శశికళ... ఈ పేరు తెలియని వారు ఉండరు... ఉండేది తమిళనాడు అయినా, దేశం మొత్తం మారుమోగిన పేరు.. జయలలితతో కలిసి చేసిన అవినీతి కేసులో ప్రస్తుతం జైలు జీవితం అనుభావిస్తున్నారు... జయలలిత మరణం, ఆ ఎపిసోడ్ మొత్తం జరిగిన విధానంలో, నిత్యం వార్తల్లోకి ఉంటూ, చివరకు జైలు జీవితం అనుభవిస్తుంది శశికళ... నిన్న జరిగిన ఒక విషయం చుస్తే, ఈమె ఎంత తెలివిగలదో అర్ధమవుతుంది.. ఈ విషయం తెలియక, పాపం మన రాష్ట్రంలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వారం వారం కోర్ట్ కి వెళ్తున్నారు అంటూ, సోషల్ మీడియాలో సెటైర్ లు పేలుతున్నాయి... ఈ సలహా ఇంత లేట్ గానా జగన్ కు ఇచ్చేది అంటున్నారు...

sasi 24012018 2

ఇంతకీ విషయం ఏంటి అంటే, గుట్కా కుంభకోణం కేసులో శికళనను ఆదాయపు పన్ను శాఖ అధికారులు విచారించబోతున్నారు... పొయెస్ గార్డెన్‌లోని ‘అమ్మ’ జయలలిత నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న కీలక పత్రాల ఆధారంగా ఈ స్కాం బయట పడింది... నిషేధిత గుట్కా విక్రయాలకు వీరు అవకాశం కల్పించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు... ఈ కేసులో విచారణకు వచ్చే నెల 10న హాజరు కావాలని శశికళకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులిచ్చింది. అయితే తాను మౌన వ్రతంలో ఉన్నానని, విచారణకు హాజరు కాలేనని ఆమె తెలిపారు. వచ్చే నెల 20 వరకు మౌన వ్రతంలో ఉంటానని పేర్కొన్నారు...

sasi 24012018 3

ఈ సమాధానంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు అవాక్కయ్యారు... ఈ విషయం ఎలా డీల్ చెయ్యాలో తెలియక పై అధికారులతో చర్చిస్తునారు... ఇది ఇలా ఉండగా, ఈ విషయాన్ని, మన రాష్ట్రంలో ఉన్న జగన్ తో లింక్ పెట్టి, సోషల్ మీడియాలో సెటైర్ లు పేలుతున్నాయి... జగన్ కూడా ప్రతి శుక్రవారం నాకు, మౌన వ్రతం అని చెప్పి విచారణని తప్పించుకోవచ్చు అంటూ, ఇలా రకరకాలుగా పోస్ట్ లు పెడుతున్నారు.. అయినా, విచారణాధికారులు, ఇలాంటి వాటికి లొంగుతారా ? సెంటిమెంట్ అంటూ గౌరవిస్తారా ? వారి పని వారు చేసుకోపోతారా ? చూద్దాం...

కాపు రిజర్వేషన్ల పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం, నిర్ణయం తీసుకుని, 5 శాతం రిజర్వేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే... జస్టిస్ మంజునాథన్ కమిషన్ సూచనలు ప్రకారం, నిర్ణయం తీసుకుంటూ, డిసెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది... వెంటనే, బిల్లు రూపంలో, అసెంబ్లీలో కూడా పెట్టింది... ఈ బిల్లు అసెంబ్లీలో కూడా ఆమోదం పొంది, కేంద్రానికి వెళ్ళింది... అంతకంటే ముందు, ఈ బిల్లు గోవర్నర్ వద్ద కూడా ఆమోదం పొందింది... ఇప్పుడు కేంద్రం పరిధిలో ఈ బిల్లు ఉంది... కేంద్ర హోంశాఖ వద్దకు ఈ బిల్లు చేరింది... దీంతో కేంద్రం కూడా ఈ బిల్లు పై తదుపరి చర్యలు చేపట్టింది...

kapu 24012018 1

కేంద్రం ఈ బిల్లు పై వివిధ శాఖల అభిప్రాయాలను కోరింది. న్యాయశాఖ, సామాజిక సాధికారికశాఖ, ఉన్నత విద్యాశాఖ, పాఠశాల విద్యాశాఖ, మైనార్టీ, గిరిజన, సిబ్బంది వ్యవహారాలశాఖల అభిప్రాయాలను కేంద్ర హోంశాఖ కోరింది.... గడువు కూడా విధించింది... 15 రోజుల్లోగా నివేదిక పంపాలని ఆయా శాఖలకు సూచించింది.... అన్నిశాఖల అభిప్రాయాలు వచ్చిన తర్వాత... షెడ్యూల్‌-9లో కాపు రిజర్వేషన్లను చేర్చే అవకాశం ఉంది. ఈ బిల్లు కనుకు ఆమోదం పొందితే, బిల్లులో ఉన్న ఈ అంశాలు అమల్లోకి వస్తాయి....

kapu 24012018 2

రిజర్వేషన్ల వివరాలు: విద్య, ఉద్యోగాల్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు... కాపులకు బీసీ (ఎఫ్‌) కేటగిరీలో 5 శాతం రిజర్వేషన్లు... కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలకు బీసీ రిజర్వేషన్లు... రాజకీయ పదవులకు రిజర్వేషన్లు వర్తించవని బిల్లులో పేర్కొన్నారు.. మొత్తానికి ఈ బిల్లు పై కేంద్రం కూడా సానుకూలంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది... ఏ అడ్డంకి లేకుండా ముందుకు వెళ్తుందా, లేక పొతే, ఎక్కడైనా ఫిట్టింగ్ పెడతారా అనేది చూడాల్సి ఉంది... ముద్రగడ లాంటి నేతలు, ఈ విషయం పై రాజకీయంగా, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టటానికి, కాచుకుని కూర్చున్నారు... చివరకు ఏమి అవుతుందో చూడాలి...

ఈ మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి, జగన్ పార్టీ, సాక్షి టీవీ/పేపర్, ఏ ఇష్యూ తీసుకున్నా, సెల్ఫ్ గోల్స్ వెయ్యటంలో వీళ్ళకి మించిన వాళ్ళు ఉండరు... సదావర్తి భూములలో 1000 కోట్ల కుంబకోణం అంటూ, హడావిడి చేసి కోర్ట్ టైం వేస్ట్ చేసి, చివరకు రాష్ట్రానికి ఒక్క పైసా కూడా రాకుండా, కోర్ట్ కి వెళ్లి, రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టారు... రాష్ట్రానికి రూపాయి రాకపోయినా పర్వాలేదు, ఆ భూములు మాత్రం అమ్మకుండా ఉండాలి అని, కోర్ట్ కి వెళ్లి, చివరకు, ఏమి చేసారో తెలుసా... తమిళనాడులోనే విషయం తేల్చుకోవాలి అంటూ, హై కోర్ట్ లో ఈ విచారణ ముసివేస్తున్నాం అని కోర్ట్ చెప్పింది... దీంతో, రాష్ట్రానికి వచ్చే నాలుగు డబ్బులు కూడా పోయి, చివరకు ఈ వైసీపీ వల్ల రాష్ట్రానికి గుండు సున్నా మిగిలింది...

alla 2402018 2

సదావర్తి సత్రం భూముల వ్యవహారం తమిళనాడులోని భూపరిపాలన కమిషనర్ కార్యాలయంలో అపరిష్కృతంగా ఉన్నందున ఇక్కడ విచారణ జరపలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది... తమకు విచారణ జరిపే అధికార పరిధి ఉండదని పేర్కొంటూ విచారణను మూసివేసింది హై కోర్ట్... సదావర్తి సత్రానికి చెందిన తమిళనాడులోని 83 ఎకరాల్ని వేలంలో ఏపీ సర్కారు రూ.22.44 కోట్లకు విక్రయించడాన్ని సవాలు చేస్తూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టుకు వెళ్ళాడు... ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరగా మళ్లీ హైకోర్టునే విచారించాలని సుప్రీం ఆదేశాలు జారీచేసింది....

alla 2402018 3

హైకోర్టులో తమిళనాడు సర్కారు అనుబంధ పిటీషన్ దాఖలు చేసి, సదావర్తి సత్రానివి అని చెబుతున్న భూములు తమకు చెందినవని వాదనలు వినిపించింది. మరోవైపు ప్రైవేటు వ్యక్తులు ఆ భూముల్లో కొంత విస్తీర్ణం తమకు చెందినవంటూ అనుబంధ పిటీషన్ వేశారు. మంగళవారం ఈ వ్యాజ్యం మరో సారి విచారణకు వచ్చింది. సదావర్తి సత్రం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తు. ఆ భూములు సత్రానికి చెందుతాయని పేర్కొంటూ తమిళనాడులోని స్థానిక న్యాయస్థానం 1924లో తీర్పు ఇచ్చిందన్నారు. తమిళనాడులోని భూపరిపాలన కమిషనర్ వద్ద, ఈ భూములకి పట్టా ఇవ్వమని అప్పీల్ దాఖలు చేశామని అది అపరిష్కృతంగా ఉందన్నారు... వాదనలు విన్న ధర్మాసనం, ఆభ్యంతరం ఉన్నవాళ్ల అక్కడే వాదనలు చెప్పుకోవాలంటూ విచారణను మూసివేసింది....

ఆంధ్రుల జీవనాడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులను నవయుగ చేతికి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో లేదో, నవయుగ రంగంలోకి దిగింది.... పేపర్ లో ప్రకటన ఇస్తూ, ఈ మహా యజ్ఞంలో మీరు భాగస్వాములు అవ్వండి అంటూ ఇలా ప్రకటన ఇచ్చింది "ఉదయించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్... ప్రతిష్టాత్మిక పోలవరం ప్రాజెక్ట్ ఒక సంవత్సరంలో పూర్తి చెయ్యాలి అనే సంకల్పంతో ఉన్నాం... ఈ భ్రమ్మండమైన ప్రాజెక్ట్ పూర్తి చేయటంలో మా బృందంతో జత కట్టండి" అంటూ, పోలవరం సైట్ లో, ఉద్యగాలు ఉన్నాయి అంటూ, ఏడు రోజుల్లో CVని పంపించమంటూ, ప్రకటనలు ఇచ్చింది....

poalvarm 24012018 2

గతంలో పనులు చేసిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ గడువులోగా పను లు చేయకపోవడంతో ప్రత్యమ్నాయచేసింది ప్రభుత్వం...ఈ నేపథ్యంలో కొత్తగా పోలవరం ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టర్గా నిర్మాణం పనులను చేపట్టేందుకు నవయుగ సంస్థ ముందుకొచ్చింది. ఈ నెలాఖరు నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు పూరి స్థాయిలో ఏర్పాట్ల పూర్తి కావచ్చని అంటున్నారు... తదుపరి ఫిబ్రవరినెలలో ప్రాజెక్ట్ పనులు నవయుగ ప్రారంభించే అవకాసం ఉంది... ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ జెన్కో విద్యుత్ కేంద్రం పనులను సైతం నవయుగ సంస్థ దక్కించుకుంది...

poalvarm 24012018 3

పోలవరం విషయంలో అటు కేంద్రానికి ఇబ్బంది లేకుండా, ఇటు ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌స్ట్రాయ్‌ కి ఇబ్బంది లేకుండా చంద్రబాబు అద్భుతమైన ఐడియా వేసారు... పోలవరం ప్రాజెక్టు కాంక్రీటు పనులు పరుగులు తీయడమే లక్ష్యంగా అదనంగా ఆర్థిక భారం పడకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఆందోళనను దూరం చేసేలా నవయుగకి పోలవరం పనులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు... పోలవరం స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనులు చేపట్టేందుకు ‘నవయుగ’ సంస్థను ముందుకు తెచ్చారు చంద్రబాబు... నవయుగ, ట్రాన్స్‌స్ట్రాయ్‌తో కలసి ఈ పనులు చేపట్టేందుకు అంగీకరించింది. అటు ట్రాన్స్‌స్ట్రాయ్‌ కూడా నవయుగతో కలిసి పని చేసేందుకు అంగీకరించింది.

Advertisements

Latest Articles

Most Read