ఆంధ్రప్రదేశ్ ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి పేరుతో ఆందోళన చేస్తున్న, సినీ హీరో శివాజీ మొదటిసారి జగన్ పై ఫైర్ అయ్యారు.... మొన్న ఢిల్లీలో వైసిపీ జరిపిన ఆందోళన, జగన్ ప్రసంగాల గురించి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబుని నిత్యం తిడుతూ ఉంటే లాభం ఏంటి ? ఒక్కసారైనా మోడీని విమర్శించరా ? ప్రతిపక్షంలో ఉంటూ కూడా, కేంద్రం పై డైరెక్ట్ గా ఎందుకు పోరాడటం లేదు ? ఢిల్లీలో ఆందోళన మంచిదే, కాని కనీసం మోడీని అడుగుతూ ఒక్క పోస్టర్ అన్నా, ఒక్క ప్రసంగం అన్నా ఇంగ్లీష్ లో ఉందా ? అంటూ జగన్ పై మండి పడ్డారు శివాజీ...

modi 07032018

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏపీకి ప్ర‌త్యేక హోదా గురించి మాట్లాడుతూ చంద్ర‌బాబుని విమ‌ర్శిస్తాడేంట‌ని సినీన‌టుడు, ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి నేత శివాజీ ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ బీజేపీ గురించి ఎందుకు మాట్లాడ‌డం లేద‌ని నిల‌దీశారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి పోరాడుతుంటే కూడా జ‌గ‌న్ మ‌ద్ద‌తు తెల‌ప‌డంలేద‌ని అన్నారు. ప్ర‌త్యేక హోదా కోసం కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీయ‌డం లేద‌ని విమ‌ర్శించారు.

modi 07032018

అలాగే గవర్నర్ ఫై కూడా విమర్శలు చెసాఉ... రాష్ట్రానికి పట్టిన అతిపెద్ద శని గవర్నర్‌ నరసింహనేనని నటుడు శివాజీ ఫైర్ అయ్యారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ గవర్నర్ నరసింహన్‌ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు... తెలంగాణ త‌ర‌హాలో ఉద్యమం చేస్తే ప్ర‌త్యేక హోదా సాధించుకోవ‌చ్చ‌ని అన్నారు. నాయకులు హోదా కోసం పోరాడితే ప్ర‌జ‌లు వారి వెన‌కాలే ఉంటార‌ని అన్నారు.

ఇనుముని కూడా నానబెట్టే అంత ఓర్పు ఉండే చంద్రబాబుకే విసుగు పుట్టించారు ఢిల్లీ పెద్దలు... చేసేది లేదు అని లీకులు ఇస్తూ, చివరకు మన సెంటిమెంట్ ను, ఆత్మాభిమానాన్ని కూడా కించ పరుస్తూ లీకులు ఇవ్వటంతో, చంద్రబాబు కూడా విసుగెత్తిపోయారు.. వారు ఆన్ రికార్డు చెప్పగానే, మనం నిర్ణయం తీసుకుందాం అంటూ నేతలను రెడీ చేస్తున్నారు... ఢిల్లీలోని ఏపీ ఎంపీలు, కేంద్రమంత్రులతో ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని నిన్న జరిగిన టీడీఎల్పీలో 95శాతం ఎమ్మెల్యేలు చెప్పిన విషయాన్ని ఎంపీలకు చంద్రబాబు తెలియజేశారు. ప్రజాభిప్రాయం కూడా ఇదే అని చెప్పారు...

cbn center 07032018 2

కేంద్రం ఇలా లీకులు కాకుండా, వారు మన హామీల పై పార్లిమెంట్ వేదికగా స్పందిచేలా చెయ్యండి... వారు అఫిషయల్ గా చెప్పగానే, మనం నిర్ణయం తీసుకుందాం... రెడీగా ఉండండి అంటూ ఎంపీలను సమాయత్తం చేసారు... ఏపీ విషయంలో కేంద్రం వైఖరిపై టీడీపీ ఎంపీలు కూడా అసహనం వ్యక్తం చేశారు. యూసీలు ఇవ్వడం లేదన్న కేంద్రం వ్యాఖ్యలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. యూసీలు ఇవ్వడంలో దేశంలో మూడోస్థానంలో ఏపీ ఉందని గుర్తు చేశారు. .. పోలవరానికి ఇచ్చిన నిధులకు ఎప్పటికప్పుడు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పిస్తున్నామని, యూసీలు ఇవ్వకుండా నిధులు ఎలా ఇస్తున్నారని సీఎం ప్రశ్నించారు.

cbn center 07032018 3

రెవెన్యూలోటు కింద ఇచ్చిన నిధులపై యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని, కేంద్ర సంస్థలకు ఇచ్చిన రూ.600కోట్లకు యుటిలైజేషన్ సర్టిఫికెట్‌లు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం, వాటి ఆధ్వర్యంలో ఉన్న శాఖలని గుర్తుచేశారు. ఇదే విషయాన్ని ఢిల్లీలోని జాతీయమీడియాతో చెప్పాలని ఎంపీలకు ఆదేశించారు. మరోవైపు రాజ్యసభలో విజయసాయి వ్యవహారశైలిపై టెలికాన్ఫరెన్స్‌లో చర్చకు వచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీలు పోరాటం చేస్తుంటే విజయసాయి కనీసం సీటు నుంచి కదలలేదన్న విషయాన్ని చంద్రబాబుకు ఎంపీలు తెలియజేశారు. సభలో ప్రధాని ఉంటే గాంధీ విగ్రహం దగ్గర, ప్రధాని లేకపోతే సభలో ఆందోళన చేస్తున్నారని చంద్రబాబుకు ఎంపీలు చెప్పారు. వైసీపీ వైఖరి ఏంటో ఇప్పటికే ప్రజలకు తెలిసిపోయిందని ఎంపీలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ చేసిన ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 'తక్షణమే ఏవైనా నిర్ణయాలు తీసుకుందామా? కొంత కాలం వేచి చూసి కేంద్ర ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తూ ఒత్తిడి పెంచుదామా?' అని చంద్రబాబు తమ నేతలను అడిగారు.

cbn 05032018 2

బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని మెజార్టీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. సమావేశంలో కేంద్రం లీకులపై టీడీఎల్పీలో వాడివేడి చర్చ సాగింది. బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలా?...కొంతకాలం కొనసాగాలా? అని ఎమ్మెల్యేల నుంచి సీఎం అభిప్రాయాలు కోరారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యేలు.. బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని తేల్చిచెప్పేశారు. అయితే కేవలం ఐదారుగురు ఎమ్మెల్యేలు మాత్రమే పొత్తు కొనసాగాలని చెప్పడం గమనార్హం. 95శాతం మంది పొత్తు వద్దు అనటంతో చంద్రబాబు ఆశ్చర్యపోయారు...

cbn 05032018 3

కేంద్రం ఇలా ఎందుకు చేస్తుందో అర్థంకావడం లేదని సీఎం తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. ఇచ్చిన హామీలనే అమలు చేయాలని పదేపదే కోరుతున్నామన్నారు. అందరూ హోదా కోసం పట్టుబట్టాలని టీడీపీ నేతలకు ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు కేంద్రం లీకులపై టీడీఎల్పీలో ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే కొన్ని ఇబ్బందులు వస్తాయని ఎమ్మెల్యేలకు బాబు వివరించారు. పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు ఆగిపోతాయని చంద్రబాబు చెప్పడంతో.. అయినా సరే ఇబ్బందులు ఎదుర్కొందామని ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇచ్చేది లేదని, ఆంధ్రప్రదేశ్‌కు పన్ను రాయితీలు ఇచ్చే అవకాశాలు లేవని, ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన రాయితీలు ఏపీకి ఇస్తే, ఇతర రాష్ట్రాలు కూడా అడుగుతాయని కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం సాయంత్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన అనంతరం టీడీఎల్పీ సమావేశం జరిగింది. సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై కీలక వ్యాఖ్యలు చేశారు.! తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నామని, రాజీపడే ప్రసక్తేలేదని అన్నారు.

cbn 07032018 2

బీజేపీతో తెగదెంపులు చేసుకుందామని కొందరు టీడీపీ నేతలు సూచించిన నేపథ్యంలో వారికి అనుకూలంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. " కేంద్ర సహకారం లేకుండా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు లేవా?. కేంద్ర సహకారం లేకుండా వరుసగా గెలుస్తున్న పార్టీలు లేవా?. కేంద్ర సహకారం లేకుండా సీఎంలు అవుతున్న వారు లేరా?. సందిగ్ధం వద్దు... ప్రత్యేక హోదానే మన విధానం. హోదా ఇవ్వాల్సిందే... లేకుంటే మనమంతా పోరాడాల్సిందే" అని చంద్రబాబు పార్టీ నేతలకు తేల్చిచెప్పేశారు. బీజేపీతో విడిపోయే అంశంపై ఆయన చర్చిస్తున్నారు.

cbn 07032018 3

అయితే ఇదే సందర్భంలో బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని మెజార్టీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. సమావేశంలో కేంద్రం లీకులపై టీడీఎల్పీలో వాడివేడి చర్చ సాగింది. బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలా?...కొంతకాలం కొనసాగాలా? అని ఎమ్మెల్యేల నుంచి సీఎం అభిప్రాయాలు కోరారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యేలు.. బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని తేల్చిచెప్పేశారు. అయితే కేవలం ఐదారుగురు ఎమ్మెల్యేలు మాత్రమే పొత్తు కొనసాగాలని చెప్పడం గమనార్హం.

Advertisements

Latest Articles

Most Read