కరువు అంటే అనంతపురం.. అనంతపురం అంటే కరువు!. ఏపీలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లా అనంతపురం. అలాంటి జిల్లా, గత రెండేళ్ళ నుంచి తన రూపు మార్చుకుంది... భూముల్లోకి నీరొచ్చింది.... భూమి లోపలి నుంచి ఉబికొచ్చింది.. ఎటుచూసినా.. పంటలు నిండిన పొలాలే.... అనంతపురం అంటే కరువు మాత్రమే అనుకునేవారు, కళ్లు నుళిమి ఇది నిజంగా అనంతేనా అని చూస్తున్నారు.. ఇది కలా.. నిజమా.. అని.. సంబర పడుతున్నారు... ఇవాళ అనంతపురంలో కరువు మాతమే ఉంది అని అనుకుంటూ పర్యటన చెయ్యటానికి వస్తున్న పవన్ కూడా, ఆశ్చర్యంతో చూడాల్సిందే...

anantapuram 27012018 2

పచ్చగా ఉన్న పొలాలు, నిండుగా ఉన్న చెరువులు, పవన్ కు స్వాగతం పలుకుతున్నాయి... పవన్ కూడా, ఆ పంటలు, నీరు చూసి తప్పక ఆనందిస్తారు... తుంగభద్ర ఎగువ కాలువ (టీబీ హెచ్చెల్సీ), హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) ప్రాజెక్టులు కల్పతరువులా మారాయి. జిల్లా దాహార్తి తీర్చడమే కాదు.. అన్నదాత మోమున వెలుగులు నింపాయి. ఏటా కనుచూపు మేర బీడు భూములే కన్పించేవి.. నేడు దశదిశలా పచ్చదనం వెల్లివిరుస్తోంది. మూడేళ్ల తర్వాత మళ్లీ ఆశించిన మేర నీరు జిల్లాకు చేరడం శుభ పరిణామం. అన్ని ప్రాంతాలను ఆదుకోవాలనే ప్రభుత్వ ముందుచూపు.. జల నిర్వహణ.. నీటి పంపిణీలో పారదర్శకతతో సాగుకు జీవం వచ్చింది...

anantapuram 27012018 3

అనంతపురంలో నీటిని చూస్తామా అనుకున్న పెద్ద వయసు వాళ్ళు అందరూ, ఈ నీటిని చూసి "మా జీవితకాలంలో నీరు చూస్తాం అనుకోలేదు అని ఉద్విగ్నంగా చెప్తున్నారు" నలభై ఏళ్ళ నుంచి నిండని చెరువులు కూడా నిండాయి అంటే, అనంత కోనసీమతో ఎలా పోటీ పడుతుందో చెప్పవచ్చు... రాయలసీమలోనే అతి పెద్ద చెరువు, బుక్కపట్నం చెరువుకు దాదాపు దశాబ్దం తరువాత నీరు విడుదల అయ్యింది... హాంద్రీనీవా నీటితో అనంతపురంజిల్లా కరువు పరిస్థితుల్లో మార్పువచ్చింది. జిల్లాలోని జీడిపల్లి,గొల్లపల్లి రిజర్వాయర్లలలో జలకళ, వీటితోపాటు జిల్లావ్యాప్తంగా పలుచెరువులను కృష్ణాజలాలతో నింపడంతో భూగర్బజలాలు పెరిగాయి. జలసిరులు అందుబాటులోకి రావడంతో గుతకల్లు, ఉరవకొండ, రాప్తాడు నియోజక వర్గాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు... ఇప్పుడు అనంతపురంలో ఉన్న పరిస్థితి గురించి, ఆ రైతులు ఏమంటున్నారో మీరే వినండి...

దాదాపు 20 న్యూస్ చానల్స్... మొన్న విజయవాడలో మొదలైన AP 24/7 ఛానల్, పాక్షింగా ఇక్కడ నుంచి నడుపుతున్న మహా న్యూస్ తప్పితే, అన్నీ హైదరాబాద్ నుంచి నడిచేవే... ఈటీవీ హైదరాబాద్ నుంచి నడిచినా, మంచిగా చర్చులు ఉంటాయి...వివాదాలు ఉండవు.. ఆంధ్రా మీద విషం చిమ్ముడు ఉండదు... ఇక మిగతా చానల్స్ అన్నీ హైదరాబాద్ నుంచి నడిచేవే... ఎడిటర్ కాని, స్క్రిప్ట్ రాసే వాడు కాని, వార్తని విశ్లేషించేవాడు కాని అందరూ హైదరాబాద్ లో కూర్చుంటారు... ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ తెలీదు... ఇక్కడ ప్రజలు అభిప్రాయాలు పట్టవ్... వారికి ఒక అజెండా ఉంటుంది, ఆ అజెండా ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యమంగా చంద్రబాబు ఏమి చేసినా రచ్చ రచ్చ చెయ్యాలి... వాళ్లకి తెలంగాణాలో ఏమి జరుగుతుందో అనవరసం... తెలంగాణా గురించి ఒక్క నెగటివ్ వార్తా రాస్తే, అక్కడ కెసిఆర్ 10 కిమీ లోతులో పతి పెడతాడు అని భయం... చానల్స్ ఆపేస్తాడు అని భయం... అందుకే అక్కడ దాసోహం... ఇక్కడ చంద్రబాబు ఏమి అనడు కదా, అందుకే హైదరాబాద్ లో కూర్చుని, మన రాష్ట్రం మీద విషం చిమ్ముతూ ఉంటారు...

ఇలాంటి వారికి AP 24/7 ఛానల్ విజయవాడ గడ్డ పై నుంచి ఛాలెంజ్ చేసింది... AP 24/7 ఎడిటర్ సాయి చుండూరి, వారందరికీ ఛాలెంజ్ చేసారు... హైదరాబాద్ లో కుర్చుని సొల్లు చర్చులు జరపటం కాదు, అమరావతి వచ్చి మీ చర్చలు పెట్టండి అన్నారు... ఇంకోసారి బెజవాడ గురించి తప్పుడు రాతలు రాస్తే, ఊరుకోం అన్నారు... మాకు బెజవాడ నుంచి నడిపే దమ్ము ఉంది, మీకు అమరావతి వచ్చే దమ్ము ఉందా అంటూ, హైదరాబాద్ చానల్స్ కి ఛాలెంజ్ చేసారు... అంతే కాని, హైదరాబాద్ లో కూర్చుని, మా మీద విషం చిమ్మితే ఖబడ్దార్ అంటూ, ఆంధ్రా గొంతు వినిపించారు... శభాస్ మీద శభాస్ AP 24/7...ప్రతి ఆంధ్రుడు మీ వెనుక ఉంటాం... ఆంధ్రా వాణి వినిపించండి... అమరావతి దమ్ము చూపించండి...

మూడేళ్ళ నుంచి ప్రతి ఆంధ్రుడి ఆవేదన ఇది... ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి పౌరుడు ఇన్నాళ్ళు నలిగి పోయారు... హైదరాబాద్ స్టూడియోల్లో కూర్చుని ఇష్టం వచ్చినట్టు వాగటం... హైదరాబాద్ లో కూర్చుని ఆంధ్ర రాష్ట్రం మీద విషం చిమ్మటం.... లేకపోతే హైదరాబాద్ నుంచి పొద్దున్నే ఫ్లిట్ కి గన్నవరం దిగి, ఇక్కడ షో చేసి, సాయంత్రానికి హైదరాబాద్ చేక్కేయటం, సాయంత్రం 8 గంటలకు కొన్ని హైదరాబాద్ చానల్స్ పనికిమాలిన చర్చలు పెట్టి, తెలంగాణా వారిని ఆ చర్చల్లో కూర్చో పెట్టి, ఆంధ్ర రాష్ట్రాన్ని తిట్టటం.... హైదరాబాద్ లో కూర్చుని, మా రాష్ట్ర ఆత్మాభిమానం దెబ్బ తింటుంటే చూస్తూ ఊరుకోము..

మా ఆంధ్ర రాష్ట్ర సమస్యలు గురించి మాట్లాడంది... తప్పు లేదు...కానీ నువ్వు ముందు ఆంధ్రుడివా, తెలంగాణ వాడివా తేల్చుకో... హైదరాబాదులో కూర్చుని, ఆంధ్ర రాష్ట్రాన్ని రిమోట్ కంట్రోల్ ద్వారా తిడతామంటే కుదరదు... లాగి పెట్టి లెంపకాయ కొడతాము... మా రాష్ట్ర సమస్య గురించి, మా మీద నిలువెల్లా విషం నింపుకుని, హైదరాబాదు లో కూర్చుని మాట్లాడతాము అంటే మేము వినడానికి సిద్ధంగా లేము. ఈ హైదరాబాద్ బేస్డ్ ఛానెల్స్, వారి అభిప్రాయాలను తీసుకొని, పదే పదే చూపిస్తూ, అదే ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయం అని చూపించడం తప్పు.... ఛానెళ్లూ....ఆంధ్రకు రండి. ఇక్కడ ఆంధ్ర ప్రదేశ్ లో ఆంధ్ర ప్రజలు, విశ్లేషకులతో మాట్లాడండి... అర్హత లేని చెంచా గాళ్ళని స్టూడియోలో కూర్చో బెట్టి, మా ముఖ్యమంత్రిని, మా రాష్ట్రాన్ని తిట్టేస్తాం అంటే కుదరదు... ఒక్కసారి కుడా మా ఆంధ్రప్రదేశ్ గురించి, మా అమరావతి గురించి పోజిటివ్ గా మాట్లాడక పోగా, రొజూ విమర్శలు చేసే సన్నాసులని స్టూడియోల్లో కూర్చోబెట్టుకుని సొల్లు చెప్పించి, మీ అజెండా మా మీద రుద్దకండి... మా వార్తలు, మా ఆంధ్రా వారి నుంచి ఇవ్వాలి.... మా ఆంధ్ర సమస్యలు, మా ఆంధ్రా గురించి చర్చల్లో, మా ఆంధ్ర వారి అభిప్రాయాలనే ఇవ్వాలి... అంతే కానీ ఆంధ్రాని అనుక్షణం వ్యతిరేకించే వారు కాదు, మా ఆంధ్ర గురించి మాట్లాడేది....

ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆలోచించాలి... మా ఆంధ్రా ప్రజల బాధ అర్ధం చేసుకోవాలి... మీ మెతకతనాన్ని అలుసుగా తీసుకుని ..... పక్క రాష్ట్రంలో కూర్చుని ఏ మాత్రం సంబంధం లేకపోయినా నోటికొచ్చినట్టు వాగుతా ఆంధ్ర ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారు... ఆంధ్రులకి ఆత్మగౌరవం కంటే ఏది ఎక్కువ కాదు.... రాష్ట్రంలో జరిగే ప్రతి విషయం పైన పక్క రాష్ట్రంలో కూర్చుని ,పక్క రాష్ట్రపు వెధవలతో దుమ్మెత్తి పోయిస్తున్న పక్క రాష్ట్రపు చానెల్స్ ని ప్రభుత్వం అదుపు చేయలేదా? కుల మత చిచ్చు పెట్టటమే ఏకైక అజండగా పని చేస్తున్న చానెల్స్ ని ఆపలేదా? మంచితనాన్ని అసమర్థత కింద జమకట్టే మూర్ఖులని, ఉపేక్షించటం సమంజసం కాదు... మీరు రియాక్ట్ అవ్వండి చంద్రబాబు గారు... ఇది ఎంత మాత్రం సమంజసం కాదు...

ప్రముఖ కార్ల దిగ్గజం కియా పరిశ్రమ పనులు వేగం పంజుకున్నాయి. అనంతపురం జిల్లా, పెనుకొండ మండలంలోని అమ్మవారుపల్లి, ఎర్రమించి వద్ద ఐదు దశలుగా చేపడుతున్న భూమి చదును పనులు తుది దశకు వచ్చాయి. 1, 2, 3, 5 దశల్లో పనులు పూర్తి కాగా, నాలుగో దశ కొనసాగు తున్నాయి. ఇప్పటికే కేటాయించిన 582.70 ఎకరాల్లో కియా ప్రధాన పరిశ్రమలో పెయింట్స్ షాపు, బాడీ బిల్లర్ వర్క్ షాప్, ఇంజిన్ ఫుట్ వర్క్స్ షాపు , ఇందనం నిలువ చేయడానికి కూల్ ఫుట్ షాప్, పవర్ ట్రైన్ షాప్, మోడల్ షాప్, అసెంబుల్డ్ షాపు, ఇంటర్నల్ రోడ్స్ పనులు చురుగ్గా సాగుతున్నాయి.

kia 26012018 2

పరిశ్రమ చుట్టూ కెనాల్ టౌన్షిప్, శిక్షణా కేంద్రం పనులు చేపడుతున్నా. వీటిని కొరియా టెక్నికల్ ఇంజీనీర్లు, మేనేజర్ల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గొల్లపల్లి రిజర్వా యర్ నుంచి పరిశ్రమకు అవసరమైన నీటి పైప్ లైన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. పరిశ్రమకు అవసరమైన యంత్రాలు, పరికరాలు ఉంచుకోవటానికి 82 ఎకరాల్లో డంపింగ్ యార్డ్ నిర్మిస్తున్నారు. పనుల పురోగతి పై జిల్లా కలెక్టర్, కియా బృందం, ఏపీఐఐసీ అధికారులు ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తున్నారు.

kia 26012018 3

2019 ద్వితీయార్థం నుంచి భారతీయ మార్కెట్లో కార్ల అమ్మకాలను ప్రారంభిస్తున్నామని ఆ సంస్థ పేర్కొంది. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి గ్రామంలో దాదాపు 600 ఎకరాల విస్తీర్ణంలో రూ.13వేల కోట్ల పెట్టుబడితో కియా సంస్థ కార్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పుతున్న సంగతి తెలిసిందే. 2018 మార్చి నాటికి ట్రయల్‌ రన్‌, 2019 సెప్టెంబరుకల్లా ఉత్పత్తిని ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏడాదికి మూడు లక్షల కార్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని నిర్మిస్తున్నారు. అంటే... రోజుకు దాదాపు 820 కార్లు! అంటే... గంటకు సుమారు 30 కార్లు బయటికి వస్తాయి. వీటిని ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తారు.

అమరావతిలో స్మార్ట్‌ బైకులు పరుగులు తీయనున్నాయి. తొలిసారిగా వెలగపూడి సచివాలయంలో ప్రభుత్వం వీటిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనుంది. ఇక్కడ విజయవంతమైతే సీఆర్‌డీఏ పరిధిలో ట్రాక్‌లు ఏర్పాటుచేసి ప్రజలకు, సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ స్మార్ట్‌ బైక్స్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే జర్మనీ నుంచి 30 సైకిళ్లు సచివాలయానికి చేరాయి. ఆవరణలోపల ప్రస్తుతం రెండు స్మార్ట్‌ సైకిల్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. సచివాలయం వాహనాల పార్కింగ్‌ వద్ద మరో స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నారు...

smart bikes 26012018 2

ప్రతి స్టేషన్‌లో 10 సైకిళ్లను ఉంచుతారు. అవసరమైన వారు సైకిల్‌ తీసుకుని వెళ్లవచ్చు. సైకిల్‌ కావలసిన వ్యక్తికి స్వైపింగ్‌ కార్డు ఇస్తారు. పాస్‌వర్డ్‌ ఇస్తారు. పాస్‌వర్డ్‌తోనే సైకిల్‌ లాక్‌ తెరుచుకుంటుంది. సచివాలయం లోపల, బయట సందర్శకులు వీటిని ఉపయోగించుకోవచ్చు. పని ముగించుకున్న తర్వాత ఆ సైకిల్‌ను 3 స్టేషన్లలో ఏదో ఒకచోట నిలిపి వెళ్లిపోవచ్చు... ఇవీ ప్రత్యేకతలు.. ఈ స్మార్ట్‌ బైక్స్‌ బాడీ మొత్తం ఎల్లాయిడ్‌, అల్యూమినియంతో తయారు చేయబడింది. వర్షంలో తడిసినా తుప్పు బట్టే అవకాశం లేదు. ఈ బైక్‌కు మూడు గేర్లు ఉన్నాయి...

smart bikes 26012018 3

దీని విలువ రూ.50 వేలపైనే ఉంటుంది. ఈ బైక్‌ కదలాలంటే స్వైపింగ్‌ కార్డు ఉండాలి. ఇందుకు పాస్‌వర్డ్‌ తెలియాలి. దీనికి జీపీఎస్‌ సిస్టం అమర్చబడి ఉంటుంది. ఎవరైనా దొంగిలించినా సైకిల్‌ ఎక్కడ ఉందో వెంటనే తెలుసుకోవచ్చు. రాత్రి పూట కూడా వినియోగించుకునేందుకు ద్విచక్ర వాహనాలకు వలే ఫ్రంట్‌, బ్యాక్‌ లైట్లు ఏర్పాటు చేశారు. ఈ సైకిల్‌కి అమర్చిన బ్యాటరీ చార్జింగ్‌ చేయకపోయినా ఏడాదిపాటు పని చేస్తుందని అధికారులు తెలిపారు. హ్యాండిల్‌ లాక్‌ కూడా ఆటోమేటిక్‌ సిస్టంలోనే ఉంటుంది.

 

Advertisements

Latest Articles

Most Read