పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలోనూ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శాసనమండలిలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై చంద్రబాబు మాట్లాడుతూ కేంద్రం పై ఫైర్ అయ్యారు... ఆంధ్రప్రదేశ్‌ భారతదేశంలో భాగం కాదా? అంటూ, అమరావతి నుంచి ఢిల్లీలో ఉన్న కేంద్రానికి కడిగి పడేసారు... మేమేమి గొంతెమ్మ కోర్కెలు కోరటం లేదని, చట్టంలో ఉన్న వాటినే అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని, అయినా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు.

cbn modi 12032018 2

రాష్ట్ర ఆర్థిక లోటుపై ఆయన స్పందిస్తూ కొంతమంది కావాలనే దాన్ని వివాదం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి రూ.16,700కోట్ల లోటుంటే రూ.4వేల కోట్లే ఇచ్చారని ఆయన అన్నారు. కేంద్రం ఇవ్వాల్సిన పెన్షన్లు కూడా రాష్ట్రానికి సరిగా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి రావాల్సిన వాటిపై అసెంబ్లీ స్పష్టం చేశారు. విశాఖ రైల్వేజోన్ ఎందుకు ఇవ్వడం లేదు? రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఊసే లేదు. కడపలో ఉక్కు కర్మాగారం హామీలను కేంద్రం పట్టించుకోవడం లేదు అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు...

cbn modi 12032018 3

11 జాతీయ విద్యాసంస్థలకు నాలుగేళ్లలో రూ.400కోట్లే ఇచ్చారు. ఐదేళ్లయినా ఒక్కదానికీ సొంత భవనం లేదు. ప్రైవేటు వ్యక్తులకు భూములిస్తే ఆరునెలల్లో పనులు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వానికి భూములిస్తే ఇంతవరకు ప్రారంభం కాలేదు. కృష్ణపట్నం పోర్టు వల్ల వచ్చే ఆదాయం ఇంకా తెలంగాణకే పోతోంది. విజయవాడ, విశాఖ మెట్రో రైలు సాధ్యం కాదన్నారు. రూ.40 వేల కోట్ల భూములను రైతులు రాజధానికి ఇచ్చారు. రాజధానికి రూ.1500 కోట్లు ఎలా సరిపోతాయి? ఏపీకి రాజధాని నగరం అవసరం లేదా? సహాయం చేయకపోగా విమర్శించడం, వెక్కించడం సబబా? హైదరాబాద్‌లో ఎన్నో పరిశోధనా సంస్థలు ఉన్నాయి. ఏపీకి ఉదారంగా కేంద్ర సంస్థలు ఎందుకివ్వరు? ఏపీ భారతదేశంలో భాగం కాదా? అంటూ కేంద్రాన్ని నిలదీశారు...

ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్పే టీడీపీ పార్టీ నేత జెసి దివాకర్‌రెడ్డి, అందరి మీద ఎలా సెటైర్‌లు వేస్తారో చూస్తుంటాం... అలాంటి దివాకర్‌రెడ్డి పై, ఈ రోజు ముఖ్యామంత్రి చంద్రబాబు సెటైర్ వేసారు... పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకుండా తనను కలవడానికి వచ్చిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పై సెటైర్‌ వేస్తూ, ‘‘బడి ఎగ్గొడితే ఫెయిలవుతారు’’ అంటూ చురకలు అంటించారు.. జేసీ పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకపోవడం పై చంద్రబాబు పై విధంగా స్పందించారు.. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీల్లో జరిగింది..

diwakar 12032018 2

దీంతో జెసి దివాకర్‌రెడ్డి కూడా, అదే స్థాయిలో తిరిగి కౌంటర్ వేసారు.. "తాను ఎప్పుడూ ఫెయిల్ కానని.. బడికి ఎగ్గొట్టిన వారు.. బ్యాక్ బెంచ్‌లో కూర్చున్న వారు ఉన్నత స్థానానికి ఎదిగారు’’ అంటూ సీఎం వేసిన సెటైర్‌కు జావాబు ఇచ్చారు... ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం అసెంబ్లీ లాబీ జేసీ మీడియాతో మాట్లాడుతూ ఈ సరదా సంభాషణ గురించి చెప్పారు... అలాగే, తనకు తనకు రాజ్యసభకు వెళ్లాలనే ఆలోచన లేదని చెప్పారు... ఎంపీగానే పోటీ చేస్తానని, పార్లమెంట్ కే వెళ్తానని చెప్పారు..

diwakar 12032018 3

మరో పక్క, టీడీపీ ఎంపీలు ఈ రోజు కూడా ఢిల్లీలో ఆందోళన చేసారు... సభ బయట, లోపల కూడా ఆందోళనలు కొనసాగించారు... ఏపీని ఆదుకోవాలని, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉభయ సభల్లోనూ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఫ్లకార్డులతో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి సభ్యులు నిరసన తెలిపారు. సభాపతి ఎంత సర్దిచెప్పినప్పటికీ సభ్యులు వినలేదు. దీంతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలగడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మంగళవారం నాటికి వాయిదా వేశారు. రాజ్యసభ ఈ రోజు రెండు గంటలకు వాయిదా పడింది...

రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం జగన్ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే... రోజు రోజుకీ దిగజారుతూ, శాశ్వతం తన పార్టీని సమాధి చేసే పనిలో ఉన్నాడు... చివరకు పాదయాత్ర లాంటి యాత్రలు చేస్తున్నా, కనీస స్పందన లేదు... ఎక్కడా మైలీజి లేదు... నిజానికి ప్రభుత్వం పై పోరాడటానికి ఎన్నో అవకాశాలు ఉన్నా, జగన్ మాత్రం తన సెల్ఫ్ గోల్స్ తో, అవకాశాలు వదులుకుని, తన మెడకే చుట్టుకునేలా చేసుకుని, ప్రజల్లో చులకన అవుతున్నాడు... అమరావతి నుంచి పట్టిసీమ దాకా, ఇలా ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్ట్ లని కూడా వ్యతిరేకిస్తూ ముందుకు పోతున్నారు... చివరకు అసెంబ్లీకి కూడా రాకుండా, బయట తిరుగుతున్నాడు...

jagan 12032018 3

ఇలా తల తిక్క నిర్ణయాలతో, చాలా మంది నాయకులు పార్టీని వీడి వచ్చేస్తున్నారు... బొత్సా, రోజా, కొడాలి నాని లాంటి మహా ఘనులు తప్ప, ఆ పార్టీలో చెప్పోకో దగ్గ నేతలు లేరు.. జగన్ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, జగన్ కొత్త స్నేహితుడు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జగన్ ను పొగడ్తలతో ముంచెత్తారు.. జగన్ కు కొన్ని అంశాల్లో తిరుగులేని మద్దతు వస్తోందని అన్నారు... జగన్ ఏంతో పోరాడుతున్నారని, జగన్ పై పొగడ్తల వర్షం కురిపించారు... అందుకే, చంద్రబాబు, జగన్ కు భయపడి ఏమి చెయ్యాలో తెలియక, హోదా అంటూ, ప్యాకేజీ అంటూ హడావిడి చేస్తున్నారని బీజేపీ నాయకులు అంటున్నారు...

jagan 12032018 3

విజయవాడలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేసారు... బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాటలు విన్న జగన్, ఆనందంతో కన్నీళ్లు కారుస్తూ సంతోషాన్ని ప్రకటించారని వైసిపీ వర్గాలు అంటున్నాయి... జగన్ కళ్ళ వెంట ఆనంద భాష్పాలు వచ్చాయని, ఇన్నాళ్ళు నేను చేస్తున్న పోరాటాలు ప్రజలు గుర్తించలేదు, మీడియా గుర్తించలేదు, చివరకి సొంత పార్టీ నేతలు కూడా గుర్తించలేదు, కాని మొదటి సారి మన కొత్త స్నేహితుడు నన్ను అర్ధం చేసుకున్నారు అంటూ, జగన్ కళ్ళ వెంట ఆనంద భాష్పాలు వచ్చాయని వైసిపీ వర్గాలు చెప్తున్నాయి...

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిరునామా త్వరలోనే, అమరావతి కానుంది. గుంటూరు జిల్లా కాజా టోల్‌గేట్ సమీపంలో నూతన నివాసానికి పవన్ కల్యాణ్ సోమవారం ఉదయం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. పవన్ కల్యాణ్ పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టిపెట్టారు. ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి రాజకీయాలు చేస్తున్న ఆయన ఇక నుంచి అమరావతి కేంద్రంగా పార్టీ కార్యకలాపాలు సాగించనున్నారు. సతీసమేతంగా భూమి పూజలో పాల్గొన్న పవన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు...

pawan 12032018 2

ఇటీవల జగన్ చేసిన కామెంట్లపై కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో జనసేన అంతర్భాగమని, ఆ పార్టీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చంద్రబాబేనని, ఆయన ఆదేశాలతోనే జనసేన పనిచేస్తోందని జగన్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ, "జనసేనకు చంద్రబాబు అయితే వైసీపీకి మోదీ, కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం చేస్తున్నారు అనుకోవాలా?" అంటూ జగన్ కు పంచ్ వేసారు. ఒక విమర్శ చేయడం ఎంతో సులభమని, దానికన్నా ముందు నిజానిజాలను తెలుసుకోవాలని హితవు పలికిన ఆయన, రాజకీయ నాయకులు ఆలోచించి మాట్లాడాలని సూచించారు. సాధ్యమైనంత త్వరలోనే ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయించి, ఇక్కడకు మారిపోతానని పవన్ స్పష్టం చేశారు.

pawan 12032018 3

పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దృష్టి సారించనున్నారు. అందుకే హైదరాబాద్ నుంచి కాకుండా సొంత రాష్ట్రం నుంచే తన కార్యక్రమాలు సాగించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను కూడా గుంటూరులో నిర్వహించనున్నారు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర కార్యాలయం కోసం మంగళగిరి సమీపంలో స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. ఇప్పుడు శాశ్వత నివాసాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేసుకోనున్నారు. అమరావతికి దగ్గరగా ఉండాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని చెప్పిన పవన్ కల్యాణ్, ఏవైనా తప్పులు జరిగినప్పుడు వెంటనే తన దృష్టికి తీసుకురావాలంటే రాష్ట్ర ప్రజల మధ్య ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read