శశికళ... ఈ పేరు తెలియని వారు ఉండరు... ఉండేది తమిళనాడు అయినా, దేశం మొత్తం మారుమోగిన పేరు.. జయలలితతో కలిసి చేసిన అవినీతి కేసులో ప్రస్తుతం జైలు జీవితం అనుభావిస్తున్నారు... జయలలిత మరణం, ఆ ఎపిసోడ్ మొత్తం జరిగిన విధానంలో, నిత్యం వార్తల్లోకి ఉంటూ, చివరకు జైలు జీవితం అనుభవిస్తుంది శశికళ... నిన్న జరిగిన ఒక విషయం చుస్తే, ఈమె ఎంత తెలివిగలదో అర్ధమవుతుంది.. ఈ విషయం తెలియక, పాపం మన రాష్ట్రంలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వారం వారం కోర్ట్ కి వెళ్తున్నారు అంటూ, సోషల్ మీడియాలో సెటైర్ లు పేలుతున్నాయి... ఈ సలహా ఇంత లేట్ గానా జగన్ కు ఇచ్చేది అంటున్నారు...
ఇంతకీ విషయం ఏంటి అంటే, గుట్కా కుంభకోణం కేసులో శికళనను ఆదాయపు పన్ను శాఖ అధికారులు విచారించబోతున్నారు... పొయెస్ గార్డెన్లోని ‘అమ్మ’ జయలలిత నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న కీలక పత్రాల ఆధారంగా ఈ స్కాం బయట పడింది... నిషేధిత గుట్కా విక్రయాలకు వీరు అవకాశం కల్పించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు... ఈ కేసులో విచారణకు వచ్చే నెల 10న హాజరు కావాలని శశికళకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులిచ్చింది. అయితే తాను మౌన వ్రతంలో ఉన్నానని, విచారణకు హాజరు కాలేనని ఆమె తెలిపారు. వచ్చే నెల 20 వరకు మౌన వ్రతంలో ఉంటానని పేర్కొన్నారు...
ఈ సమాధానంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు అవాక్కయ్యారు... ఈ విషయం ఎలా డీల్ చెయ్యాలో తెలియక పై అధికారులతో చర్చిస్తునారు... ఇది ఇలా ఉండగా, ఈ విషయాన్ని, మన రాష్ట్రంలో ఉన్న జగన్ తో లింక్ పెట్టి, సోషల్ మీడియాలో సెటైర్ లు పేలుతున్నాయి... జగన్ కూడా ప్రతి శుక్రవారం నాకు, మౌన వ్రతం అని చెప్పి విచారణని తప్పించుకోవచ్చు అంటూ, ఇలా రకరకాలుగా పోస్ట్ లు పెడుతున్నారు.. అయినా, విచారణాధికారులు, ఇలాంటి వాటికి లొంగుతారా ? సెంటిమెంట్ అంటూ గౌరవిస్తారా ? వారి పని వారు చేసుకోపోతారా ? చూద్దాం...