మోడీ వల్లే, కియా కార్ల కంపెనీ మన రాష్ట్రానికి వచ్చింది అని, నిస్సిగ్గుగా వాదిస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలకి, ముఖ్యంగా తన ఫేస్బుక్ పేజీలో మోడీ వల్లే, కియా వచ్చింది అని పెట్టుకున్న పురందేశ్వరి గారికి, చంద్రబాబు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు... విశాఖ‌ప‌ట్నంలో నిర్వ‌హించిన భాగ‌స్వామ్య స‌ద‌స్సు వివరాలు వివరించటానికి, నిన్న అమ‌రావ‌తిలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు మాట్లాడారు... ఈ సందర్భంగా, కియా మోటార్స్ గురించి చంద్రబాబు చెప్పారు... చాలా మంది కళ్ళు తెరిపించేలా మాట్లాడారు.. అయినా వారు వినరు అనుకోండి... ప్రజలకు తెలియాలి కదా...

cbn kia 28022018 2

ఆయన మాటల్లో "ఇక్కడ కియా మోటార్స్ కోసం ఏ రాష్ట్రం ట్రై చెయ్యలేదా ? అన్ని రాష్ట్రాలు పోటీ పడలేదా ? మరి మన రాష్ట్రానికి, ఇంత పోటీ తట్టుకుని ఎట్లా వచ్చింది ? ఇది మన మీద ఉండే కాన్ఫిడెన్సు... కియా మోటార్స్ రాకుండా, చాలా మంది అడ్డుపడ్డారు... మభ్యపెట్టారు... కాని, వాళ్ళు కూడా అన్నీ ఆలోచించారు... అన్ని రాష్ట్రాల కంటే, ఠిస్ ఇస్ ది మోస్ట్ స్టేబిల్ గవర్నమెంట్.. చాలా ప్రో ఆక్టివ్ గా ఉన్నారు, అని అన్నీ చూసుకుని మన దగ్గరకు వచ్చారు..." అంటూ చంద్రబాబు కియా మోటార్స్ వచ్చిన విధానం పై చెప్పారు...

cbn kia 28022018 3

గత కొద్ది రోజుల నుంచి, రాష్ట్ర బీజేపీ నేతలు సిగ్గు అనేది పూర్తిగా వదిలేసి, ఏమాత్రం ప్రజలు ఏమనుకుంటారో అనేది కూడా లేకుండా, చంద్రబాబు ఎంతో కష్టపడితే తెచ్చిన కంపెనీని, మోడీ వల్లే రాయలసీమలో పెట్టారు అంటూ, ఒక ఫేక్ ఇమేజ్ పట్టుకుని ప్రచారం మొదలు పెట్టారు... నిన్న పురందేశ్వరి లాంటి నాయకురాలు కూడా, మోడీ వల్లే వచ్చింది అంటూ, నిస్సిగ్గుగా, చంద్రబాబు కష్టాన్ని, మోడీ ఖాతాలో వేసారు.. చంద్రబాబు మాత్రమే కాదు, ఇది వరకు తమిళనాడుకి చెందిన ఒక కన్సల్టెంట్, కియా అన్ని రాష్ట్రాలను కాదని, ఆంధ్రప్రదేశ్ కి ఎలా వచ్చిందో క్లియర్ గా చెప్పారు... అది అప్పట్లో, బాగా వైరల్ అయ్యింది కూడా... ఇప్పటికే, ఇలాగే ఫేక్ ప్రచారం చేసుకుంటూ మోడీని లేపుదాం అనుకుంటే, ఇది 2014 కాదు, మేము ఉత్తరాది వాళ్ళం కాదు... లెక్కకు లెక్క సరైన సమయంలో అప్ప చెప్తాం... కియా మోటార్స్ మా ముఖ్యమంత్రి కష్టం... వారి మాటల్లో వినండి...

మన రాష్ట్రంలో బీజేపీ నేతలు, అయ్యో రాయలసీమకు అన్యాయం జరిగిపోతుంది అంటూ, హైదరాబాద్ స్టూడియోల్లో కూర్చుని ప్రజలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు... మరో పక్క, ఇప్పటికే కృష్ణా నది నుంచి సరిపాడా నీరు రాక, పట్టిసీమ అని, అది అని, ఇది అని, కిందా మీద పడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్రంలో నీటి కష్టాలు లేకుండా, జాగ్రత్తలు తీసుకుని, ఈ మధ్య కాలంలో ఎప్పుడూ రానన్ని నీరు రాయలసీమకు ఇచ్చారు.... మరో పక్క, ఇవే నీరు చూపించి, కియా లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా, రాయలసీమకు వచ్చేలా చేసారు చంద్రబాబు... అయితే, ఇప్పుడు కర్ణాటక బీజేపీ తీసుకున్న నిర్ణయం, రెండు తెలుగు రాష్ట్రాల పై, పిడుగు లాంటి వార్త అయ్యింది..

karnataka bjp 28022018

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే కృష్ణానది పై నిర్మించిన ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం బి.ఎ్‌స.యడ్యూరప్ప ప్రకటించారు.... అంటే ప్రస్తుతం, 120 టియంసీలుగా ఉన్న డ్యాం కెపాసిటీ, 200 టియంసీలకు చేరుకుంటుంది... ఇప్పుడున్న పరిస్థుతుల్లోనే నీరు మన రాష్ట్రానికి రావాలి అంటే, అక్టోబర్, నవంబర్ అవతుంది... మరి ఇంకా ఎత్తు పెంచితే, ఇక కృష్ణా నది అనేది ఒకటి ఉంది అని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోవాల్సిందే... ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర నష్టం వచ్చేలా, ఇలాంటి దారుణమైన నిర్ణయం తీసుకుంది కర్నాటక బీజేపీ...

karnataka bjp 28022018

మరి రాయలసీమకు అన్యాయం జరిగిపోతుంది, చంద్రబాబు ఏమి పట్టించుకోవటం లేదు, అని ఎగిరిన రాష్ట్ర బీజేపీ నేతలు, ఇప్పుడేమంటారు ? మీ యడ్యూరప్పని ఎదిరించే ధైర్యం ఉందా ? ఇలాంటి ప్రకటన, ఆలోచన చెయ్యవద్దు అని, మా రాయలసీమకు అన్యాయం జరుగుతుంది అని, అమిత్ షా తో చెప్పే దమ్ము ఉందా ? మా రాయలసీమ మట్టి కొట్టుకుపోతుంది అని, మీ సొంత బీజేపీ నేతలతో పోరాడే ధైర్యం ఉందా ? లేకపోతే దీన్ని కూడా సమర్ధిస్తారా ? చంద్రబాబు పట్టిసీమ కట్టాడు, ఇంకా కృష్ణా నదితో పని ఏంటి, అని సోము వీర్రాజు వచ్చి అంటాడా ? ఎందుకంటే నిన్న హోదా ఎందుకు, ఇన్ని కంపెనీలు వస్తుంటే అన్నాడుగా... అదే లాజిక్ ప్రకారం, కృష్ణా నదిని, కర్ణాటకకు దానం చేద్దాం అంటాడా ?

విశాఖ వేదికగా మూడు రోజులపాటు జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో పెట్టుబడులు రాలేదు.. తప్పుడు లెక్కలు చూపిస్తున్నారంటూ కొందరు చేస్తోన్న విమర్శలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. విశాఖలో భాగస్వామ్య సదస్సు వివరాలను ఆయన అమరావతిలో మీడియాకు వెల్లడించారు. ఇదే సందర్భంలో జగన్ పై, ఒక కొత్త డౌట్ లేవనెత్తారు చంద్రబాబు... జగన్, హోదా తప్ప వేరే అంశం మాట్లాడటం లేదు, దీంట్లో మర్మం ఏమిటో అని అన్నారు... పోలవరం గురించి ఎందుకు మాట్లాడాడు అని అన్నారు...

cbn doubt 27022018 2

హోదా సెంటిమెంట్ తో రాజకీయలాభం పొందాలని జగన్ చూస్తున్నాడని ముఖ్యమంత్రి చంద్రబాబు దుయ్యబట్టారు... విభజన చట్టం లోని 19 అంశాలతో పటు, మన్మోహన్ సింగ్ ఇచ్చిన 6 హామీలలో 5 వదిలేసి, కేవలం దాను మాత్రమే సెంటిమెంట్ గా పెంచి లబ్ది పొందాలని ప్రయత్నం చేస్తోంది అని అన్నారు.. ఏ నాడు పోలవరం గురించి మాట్లాడడు, ఆర్ధిక లోటు గురించి మాట్లాడడు, EAP ప్రాజెక్ట్ లలో రావాల్సిన నిధులు గురించి మాట్లాడడు, హైదరాబాద్ లో ఉన్న ఉమ్మడి ఆస్తుల విభాజన్ గురించి మాట్లాడడు, కేవలం ప్రజల్లో భావోద్వేగం రగిలించటానికి, హోదా అంటాడు అంటూ, దుయ్యబట్టారు.. జగన్ కు రాజకీయ లాభాలు తప్ప, రాష్ట్ర ప్రయోజనం వారికి పట్టదనేది రుజువైంది అని చంద్రబాబు అన్నారు..

cbn doubt 27022018 3

విభజనచట్టంలో పేర్కొన్నవన్నీ కేంద్రం ఇవ్వాల్సిందేనని చంద్రబాబు అన్నారు. తప్పించుకొనే ప్రయత్నం చేస్తే మాత్రం సరికాదని తెలిపారు. విభజన హామీలను సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలన్నారు. ఇందుకోసం సంఘటితంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి ఏమీ జరగలేదనడం సరికాదన్నారు. స్వశక్తితో మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని, మన పని మనం చేసుకుంటూనే కేంద్రంతో పోరాటం చేయాలన్నారు. నిర్మాణాత్మకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

మాజీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, ఐవైఆర్‌ కృష్ణారావు గతం మర్చిపోయారు... అవును, మీరు వింటుంది నిజమే... అమరావతిని ఆపటానికి, జే గ్యాంగ్ తో ప్లాన్ వేసి, స్విస్‌ చాలెంజ్‌ ఆపెయ్యమని కోర్ట్ లో కేసు వేసారు ఐవైఆర్‌.. నిన్న కేసు విచారణ సమయంలో, ‘స్విస్‌ చాలెంజ్‌ విధానంపై నోటిఫికేషన్‌ జారీచేసినపుడు మీరే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండి.. పదవీ విరమణ చేసిన తర్వాత ప్రజాహిత ప్రయోజనం (పిల్‌) ఎలా వేస్తారు? ఇందుకు సంబంధించిన నోట్‌ఫైల్‌పై ఆనాడు మీ అభ్యంతరాలు నమోదు చేశారా’ అని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావును హైకోర్టు నిలదీసింది.

iyr 28022018 2

ఈ విషయం తనకు అంతగా గుర్తులేదని.. అందుకు సంబంధించిన పత్రాలను సమాచార హక్కు చట్టం కింద తీసుకుని కోర్టుకు చెబుతానని ఆయన చెప్పడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘మీ హయాంలోనే రూపొందించిన ఈ విధానంపై అప్పుడు మీరు ఏం చేశారో తెలియదని మీరే చెబితే ఎలా? ప్రజాహిత వ్యాజ్యంలో ప్రజా ప్రయోజనాలు ఉండాలి.. వ్యక్తిగతం కాకూడదు. పిల్‌ నిబంధనలు ఏం చెబుతున్నాయో చదువుకోండి’ అని హితవు పలికింది. స్విస్‌ చాలెంజ్‌ విధానం రూపొందించినప్పుడు మీరు సీఎ్‌సగా ఉన్న విషయాన్ని పిల్‌లో ఎందుకు చెప్పలేదని కూడా ప్రశ్నించింది.

iyr 28022018 3

నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని ప్రశ్నిస్తూ.. ఐవైఆర్‌ కృష్ణారావు పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు వచ్చినపుడు, దీనిపై ఏపీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ..స్విస్ ఛాలెంజ్ విధాన్నాన్ని రూపొందించిన సమయంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించిన ఐవైఆర్ కృష్ణారావు విధాన నిర్ణయంలో భాగస్వామి అయినందు వల్ల, ఈ విధానాన్ని ప్రశ్నించే అర్హత లేదన్నారు. దీనిపై ప్రథమ నోటిఫికేషన్ నమూనాను మే, 2015లో జారీ చేసినట్లు తెలిపారు. ఈ అంశాలను అఫిడవిట్‌ లో ఎందుకు వివరించలేదని ధర్మాసనం ఐవైఆర్‌ ను ప్రశ్నించింది. దీనిపై ఐవైఆర్‌ స్పందిస్తూ ..ఆ సమయంలో తాను ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న విషయం వాస్తవమేనన్నారు. కానీఅఫిడవిట్‌ లో పేర్కొనలేదన్నారు. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో అదనప ప్రమాణ పత్రం దాఖలు చేస్తానని తెలిపారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.

Advertisements

Latest Articles

Most Read