అమరావతిలో, రాయపూడి రెవెన్యూ పరిధిలో ఐదెకరాల్లో జరుగుతున్న హౌసింగ్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చక చకా జరుగుతున్నాయి... రాజధానిలో ఉద్యోగులు కోసం, 1,450 ఎకరాల్లో, 3,840 ఇళ్ల నిర్మాణం కోసం ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టారు... 2017 నవంబర్ లో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్ట్, ఫిబ్రవరి 2019 నాటికి, పూర్తి కానుంది... 15 నెలల్లో పూర్తి చేసేందుకు ప్రణాళిక రచించారు... ఆ విధంగానే పనులు కూడా జరుగుతున్నాయి... పైల్‌ పౌండేషన్‌ పనులు చివరి దశకు వచ్చాయి... మార్చి పదో తేదీన గ్రౌండు శ్లాబు, 18న మొదటి శ్లాబు వేసేలా ప్లాన్ చేసారు. మూడు నెలల్లో 12 స్లాబులు పూర్తి చేస్తారు...

amaravati housing 26012018 2

61 టవర్లలో 3,840 ఇళ్లు నిర్మాణం చేస్తున్నారు... శాసనసభ్యులు, అఖిల భారత సర్వీసు అధికారులు మొదలుకుని గెజిటెడ్‌ అధికారులు, ఎన్జీవోలు, 4వ తరగతి ఉద్యోగులకు వీటిలో నివాసవసతి కల్పిస్తామన్నారు. ఇటుకలే అవసరం లేని అత్యధునాతన షియర్‌వాల్‌ టెక్నాలజీతో ఇల్లు నిర్మిస్తున్నారు... ఇందులో 240 ఎమ్మెల్యేల గృహాలు, 144 ఐఏఎస్‌ల ఇళ్ళు, 1968 ఎన్జీవోల ఇళ్లు, 15 క్లాస్‌ ఫోర్‌ ఉద్యోగస్తుల ఇళ్లు ఉంటాయి...

amaravati housing 26012018 3

మంత్రి నారాయణ, వారానికి రెండు సార్లు వచ్చి, ఈ ప్రాజెక్ట్ పురోగతి చూస్తున్నారు... మొత్తం 97 రిగ్గులతో రోజుకు 220 ఫైల్స్‌(పిల్లర్‌లు) పూర్తి చేస్తామని చెప్పారు. 22 రిగ్గులతో తాత్కాలిక సచివాలయం పనులు పూర్తి చేశామన్నారు. ఆధునిక టెక్నాలజీతో నిర్మాణాలు చేస్తున్నట్లు చెప్పారు. డిసెంబరు కల్లా 85 లక్షల చదరపు అడుగులలో నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు... రైతులకిచ్చిన ప్లాట్లలో కూడా పనులు జరుగుతున్నాయని, అండర్‌ గ్రౌండు డ్రెయినేజీ, విద్యుత్‌, ఇతర మౌలిక సదుపాయాలు ఇదే సమయానికి పూర్తి చేస్తామన్నారు... రాజధానిలో 34 పెద్ద రోడ్లు ఏర్పాటు అవుతున్నట్లు తెలిపారు. ఇందులో 22 రోడ్లకు చెందిన టెండర్లు పూర్తి చేసుకొని నిర్మాణ పనులు వేగవంతంగా చేస్తున్నట్లు చెప్పారు. రూ.22 వేల కోట్ల మేర టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అసెంబ్లీ , సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవనం, ముఖ్యమంత్రి నివాసం ఇంటర్నల్ డిజైన్‌ నిర్మాణం మీద కసరత్తు జరుగుతుంది అని, వచ్చే నెలలో టెండర్లు పిలిచే అవకాసం ఉందని, వెంటనే పనులు ప్రారంభమవుతాయన్నారు.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో, బొండా ఉమా గెలుపుకు ప్రధాన కారణం, ఈ ఎన్నికల హామీ... ఇచ్చిన మాట ప్రకారం, హామీ నెరవేర్చి, చిత్తశుద్ధి చాటుకున్నారు... విజయవాడలో ఉన్న చెత్త అంతా వెళ్ళేది, సింగ్‌నగర్‌ దగ్గర ఉన్న డంపింగ్ యార్డ్ లోకే... ఎన్నికల హామీలో, ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పారు... సింగ్‌నగర్‌ వాసుల దశాబ్దాల నిరీక్షణకు నిలువెత్తు సమాధానంగా, ఈ సమస్య ఇన్నాళ్ళకు పరిష్కారం అయ్యింది.. పంచాయతీ రాజ్‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ రీ మీడియేషన్‌ ఆఫ్‌ బయోమైనింగ్‌ ప్రాజెక్టుకు డిసెంబరులో శంకుస్థాపన చేసారు. రూ.14 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు, ఏడాదిలోపే, రెండున్నర లక్షల టన్నుల చెత్తను తొలగించే స్థాయికి చేరుకోవాలని ముఖ్యమంత్రి టార్గెట్ ఇచ్చారు...

bonda uma 26012018 2

జిగ్మా గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నేతృత్వంలో ఈ పనులు రెండు వారాల క్రితమే పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయి. పనులను వేగవంతం చేసేందుకు ప్రసుత్త యంత్రాలను కొరియా నుంచి ప్రత్యేకంగా జిగ్మా సంస్థ తెప్పించుకుంది. ప్రస్తుతం పనిచేస్తున్న యంత్రాలతో రోజుకు వంద టన్నుల చెత్తను వేరు చేస్తున్న సిబ్బంది ప్లాస్టిక్‌, కంకర, మట్టి, లిక్విడ్‌ వేస్ట్‌ను వేరుచేస్తున్నారు. కొరియన్‌ సంస్థ నుంచి తెప్పించిన యంత్ర సామగ్రితో పనులను ప్రారంభించిన కాంట్రాక్టు సంస్థ రాబోయే 15 రోజుల్లో మరో నాలుగు యంత్రాలతో యార్డు నలు దిక్కుల నుంచి చెత్త వేరుచేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతోంది. ఏకకాలంలో పనులను చేపట్టడం ద్వారా రోజుకు నాలుగు వందల టన్నుల చెత్తను వేరు చేయొచ్చని జిగ్మా సంస్థ ప్రతినిధులు వివరిస్తున్నారు.

bonda uma 26012018 3

డంపింగ్‌ యార్డులో పేరుకుపోయిన చెత్తను బయో, ప్లాస్టిక్‌, పారిశుధ్య వ్యర్థాలుగా వేరుచేస్తారు. వేరు చేసిన వ్యర్థాలను అవసరమైన మేరకు విక్రయించి మరికొన్నింటిని భూమిలో కలిపేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తారు.ప్లాస్టిక్‌, పారిశుధ్య వ్యర్థాలు ప్లాస్టిక్‌ వ్యర్థాలను వేరుచేసి ఉపయోగపడేవాటిని విక్రయానికి పంపుతారు. పారిశుధ్య వ్యర్థాలను ప్రత్యేక శాస్త్రీయ పద్ధతిలో భూమిలో పూడుస్తారు. యార్డులో గోతులు తీసి పారిశుధ్య వ్యర్థాలను లేయర్లుగా వేసి మట్టితో పూడ్చేస్తారు. ఇలా కొన్ని లేయర్లు వేసిన అనంతరం పూడ్చిన వ్యర్థాలను సుమారు 12 సంవత్సరాల వరకు కదిలించకుండా చర్యలు తీసుకుంటారు. మధ్యలో బయటకు తీయడం వల్ల ప్రమాదకర విషవాయువులు వెలువడే అవకాశం ఉంటుంది.

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో, దేశంలోని సుప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో 9వదిగా ఉన్న అమృత యూనివర్సిటీ ఏర్పాటు కానుంది... వచ్చే నెల 7వ తేదీన శంకుస్థాపన జరగనున్నట్లు విశ్వస నీయంగా తెలిసింది. ముఖ్యమంత్రి చంద్ర బాబు చేతులమీదుగా ఈ కార్యక్రమం జరగబోతోందని సమాచారం. రాజధాని గ్రామాలైన నవులూరు- ఎర్రబాలెంల మధ్య రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 200 ఎకరాల్లో రూపుదిద్దుకోబోతున్న ఈ విశ్వవిద్యాలయం క్యాంపస్‌కు సంబంధించిన ఆకృతులను ఇటీ వల సీఎంకు ‘అమృత’ ప్రతినిధులు చూపారు.

amrita 26012018 1

ముఖ్యంగా ప్రవేశద్వారం, మంగళగిరి గాలిగోపురాన్ని ప్రతిబంబించే విధంగా ఉండటం, బాగా ఆకర్షించింది... మంగళగిరి నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో, నవులూరుకు సమీపంలో ఈ అమృత అమరావతి యూనివర్శిటీ క్యాంపస్‌ ఏర్పాటు కానుంది. ఇందులో అత్యాధునికమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో సహా మెడికల్‌ విద్యా,వైద్యసంస్థలు మరియు ఇంజినీరింగ్‌ సంస్థలను కూడా నెలకొల్పనున్నట్లు తెలిసింది... దేశంలోని ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో నంబర్వన్ స్థానంలో, అన్ని యూనివర్సిటీల్లో 9వ అత్యుత్తమైనదిగా, ఆసియా ఖండం బెస్ట్‌ యూనివర్సిటీల్లో 168గా పేరొందిన అమృత సంస్థకు దేశంలోని అమృతపురి, కోయంబత్తూరు, కొచ్చిన్‌, బెంగుళూరు, న్యూఢిల్లీలలో ఇప్పటికే 5 క్యాంపస్ ఉన్నాయి.

amrita 26012018 2

అమరావతిలో, 5 ఏళ్లలో పూర్తయ్యే తొలి దశను 150 ఎకరాల్లో, 5 నుంచి 7 ఏళ్లల్లో సిద్ధమయ్యే మలి దశను 50 ఎకరాల్లో నిర్మించనున్నారు... 5 ఏళ్లలో పూర్తయ్యే తొలి దశను 150 ఎకరాల్లో, 5 నుంచి 7 ఏళ్లల్లో సిద్ధమయ్యే మలి దశను 50 ఎకరాల్లో నిర్మించనున్నారు... మొత్తం 6 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణముండే 7 అంతస్థుల భవన సముదాయాలను ఈ క్యాంపస్‌లో నిర్మిస్తారు. .. విద్యార్థినీ విద్యార్థుల కోసం వేర్వేరుగా వసతిగృహాలను జి ప్లస్‌ 10 ఫ్లోర్లతో నిర్మించనున్నారు.... అధ్యాపకులు, ఉద్యోగుల కోసం లక్షకు పైగా చదరపుటడుగుల విస్తీర్ణంలో, 14 అంతస్థుల్లో, 104 అపార్ట్‌మెంట్లను నిర్మిస్తారు.

రాజధాని నిర్మాణాలకు ప్రధాన అడ్డంకిగా ఉన్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ముడిసరుకు, ఇతర భారీ సామగ్రి తరలించేందుకు జలరవాణా పై దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఫెర్రీ నుంచి రాజధానికి ముడిసరుకు తరలించేందుకు రంగం సిద్ధం చేసింది. ఆ మేరకు కేంద్ర జలవనరులశాఖ అనుమతితో భారీ పంటు నిర్మాణం చేపట్టి పూర్తి చేసింది. ఫెర్రి నుంచి లింగాయపాలేనికి వెళ్లేందుకు పంచాయతీలో 9 నెలల క్రితం తీర్మానం చేయగా, పాలకవర్గం ఆమోదం తెలిపింది.

amaravati ravana 2601201821

రాజధాని అవసరమైన ముడిసరుకు, రాతి క్వారీ మెటీరియల్ తో పాటు హైదరాబాద్, మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే సరుకు విజయవాడ మీదుగా రావాలంటే ఎంతో సమయం పడుతుంది... అది కూడా రాత్రి వేళ మాత్రమే భారీ వాహనాలకు అనుమతి ఇస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంటూరు జిల్లా కంటే రాతి క్వారీల నుంచి ఎక్కువ ఉత్పత్తి, కృష్ణా జిల్లాలో జరుగుతుంది. ఆ సరుకును తేలికగా రాజధాని తరలించినట్టయితే రాజధానికి ముడిసరుకు కొరత తీరుతుంది...

amaravati ravana 26012018 3

దీనిని దృష్టిలో ఉంచుకుని భారీ పంటు పై ఒకేసారి 30 లారీలు సుమారు 150 టన్నులు తరలించే విధంగా నిర్మాణం చేశారు. అది విజయవంతమైతే మరికొన్నిటిని అనుమతిచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నారు... భారీ పంట్లు సఫలీకృతం అయితే రాజధాని ట్రాన్స్పోర్ట్ అవకాశాలు మెరుగవుతాయని అబిప్రాయ పడుతున్నారు. ఫెర్రి వద్దకు భారీ వాహనాల రాకపోకల వల్ల భవిష్యత్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సంగమం రహదారి గుండా భారీ వాహనాలు అనుమతిస్తే కరకట్ట కుంగిపోయే అవకాశం ఉంది. దీని పై కూడా ప్రభుత్వం ప్రత్యామ్న్యాయం ఆలోచిస్తుంది...

Advertisements

Latest Articles

Most Read