సామాన్యంగా రాజకీయ నాయకులతో ప్రభుత్వ ఉద్యోగులు కొంచెం దూరంగా ఉంటారు... ఫార్మాలిటీగా విష్ చెయ్యటం, లేకపోతే ఏదన్నా విషయం బ్రీఫ్ చెయ్యటం, ఇంత వరుకే ఉంటుంది... ఏమన్నా క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నా, అది బహిరంగంగా బయట చూపించరు.. కాని నిన్న జగన్ పాదయాత్రలో ఒక ఆశక్తికరమైన సంఘటన చోటు చేసుకుని... ఒక పోలీసు అధికారి జగన్ చెయ్యి పట్టుకుని, కొంత దూరం పాదయాత్ర చెయ్యటంతో అక్కడ అందరూ అవాక్కయ్యారు... మరీ ఇంత బహిరంగంగా ఒక రాజకీయ నాయకుడితో, పోలీసు ఉన్నత స్థాయి అధికారి చేయి చేయి పట్టుకుని ఒక రాజకీయ యాత్రలో నడవటం, అందరినీ ఆశ్చర్య పరించింది... వివరాలు ఇలా ఉన్నాయి..
ప్రతిపక్ష నాయకుడు జగన్ చిత్తూరు జిల్లలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే... పూలవాండ్లపల్లె నుంచి వాల్మీకిపురం మధ్య సాగిన జగన్ పాదయాత్రలో విధులు నిర్వహించేందుకు వచ్చిన రొంపిచెర్ల ఎస్ఐ నాగార్జునరెడ్డి కొంతసేపు జగన్ చేయి పట్టుకుని నడవడం చర్చనీయాంశమైంది. దీన్ని చూసి పార్టీ నాయకులు సైతం ఆవాక్కయ్యారు. అనంతపురం జిల్లాకు చెందిన నాగార్జునరెడ్డి కడప జిల్లాలో వివాహం చేసుకున్నారు. గతంలో చౌడేపల్లె ఎస్ఐ గా పనిచేశారు. వారం కిందటే చిత్తూరు నుంచి వచ్చి రొంపిచెర్లలో బాధ్య తలు స్వీకరించారు. ప్రభుత్వ ఉద్యోగి ఒక పార్టీ అధినేత వెంట సన్నిహితంగా నడవటం చర్చకు తావిచ్చింది.
మరో వైపు జగన్ పాదయత్ర పై ప్రత్యర్ధి పార్టీలు విమర్శలు చేస్తున్నాయి... ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డి చేస్తున్న పాదయాత్ర ఓ రికార్లేనని, దేశ చరిత్రలోనే ఇలాంటి పాదయాత్ర ఇంతకు ముందెప్పుడూ ఏ నాయకుడు చేయలేదని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ నగర పరిధి భీమిలి మండలం కాపులుప్పాడలో మంగళవారం జరిగిన జన్మభూమి కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. వారంలో ఒక రోజు కోరుకు వెళ్లి వచ్చి పాదయాత్ర చేస్తున్న ఏకైక నాయకుడు వైఎస్ జగనేనని ఎద్దేవా చేశారు. శాసనసభ సమావేశాలను మొత్తంగా బహిష్కరించిన ఘనత కూడా ఆయనకు, ఆయన పార్టీకే దక్కుతుందన్నారు. రాజకీయ అపరిపక్వతకు ఈ విధమైన ధోరణి అద్దం పడుతోందన్నారు.