నిన్న రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ హరిబాబు, గోకరాజు గంగరాజు, ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి, రాష్ట్రానికి, ఇది చేసాం, అది చేసాం అని చెప్పి, 27 పేజీల రిపోర్ట్ ఇచ్చారు... దాని పై, టిడిపి ఎంపీలు, బీజేపీ చేసిన అవాస్తవాల పై, క్లారిటీ ఇచ్చారు... బీజేపీ చెప్పెంది ఏమిటి ? దానికి టిడిపి క్లారిఫికేషన్ ఏంటి ? 1. లోటు బడ్జెట్ కు సంబంధించి ఇప్పటివరకు 3,979.5కోట్లు విడుదల చేశామని, 2015-20 నాటికి 22,113కోట్లు ఇస్తామని ప్రకటించింది.1. లోటు బడ్జెట్ కు సంబంధించి ఇప్పటివరకు 3,979.5కోట్లు విడుదల చేశామని, 2015-20 నాటికి 22,113కోట్లు ఇస్తామని ప్రకటించింది...... అయితే, 2014-15కి లోటు రూ.16వేలు లోటు ఉందని కంప్ట్రోలర్ & ఆడిటర్ జనరల్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇదే సీజీఐతో అన్నింటికీ కోత పెట్టి ఇప్పుడు కేంద్రం కేవలం 4వేల కోట్లు మాత్రమే వస్తుంది. ఇప్పటికే రూ.3800కోట్లు ఇవ్వడం జరిగిందని ఇంకా వచ్చేది. రూ.120కోట్లు మాత్రమే అన్నారు. అయితే 2016లో స్పెషల్ అసస్టెన్స్ ప్రకటించేప్పుడు లోటు రూ.7509కోట్లు ఉంటుందని చెప్పారు. రూణమాఫీని వేరే ప్రణాళికను అమలు చేశాం. అన్ పెయిడ్ బిల్లులు వాటిల్లో ఇన్ క్లూడ్ చేసి 16వేల కోట్లు లోటు ఉంటుందని చెప్పడం జరిగింది.... 2. రాజధాని నిర్మాణానికి రూ.3500కోట్లు ఇచ్చాం అని కేంద్రం ప్రకటించింది.... అయితే, రూ.1500కోట్లు మాత్రమే ఇప్పటివరకు ఇవ్వగా ఇందుకుగాను 6లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన సచివాలయం, అసెంబ్లీ భవనాలు నిర్మించారు. 80లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అధికారులు, సిబ్బంది నివాస భవనాలు నిర్మాణంలో ఉన్నవి. అనేక రోడ్లు నిర్మాణంలో ఉన్నవి. అనేక రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. కొండవీటి వాగు నిర్మాణంలో ఉన్నది. కాగా రాజ్ భవన్, సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ, కౌన్సిల్ నిర్మాణాలతో పాటు మౌలిక వసతులకు రూ.42,935 కోట్లు అవసరం. ఈ అవసరంతో పోలిస్తే కేంద్రం ఇచ్చిన నిధులు ఎంత తక్కువనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనికి సంబంధించి డీపీఆర్ కూడా కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం సమర్పించింది. అలాగే విజయవాడ-గుంటూరు డ్రైనేజీకి రూ.1000కోట్లు మాత్రమే ఇచ్చారు. మెట్రో రైలు ఇవ్వలేదు. రాజధానికి రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేయలేదు. అభివద్ది చెందిన బెంగళూరు వంటి నగరానికి రూ.17వేల కోట్లు కేటాయించి ఏపీకి మాత్రం మొండిచేయి చూపించారు.....

3. వెనుకబడిన జిల్లాల అభివృద్థికి ప్యాకేజీ అని ఘనంగా ప్రకటించింది... రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలను అభివృద్థి పథంలో నడిపెందుకు కేబీకే, బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ అని ప్రకటించిన కేంద్రం ఇప్పటివరకు రూ.24,350 కోట్లు అడగగా కేవలం రూ.1050 కోట్లు మాత్రమే ఇచ్చింది.... 4. ప్రత్యేక ప్యాకేజి పేరుతో సాయం.... ఎన్నికల ముందు 15ఏళ్లు ప్రత్యేక హోదా అంటూ హామీ ఇచ్చి 2017 తర్వాత ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండదని చెబుతూ, దానికి సరి సమానమైన న్యాయం ప్రత్యేక ప్యాకేజి ద్వారా చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటికి ఒక్క పైసా నిధులను కూడా విడుదల చేయలేదు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం ఈపీఏ ప్రాజెక్టు కింద రూ.18,857 కోట్ల కోసం ప్రతిపాదన పెడితే ఇప్పటివరకు ఆమోదం తెలపలేదు..... 5.పోలవరం కోసం 100% నిధులను ఇచ్చాం.. ఇప్పటికే రూ.4662.28కోట్లు విడుదల చేశాం..... ఆగస్టు 2016న కేంద్రంకు పోలవరంకు 2014-15 అంచనాల ప్రకారం రూ.54వేల కోట్లు అవుతుందని అంచనాలు ఇవ్వడం జరిగింది. అయితే పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లలో ఖర్చు పెట్టిన మొత్తం రూ.7900 కోట్లు. కేంద్రం అందులో ఇచ్చింది రూ.3500 కోట్లు కేంద్రం రూ.3500 కోట్లు. ఇంకా బకాయి ఉండగా దానిపైన వడ్డీనే రూ.300కోట్లు పడుతుంది. అలాగే కేంద్రం నాన్చుడు కారణంగానే ఎగువ కాఫర్ డ్యాం, స్పిల్ వే, స్పిల్ ఛానెల్ 2నెలలు పైగా ఆలస్యం అయింది..... 6. ఐఐటీకి 90.93 కోట్లు విడుదల చేశాం..... ఐఐటీకి మొత్తం అంచనా ఖర్చు 700కోట్లు అయితే కేంద్రం విదిల్చింది 90.93కోట్లే. అలాగే తిరుపతిలో ఐఐటీని నిర్మించేందుకు కేంద్రానికి ప్రభుత్వం 590 ఎకరాలు దాదాపు రూ.1000కోట్లకు పైగా విలువ చేసే భూమిని ఇస్తే ఇప్పటివరకు అక్కడ ఏమీ జరగలేదు..... 7. ఎన్ఐటీకి రూ.50కోట్లు విడుదల చేశాం.......తూర్పు గోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెంలో రాష్ట్రప్రభుత్వం ఎన్ఐటీ నిర్మాణానికి 176ఎకరాలను ఇవ్వగా ఎన్ఐటీ అంచనా ఖర్చే రూ.470కోట్లు. కానీ కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లలో ఇచ్చింది రూ.50కోట్లు........ 8. ట్రిపుల్ఐటీకి రూ.20కోట్లు విడుదల చేశాం.... ట్రిపుల్ఐటీకి మొత్తం అంచనా ఖర్చు 125కోట్లు అయితే అంతులో 20శాతం కూడా నిధులు విడుదల చేయలేదు కేంద్రం.

9. సెంట్రల్ యూనివర్శిటీకి రూ.10కోట్లు.... సెంట్రల్ యూనివర్శిటీ కోసం భారీగా నిధులు వెచ్చిస్తామని చెప్పి ఆ బిల్లును పార్లమెంటులో పెడుతామని, హామీ ఇచ్చి ఇప్పటివరకు ఆ ఊసే లేదు..... 10. ఐఐఎస్ఈఆర్ కు రూ.64కోట్లు విడుదల చేశాం..... రూ.870కోట్ల అంచనాలతో ఉన్న యూనివర్శిటీకి నాలుగేళ్లలో రేవలం రూ.64కోట్లు విడుదల చేసింది. ఈ యూనివర్శిటీ కోసం రాష్ట్రప్రభుత్వం రూ.1000కోట్ల విలువైన భూమిని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించింది..... 11. ఐఐఎంకు రూ.92కోట్లు విడుదల చేశాం..... విశాఖపట్నంలోని ఐఐఎంకు 680కోట్ల అంచనాతో ఉంటే కేంద్రం మాత్రం ఇప్పటికి రూ.92కోట్లు మాత్రమే విడుదల చేసింది. కాగా ఇందుకోసం రాష్ట్రప్రభుత్వం రూ.800కోట్ల విలువైన 335ఎకరాలను రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి ఇచ్చింది..... 12. వ్యవసాయ విశ్వవిద్యాలయంకు రూ.135 కోట్లు విడుదల.... ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి చూపించినా కేంద్రం పనులు మాత్రం చేయట్లేదు..... 13. వివిధ పథకాల కింద నేషనల్ హైవే, రోడ్డు కనెక్టవిటీ కింద లక్ష కోట్లు నిధులు ఖర్చు చేయనున్నాం..... అన్నీ రాష్ట్రాలకు ఇచ్చినట్టుగా ఇది కూడా ఇచ్చారు కానీ, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కు ఎటువంటి కేటాయింపులు జరగలేదు. అనంత-అమరావతి నిర్మాణానికి భూసేకరణ జరుగుతుంది. ప్రాజెక్టు అంచనా రూ.25వేల కోట్లు కాగా బడ్జెట్ లో ఈ ప్రాజెక్టు కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. భూ సేకరణకు అయ్యే ఖర్చును కూడా రాష్ట్రప్రభుత్వమే భరిస్తుంది..... 14. 180కి.మీ అమరావతి అవుటర్ రింగ్ రోడ్డుకు రూ.20వేల కోట్ల అందజేయనున్నాం.... ఈ ప్రాజెక్ట్ ఇంకా డీపీఆర్ దశలోనే ఉంది..... 15. విశాఖ, విజయవాడ మెట్రో.... ఎలాంటి పురోగతి లేదు. 2018-19 బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు.....

16. కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్.... ఎలాంటి పురోగతి లేదు. ప్రాజెక్టు విలువ రూ. 32,900 కోట్లు. ఫైనాన్స్ వయబుల్ కింద కేంద్రం రూ.5 వేల కోట్లు ఇవ్వాలి. కేంద్రం పట్టించుకోవడం లేదు..... 17. కడప, రాజమండ్రి ఎయిర్‌పోర్టులను అభివృద్ది చేస్తామన్నారు.... కడప, రాజమండ్రి విమానాశ్రయం అభివృద్ది పనులు నత్తనడకన సాగుతున్నాయి..... 18. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎక్స్‌పాన్షన్.... కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేదు..... 19. దుగ్గరాజపట్నం పోర్ట్.... ఎలాంటి పురోగతి లేదు. సాంకేతిక కారణాలను సాకుగా చూపుతున్నారు..... 20. కడప స్టీల్ ప్లాంట్:.... ఎలాంటి పురోగతి లేదు. రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోలేదు. ఫీజబులిటీ లేదంటున్నారు. నివేదిక పెండింగ్‌లో పెట్టారు..... 21. 2014 తర్వాత విద్యుత్ ఉత్పాదకత గణనీయంగా పెరిగింది. గడిచిన మూడున్నర్రేళ్ళల్లో విద్యుత్ ప్రసార శక్తి రెండు రెట్లు అయ్యింది. దీని వల్ల యూనిట్ ధర మూడు రూపాయలకు పడిపోయింది..... విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ సర్‌ప్లస్ విద్యుత్ కలిగి ఉంది. దానివల్ల వచ్చిన లబ్ధే తప్ప కేంద్ర ప్రభుత్వం దీని కొరకు రాష్ట్రానికి చేసిందేమీ లేదు..... 22. 2009-14లో రైల్వేకు కేటాయించినది రూ. 5,100 కోట్లు. అయితే 2014-19లో రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులకు రూ.14,151 కోట్లు కేటాయించడమైనది. రూ. 47,989 కోట్ల విలువైన 5,010కి.మీ. 32 రైల్వే ప్రాజెక్టులు ఇప్పటికే పని జరుగుతున్నది..... ప్రాజెక్టుల అంచనాలు, అవసరమైన నిధుల గురించి తెలిపారే తప్ప ఇప్పటి వరకు ఎన్ని నిధులు మంజూరు చేసింది?, ఇంకా ఎన్ని నిధులు విడుదల చేయాల్సివుందనేది తెలియజేయలేదు..... రూ.3,631 కోట్లు వ్యయమయ్యే గుంటూరు- గుంతకల్ లైనుకు 2017-18లో రూ. 124కోట్లు కేటాయించటం జరిగింది. ఈ విధంగా అయితే ఆ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవ్వాలి?.... 23. ఇండియన్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ ప్యాకేజీ, ఇండియన్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ సంస్థలు ఒక్కొక్కటి 25 ఎకరాల్లో ఉండేలా మంజూరు చేయటం జరిగింది..... 25ఎకరాల్లో అభివృద్ది చేయాల్సిన సంస్థలకు 2018-19 కేంద్ర బడ్జెట్‌లో రూ.5 కోట్ల చొప్పున మంజూరు చేయటం జరిగింది . ఈ విధంగా అయితే ఆ సంస్థలు ఎప్పటికి పూర్తవ్వాలి?.... 24. రాష్ట్రానికి 4 స్మార్ట్ సిటీలు(వైజాగ్, కాకినాడ, తిరుపతి, అమరావతి) మంజూరు చేయటం జరిగింది. వాటికి రూ.1500 కోట్లు కేటాయించడం జరిగింది..... స్మార్ట్ సిటీలు ప్రకటించారే తప్ప వాటి అభివృద్ది కొరకు ఇప్పటిదాక ఎటువంటి నిధులు మంజూరు చేయలేదు.

ఈ వైసిపీ పార్టీకి విజయవాడ ప్రజలు ఒకరకంగా కూడా కనిపించటం లేదు... రోజుకి ఒక డ్రామా ఆడుతూ, ప్రజలని పిచ్చోళ్లని చేస్తూ, నిజం అనుకునే లోప అబద్దం అంటారు, అబద్దం అనుకుంటే నిజం అంటారు... అసలు ఎవరు ఎవరి పక్షమో అర్ధం కాక, ఇటు ప్రజలు, అటు కార్యకర్తలు జుట్టు పీక్కుంటున్నారు... మొన్నటి మొన్న పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు అంటూ డ్రామా ఆడిన గౌతంరెడ్డి, వైఎస్ జగన్ ను పాదయత్రలో కలవటం సంచలనం అయ్యింది... వంగవీటి రంగాను చంపడం తప్పు కాదు అంటూ, వైఎస్ జగన్ దగ్గరి బంధువు, గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలతో, కాపుల ఆగ్రహానికి గురై, గౌతంరెడ్డిని పార్టీ నుండి సస్పెన్షన్ చేస్తున్నాం అంటూ, అప్పట్లో వైసీపీ డ్రామా ఆడింది...

vijyasai 11022018 2

మొన్న, అది నిజంగానే డ్రామా అని తేలిపోయింది... కేవలం అప్పట్లో రాధాను బుజ్జగించటానికే అప్పట్లో డ్రామా ఆడారు అనే విషయం ఇప్పుడు తేలిపోయింది... తరువాత వరుస పెట్టి గౌతం రెడ్డి వైసిపి పార్టీ తరుపున న్యూస్ చానల్స్ లో విశ్లేషకుడిగా వెళ్లారు... సస్పెండ్ అయిన వ్యక్తీ, సస్పెండ్ చేసిన పార్టీ అధ్యక్షుడిని కలవటం ఒక వింత అయితే, అదే సస్పండ్ అయిన నాయకుడు, టీవీ చర్చల్లో కూడా వెళ్ళిపోయారు... ఇక అందరు గౌతం రెడ్డి వైసిపీ పార్టీలో వెళ్ళిపోయాడు అనుకున్నారు... గౌతం రెడ్డి కూడా, నాకు ఇప్పటి వరకు సస్పెండ్ చేసినట్టు, ఒక్క లెటర్ కూడా రాలేదు అని తేల్చి చెప్పారు...

vijyasai 11022018 3

మళ్ళీ ఏమైందో ఏమో, నిన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి హోదాలో విజయసాయిరెడ్డి ఒక ప్రకటన విడుదల చేసారు... గౌతమ్‌రెడ్డి టీవీ చర్చల్లో పాల్గుంటూ చెప్తున్న అభిప్రాయాలతో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని, ఆయన తమ పార్టీ సభ్యుడు కూడా కాదని, ఆయన్ను సస్పెండ్ చేసాం అని విజయసాయిరెడ్డి ప్రకటనలో తెలిపారు. అయితే గౌతం రెడ్డి మాత్రం, తనను సస్పెండ్‌ చేసినట్టు కూడా ఎలాంటి సమాచారం పార్టీ అధిష్టానం నుంచి నేటికీ అందలేదని గౌతమ్‌రెడ్డి మరోసారి గుర్తుచేశారు. జగన్ ను మొన్న కలిసినప్పుడు, పార్టీ కోసం కష్టపడమన్నారని అని గౌతం రెడ్డి చెప్పారు... అసలు ఇన్ని ప్రకటనలు, ఇన్ని డ్రామాల మధ్య, మేమేన్నా పిచ్చోళ్ళు లాగా కనిపిస్తున్నామా, అంటూ విజయవాడ ప్రజలు అంటున్నారు...

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అసలు రంగు బయట పెడుతున్నాడు... వై.ఎస్‌.జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత, కాదు అంతకంటే ముందే నేను త్వరలో కేంద్ర మంత్రిని అవుతున్నా, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు కీలక అధికారుల సంగతి చూస్తా అంటూ, నోటికి వచ్చినట్టు మాట్లాడారు విజయసాయి... నిన్న రాష్ట్రపతిని కలిసి వచ్చిన తరువాత, తన సన్నిహితుల వద్ద ఈ వ్యాఖ్యలు చేసారు విజయసాయి... అధికార పిచ్చతో, చివరకు అధికారులని కూడా, రాజకీయా ఉచ్చులోకి లాగుతున్నారు అంటూ, టిడిపి నాయకులు మండిపడుతున్నారు...

vijayasai 10022018 2

రాజకీయంగా మమ్మల్ని ఇప్పటికే సాక్షి ఛానల్ లో బద్నాం చేస్తున్నారు, ఇప్పుడు ప్రభుత్వ అధికారులను పనిచేసుకోనీయకుండా, వారి పై కూడా బురద జల్లుతూ, పబ్బం గడుపుకుంటున్నారు అని విమర్శలు చేస్తున్నారు... వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో, పోలీసుల పై, వైజాగ్ పోలీసు కమీషనర్ పై జగన్ చిందులు, అలాగే కృష్ణా జిల్లా కలెక్టర్ గా పని చేసిన అహ్మద్ బాబు కి వార్నింగ్, ఇచ్చి జైలుకి తీసుకుపోతా అని జగన్ అనటం, ఇప్పుడు A2 విజయసాయి రెడ్డి కూడా, నేను మంత్రిని అవుతాను, మీ అంతు చూస్తా అంటూ, ఉన్నతస్థాయి అధికారులని బెదిరించటంతో వీరి నైజం మరో సారి బయటపడింది..

vijayasai 10022018 3

ఇన్ని చేస్తూ, నిన్న ప్రధాన ఎన్నికల కమిషనర్ ని కలిసి, మేము రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోతున్నాం, మా ఎమ్మల్యేలు వెళ్ళిపోతున్నారు, అందుకే కేంద్ర బలగాలతో తమ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని కోరి, రాజ్యసభ ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ లను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని, అమరావతిలో వద్దు అంటూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ ను కోరటంతోనే వీరి నైజం ఏంటో తెలుస్తుంది...

టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్‌,రామ్మోహన్ నాయుడు మరోసారి బీజేపీ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం పై ఉతికి ఆరేసారు... ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై తెలుగుదేశం ముఖ్యనేతలు, అందుబాటులో ఉన్న ఎంపీలతో చంద్రబాబునాయుడు ఈరోజు చర్చించారు... తరువాత, ఎంపీలు మీడియాతో మాట్లాడారు...రాష్ట్ర విభజన ఏ విధంగా జరిగిందో అందరికీ తెలిసిందేనని, బీజేపీ మద్దతుతోనే ఏపీ విభజన జరిగిందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ అన్నారు. కేంద్రం దక్షిణాది రాష్ట్రాలతో ఏపీని పోల్చి చూడాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగిస్తే సహించబోమని, రాష్ట్ర విభజనతో చాలా ఆస్తులు కోల్పోయామని అన్నారు. ఏపీ తలసరి ఆదాయం చాలా తక్కువని, రాష్ట్రాన్ని అసంబద్ధంగా విడగొట్టారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.

galla 11022018 2

విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అన్నారని, ఇచ్చిన హామీని విస్మరించారని జయదేవ్ ఆరోపించారు. దేశంలోని అన్ని పార్టీలు ఏపీకి మద్దతిస్తున్నాయని జయదేవ్‌ పేర్కొన్నారు. ఏపీకి న్యాయం చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబు ఇంకా ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లాలంటూ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. నాలుగేళ్లు దాటుతున్నప్పటికీ విభజన చట్టంలోని అంశాలపై స్పష్టత లేదని, రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా, హేతుబద్ధత లేకుండా విభజించారని, విభజన తర్వాత కోలుకోవాలనే ఉద్దేశంతోనే విభజన చట్టం తీసుకొచ్చారని అన్నారు.

galla 11022018 3

‘కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలకు దూరదర్శన్, పాస్ పోర్టు ఆఫీసులు ఇవ్వరా? మేమేమైనా పక్క దేశంలో ఉన్నామా? రైల్వేజోన్ విషయంలో సమాధానం ఇవ్వలేదు! రాజకీయ నిర్ణయం తీసుకుంటే రైల్వేజోన్ పై క్లారిటీ వస్తుంది. కంభంపాటి విడుదల చేసిన నివేదికలో విభజన హామీల ప్రస్తావనే లేదు. కుట్రలు చేస్తోంది వైసీపీ.. పోరాటాలు చేస్తోంది టీడీపీ. వైసీపీవి నిలకడలేని ప్రకటనలు, నిబద్ధత లేని పోరాటాలు. వైపీపీ నేతల రాజీనామాల సంగతి ఏమైంది? వైసీపీ ఎంపీలు ప్రధాని మోదీ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు!’ అని రామ్మోహన్ నాయుడు విమర్శించారు.

Advertisements

Latest Articles

Most Read