ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడారు.. తనను అవహేళన చేస్తున్నారని చెప్తూ తనది బలహీనత కాదని.. మిత్రధర్మం పాటిస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాడుతుంటే.. తనను బలపర్చకుండా బలహీనపరుస్తారా? అంటూ విపక్షాలపై మండిపడ్డారు. తనకు మనుషులు కాదు.. దేశం, రాష్ట్రం ముఖ్యమని స్పష్టం చేశారు. కొందరు వ్యక్తులు ఢిల్లీతో లాలాచీ పడ్డారంటూ, లాలూచీ పడ్డ వారెవరో త్వరలోనే బయటపెడతానని, అన్నిటికీ రెండుమూడ్రోజుల్లో సమాధానం చెబుతానని అన్నారు.

cbn 15032018 2

‘కేంద్రంపై నేను పోరాడుతున్నాను. దేని కోసం పోరాడుతున్నాం? నాలుగేళ్లుగా కేంద్రాన్ని అడిగాను. ఈ నాలుగేళ్లలో 29 సార్లు ఢిల్లీ తిరిగాను. ‘నాది బలహీనత’ అని కొంతమంది అంటున్నారు. నాది ధర్మం. మిత్రధర్మం. 29 సార్లు తిరిగిన తర్వాత, నాలుగేళ్లపాటు ప్రయత్నం చేసిన తర్వాత సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో, విధిలేని పరిస్థితిలో పోరాటం ప్రారంభించాను. నేను ఒక్కడినే ఇప్పటికీ ఢిల్లీ పై పొరాడు తన్నా, ఆ పోరాటాన్ని కొనసాగిస్తున్నాను.

cbn 15032018 2

పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు, ఏపీలో మనం పోరాడుతుంటే.. ఒక్కొక్కరూ ఒక్కొక్క లాలూచీ రాజకీయాలతో నన్ను విమర్శిస్తున్నారు. ఏపీకి ప్రధాని అన్యాయం చేస్తున్నారని నేను గళం విప్పినప్పుడు, నన్ను బలపర్చాల్సిన మీరు (విమర్శించే వాళ్లు) బలహీనపరుస్తారా? అది రాష్ట్ర ప్రయోజనాలకు ఏమాత్రం లాభం చేకూర్చదు. తెలుగు జాతికి, ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రజానీకానికి న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు. నా సుదీర్ఘ రాజకీయ అనుభవంతో చెబుతున్నాను. ఎన్నో రాజకీయాలను చూశాను. ఎంతో మంది ఎన్నో విధాలుగా లాలూచీ పడ్డారు. ఎవరెన్ని చేసినా ‘ట్రూత్ ఈజ్ ట్రూత్’. నిజం నిప్పులాంటిది. నిప్పుతో చెలగాటమాడాలని చూడొద్దు భవిష్యత్ లో ఎవరికీ కలిసి రాదు’ అని చంద్రబాబు భావోద్వేగం చెందారు.

కేవలం చంద్రబాబుని ఇబ్బంది పెట్టటానికి, మోడీ పై అవిశ్వాసం అంటూ జగన మోహన్ రెడ్డితో పాటు, అతని స్నేహితులు ఆడిన డ్రామాలు చూస్తూనే ఉన్నాం... ఒక పక్క మోడీకి విశ్వాసం అంటూ, మళ్ళీ అవిశ్వాసం అంటూ డ్రామాలు ఆడారు... ఇక కొంత మంది అయితే, మోడీ అనే పేరు పలికి కొన్ని నెలలు అయిపొయింది... ఈ సందర్భంలో, మోడీ పేరు చెప్పి మరీ, చంద్రబాబు లెఫ్ట్ అండ్ రైట్ వాయిస్తూ, మనకు చేసిన అన్యాయాన్ని దేశానికి చాటి చెప్పారు... అయితే, చంద్రబాబుని ఇబ్బంది పెడదాం అని, మార్చ్ 21న కాకుండా, ప్రస్తుతం రాజాకీయ వాతావరణం ఉపయోగించుకోవటానికి, రేపే అవిశ్వాసం పెట్టారు.. అయితే, చంద్రబాబు వీళ్ళకి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు...

cbn aviswasam 15032018 2

రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా మద్దతు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించింది. అందుబాటులో ఉన్న మంత్రులు, సీనియర్‌ నేతలతో సీఎం తన ఛాంబర్‌లో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో జగన్ జగన్ & కో కి, గొంతులో పచ్చి వెలక్కాయ్ పడింది... చంద్రబాబుని ఇరుకున పెడదాం అని, వారే ఇప్పుడు ఇరుకున పడ్డారు... చంద్రబాబు ధైర్యంగా, మోడీ మీద ఎదురు తిరగ గలరు... కాని, జగన్ బ్యాచ్, మోడీ మీద విశ్వాసం లేదు అని రికార్డెడ్ గా చెప్పే దమ్ము ఉందా ?

cbn aviswasam 15032018 3

అంతే కాదు, చంద్రబాబు మరో డైరెక్షన్ కూడా ఇచ్చారు... వైకాపా భాజపాతో కలిసే ఈ అవిశ్వాసం నాటకం ఆడుతోందని, వీరిద్దరూ ఆడుతున్న నాటకాలు అవిశ్వాసం సందర్భంగా పార్లమెంట్ లోనే ఎండగట్టాలని చెప్పారు... రాష్ట్ర అభివృద్ధి కోసం ఉన్న వనరులన్నింటినీ వాడుకోవాలని సీఎం నేతలతో అన్నారు. రాజకీయాలకతీతంగా వ్యవహరిస్తున్నామనే సంకేతాన్ని కేంద్రానికి తెలియజేయాలని ఈ సందర్భంగా సీఎం అన్నారు. ఇందులో భాగంగానే కేంద్రంపై ఎవరు అవిశ్వాసం పెట్టినా మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టాలని నిర్ణయించారు.

మమ్మల్నే ఎదిరిస్టారా ? ఇప్పటి వరకు మాకు దేశంలో ఎదురు చెప్పిన వాడు లేడు... మా ఇమేజ్ దెబ్బ తీస్తారా ? మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని నిండు సభలో అవమానిస్తారా ? మీ అంతు చూస్తాం అంటుంది ఢిల్లీ...మీ కలలను చిదిమేస్తాం.. మీ వేలుతో, మీ కంటినే పొడుస్తాం అంటూ.. ఏపి పై మహా కుట్ర చేస్తుంది... తమిళనాడులో చేసినట్లు ఆంధ్రాలో, అస్థిరత సృష్టించే వ్యూహంలో ఉంది బీజేపీ... రాజకీయంగా ఇప్పటికే తన అస్త్రాలు సిద్ధం చేసుకుంది.. నిన్న రాత్రితో అది పూర్తిగా అర్ధమైంది... చంద్రబాబు పై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే వ్యూహం కూడా త్వరలో చూడబోతున్నాం... ముఖ్యంగా ఈ కుట్ర వెనుక రెండు ఉద్దేశాలు...ప్రస్తుతం కేంద్రం పై పోరాడుతుంది చంద్రబాబు ఒక్కడే, ఈ విషయంతో పాటు ప్రత్యేక హోదా అంశం పక్క దారి పట్టించటం... కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత కేంద్రంపై పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీకి ప్రజలలో వస్తున్న మద్దతుని రానివ్వకుండా చేసి ప్రజలలో అనుమానపు బీజాలు నాటి, గందరగోళాన్ని సృష్టించటం... రెండోది, ఈ 4సంవత్సరాలలో ఏమి లేని రాష్ట్రములో బస్సులో ఉంటూ పాలనని కొనసాగించి ఈరోజు రాష్ట్రాన్ని అగ్రగామి చెయ్యాలి అనే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రిని, ఆయన దృఢ సంకల్పాన్ని బలహీన పరచి తద్వారా రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించి మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడలేకుండా చెయ్యటం...

cbn 15032018 2

ఇదే విషయం చంద్రబాబు కూడా ధృవీకరించారు... ఏపీ ప్రజల సహేతుకమైన డిమాండ్‌ను పరిష్కరించడం మానేసి.. జగన్‌ను, పవన్‌ను అడ్డం పెట్టుకుని టీడీపీపై విమర్శలు చేయించడం వెనుక బీజేపీ ఉందనే స్పష్టమైన సమాచారం ఉందని చెప్పారు... గురువారం ఉదయం పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీ వ్యూహ కమిటీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఇతరుల కుట్రలో పవన్ కల్యాణ్ పావు కావడం బాధాకరంగా ఉందన్నారు. ఆ కుట్రలో భాగంగానే తనపై నిందలు వేస్తున్నారని, అంతేగాక రాష్ట్ర ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు చెప్పారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే ఎవరికి ప్రయోజనం? ఈ విమర్శల వల్ల రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం కలుగుతుందా..?’’ అంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి రాజకీయ కుట్రలను ప్రజలు అర్థం చేసుకుంటారని, వాళ్లే తగిన బుద్ధి చెబుతారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

cbn 15032018 3

మన లక్ష్యాన్ని మనవాళ్లే దెబ్బతీయడం బాధాకరంగా ఉందని, రాష్ట్రం హక్కుల కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని, ఢిల్లీ ఆదేశాల ప్రకారం, వాళ్లకి ఎదురు తిరిగినందుకు, సీఎంను బలహీన పర్చడం తగదని చంద్రబాబు హితవుపలికారు. ఇది కీలక సమయమని, అందరి లక్ష్యం రాష్ట్ర ప్రయోజనాల మీదే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. ఢిల్లీతో పోరాడి మన రాష్ట్ర హక్కులు సాధించుకోవాలని అన్నారు... దేశంలో యాంటీ మోదీ, యాంటీ బీజేపీ భావన బలంగా ఉందని ఆయన చెప్పారు. ఇందుకు నిన్న వెల్లడైన యూపీ, బీహార్ ఉప ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అందువల్ల, రాష్ట్ర ప్రజలు ఢిల్లీ కుట్రలు తిప్పి కొడుతూనే, జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ,జిత్తులమారి వేషాల వేస్తున్న వారిని అనుక్షణం ఎండగడుతూ... అణచివేతను, వేధింపుల్ని ఎదుర్కోవడానికి మనం సంసిద్ధం కావలి...మన రాష్ట్రాన్ని ఢిల్లీ పెద్దల కుట్రల నుంచి కాపాడుకోవాలి... జై ఆంధ్రప్రదేశ్... జై పోలవరం.. జై అమరావతి...

మా ఆంధ్ర రాష్ట్రం పై బురద జల్లి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి పై గుడ్డ కాల్చి మొఖాన వేసిన పవన్ కళ్యాణ్ గారికి, ఇవే మా సమాధానాలు... ముందుగా, మీరు తెలుగుదేశం పై, ఆ పార్టీ నాయకుల పై చేసిన ఆరోపణలు మాకు అనవసరం.. మీరు మా రాష్ట్ర ఇమేజ్ పై చేసిన దాడికి, మా అమరావతి పై చిమ్మిన విషానికి, మా 5 కోట్ల ఆంధ్రుల కోసం కుటుంబాన్ని కూడా వదిలి కష్టపడుతున్న మా ముఖ్యమంత్రి గారి పై చేసిన విషపు ఢిల్లీ ప్రచారానికే మేము సమాధానం చెప్తాం...

ముందుగా అమరావతికి 33 వేల ఎకరాలు ఎందుకు, ముఖ్యమంత్రి గారు, 7-8వేల ఎకరాల్లో అయిపోతుంది అన్నారు... ముందు మీ భాషలో చెప్తాం పవన్ గారు.. మీరు ఒక నలుగురు ఉండటానికి, రెండు ఎకరాల్లో ఇల్లు కావలా ? మా 5 కోట్ల మంది ఆంధ్రులకి 33 వేల ఎకరాలు వద్దా ? అవును మీరు చెప్పింది నిజం, 7-8వేల ఎకరాల్లో నే రాజధాని అయిపోతుంది.. ఇప్పుడు కూడా మా అమరావతి వచ్చేది 7-8వేల ఎకరాల్లో నే ... రైతులకు భూములు ఇచ్చి, మౌలిక వసతులు పూర్తి అయితే మిగిలేది ఆ 8000 ఎకరాలు మాత్రమే.. మాకు రాజధాని కట్టుకోవటానికి డబ్బులు లేవంటే, మా రైతులు, మా ముఖ్యమంత్రి మీద నమ్మకంతో ఇచ్చారు... మరి వారికి న్యాయం చెయ్యొద్దా ? వారికి డెవలప్ చేసి భూములు తిరిగిస్తే, మా రాజధానికి ఉండేది ఆ 7-8వేల ఎకరాలే...

అభివృద్ధి అంతా అమరావతిలోనే నా అంటున్నారు... అమరావతిలో కేవలం నాలెడ్జ్ సొసైటీ మాత్రమే, హాస్పిటల్స్, హోటల్స్, కాలేజీలు, స్కూల్స్, టౌరిజం తప్ప ఏమి ఉండదు... మీకు కియా ఎక్కడ వచ్చిందో తెలియదు ఏమో... మీకు ఫిన్ టెక్ వాలీ, బ్లాక్ చైన్ హబ్ ఎక్కడ వచ్చిందో తెలియదు ఏమో, మీకు హీరో హోండా, ఫాక్స్ కాన్, ఇసుజు లాంటి కంపెనీలు ఎక్కడ వచ్చాయో తెలియదు ఏమో... జాతీయ విధ్యా సంస్థలకు రాష్ట్రమంతా ఇచ్చిన సంగతి మీకు తెలియదు ఏమో.. అనంతపురంలో ఎంత నీరు వచ్చిందో మీకు తెలియదు ఏమో, గుంటూరులో వచ్చిన సిమెంట్ ఫ్యాక్టరీలు, గోదావరి జిల్లలో ఆక్వా ప్రగతి మీకు తెలియదు ఏమో... ఒకసారి ఏ పెట్టుబడులు, ఏ రంగం ఎక్కడ విస్తరించి ఉందో, తెలుసుకోండి సార్...

అవినీతిలో మా రాష్ట్రం నెంబర్ వన్ అంటున్నారు... మీరు చెప్పే లెక్కలు 2016లోవి... మా ముఖ్యమంత్రి 1100 పెట్టి, ACBని బలోపేతం చేసిన తరువాత, ఈ రాష్ట్రంలో అవినీతి శాతం తగ్గింది... మా రాష్ట్రం 19వ స్థానంలో ఉంది... రిపోర్ట్ ఇక్కడ చూడవచ్చు... http://www.ncaer.org/publication_details.php?pID=282

pavan aropanalu 15032018 1

పోలవరం ప్రైవేటు కాంట్రాక్టర్ లు కడుతున్నారు అంటున్నారు... అవును సార్.. ప్రపంచంలో ఎక్కడైనా, ఏ ప్రభుత్వ ప్రాజెక్ట్ అయినా ప్రైవేటు కాంట్రాక్టర్ లే కట్టేది... ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి, కూలీలని పెట్టుకోరు... మొన్న ఇలాగే పోలవరం పై అవినీతి అన్నారు.. వెబ్సైటు చూసుకోమంటే, తరువాత ఆ పోలవరం అవినీతి ఊసే లేదు... మరొకసారి చూసుకోండి.. మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,అన్నిట్లో పారదర్సకత చూపిస్తుంది.. మీ తెలంగాణా రాష్ట్రంలా కాదు... http://polavaram.apegov.com/ispp/home

ఇక పొతే ఎర్ర చందనం... కింద ఇమేజ్ చూడండి... మీకు ఇంగ్లీష్ బాగా వచ్చుగా అర్ధమవుతుంది... ఘట్టమనేని శ్రీనివాస్ అనే IPSని (చిత్తూర్ SP గా పని చేసారు) ఇక్కడ వేసారు... ఎర్ర చందనం మాఫియా తుక్కు రేగకొట్టాడు. ఎర్ర చందనం మాఫియా హిట్ లిస్ట్ లో సీఎం కంటే ముందు ప్లేస్ లో వున్నాడు.... 20 మంది ఎర్ర చందనం స్మగ్లర్లని ఎన్కౌంటర్ చేపించిన చరిత్ర మా ప్రభుత్వానిది...

pavan aropanalu 15032018 1

ఇక మా రాష్ట్రంలో పర్యావరణానికి హాని కలుగుతుంది అంటున్నారు... మీకు ఇంకా తెలియదు ఏమో, లేక మీకు స్క్రిప్ట్ రాసిన వారికి తెలియదు ఏమో... ఇండియా స్టేట్ అఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2017 ప్రకారం, మా రాష్ట్రం ఫారెస్ట్ ఏరియా కవర్ పెరుగుదలలో మొదటి స్థానంలో ఉంది...

pavan aropanalu 15032018 1

ఇక ఫాతిమా కాలేజీ విద్యార్ధుల సంగతి... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతలా వారి కోసం, చేసిందో మీకు తెలియదా ? మొన్నటి దాకా మీ ఫ్రెండ్ కామినేని శ్రీనివాస్ మీ పక్కనే ఉంటూ, అన్నీ చెప్పారు కదా... సుప్రీమ్ కోర్ట్ కొట్టేసింది.. చెయ్యల్సింది కేంద్రం.. సీట్లు వేరే కాలేజీల్లో సద్దుతాం అని రాష్ట్రం అంటున్నా, మీ కొత్త స్నేహితుడు మోడీ వద్దు అన్నాడు... కేంద్రం కోర్ట్ కి వెళ్తే, సుప్రేం కోర్ట్ వద్దు అంటుంది... మీరు ఎవర్ని నిందించాలి ?

ఉచిత ఇసుక దోపిడీ అంటున్నారు... ప్రభుత్వం ఉచిత ఇసుక అంది... అంటే, కావలసిన వారు లారీ వేసుకుని వెళ్లి, అక్కడ ఇసుక నిబంధనలు ప్రకారం లోడ్ చేసుకుంటే ఫ్రీ... కాని అది అందరికీ కుదరదు కదా ... లారీకి డబ్బులు కట్టాలి, అక్కడ లోడ్ చేసి కూలి వాళ్ళకు డబ్బులు కట్టాలి... ఈ క్రమంలో మధ్యలో వాళ్ళని అప్రోచ్ అవుతారు... మీరు అన్నట్టు 15 వేలు అయితే ఎక్కడా లేదు, 6-7 వేలల్లోనే ఇసుక దొరుకుతుంది...

ఇక స్పెషల్ స్టేటస్ గురించి మాట మార్చారు మా ముఖ్యమంత్రి అంటున్నారు... మాట మార్చింది మీ కొత్త స్నేహితులు... ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి లేదు, ప్యాకేజీ ఇస్తాం, రెండు సమానమే అంటే, మన రాష్ట్రం ఉన్న పరిస్థుతుల్లో కేంద్రం తెగేసి చెప్తే, ముఖ్యమంత్రి సరే అన్నారు... ఆ రోజు కూడా, నాకు హోదా ఇస్తే సంతోషం, కాని కుదరదు అంటున్నారు,అందుకే ఒప్పుకున్నా అన్నారు... కాని, ఇప్పుడు మీ కొత్త స్నేహితులు, ప్యాకేజీ ఇవ్వలేదు, పైగా మిగతా రాష్ట్రాలకి హోదా కొనసాగిస్తున్నారు.. మా ముఖ్యమంత్రి అడిగేది ఇది... ఇవ్వం అని చెప్పి, వాళ్లకి ఎందుకు ఇచ్చారు ? మా హక్కుగా ఇచ్చింది, ఇవ్వండి అంటూ, మీ అందరి కంటే ముందే కేంద్రం పై ఎదురు తిరిగారు... మీరు మోడీ అనే పదం పలికి ఆరు నెలలు అయ్యింది... ఎందుకో మీరే చెప్పాలి... కాబట్టి కేంద్రం మాట మార్చింది కాబట్టి, మా ముఖ్యమంత్రి వైఖరి మారింది...

pavan aropanalu 15032018 1

చివరగా నిన్న మా యువతని బాగా రెచ్చగొట్టారు... ఉద్యోగాలు లేవు అన్నారు. ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ల నుంచి పైసా పెట్టుబడి రాలేదు అన్నారు... మీ కొత్త స్నేహితుడు, పార్లమెంట్ లో చెప్పింది సార్ ఇది..చూడండి... నాలుగేళ్లల్లో మొత్తం 2680 ఎంవోయూలు కుదిరాయని, రూ.17,80,891 కోట్లు మేర పెట్టుబడులు రానున్నాయని, తద్వారా 41,99,357 మందికి ఉపాధి లభించనుందని వివరించారు. ఈ నాలుగు ఏళ్ళలో, 531 కంపెనీలు మొదలు పెట్టారని, వాటి విలువ 1,29,661 కోట్లు అని, పరిశ్రమల రాకతో ఏపీలో ఇప్పటి వరకు 2,64,754 మందికి ఉపాధి లభించిందని లిఖిత పూర్వకంగా వెల్లడించారు..

pavan aropanalu 15032018 1

నాలుగేళ్ళు చంద్రబాబు ఏమి చేస్తాడా చూసాను అని, ఏ బాధ్యతా లేని మీరు ఎలా అన్నారో, అలాగే 5 కోట్ల మందికి ప్రతినిధిగా బాధ్యతగా కేంద్ర వైఖరిలో మార్పు కోసం, మా ముఖ్యమంత్రి ఎదురు చూసారు... మీ విషయంలో ఉన్న లాజిక్, ఇక్కడ కూడా వర్తిస్తుంది... ఇక రాజకీయ అవినీతి అనేది అంతం లేనిది... కాని, మా రాష్ట్రంలో అది అంతగా లేదు అని చెప్పగలం.. కులాల గురించి, మీరు, మీ అన్నయ్య గారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది... కుల రాజకీయాలు లేకపోతే, నిన్న మీ సభలో పావు వంతు జనం కూడా వచ్చే వారు కాదు... రాజకీయంగా మీరు ఎన్ని విమర్శలు అయినా చేసుకోండి... ఢిల్లీతో చేతులు కలిపి, మా రాష్ట్ర ప్రతిష్ట గురించి, మా అమరావతి పై విషం చిమ్ముతూ, మా భవిషత్తు తరాల కోసం కష్టపడే మా ముఖ్యమంత్రిని అంటే మాత్రం, చూస్తూ కూర్చోం...

Advertisements

Latest Articles

Most Read