విలక్షణ నటుడు తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్, రెండు నెలల క్రితం, టైమ్స్ లిట్‌ఫెస్ట్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ, "ఐ యాం ఏ ఫ్యాన్ అఫ్ చంద్రబాబు నాయుడు" అంటూ, దానికి కారణాలు చెప్తూ, ఇది వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం పడిన కష్టం, ఇప్పుడు నవ్యాంధ్ర కోసం పడుతున్న కష్టం గురించి చెప్తూ, ఆ వ్యాఖ్యలు చేసారు... మళ్ళీ ఇప్పుడు కమల్ హాసన్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు చేసారు... ఒక తమిళ మ్యాగజైన్ లో రాసిన ఎడిటోరియల్ లో చంద్రబాబుతో పేరు ప్రస్తావిస్తూ, ఆర్టికల్ రాసారు...

kamal 19012018 2

ద్రవిడ గుర్తింపు కింద దక్షిణ భారతదేశం ఏకమై సమష్టి వాణి వినిపిస్తే అది కేంద్ర ప్రభుత్వాన్ని దారిలోకి తీసుకురావడానికి సరిపోతుందని సినీ నటుడు కమల్ హాసన్ అన్నారు... చంద్రబాబుతో పాటు, మిగతా దక్షిణాద రాష్ట్రాల ముఖ్యమంత్రుల పేర్లు ప్రస్తావిస్తూ, వీరందరూ ద్రవిడులే... దక్షిణ భారత దేశమంతటా ద్రవిడ గుర్తింపు విస్తరించిన పక్షంలో మన పట్ల కేంద్ర ప్రభుత్వ వివక్ష అదృశ్యమైపోతుంది. మనమంతా ఏకమై సమష్టి గొంతు వినిపిస్తే అది మనలను ఢిల్లీతోమాట్లాడటానికి అనుమతిస్తుంది అని కమల్ హాసన్ అన్నారు.

kamal 19012018 3

కేంద్రం ఇక్కడి నుంచి వసూలు చేసిన పన్నులను ఉత్తర భారత రాష్ట్రాలకు ఖర్చుపెడుతున్నదని కొందరు అంటున్నా రు. అది ఉమ్మడి కుటుంబం పని చేసే తీరుకు అద్దం పడుతుంది అని ఆయన తెలిపారు. కష్టపడి సంపాదించే అన్నయ్య కుటుంబంలో ఉద్యోగం లేని తమ్ముళ్ళను చూసుకోవాలి. కానీ తమ్ముళ్ళ దానిని అలుసుగా తీసుకొని అన్నయ్యను మోసగించి, ఆకలితో అలమటించేలా చెయ్యకూడదు అని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ఉన్న సైకోలురెచ్చిపోతూనే ఉన్నారు... పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, వీరి ఆగడాలకు అంతం లేకుండా పోయింది... మొన్నటికి మొన్న, రాష్ట్రం మొత్తం ఆనందంగా, అమరావతిలో, భారత రాష్ట్రపతిని పిలిచి వేడుకలా ఫైబర్ నెట్ కేబుల్ ప్రారంభించిన వేళ, రాష్ట్రంలోని సైకోలు తమ బుద్ధి మరోసారి బయట పెట్టారు.. మన ఆనందం పాడు చెయ్యాలి అనే ఉద్దేశంతో, ఫైబర్ నెట్ కేబుల్‌ కట్ చేసి తమ పైశాచిక ఆనందం చూపించారు. రాష్ట్రపతి కోవింద్ అమారవతి పర్యటన కార్యక్రమ ప్రసారం కాకుండా దుండగులు ఇంటర్‌నెట్ ఫైబర్ కేబుల్‌ని కట్ చేశారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. 6 చోట్ల కేబుల్‌ని కట్ చేసినట్లు అధికారులు గుర్తించారు.

cbn fiber 19012018 3

అప్పటి నుంచి, ఇలా ఫైబర్ గ్రిడ్ కేబుల్స్ కత్తిరించటం జరుగుతూనే ఉంది... ఇవాళ కల్లెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఈ విషయం పై స్పందించారు... ఫైబర్ గ్రిడ్ కేబుల్స్ కత్తిరించే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించండని ఎస్పీలకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసే వాళ్ళు దేశద్రోహులని సీఎం మండిపడ్డారు. ఇక్కడ సీఎం మాట్లాడుతూ... కిందిస్థాయి అధికారుల సహకారం ఉంటే సస్పెండ్ చేయాలన్నారు. పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు బాగుండాలని ఆయన చెప్పారు. కేసుల దర్యాప్తులో సాంకేతికత ఉపయోగపడాలన్నారు. తప్పు చేసిన వ్యక్తి ఏ స్థాయిలో వున్నా శిక్షపడాల్సిందేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

cbn fiber 19012018 2

ప్రతి పేద వాడికి, విజ్ఞానం, వినోదం కూడా అందించాలి అనే లక్ష్యంతో, చంద్రబాబు ప్రభుత్వం ఫైబర్ నెట్ తో, 150 రుపాయిలకే, ఫోన్, టీవీ, ఇంటర్నెట్ కలిపించటం కోసం, కృషి చేస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే కొన్ని చోట్ల కనెక్షన్ లు కూడా ఇస్తున్నారు... ఇప్పటికే ఈ ఫైబర్ నెట్ మీద కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయి... ఈ ప్రాజెక్ట్ ఆపెయ్యాలి అని, కోర్ట్ లో కేసులు కూడా వేసాయి... అయితే వీళ్ళ కుట్రలని కోర్ట్ తిప్పి కొట్టింది... ఇప్పుడు ఇలా కొంత మంది వైర్లు కత్తిరిస్తున్నారు... ఆ సైకోలు ఎవరు అనే విషయం పోలీసులు విచారణ చేసి, ప్రజల చేతే బుద్ధి చెప్పించాలి...

పోయిన ఏడాది ఆగష్టు నెలలో, దేశంలోనే మొదటి సారిగా, మన రాష్ట్రంలోనే మొదటి డ్రోన్ తయారీ జరుగుతుంది అని మేము ఒక ఆర్టికల్ రాస్తే, సోషల్ మీడియాలో కొంత మంది వెటకారం చేశారు... కట్ చేస్తే, ఇవాళ మొదటి డ్రోన్ తయారు అయ్యి, దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు తీసుకువచ్చారు... దేశంలోనే మొదటి సారిగా, డ్రోన్ ఆంధ్రాలో తయారు అయ్యింది... గర్వంగా దాని మీద మేడ్ ఇన్ ఆంధ్రా అని రాసుకున్నాం... ఇప్పటి వరకూ డ్రోన్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ఇక నుంచి సొంతంగా తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసింది...

drones 19012018 2

ఆంధ్రప్రదేశ్ ను గ్లోబల్ డ్రోన్ హబ్ గా మార్చేందుకు డ్రోన్ ఎక్సలెన్స్ సెంటర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి విశాఖపట్నంలో డ్రోన్ తయారీ పరిశోధన, నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఒమ్ని ప్రెసెంట్ కంపెనీ సంస్థ ముందుకు వచ్చింది... ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ, డ్రోన్ తయారీ సంస్థ ఓమ్ని ప్రెసెంట్ భాగస్వామ్యంతో విశాఖపట్నం లో ఏర్పాటు చేసిన అమరావతి డ్రోన్ల కంపెనీ లో తయారు చేసిన మొదటి మేడ్ ఇన్ ఆంధ్రా డ్రోన్ ను కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు లాంచ్ చేసారు...

drones 19012018 3

ఐటి శాఖ మంత్రి నారా లోకేష్, ఐటి శాఖ సెక్రెటరీ విజయానంద్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డ్రోన్ ప్రత్యేకతలను ముఖ్యమంత్రికి వివరించారు.. మార్కెట్ లో దొరికే డ్రోన్ల కంటే ఎక్కువ నాణ్యత, తక్కువ ధరకే మేడ్ ఇన్ ఆంధ్రా డ్రోన్ల తయారీ... ఇప్పటివరకూ దేశంలో ఎక్కడా డ్రోన్ల తయారీ యూనిట్లు లేవు.... తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే డ్రోన్ల తయారీకి ముందుకు వచ్చింది.. ఎర్రచందనం ఆక్రమ రవాణాని అరికట్టడం, సిఆర్డిఏ పోలవరం పనులు, స్మార్ట్ పోలీసింగ్ లోనూ డ్రోన్లను ఉపయోగించుకునే అవకాశం ఉంది...

జనసేన పార్టీ సడన్ గా ఆక్టివ్ అయ్యింది... దాదాపు నెల రోజుల నుంచి సైలెంట్ గా ఉన్న జనసేన పార్టీ, ఒకేసారి ఆక్టివ్ అయ్యి, అనూహ్య పరిణామంతో అందరినీ అవాక్కయ్యేలా చేసింది... జనసేన పార్టీ కోశాధికారి రాఘవయ్యతో పాటు ఇతర నేతలు ముద్రగడతో, తూర్పు గోదావ‌రి జిల్లాలో ఆయన సొంత గ్రామం కిర్లం పూడిలో భేటీ అయ్యారు.... పార్టీని బ‌ల‌ప‌ర్చుకోవాల‌ని ప్రణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్న తరుణంలో, ఈ పరిణామం జరిగినట్టు తెలుస్తుంది... దాదాపుగా ఐదు గంటల పాటు జనసేన కార్యకర్తలు ముద్రగడ పద్మనాభం తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ..

janasena 19012018 2

ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంతో జ‌న‌సేన బృందం ఏయే అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రుపుతోందో తెలియాల్సి ఉంది. అయితే పవన్ చెప్తున్న వ్యాఖ్యలకు, జనసేన పార్టీ చేస్తున్న పనులకు పొంతన లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు... ఒక పక్క కుల రాజకీయాలకు నేను వ్యతిరేకం అంటూ, పవన్ మళ్ళీ కుల నాయకుడుతో భీటీ అవ్వటంతో, పవన్ కూడా అన్ని రాజకీయ పార్టీలు లాగే అనే అభిప్రాయం కలుగుతుంది అని అంటున్నారు... పవన్ తన పార్టీ సిద్ధాంతం అని ట్వీట్ చేస్తూ, మొదట చెప్పిన మాట "కులాలను కలిపే ఆలోచన విధానం" అని...

janasena 19012018 3

మరి అలాంటింది, ఈ సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకం అయిన, ముద్రగడతో సంప్రదింపులు జరపటం, జనసేన సిద్ధాంతానికి వ్యతిరేకం అనే అభిప్రాయం వస్తుంది... ఏది ఏమైనా, ఇది ఒక అనూహ్య పరిణామంగా రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు... ఒక పక్క ముద్రగడ, జగన్ మనిషి అనే అభిప్రాయం ఉండటం, మరో పక్క పవన్, జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడటం... ఈ పరిణామాల్లో, జనసేన వేసిన అడుగు, అంచనాలకు అందటం లేదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు...

Advertisements

Latest Articles

Most Read