రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాల ఆందోళనలకు, ఉభయ సభల్లో ఎంపీలు చేస్తున్న ఆందోళనకు కేంద్రంలో కదలిక వచ్చింది... విభజనలోని అన్ని అంశాల పై, నిర్దిష్ట క్లారిటీ ఇచ్చింది... అయితే, కేంద్ర వైఖరి తెలిసిన టిడిపి ఎంపీలు, ఇవన్నీ చట్ట సభల్లో ప్రకటన చేసి, అమలు అయ్యే వరకు, నమ్మలేము అని ప్రకట... ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంశాలు ప‌రిష్కారానికి సుమారు రెండున్న‌ర గంట‌ల‌పాటు భేటీ అయిన కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుజ‌నా చౌద‌రి, పియూష్ గోయ‌ల్‌, బిజెపి జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా... ఎపికి ఇవ్వాల్సిన నిధులు, ప‌లు సంస్థ‌లు, రైల్వే జోన్ ప్ర‌క‌ట‌న‌, దుగ‌రాజ‌ప‌ట్నం పోర్టు వంటి కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌... పార్ల‌మెంటు నిబంధ‌న‌ల ప్ర‌కారం న‌డుచుకోవాల‌నే ఉద్దేశంతోనే, ప‌లు మంత్రిత్వ శాఖ‌ల అంశాల ప్ర‌స్తావ‌న చేయ‌కూడ‌ద‌ని, భేటీలో పేర్కొన్న జైట్లీ... రెండో ద‌శ బ‌డ్జెట్ స‌మావేశాల ప్రారంభం లోపు అన్ని ప్ర‌క‌ట‌న‌లూ పూర్తి చేసి కార్యాచ‌ర‌ణ‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు వెల్ల‌డించిన‌ ఉన్న‌త స్థాయి వ‌ర్గాలు...

రెవెన్యూ లోటు పూర్తి చేయ‌డానికి ఓప్పుకున్న కేంద్ర ప్ర‌భుత్వం... 14వ ఆర్ధిక సంఘం ప్ర‌కారం 2014-15 ఏడాదిలో ప‌దినెల‌ల కాలానికి రాష్ట్రానికి రావాల్సిన మొత్తం ఇచ్చేందుకు కేంద్రం అంగీక‌రించినట్లు పేర్కొన్న ఉన్న‌త వ‌ర్గాలు... గ‌త మూడేళ్ళ నుంచి రావాల్సిన మొత్తాన్ని వెంట‌నే విడుద‌ల చేసేందుకు... మిగిలిన మొత్తాన్ని ప్ర‌తి ఏటా విడుద‌ల చేసేందుకు అంగీకారం.... ప్ర‌త్యేక హోదా వ‌ల్ల రాష్ట్రానికి వ‌చ్చే నిధుల మొత్తాన్ని ఒకే సారి ఇచ్చేందుకు సంసిధ్ద‌త వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం.... ప్ర‌త్యేక ప్యాకేజి ప్ర‌కారం ఈఎపి నిధుల‌ను కూడా కేంద్ర ప్ర‌భుత్వం స‌ర్దుబాటు చేసేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు పేర్కొన్న‌విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు.. ఆ నిధులు కూడా వెంట‌నే విడుద‌ల చేసేందుకు కూడా అంగీకారం.... దుగ‌రాజ‌ప‌ట్నం పోర్టు నిర్మాణానికి ఇస్రో అభ్యంత‌రం తెలిపింద‌ని... అక్క‌డ కాకుండా రాష్ట్ర ప్ర‌భుత్వం ఎక్క‌డ సూచిస్తే అక్క‌డ పోర్టు నిర్మాణాకి సిద్దంగా ఉన్నట్లు కేంద్రం నుంచి స్ప‌ష్ట‌మైన హామీ ఇస్తున్న‌ట్లు తెలిసింది.... ఏ నిమిషంలోనైనా రైల్వేజోన్‌ ప్రకటించాలని పీయూష్‌ గోయాల్‌ను అరుణ్‌జైట్లీ ఆదేశం..

పెట్రో కెమిక‌ల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు 12 శాతం నుంచి ఎంత ఎక్కువ సాధ్యం అయితే అంత వ‌ర‌కు ఐఆర్ త‌గ్గించుకోవాల‌ని చ‌మురు సంస్థ‌ల‌కు ఇప్ప‌టికే ఆదేశాలు పంపార‌ని, ఇందుకు సంబంధించిన ఇంట‌ర్ ఆఫీస్ మెమోనే వెంట‌నే విడుద‌ల చేయాల‌ని సంబంధిత మంత్రిత్వ శాఖ‌ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు భేటీలో వెల్ల‌డి... క‌డ‌ప ఉక్కు క‌ర్మగారం ప్ర‌భుత్వ‌, ప్రైవేటు భాగ‌స్వామ్యంతో నిర్మించాల‌ని... ఉద్యోగ‌, ఉపాధి క‌ల్ప‌నే దీనికి ప్ర‌ధాన ఉద్దేశమ‌ని పేర్కొన్న‌ట్లు తెలిసింది. క‌ర్మాగార నిర్మాణానికి కావ‌ల‌సిన నివేదిక మెకాన్ సంస్థ ఈనెల 12కి అందించ‌నున్న‌ట్లు వెల్ల‌డి. రైల్వే జోన్ ఏర్పాటు ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లో ఇవ్వాల‌ని నిర్ణ‌యం... విశాఖ - ఛెన్నై, క‌డ‌ప - ఛెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు వ‌స్తున్న అడ్డంకులు అన్ని తొలగించి... అందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌ను వేగ‌వంతం చేయాల‌ని నిర్ణ‌యం... అమ‌రావ‌తి నిర్మాణానికి చేసిన ఖ‌ర్చు వివ‌రాలు పంపితే... ఎప్ప‌టిక‌ప్పుడు నిధులు విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యం... పోల‌వ‌రం ప్రాజ‌క్టుకు ఇప్ప‌టికే ఒక వ్య‌వ‌స్థ ఏర్పాటైంద‌ని... దాని ప్ర‌కారం నిదుల‌కు ఇబ్బంది లేకుండా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామ‌ని... ఆ ప్రాజ‌క్టును అనుకున్న రీతిలో పూర్తి చేయ‌నున్న‌ట్లు బేటీలో చ‌ర్చ‌..

కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి వారం అయ్యింది... సరిగ్గా వారం క్రితం ఎన్నో అనుమానాలు, ఎన్నో అపోహలు... ఆ అపోహలు అన్నీ పటాపంచలు అయిపోయాయి... మేము అనుకున్నదాని కంటే, ఎక్కువే చేసారు చంద్రబాబు అనుకుంటున్నారు ప్రజలు.... సరిగ్గా వారం క్రితం, సొంత పార్టీ వాళ్ళే చంద్రబాబు పై విమర్శలు చేసారు... మరీ ఇంత డిఫెన్సు గేమ్ ఆడితే ఎలా చంద్రబాబు అంటూ నెటిజ‌న్లు పోస్ట్ లు పెట్టారు... అనేక అనుమానాలు, అనేక సందేహాలు.. బాబు ఏం చేస్తున్నారు? ఏపీని ఆయ‌న ముంచేస్తారా? ఇంత జరుగుతున్నా కూడా ఆయ‌న ఇంకా మిత్ర‌ధ‌ర్మం అంటూ ప‌ట్టుకు వేళ్లాడుతాడా? ఆయ‌నేం చేయ‌లేడా ? కేంద్రాన్ని లైన్లోకి తీసుకురాలేడా? వ‌ంటి అనేకానేక సందేహాలు... దీంతో గ‌త శుక్ర‌, శ‌నివారాల్లో నెటిజ‌న్లు చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపైనా, టీడీపీ ఎంపీల‌పైనా భారీ స్థాయిలో విరుచుకుప‌డ్డారు....

కాని చంద్రబాబు మాత్రం ఎక్కడా బ్యాలన్స్ తప్పలేదు... పర్ఫెక్ట్ గా గేమ్ స్టార్ట్ చేసారు... త‌న రాజ‌కీయ చ‌మ‌త్కారం ఏమిటో చూపించారు... అప‌ర చాణిక్యుడిగా పేరొందిన త‌న విశ్వ‌రూపం ఏంటో కేంద్రానికి చూపించారు... ఏపీ స‌మ‌స్య‌ను దేశ స‌మ‌స్య‌గా మార్చాల‌ని అప్ప‌టిక‌ప్పుడు ప‌క్కా ప్లాన్ సిద్ధం చేశారు... ఎంపీల‌ను అలెర్ట్ చేశారు... బీజేపీపై ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌కుండా త‌న వేలితో త‌న క‌న్నును ఎలా పొడిపించాలో స్కెచ్ సిద్ధం చేశారు.... ఎంపీల‌ను పిలిపించి త‌న ప్లాన్ వివ‌రించారు.... ప‌క్కాగా అమ‌లయ్యేలా.. అమ‌లు చేసేలా తెర వెనుకే ఉండి మంత్రాంగం న‌డిపించారు... తెలుగు వారి ఆత్మ గౌర‌వం ఎలా ఉంటుందో కేంద్రం చ‌వి చూసింది... అటు రాజ్య‌సభ‌, ఇటు లోక్‌స‌భ‌లో టీడీపీ ఎంపీలు తీవ్ర స్థాయిలో ఉద్య‌మాన్ని ముందుకు న‌డిపించారు...

నిజానికి టిడిపి ఎంపీలు ఈ రేంజ్ లో ఆందోళన చేస్తారని ఎవరూ ఊహించలేదు... అటు కేంద్రమే కాదు, ఇక్కడ ఉన్న ప్రతిపక్షం కూడా అవాక్కయింది... ప్ర‌ధానిగా మోడీ బాధ్య‌తలు స్వీక‌రించాక ఏపీ గురించి మొదటి సారి పార్ల‌మెంటులో మాట్లడారు.. జైట్లీ మూడు సార్లు ప్రకటన చేసారు.... ఇక‌, గ‌ల్లా జ‌య‌దేవ్‌ స్పీచ్ అయితే, అన్నిటికంటే హైలైట్... మీకు మేం కావాలో? అవినీతిలో జైలుకు వెళ్లి ఏడాదిపైగా జైల్లో ఉండి వ‌చ్చిన జ‌గ‌న్ కావాలో తేల్చుకోవాల‌ని అల్టి మేటం ఇచ్చారు... ఏపికి న్యాయం చెయ్యల్సింది మీరే, కాంగ్రెస్ గతి పట్టించుకోవద్దు అంటూ అల్టిమేటం ఇచ్చారు.. ఫ‌లితంగా ఇప్పుడు ఏపీ ప్ర‌జ‌ల ఆశ‌ల బంతుల‌న్నీ, కేంద్రం కోర్టులో ప‌డ్డాయి... ఇప్పుడు ఎవ్వ‌రూ బాబును వేలెత్తి చూపించ‌లేని ప‌రిస్థితి వ‌చ్చేసింది... అదే స‌మ‌యంలో వామ‌ప‌క్షాలు ఇచ్చిన పిలుపును సైతం చంద్ర‌బాబు మ‌న్నించారు. బంద్‌లంటే ఇష్ట‌ప‌డ‌ని బాబు సైతం తెలుగు దేశం పార్టీ శ్రేణులు కూడా నిర‌స‌న తెలిపి ఏపీ కోసం ఉద్య‌మించాల‌న్నారు... ఈ విధంగా, ఎవరూ ఊహించని విధంగా చంద్రబాబు మొదటి అడుగులోనే అబ్బురపరిచారు... ఇక ఎన్ని అడుగులు ఉన్నాయో, ఎన్ని మార్గాల్లో కేంద్రం పై ఒత్తిడి తెస్తారో, లేక ఇక తెల్చుకుంటారో వేచి చూడాలి... ఒకటి మాత్రం నిజం... తెలుగుదేశం కార్యకర్తలకి, బీజేపీని వదిలించుకుంటే వచ్చే ఓట్లు కనిపిస్తున్నాయి.. రాష్ట్రానికి వచ్చే డబ్బులు కంటే ఓట్లు ఎక్కువయ్యాయి.... కాని చంద్రబాబు గారికి వచ్చే ఓట్లు కంటే .. ఏపీ కి వచ్చే డబ్బులు గురుంచి ప్రయత్నం చేస్తున్నారు.... చంద్రబాబు గారు, చివరకు సక్సెస్ అవ్వాలని కోరుకుందాం... ఎందుకంటే, ఆయన గెలిస్తే, రాష్ట్రం కూడా గెలుస్తుంది...

"మిస్టర్ ప్రైమ్ మినిస్టర్"... ఇది అన్నగారు తెలుగోడికి నేర్పిన ఆత్మాభిమానం.... చంద్రబాబు నేర్పిన ఆత్మస్తైర్యం.... దమ్మున్నోడు ఎవడికి తలవంచడు అనటానికి మొన్న గుంటూరు ఎంపీ స్పెచ్ ఒక ఉదాహరణ... సుమారు 14 నిమిషాల పాటు ఇంగ్లీష్ లో, ఆంధ్రా ప్రజల ఆక్రోశం ఈ దేశానికి ఘాటుగా చాటి చెప్పారు గల్లా జయదేవ్... బహుసా, ఇలాంటి పవర్ఫుల్ స్పీచ్, ఢిల్లీని డైరెక్ట్ గా, "మిస్టర్ ప్రైమ్ మినిస్టర్" పీపుల్ అఫ్ ఏపి ఆర్ నో ఫూల్స్ అంటూ ఘాటుగా స్పందించటం, ఈ తరం ఎప్పుడూ వినలేదో ఏమో కాని, ఇప్పటికీ గల్లా మాటలు చెవుల్లో తిరుగుతూనే ఉన్నాయి... మూడు రోజులు అయినా, సోషల్ మీడియా దద్దరిల్లుతూనే ఉంది...

galla 09022018 2

ముఖ్యంగా జయదేవ్ చివర్లో చెప్పిన మాటలు హైలైట్... ఒక పారిశ్రామికవేత్తగా ఉంటూ, సొంత ప్రయోజనాల కంటే, ప్రజల ప్రయోజనాలు ముఖ్యం అని తలిచి, సాక్షాత్తు ఆర్ధిక మంత్రిని, ప్రధాన మంత్రిని దులుపుతూ ‘‘ఇప్పటిదాకా మీరు సంకీర్ణ ధర్మం పాటించలేదు. ఇదే చివరి అవకాశం. ఇప్పుడైనా పాటించండి. ఇలా చెప్పాలని గానీ, మిత్రపక్షం మనసు గాయపరిచేలా మాట్లాడాలనిగానీ మాకు లేదు. కానీ... మీరు మాకు అలాంటి పరిస్థితి కల్పించారు. ఇది కీలకమైన ఎన్నికల సంవత్సరం. కూటమిలోని మిత్రులకు, కొత్తగా మిత్రులు కావాలనుకునే వారికీ విషయం అర్థమవుతుంది. ఆర్థికమంత్రి, ప్రధానమంత్రి దీనికి సమగ్ర వివరణ ఇవ్వాల్సిందే.. కొంత మందిని ఎప్పుడూ మోసం చేయవచ్చు. కొంత మందిని అప్పుడప్పుడు మోసం చేయవచ్చు.. కానీ ఎప్పుడూ అందరినీ మోసం చేయలేరు. ఏపీ ప్రజలు కానీ, టీడీపీ కానీ మోసపోయే వారి జాబితాలో ఉండరు’’.ఏపీ ప్రజలు మూర్ఖులు కాదు!’ అని జయదేవ్‌ తన ప్రసంగాన్ని ముగించారు..

galla 09022018 3

తెలుగు ఎంపీలకు దమ్ము ఉందా ? పార్లమెంట్ లో ఎదో హడావిడి చేసి కూర్చుంటారు... ప్రధానిని చూస్తే పారిపోతారు... వీరికి ధైర్యం లేదు... వీరు పారిశ్రామికవేత్తలు... వీరు కాంట్రాక్టర్లు... ఇలా హైదరాబాద్ లో ఉన్న రంకు మీడియా, హైదరాబాద్ లో పని లేని సన్నాసులు, మొన్నటి దాకా పిచ్చి వాగుడు వాగారు... అలాంటిది ఒక ప్రధాన మంత్రిని పార్లమెంట్ లో పట్టుకుని "మిస్టర్ ప్రైమ్ మినిస్టర్" అంటూ ఒక తెలుగు ఎంపీ దుమ్ము దులుపితే, అది చూపించకుండా, సొల్లు వాగుతున్న హైదరాబాద్ మీడియాకు, సోషల్ మీడియాలో గల్లా స్పీచ్ కు వచ్చిన షేర్స్, కామెంట్స్, వ్యూస్, ఇవే మాట్లాడుతాయి... చివరగా ఈ దేశానికి కూడా గెట్టిగా చెప్తున్నాం "పీపుల్ అఫ్ ఏపి ఆర్ నో ఫూల్స్"...

ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి వ్యవహార శైలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై తన అభిప్రాయం, కేసులు మాఫీ కోసం ఆడుతున్న డ్రామాలు, ఇలా ప్రతి విషయంలో చేస్తున్న నయవంచనతో జగన్ ను వదిలి అందరూ వచ్చేస్తున్నారు... ఇటు పట్టిసీమ దండగ అంటూ, కృష్ణా జిల్లా రైతాంగం ఆగ్రహానికి గురై, అలాగే సీమకు నీళ్ళు ఇస్తున్న పట్టిసీమ దండగ అంటూ, అక్కడ రైతాంగం ఆగ్రహానికి గురై, తన విధానాలతో, తన పార్టీ నాయకులను బయట తిరగానివ్వకుండా చేస్తున్నాడు... మరో పక్క తన సెల్ఫ్ గోల్స్ తో, ప్రాంతానికి ఒక మాట మాట్లాడుతూ, ద్వంద్వ విధానాలు అవలంభిస్తూ, ఇరు ప్రాంతాలకి కాకుండా పోతున్నాడు జగన్...

vijayasai police 09022018 2

మరో పక్క, జగన్ పెట్టే టార్చర్ తట్టుకోలేక మరి కొంత మంది, జగన్ కు దండం పెట్టి బయటకు వచ్చేస్తున్నారు... పాదయాత్ర చేస్తున్నా, ప్రజల్లో ఏ మాత్రం గ్రాఫ్ పెరగటంలేదు.. వలసులు జరుగుతూనే ఉన్నాయి.. దీంతో, రేపు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి... మరో నాలుగురు ఎమ్మల్యేలు పార్టీ మారితే రాజ్యసభ సీటు వచ్చే అవకాసం లేదు... మరో పక్క, మరో 15 మంది ఎమ్మల్యేలు జగన్ కు నమస్కారం పెట్టేస్తారు అనే వార్తలు వస్తున్నాయి... దీంతో విజయసాయి రెడ్డి రంగలోకి దిగారు...

vijayasai police 09022018 3

ప్రధాన ఎన్నికల కమిషనర్ ని కలిసి, ఏపీ ప్రభుత్వం దగ్గర ఉండి, మా ఎమ్మల్యేలను లాగేస్తుంది అని, మరో నలుగురు ఎమ్మల్యేలు వెళ్ళిపోతే మాకు రాజ్యసభ సీటు పోతుంది అని, అందుకే కేంద్ర బలగాలతో తమ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని కోరారు... రాజ్యసభ ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ లను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని, అమరావతిలో వద్దు అంటూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేసారు విజయసాయి... ఇలా వింతంగా ఫిర్యాదు రావటంతో, ఎన్నికల కమిషన్ కూడా అవాక్కయినట్టు సమాచారం... వేరే రాష్ట్రంలో ఎన్నికలు పెట్టమనటం, ఎమ్మల్యేలకు సెంట్రల్ ఫోర్సు తో సెక్యూరిటీ పెట్టాలని అనటం, ఎప్పుడూ ఎవరూ కోరలేదు అని అంటున్నారు...

Advertisements

Latest Articles

Most Read