క్రితం దాఖలు చేసిన పిటీషన్ లో కోరింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ 2007లో ఒడిశా సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. అప్పటి నుంచి ఇది విచారణలో ఉంది. తర్వాత వరసగా 12 మధ్యంతర దరఖాస్తులు దాఖలు చేసింది. ఒడిశా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసులో తెలంగాణ కూడా ప్రతివాది అయ్యింది... ఈ కేసులో కూడా, ముంపు పై సర్వే అయ్యేంత వరకు, ఏ పనులు చెయ్యవద్దు అనే ఆదేశాలు ఇస్తే, ఇక అంతే సంగతులు...

polavaram 18032018 3

ఇన్ని విధాలుగా, చంద్రబాబుని సాధించటం కోసం, చంద్రబాబుని దోషిగా చూపించటం కోసం, అవినీతి లేదు కాబట్టి, ఇలాంటి సాంకేతిక అంశాలు చూపించి, పోలవరం ఆపించి, రాష్ట్రంలో అనిశ్చితికి, ఆపరేషన్ గరుడలోని ఒక భాగంతో, ఢిల్లీలోని బీజేపీ పెద్దలు గేమ్ ఆడుతున్నారు... ఇలాంటి వాటిల్లో ఏదన్నా తీర్పు వచ్చినా, మనం చేసేది ఏమి ఉండదు.. ఎందుకంటే, కోర్ట్ లను గౌరవించాలి కదా... చూద్దాం ఏమి చేస్తారో...

జగన్ మోహన్ రెడ్డి గారు, నేను 30 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటున్న సంగతి తెలిసిందే... అయితే, ఈ రోజు ఉగాది పర్వదినం సందర్భంగా గుంటూరు జిల్లా కాకుమానులో వైసిపీ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో జగన్‌ మోహన్‌రెడ్డిని పురోహితులు ఎక్కడికో తీసుకువెళ్ళి నుంచో పెట్టారు... జగన్ మోహన్ రెడ్డి స్టార్ట్ తొందరలోనే తిరుగుతుంది అంట... ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వర్ణయుగం అంట... వైఎస్సార్‌ పాలనను ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మళ్లీ చూడబోతున్నారని పంచాంగకర్తలు పేర్కొన్నారు. వైఎస్సార్‌ పాలన అంటే ఏంటో తెలిసిందేగా...

jagan 18032018 2

అక్టోబర్ 25 వరకూ ఆయన జాతకంలో ఉన్న గోచార సమస్యలు పూర్తి కానున్నాయని పంచాంగకర్తలు తెలిపారు. ఇక, అవి పూర్తి కాగానే జగన్ కీర్తి మరింత పెరుగుతుందని, 2019 ఎన్నికలకు ముందే ఆయనకు బుధ మహాదశ ప్రారంభమవుతుందని, ఇదేమీ ముఖస్తుతి కోసం చెప్పబోవడం లేదని తెలిపారు. ఇక ఆ టైం నుంచి, జగన్ అందరినీ శాసించి, రాజకీయాలు తిప్పేస్తారంట... వచ్చే ఎన్నికల్లో జగన్ జాతకరీత్యా 135 సీట్లు వస్తాయని, తను చెప్పిన అంశం తప్పయితే, ఇక జీవితంలో మరెక్కడా పంచాంగ శ్రవణం చేయబోనని ఈ పంతులు గారు సవాల్ విసిరారు...

jagan 18032018 3

తాను ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెబుతున్నానని అన్నారు. జగన్ కు మంచి జరగనుందని, 2019 మే తరువాత 12 సంవత్సరాల, 8 మాసాల 18 రోజులు ముఖ్యమంత్రి పదవిలో ఉంటారని చెప్పారు. తాము 40 మంది పంచాంగకర్తలం కూర్చుని భవిష్యత్తులో జరగబోయేదాన్ని అంచనా వేశామని, ఈ అంచనాలు ఏకాభిప్రాయమని అన్నారు... మొన్న జగనేమో, రెండు టెంకాయలు ఎక్కువ కొట్టమన్నాడు... వీరేమో, 40 మంది కూర్చుని, డిసైడ్ చేసేసాం అంటున్నారు.. ఇంతాకీ ప్రజలు ఏమి చెయ్యాలి ? వీరి పాత్ర, వీరి అభిప్రాయం ఏమి లేదా ? ఇంతకీ పాపం, జగన్ ను అంత ఆనంద పరిచిన ఆ పంతులు గారికి, సంభవన భేషుగ్గా ఇచ్చారో లేదో...

చంద్రబాబుని ఇబ్బంది పెడుతూ, రాష్ట్రంలో అనిశ్చితి నెలకొల్పాలని, దాని కోసం మన రాష్ట్రంలోని నేతలనే వాడుకుంటున్న బీజేపీ పెద్దలు ఆపరేషన్ గరుడు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే... ఈ ఆపరేషన్ మొదటి పార్ట్ లో, పాత్రదారులని సెట్ చేసి, డిరెక్షన్ మొదలు పెట్టారు ఢిల్లీ పెద్దలు... ఆపరేషన్ గరుడు, రెండో భాగం మొదలైంది... ఇందులో భాగంగా, బహిరంగంగానే పనులు చేసేస్తున్నారు... చంద్రబాబు ఎన్నో సార్లు చెప్పినట్టు, జగన్ - బీజేపీ కలిసి పోతున్నారు అనే దానికి ఇదే ఉదాహరణ... బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నివాసంలో ఏపీ బీజేపీ నేతల సమావేశంలో ఈ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది...

pk 17032018 2

తెలుగుదేశం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత, రాష్టంలో ఎలా వెళ్ళాలి అనే వ్యూహం అని చెప్తూ, ఈ సమావేశానికి, జగన్ 250 కోట్లు ఇచ్చి పెట్టుకున్న సలహాదారుడు, ప్రశాంత్ కిషోర్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యి, నిస్సిగ్గుగా బీజేపీ - వైసిపీ బంధాన్ని బయట పెట్టారు... ఒక పక్క అవిశ్వాసం అంటూ, ఇలా డ్రామాలు ఆడుతున్నారు.. చంద్రబాబు ఎప్పటి నుంచో చెప్తున్న మాటలు, గత కొన్ని రోజులుగా ఢిల్లీ పెద్దలు చేస్తున్న కుట్రలు నిజమే అని ఇప్పుడు తేలింది...

pk 17032018 3

వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో, మరో అంశం కూడా చర్చించారు.. తెలుగుదేశం పెట్టిన అవిశ్వాస తీర్మానం ఎలా ఫెయిల్ చెయ్యాలి, మొన్న మద్దతు ప్రకటించిన పార్టీలు, చంద్రబాబుకి మద్దతు ఇవ్వకుండా ఎలా ఒత్తిడి తేవాలి అనేది కూడా చర్చించారు.. అలాగే, అవిశ్వాసం అంకం పూర్తయిన తరువాత, ఆపరేషన్ గరుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది కూడా చర్చించారు... మొత్తానికి చంద్రబాబు చెప్పినట్టు, బీజేపీ, వైసిపీ, పవన్ తో కలిసి రాష్ట్రంలో అనిశ్చితి వాతావరణం సృష్టించాలి అనే ప్లాన్ నిజమే అనే, ఇవాల్టితో నిర్ధారణ అయ్యింది... ఇప్పటికైతే, వైసిపీ - బీజేపీ అడ్డంగా దొరికాయి...

శ్రీశైలంలో జరగుతన్న ఉగాది కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గున్నారు... ఆంధ్రప్రదేశ్ రావటానికి ఎప్పటి నుంచో, ప్రధాని గారికి కుదరటం లేదు... ఇక్కడకు రావటానికి టైం సరిపోక, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే కార్యక్రమంలో మోదీ పాల్గుని ప్రసంగిచారు... ప్రజలకు ఉగాది సందేశం ఇచ్చారు... ఇక్కడ వరకు బాగానే ఉంది... ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎమన్నా సందేశం ఇస్తారేమో అని, అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు... ఎందుకంటే, శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబాట్టి... కాని, మన ఆశల మీద ప్రధాని నీళ్ళు చల్లారు...

karnataka 17032018 2

ఈ అవకాశాన్ని కూడా, కర్ణాటక ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించుకున్నారు... కర్నాటకలో ఎన్నికలున్నాయి కాబట్టి, శ్రీశైలంకి కన్నడ భక్తులు వస్తారు కాబట్టి , వారికోసం ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారా అనే అనుమానం కలుగుతుంది... ఎందుకంటే, ఆ వీడియో మొత్తం, కన్నడలో కట్టిన బ్యానర్స్ దర్శనం ఇచ్చాయి... చివరకు వీడ్కోలు చెప్పింది కూడా కన్నడలోనే.... శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ లో ఉంది... ఇక్కడ ప్రజలు మాట్లాడే భాష తెలుగు అనే విషయం ప్రధాని గారు మర్చిపోయారు... తెలుగు ప్రజలతో పని లేదు అనే భావనలో ప్రధాని గారు ఉన్నారేమో...

karnataka 17032018 3

పొలిటికల్ గా ఎన్నైనా ఉండొచ్చు కానీ రాష్ట్ర ప్రజలు ఏమి తప్పు చేశారు సార్.... కర్ణాటక ప్రజల గురించి మాత్రమే మాట్లాడారు కానీ, తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చేప్పలేదు. సంక్రాంతి పండగ రోజు కూడా ఇలాగే చేసారు... సంక్రాంతి పురస్కరించుకుని, తమిళనాడు,గుజరాత్, మరాఠీ, పంజాబ్, నార్త్ ఇండియన్ సోదరుల అందరికి పండుగ శుభాకాంక్షలు చెప్పారు... తమిళ్, కన్నడ, పంజాబీ ఇలా వేరు వేరు భాషల్లో ట్వీట్ చేసారు.... కాని మన తెలుగు వారు జరుపుకొనే సంక్రాంతి మాత్రం మర్చిపోయారు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో, వివిధ రాష్ట్రాల్లో, దేశాల్లో ఉన్న తెలుగువారికి, వారి తెలుగు భాషలో కాని, ఇంగ్లీష్ లో కాని, పండుగ శుభాకాంక్షలు చెప్పలేదు ప్రధాని.... ఇప్పుడు ఉగాది పండుగ పురస్కరించుకుని చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో కూడా, మన రాష్ట్రంలో ఉన్న శ్రీశైలంలో ఉన్న వారితో మాట్లాడుతూ, ఒక్క ముక్క తెలుగులో చెప్పక పోగా, కన్నడలో చెప్పారు.... రేపైనా ఏమన్నా ట్వీట్ చేస్తారేమో చూద్దాం...

Advertisements

Latest Articles

Most Read