విజయవాడలో ట్రాఫిక్ ఎంత పెద్ద సమస్యగా తయారు అయ్యిందో అందరికీ తెలిసిందే... అమరావతి రాజధానిగా చెయ్యటం, అంతకు ముందు తాత్కాలికంగా ప్రభుత్వం మొత్తం విజయవాడ నుంచే పరిపాలన చెయ్యటం, సిటీ పెరగటం, ఇలా అన్ని సమస్యలతో ట్రాఫిక్ రద్దీ బాగా ఎక్కువ అయింది.. ఒక పక్క విఐపి మూమెంట్ ఉండటం, మరో పక్క కనకదుర్గ గుడి దగ్గర ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉండటం, ట్రాఫిక్ నియంత్రించటంతో కూడా, ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కుంటున్నారు.. ఇటు వైపు గన్నవరం నుంచి ఎనికేపాడు దాకా కొంచెం ఫ్రీ గా ఉన్నా, ఎనికేపాడు నుంచి బెంజ్ సర్కిల్ వరకు నరకం కనిపిస్తుంది.. మరో పక్క, గొల్లపూడి నుంచి, భవానీపురం మీదగా సిటీకి వచ్చే ట్రాఫిక్ కూడా అంతే... ఈ ట్రాఫిక్ దెబ్బతో ప్రజలు బయటకు వెళ్ళాలి అంటేనే హడలి పోతున్నారు...

vijayawada 23012018

ప్రధానంగా కనకదుర్గ వారధి దగ్గర నుంచి గన్నవరం విమానశ్రయం వరకు, లారీలు కూడా ఇదే మార్గం గుండా వెళ్లాల్సి రావడంతో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారుతోంది అని, ఇదే ప్రధాన కారణం అని అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు నెల రోజుల క్రితం, ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ఒక ప్రతిపాదన పెట్టారు... సిటీలోకి పెద్ద వాహనాలు రాకుండా, ఎన్ హెచ్ - 216 మీదుగా మళ్లించాలన్న కలెక్టర్ లక్ష్మీకాంతం ప్రతిపాదనకు సీఎం సానుకూలంగా స్పందించారు. సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని జాతీయ రహదారుల సంస్థకు బాధ్యతలు అప్పగించారు.

vijayawada 23012018

ప్రకాశం జిల్లా వద్ద ప్రారంభమయ్యే 216వ నెంబర్ జాతీయ రహదారిని రేపల్లె, పెనుమూడి, పామర్రు, కత్తిపూడి మీదుగా ఐదో నెంబర్ జాతీయ రహదారికి మళ్లించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనిపై జాతీయ రహదారుల సంస్థ నుంచి స్పందన బాగానే వస్తున్నా. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ప్రాంతీయ అధికారుల నుంచి అంతగా స్పందన రావటం లేదు. ఎన్ హెచ్ - 216 విస్తరణ పనులు జరుగుతున్నందున భారీ వాహనాలు ఇటు మళ్లిస్తే మరిన్ని సమస్యలు వస్తాయని అధికారులు వాదిస్తున్నారు. దీని పై జాతీయ రహదారుల సంస్థ అధికారులు అయితే సమగ్ర అధ్యయనానికి సమాయత్తమయ్యారు. వారు కనుక ఒప్పుకుంటే, విజయవాడ వాసులకి ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయి...

ముఖ్యమంత్రి కుర్చీ కోసం అంటూ యాత్ర పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రం అంతటా తిరుగుతున్న సంగతి తెలిసిందే... ఇవాళ కొంచెం ఎర్లీగా బ్రేక్ ఇచ్చి, ఒక జాతీయ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు జగన్... ఆ ఇంటర్వ్యూ లో మోడీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు... బీజేపీ కనుక మేము, ప్రత్యెక హోదా ఇస్తాము అని ప్రకటిస్తే, బీజేపీతో కలుస్తాము అంటూ, బంపర్ ఆఫర్ ఇచ్చారు... అక్కడకి ఎదో బీజేపీ, జగన్ కోసమే ఎదురు చూస్తున్నట్టు, వాళ్ళకే ఆఫర్ ఇచ్చారు... జగన్, కలవకపోతే, మోడీ మళ్ళీ ప్రధాని అవ్వరు అని జగన్ ఫీల్ అవుతున్నాడో ఏమో కాని, దావోస్ లో ఉన్న మోడీ ఈ మాటలు విని, ఎలా ఫీల్ అయ్యారో పాపం...

jagan media 22012018 2

జగన్ మాట్లాడుతూ " ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తే 2019లో బీజేపీతో కలిసి వెళ్తా... మా ప్రధాన టార్గెట్ చంద్రబాబే.... హోదా హామీ నిలబెట్టుకుంటే మరో ఆలోచన లేకుండా బీజేపీతో అడుగులు వేస్తా.... కాంగ్రెస్ లో ఉన్నప్పుడు గౌరవనీయ వ్యక్తిగానే ఉన్నా..." అంటూ జగన్ చెప్పారు... అంతేనా యధావిధిగా చంద్రబాబు పై ఆరోపణలతో విరుచుకుపడ్డారు... ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు అవుతున్నా ఇప్పటివరకు రాష్ట్రంలో ఏమి జరగటంలేదు అని అన్నారు... అంతే కాదు, తనకిష్టమైన డైలాగ్ త్వరలో "నేనే సియం" అని చాలా సార్లు అన్నారు కూడా..

jagan media 22012018 3

జగన్ వ్యాఖ్యలు ఎంతో హాస్యాస్పదంగా ఉన్నాయి... ఒక పక్క బీజేపీ ఇప్పటికే, ప్రత్యేక హోదా ముగిసిన చరిత్ర అని చెప్పింది... ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పింది... ఒక పక్క పోలవరం పర్మిషన్ లు లేట్ అవుతున్నాయి... మరో పక్క నిధులు ఆలస్యం అవుతున్నాయి... హైదరాబాద్ ఉమ్మడి ఆస్తులు మీద ఇప్పటి వరకు ఏమి లేదు... మరి జగన్ ఇలాంటి వాటి మీద మాత్రం మాట్లాడడు..కేంద్రాన్ని ఏ నాడు ఒక్క మాట అనడు... కాని, బీజేపీ ఇస్తాను అంటే పొత్తు పెట్టుకుంటాడు అంట... ప్రతిపక్షంలో ఉండి, మా రాష్ట్రానికి ఇది కావలి అని పోరాడాలా ? లేక పొత్తు కోసం డ్రామాలు ఆడాలా ? మోడీ అంటే అంత భయమా ? ఇవ్వను అంటున్న బీజేపీ పొత్తు కోసం వెంపర్లాడటం ఎందుకు, కాంగ్రెస్ పార్టీ మేము అధికారకంలోకి వస్తే, ప్రత్యేక హోదా ఇస్తాము అంటుందిగా, కాంగ్రెస్ తో పొత్తు ఎందుకు పెట్టుకోవు ? ఎందుకంటే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాసం లేదు... మళ్ళీ మోడీనే వస్తాడు, మన కేసులు ఇంకో పదేళ్ళు లేటు చేసుకోవచ్చు అనే స్వార్ధం...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పని తనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు... చంద్రబాబు పట్టుదల, కష్టపడే తత్వం, ఓర్పు, విజన్ ఇలా అన్ని విషయాల్లోనూ ఆయన లాంటి రాజకీయ నాయకుడు ఎవరూ లేరు అనేది అందరూ చెప్తారు... చంద్రబాబు దగ్గర పని చేసిన వారు అయితే, ఆయనను దగ్గర నుంచి చూసి, ఆయనతో కలిసి పని చేసి, ఆయన దగ్గర ఉన్నందుకు గర్వ పడతారు.. ప్రత్యేక పరిస్థితుల్లో, తెలంగాణా లాంటి ప్రాంతాల్లో, చంద్రబాబుని విడిచి వెళ్ళిపోయిన వారు కూడా, ఇప్పటికే చంద్రబాబు సూపర్ అంటూ కితాబు ఇస్తున్నారు...

babu mohan 22012018 2

తాజగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు బాబుమోహన్ ప్రశంసలు కురిపించారు. ఆదివారం తన వ్యక్తిగత కార్యక్రమంలో భాగంగా విజయనగరం వచ్చిన ఆయన, చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు చేసారు... ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి పరిపాలనాదక్షుడు.. అభివృద్ధి కోసం రాజీలేని పోరాటం చేసే నేతగా కితాబు ఇచ్చారు... ఎలాంటి ఉపద్రవం వచ్చినా తట్టుకుని ముందుకు పోగల ధైర్యం చంద్రబాబు సొంతమని కితాబిచ్చారు. ‘ఆయనతో కలిసి పనిచేసిన రోజుల్లో ఆయన పనితనాన్ని దగ్గరగా చూసేవాడిని. ఆయన ఓపిక, పట్టుదలను చూసి ముగ్ధులయ్యేవారం.

babu mohan 22012018 3

ఇప్పటికీ అదే స్పీడు, పట్టుదల ఆయనలో కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బాబు సూపర్‌.. బ్రహ్మాండం’ అని బాబు మోహన్ చెప్పారు. మరో పక్క ఇటు జగన్ మోహన్ రెడ్డి మాత్రం, దావోస్ వెళ్ళినా, చంద్రబాబు హోలిడి ఎంజాయ్ చెయ్యటానికి వెళ్ళాడు అని విమర్శలు చేస్తాడు... ఆయనకు విజన్ లేదు అంటాడు జగన్... నేను ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి భవిష్యత్తు అని ఊరు ఊరు తిరిగి చెప్తున్నాడు... ఈ జగన్ బాబుకి, బాబు మోహన్ లాగా, చంద్రబాబు గొప్పతనం ఎప్పటికి తెలుస్తుందో ?

గుజరాత్‌కు చెందిన అదానీ గ్రూప్ అధినేత, పారిశ్రామికవేత్త గౌతమ్‌ ఆదాని, అంటే దేశంలో తెలియని వారే ఉండరు.. ప్రధాని మోడీకి సన్నిహితుల్లో అదానీ ఒకరు... మోడీ, అమిత్ షాకు అదానీ అత్యంత సన్నిహితుడు అనే ప్రచారం ఉంది... అది వాస్తవం కూడా... ఇది ఇలా ఉంటే, రాష్ట్రంలో ఉన్న ప్రతి పక్ష నాయకుడు వైఎస్ జగన్, ఆదానీ మధ్య పరిచయాలు ఉన్నాయి... ఆ పరిచయాలతోనే 2014లో, ఆదానీ ద్వారా బీజేపీతో పొత్తుకు ప్రయత్నించారు... అప్పట్లో జగన్, ఆదానీ కలుసుకోవటం సంచలనం అయ్యింది... కాని అప్పట్లో, మోడీ, జగన్ తో కలవటానికి ఒప్పుకోకుండా, చంద్రబాబు వైపే మొగ్గు చూపారు...

adani 22012018 2

ఈ మధ్య జగన్, ఉన్నట్టు ఉంది ప్రధానిని కలవటానికి కూడా, ఆదానీ ద్వారానే అప్పాయింట్మెంట్ సంపాదించారు అనే ప్రచారం కూడా ఉంది.. ఆదానీ ద్వరా, మోడీతో లింక్ కుదుర్చుకుంటున్నారు జగన్, అని చంద్రబాబు గ్రహించారు... ఆ లింక్ మీద దెబ్బ దెబ్బకొట్టే రాజకీయ ఎత్తుగడ వేసారు చంద్రబాబు... అందుకే, జగన్ ఏ మార్గం అయితే ఎంచుకుని ఆదానికి దగ్గర అయ్యారో, ఆ వ్యాపార మార్గంలోనే ఆదానిని దగ్గర చేసుకుని, జగన్ కి చెక్ పెట్టే ప్రయత్నం చేసారు... జగన్ ఏ మార్గంలో, ఇబ్బంది పెట్టాలి అని ప్లాన్ చేసాడో, అదే మార్గంలో జగన్ కు రివర్స్ ట్రీట్మెంట్ ఇవ్వటానికి రెడీ అయ్యారు...

adani 22012018 3

అందుకే శ్రీకాకుళం జిల్లా భావనపాడులో నిర్మించతలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్‌ నాన్‌ మేజర్‌ పోర్టు నిర్మాణ బాధ్యతలను అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజెడ్‌ లిమిటెడ్‌కు అప్పగించాలని, చంద్రబాబు నిర్ణయించారు... పోటీదారులుగా నవయుగ, గంగవరం పోర్ట్ కూడా రేసులో నిలిచినా, చివరకు వారు తప్పుకున్నారు... భావనపాడు పోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది.. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్మించే ఈ ప్రాజెక్టును.. అదానీ సంస్థ చేపడుతుంది. ఇందుకు గాను తొలి 30 ఏళ్లలో మొత్తం ఆదాయంలో 2.3 శాతం వాటాను రాష్ట్రప్రభుత్వానికి చెల్లిస్తుంది. 31 నుంచి 40 ఏళ్ల వరకు 4.6 శాతం.. 41 నుంచి 50 ఏళ్ల వరకు 9.2 శాతం వాటాను ఇస్తుంది. ఇటీవల కేరళలోనూ అదానీ సంస్థ ఓడరేవు నిర్మాణం చేపట్టింది. దీంతో.. రాష్ట్రంలోనూ ఆ సంస్థ ఓడరేవు నిర్మాణం పనులు చేపట్టేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని న్యాయశాఖ, అడ్వకేట్‌ జనరల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

Advertisements

Latest Articles

Most Read