ఆ పాప పేరు లక్ష్మీ సాత్విక... కడపలో ఒక చిన్న స్కూల్ లో చదువుతుంది... ఇప్పుడు మాత్రం ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలిచి తన సత్తా చాటింది... ప్రభుత్వం ఏర్పాటు చేసిన వర్చువల్ క్లాసురూమ్స్ ద్వారా తనకున్న ప్రతిభకు మరింత పదును పెట్టి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకువచ్చింది... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అన్ని జిల్లాల కలెక్టర్ల ముందు ఆ అమ్మాయని అభినందించారు... వర్చువల్ క్లాసురూమ్స్ అని ప్రజలను మభ్య పెడుతున్నారు అని, అసత్య ప్రచారం చేస్తున్న వారికి, ఈ పాప విజయమే సమాధానం... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...
కడప జిల్లా కస్తూర్బా పాఠశాలకు చెందిన లక్ష్మీ సాత్విక, 9వ తరగతి విద్యార్ధిని... అంతర్జాతీయ సైన్స్ ఒలంపియాడ్లో తన ప్రతిభను చాటి, మూడో ర్యాంకు సాధించింది... ఇదేదో ఆషామషీ పరీక్ష కాదు, ప్రపంచ వ్యాప్తంగా, 33 దేశాల నుంచి పిల్లలు ఈ పరీక్షలో పాల్గున్నారు... వారి అందరితో పోటీ పడి, మన రాష్ట్రానికి చెందిన, లక్ష్మీ సాత్విక మూడవ ర్యాంకు సాధించింది... ఇలా చదువుకుని, మంచి టాలెంట్ ఉన్న పిల్లలు అంటే ముఖ్యమంత్రికి ఎంత మక్కువో తెలిసిందే.. అందుకే, శుక్రవారం కలెక్టర్ల సదస్సుకు అధికారులు ఆ విద్యార్థినిని తీసుకొచ్చారు...
కలెక్టర్ల అందరి ముందూ సాత్వికను అభినందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.... అంతే కాదు, ఇంత అద్భుతమైన ప్రతిభ కనబరచడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన సీఎం, సాత్వికకు రూ.5 లక్షలు ప్రకటించారు. రూ.5 లక్షలు సాయి సాత్విక పేరు మీద డిపాజిట్ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు... సాత్విక ఉన్నత విద్యాభ్యాసానికి అవసరమయ్యే వ్యయం మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు...