గత 15 రోజుల నుంచి రాష్ట్రంలో అలజడి వాతావరణం.. ఎవరి రాజకీయ ప్రయత్నాలు వారివి... రాష్ట్ర ప్రయోజనాలు మాత్రం ఎవరికీ పట్టదు... హైదరాబాద్ లో కూర్చుని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేస్తూన్న వారు మరి కొందరు... ఇక మీడియా సంగతి చెప్పనే అవసరం లేదు... కాని, ఇన్ని ఇబ్బందులు మధ్య కూడా తనకు అప్పచెప్పిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్విహిస్తుంది మాత్రం, ఈ రాష్ట్రంలో ఒక్కరే ఒక్కరు... రాజకీయ ప్రయోజనాలు కంటే, ఆయనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం... అందుకే ఆయన ఫ్లో లో ఆయన ఉన్నారు... ఆయనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... 

ambani factory 13022018 2

ఇంత గొడవలు మధ్య కూడా దుబాయ్ వెళ్లి ఎమిరేట్స్ తో ఒప్పందం చేసుకుని వచ్చారు... ఇన్ని ఇబ్బందులు మధ్య కూడా, నెంబర్ వన్ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ సంస్థల అధినేతని, అమరావతి రప్పించారు... అంబానీ లాంటి పారిశ్రామిక వేత్త, ఊరికే రారు కదా... చంద్రబాబు ఆ విధంగా పావులు కదిపారు... రెండు నెలల క్రితం ఐటి శాఖ మంత్రి లోకేష్ ని పంపించి, ప్రాధమిక చర్చలు జరిపించారు... రెండు నెలలు తిరక్కుండానే, అంబానీ అమరావతిలో అడుగు పెట్టారు...

ambani factory 13022018 3

మహా శివరాత్రి పర్వదినాన, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ వినిపించారు ముకేష్ అంబానీ.... రియల్ టైం గవర్నెన్స్ ప్రశంసలు, చంద్రబాబు విజన్ ప్రశంసలు పక్కన పెడితే, ఈ రోజు అంబానీ మన రాష్ట్రంలో పెద్ద ఎత్తన పెట్టుబడి పెట్టబోతున్నారు.... తిరుపతిలో ఫోన్ల తయారీ కంపెనీ ఏర్పాటుకు సిద్ధమని అంబానీ ప్రకటించారు... నెలకు 10 లక్షల ఫోన్లు తయారు చేసే సామర్ధ్యం ఉన్న కంపెనీ ఏర్పాటు చేస్తామని చెప్పారు... ఇది సౌత్ ఇండియాలోనే అతి పెద్ద హార్డువేర్ మాన్యుఫాక్చారింగ్ ప్లాంట్ కానుంది... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వటమే ఆలస్యం అని, రెండు వారాల్లోనే శంకుస్థాపన చేసి పనులు మొదలు పెడతాం అని చెప్పారు...

ముకేష్ అంబానీ స్థాయి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయన ఒక కార్పొరేట్ దిగ్గజం... అలాంటి వ్యక్తి, ఈ రోజు తెలుగోడు దమ్ము ఏంటో చూసారు... చంద్రబాబు టెక్నాలజీ విప్లవం అంటే ఏంటో చూపించారు... ఆసియాలోనే అతి పెద్దదైన 66 అడుగుల పొడవైన వీడియో తెరపై.. దానిపై ఒకేసారి రాష్ట్రంలోని వందల ఊళ్లలోని సర్వెలైన్సు కెమెరాల నుంచి అక్కడ తాజా స్థితి ప్రత్యక్ష పసారం, మరోవైపు పరిష్కార వేదికద్వారా వందల మంది సిబ్బంది లక్షల్లో వస్తున్న ప్రజా ఫిర్యాదులపై స్పందిస్తున్న తీరు ప్రత్యక్షప్రదర్శన... ఇంకో వైపు పీపుల్స్ హబ్... ఈ ప్రగతి, తాళం వేసి ఉన్న ఇళ్లకు గస్తీ కాస్తున్న పోలీసు కెమెరా కళ్లు... వాతావరణ ప్రత్యక్ష స్థితి... ఒకటా, రెండా. ... అంబానీ ముందు ముందు రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక వినియోగంలో తనకున్న అపార అనుభవపాఠ సోయగాన్ని ప్రదర్శించారు చంద్రబాబు...

ambani 13022018 2

ఇవన్నీ చూసిన అంబానీ ముగ్ధుడయ్యారు. ఇటువంటి టెక్నాలజీ విదేశాల్లోనే కాదు.. ఎక్కడా లేదన్నారు... చంద్రబాబుకి, రియల్ టైం గవర్నెన్స్ టీంకి అభినందంనలు తెలిపారు... ఇలాంటివి దేశమంతటా రావాలని, అన్ని రాష్ట్రాలు ఇలాంటి సెంటర్స్ పెట్టుకోవాలని అన్నారు... ఫైబర్ గ్రిడ్ ద్వారా గ్రామాల్లో ఫోన్, ఇంటర్ నెట్, టీవీ మూడు ఒకే వైర్ ద్వారా ఇవ్వడం చాలా అరుదైన విషయమని ముకేష్ అన్నారు. సుమారు గంటకు పైగా ఈ సమావేశంలో, చంద్రబాబు, లోకేష్, ఐఏఎస్ అహ్మద్ బాబు, రియల్ టైం గవర్నెన్స్ సెంటర్‌ పని తీరుని వివరించారు...

ambani 13022018 3

దేశంలో మరే ఇతర రాష్ట్రం చేయని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రియల్ టైమ్ గవర్నెన్స్ అమలు చేస్తోంది. ఇందు కోసం అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఇటీవల, ఈ సెంటర్ చూసి ఆశ్చర్యపోయారు... ఢిల్లీ వచ్చి అన్ని రాష్ట్రాలకి ప్రెజెంటేషన్ ఇవ్వాలని చంద్రబాబుని కోరారు... ఇలాంటి చంద్రబాబుని, బీజేపీ అనుకూల జాతీయ మీడియా, మన ఘనత వహించిన హైదరాబాద్ మీడియా ఇలాంటి విజయాలు చూపించవు... చంద్రబాబు ఎక్కడ కోపంగా ఉన్నారు, లోకేష్ ఎక్కడ నోరు జారారు, ఏ పోలీసు స్టేషన్ లో ఏ కేసు నమోదైంది, ఆ కేసుని అడ్డు పెట్టుకుని, ఆంధ్రప్రదేశ్ మీద ఎలా విమర్శలు చెయ్యాలి లాంటి వార్తలే వేస్తారు... మన ఖర్మకు, మన సొంత మీడియా ఎప్పుడు వస్తుందో...

ఇవాళ అమరావతిలో పర్యటించనున్న ముఖేష్ అంబానీని రిసీవ్ చేసుకునేందుకు ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు... ఈ సందర్భంగా అక్కడ మీడియాతో లోకేష్ మాట్లాడుతూ, రాయలసీమలో జియో ఫోన్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని అంబానీని కోరామని చెప్పారు... వెనుకబడిన ప్రాంతం అయిన రాయలసీమలో, జియో ఫోన్ తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తే ఎంతో లాభం ఉంటుంది అని చెప్పారు... దానికి సంబంధించి ముకేష్ అంబానీ నిర్ణయం కోసం వేచి చూస్తున్నాం అన్నారు... రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానం పలుకుతామన్నారు...

jio 13022018 2

అయితే ఒక్కసారి చంద్రబాబు రంగంలోకి దిగితే, ఆ ప్రాజెక్ట్ ఓకే అయిపోయినట్టే అనే ప్రచారం అధికార వర్గాల్లో ఉంది... ఇప్పటికే అంబానీ గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు... అక్కడ లోకేష్, గన్నవరం ఎమ్మల్యే వంశీ స్వాగతం పలికారు... అక్కడ నుంచి హెలికాప్టర్ లో, వెలగపూడి హెలిపాడ్ దగ్గరకు చేరుకొని, అక్కడ నుంచి ప్రత్యెక కాన్వాయ్ లో సచివాయలం చేరుకున్నారు... ప్రస్తుతం, రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ లో అంబానీ ఉన్నారు.. రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ఎలా పని చేస్తుంది, అధికారులు వివరిస్తున్నారు...

jio 13022018 3

పెట్టుబడుల సమావేశం అయిపోయిన తరువాత, ముఖ్యమంత్రి నివాసంలో విందు భేటీలోనూ ముఖేష్ పాల్గుంటారు... తిరిగి 10 గంటలకు గన్నవరం చేరుకొని, ముంబై వెళ్తారు...ఈ భేటీలో పారిశ్రామిక రంగంతో పాటు, తాజా రాజకీయ పరిణామాలు కూడా చర్చించే అవకాసం ఉంది... ఇటీవల చంద్రబాబు, బీజేపీకు దూరం అవుతున్నారు అనే సంకేతాలు, దేశ వ్యాప్తంగా బలంగా వెళ్ళిన నేపధ్యంలో, ఆ విషయాలు పై కూడా, ఇరువురి మధ్య చర్చకు వచ్చే అవకాసం ఉంది... మొత్తానికి ముకేష్ అంబానీ ఎలాంటి పెట్టుబడులు పెడతారు, ఎంత పెడతారు అనే దాని పై, ఆసక్తి నెలకొంది...

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఉన్న, గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు పూర్తి సుముఖంగా ఉన్నామంటూ.. మార్చి 15 తర్వాత అధికారులు ప్రకటించనున్నారు. ఆ తర్వాత.. విమానయాన సంస్థలు సర్వీసులను విదేశాలకు ఇక్కడి నుంచి నడపొచ్చని ఆహ్వానించనున్నారు. ఆ తర్వాత ముందుకొచ్చే విమాన సంస్థలు.. 45 రోజుల ముందు షెడ్యూల్‌ను ప్రకటిస్తాయి. షెడ్యూల్‌ను విడుదల చేశాక టిక్కెట్ల అమ్మకం ప్రారంభమవుతుంది. మే నుంచి అంతర్జాతీయ సర్వీసులు గన్నవరం నుంచి నేరుగా విదేశాలకు నడవనున్నాయి. దీనికోసంఅవసరమైన సన్నద్ధతపై విమానాశ్రయంలో సోమవారం నిర్వహించిన ఇమ్మిగ్రేషన్‌ శిక్షణ తరగతుల కార్యక్రమంలో అధికారులు చర్చించి.. నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ విమానాశ్రయం అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉందంటూ మార్చి 15న జాయింట్‌ డిక్లరేషన్‌ను ప్రకటించాలని నిర్ణయించారు. ఈ డిక్లరేషన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి సైతం పంపించనున్నారు. ఆ తర్వాత విమానయాన సంస్థలతో ప్రభుత్వం సైతం సంప్రదింపులు జరుపుతుంది.

gannavaram 13022018 2

గన్నవరం విమానాశ్రయంలో ఇప్పటికే అంతర్జాతీయ టెర్మినల్‌ భవనం సిద్ధమైంది. గతంలో వినియోగించిన పాత టెర్మినల్‌ భవనాన్నే రూ.2 కోట్లను వెచ్చించి.. అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా మార్పులు చేశారు. మూడంచెల భద్రతా వ్యవస్థ, అంతర్జాతీయ సేవలు అందించేందుకు వీలుగా కస్టమ్స్‌, ఇమ్మిగ్రేషన్‌ కార్యాలయాలు, కన్వేయర్‌బెల్ట్‌లు, ఎక్స్‌రే బ్యాగేజీ యంత్రాలను పూర్తిస్థాయిలో అమర్చారు. ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్‌ సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బంది ఒక్కటే కొరత ఉంది. సోమవారం నుంచి 13మంది రాష్ట్ర పోలీసు సిబ్బందికి ఇమ్మిగ్రేషన్‌ సేవలు అందించేందుకు అనుగుణంగా శిక్షణను ప్రారంభించారు. 15 రోజుల్లో వీరికి శిక్షణ పూర్తయి.. సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంటారు. ఈలోగా ఇమ్మిగ్రేషన్‌ సేవల కోసం కేటాయించిన కార్యాలయంలో కంప్యూటర్లు, కేబుళ్లను ఏర్పాటు చేయడం పూర్తవుతుంది.

gannavaram 13022018 3

మరోవైపు కస్టమ్స్‌ విభాగం కూడా ఇక్కడి నుంచి సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. కస్టమ్స్‌ డీసీ శ్రీకాంత్‌, ఫారినర్‌ రీజినల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌(ఎఫ్‌ఆర్‌ఆర్‌వో) భాస్కర్‌రెడ్డి తదితరులు సోమవారం అంతర్జాతీయ టెర్మినల్‌, ఏర్పాట్లను పరిశీలించారు. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) తరఫున అన్ని రకాల సిద్ధంగా ఉన్నామని విమానాశ్రయ అధికారులు వారికి వివరించారు. ఫిబ్రవరి నెలాఖరుకు ఇమ్మిగ్రేషన్‌ సేవలు అందించేందుకు తాజాగా శిక్షణ తీసుకుంటున్న 13మంది సిబ్బంది సిద్ధమవుతారు. అనంతరం.. రెండు వారాల్లో మిగతా అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసి.. మార్చి 15న ఏఏఐ, ఇమ్మిగ్రేషన్‌, కస్టమ్స్‌ విభాగాలన్ని కలిసి జాయింట్‌ డిక్లరేషన్‌ను ప్రకటించాలని నిర్ణయించారు... గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులను నడిపేందుకు తొలి అవకాశం ఎయిరిండియా సంస్థకే ఇవ్వనున్నారు. ఇప్పటికే ఎయిరిండియా ముంబయికి నడుపుతున్న సర్వీసును దుబాయ్‌ వరకూ పొడిగించనున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తొలుత అదే విమానం ఇక్కడి నుంచి విదేశాలకు ఎగరనుంది. తొలుత దుబాయ్‌కు ముంబయి మీదుగా ఈ సర్వీసును నడపనున్నారు.

Advertisements

Latest Articles

Most Read