అనుకున్నదే జరిగింది... పొద్దున నుంచి పులివెందులలో, ముఖ్యమంత్రి పర్యటనలో అలజడి సృష్టించాలి అని సర్వ ప్రయత్నాలు చేసి విఫలం అయిన వైసిపి ఏకంగా తన ఎంపీ చేతే సభలో అలజడి సృష్టించారు... ఏ ఎమ్మల్యే, ఎంపీ, కార్యకర్త జన్మభూమి మీటింగ్లకు వెళ్ళద్దు అని ఆదేశాలు ఇచ్చిన వైసిపి, కడపలో పులివెండ్లలో జరుగుతున్న ముఖ్యమంత్రి మీటింగ్ కు మాత్రం, అక్కడ స్థానిక ఎంపీ, జగన్ కుటుంబ సభ్యుడు, వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని పంపించారు... అవినాష్‌రెడ్డి పెద్ద ఎత్తున తన కార్యకర్తలను తీసుకురావటంతోనే అక్కడ ఎదో జరుగుతుంది అని పోలీసులు గ్రహించి అలెర్ట్ అయ్యారు...

pulivendula cm 03012018 2

అవినాష్‌రెడ్డి తీసుకొచ్చిన కార్యకర్తలు ఎదో ఒక గొడవ చేస్తారు అని గ్రహించిన పోలీసులు పెద్ద ఎత్తన వారి మీద నిఘా పెట్టారు.. ఇక చేసేది లేక అవినాష్‌రెడ్డి రంగంలోకి దిగారు... ప్రోటోకాల్ ప్రకారం మైక్ తీసుకుని, ఇక్కడ జరిగింది అంతా రాజశేఖర్ రెడ్డే చేసారు అని, మీరు చేసింది ఏమి లేదు అంటూ మొదలు పెట్టారు.. దీంతో ముఖ్యమంత్రి కల్పించుకుని మాట్లాడుతున్నా అవినాష్‌రెడ్డి మాత్రం ఆపటం లేదు... దీంతో ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేస్తూ, ఇది కరెక్ట్ కాదు అని, నేను ఇక్కడకు రాజకీయం చెయ్యటానికి రాలేదు, ఇలా చెప్పుకుంటూ పొతే, నేను చాలా చెప్తాను, ఇది రాజకీయ సభ కాదు, ప్రభుత్వ సభ అంటూ చెప్పారు...

మీకు ఎమన్నా కావలి అంటే చెప్పండి, ఎమన్నా పనులు కావలి అంటే అడగండి ప్రభుత్వం స్పందిస్తుంది అని చెప్తున్నా అవినాష్‌రెడ్డి మాత్రం వినలేదు.... దీంతో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చెయ్యటంతో అక్కడ నుంచి వెళ్ళిపోయారు... తరువాత ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని, అంతా మేమే చేసాము అని చెప్తే కుదరదు అని, ఎవరు చేసారో ప్రజలకు తెలుసు అంటూ, వారికి చురకలు అంటించారు... తరువాత అక్కడ ప్రజా ప్రతినిధులు అడిగిన వినతులకు స్పందించి, పులివెందులకు వరాలు ప్రకటించారు...

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చిత్తూరు జిల్లలో కొనసాగుతుంది... జగన్ పాదయత్రలో పైడ్ ఆర్టిస్ట్ లు దొరుకుతూనే ఉన్నారు... వీరికి ట్రైనింగ్ ఇచ్చే వారిది తప్పో, వీరు సరిగ్గా స్క్రిప్ట్ ఫాలో అవ్వలేదో కాను, మరో సారి అడ్డంగా దొరికిపోయారు... అయితే ఈ ఈవెంట్ లో, చేస్తున్న స్కిట్ లు అన్నీ రివర్స్ అవుతున్నాయి... ప్రతి రోజు పాదయత్ర ప్రారంభానికి ముందు, స్థానికులతో ముఖాముఖి నిర్వహించి, వారి సమస్యలు వినటం అనేది కాన్సెప్ట్... కాన్సెప్ట్ లో ప్రజల సమస్యలు కంటే, చంద్రబాబుని తిట్టటం అనేది ఇంపార్టెంట్ అని పీకే బ్యాచ్ స్క్రిప్ట్ లోని మెయిన్ పాయింట్... కాని, ఈ పైడ్ బ్యాచ్ లు చేసే స్కిట్ లు అన్నీ రివర్స్ అయ్యి, చివరకు సెల్ఫ్ గోల్ అవుతున్నాయి...

paid 03012018 2

నిన్న జగన్ సభలో ఒక మహిళ మాట్లాడుతూ, "జగన్ అన్నా, నాకు 20 ఏళ్ళ నుంచి రేషన్ రావటం లేదు అన్నా... అన్నా నేను ఇక్కడకు నీ అభిమానిగా వచ్చాను, డ్వాక్రా మహిళగా రాలేదు అన్నా" అని తనకు ఇచ్చిన స్క్రిప్ట్ చదివింది.... ఆమె తప్పు చదివిందో, లేక రాసిచ్చిన వారి తప్పో కాని, మొత్తానికి దొరికిపోయింది... ఇందులో ఒకటి 20 ఏళ్ళ నుంచి రేషన్ రావటం లేదు అని ఒక ఇంటెన్సిటీ కోసం చెప్పింది కాని, నిజానికి 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, అందులోనూ ఆరు ఏళ్ళు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు... మరి మాది స్వర్ణ యుగం అని చెప్పుకునే జగన్, అప్పుడు ఆ మహిళకు ఎందుకు రేషన్ ఇప్పించలేదు... ఇక రెండో విషయం అయితే, మామూలు అబద్దం కాదు...

paid 03012018 3

ఆమె మాట్లాడుతూ, "అన్నా నేను ఇక్కడకు నీ అభిమానిగా వచ్చాను, డ్వాక్రా మహిళగా రాలేదు అన్నా"... డ్వాక్రా మహిళగా ఎవరు ఉంటారు ? రేషన్ కార్డ్ ఉన్నవాళ్ళే ఉంటారు... రేషన్ కార్డు ఉంటే, రేషన్ ఆపటం భ్రమ్మ దేవుడు తరం కూడా కాదు... రేషన్ కార్డు లేకుండా డ్వాక్రాలో ఉండటం కుదరదు అనే లాజిక్ మర్చిపోయి స్క్రిప్ట్ అల్లారు... చివరకు దొరికిపోయారు... ఆమె మాట్లడుతూ ఉండగా, జగన్ చాలా అసహనంగా ఉన్నారు... మరి ఆ మాటల్లో డొల్లతనం జగన్ కి అర్ధమైందో ఏమో... మళ్ళీ దొరికాంరా బాబు అనుకున్నారో ఏమో...

మొన్న విశాఖలో ఇద్దరు మహిళలు కొట్టుకుంటే, దళితలు మీద దాడి జరిగిపోయింది అని ఒక కట్టు కధ అల్లి, అదే నిజం అని నమ్మించారు... కాని ఇక్కడ అదే దళిత వర్గానికి చెందిన మహిళను ఎలా కొట్టారో చూడండి... ఇప్పుడు ఏ మీడియాకీ, ఏ నాయకుడుకి వీరు దళితులు అని గుర్తుకు రావటం లేదు... ఒక దళిత మహిళ, అగ్ర కులానికి చెందిన మహిళా అని కాదు... ఆమె ఒక మహిళ... ఆమె రక్తాన్ని కళ్ల చూసారు రౌడీలు... నొప్పిగా ఉంది కొట్టద్దు అంటున్నా వినిపించుకోకుండా, కనీసం మానవత్వం లేకుండా, మహిళను కొడుతున్నాం అనే స్పృహ కూడా లేకుండా, విచక్షణ మర్చిపోయి కొట్టారు... ఇంతకీ ఆమె చేసిన తప్పు ఏంటో తెలుసా ? ఈ వివరాలు చూడండి...

kadapa 03012018 2

అది కడప జిల్లా... ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా... వైఎస్ఆర్ పార్టీ ఎమ్మల్యే రఘురామి రెడ్డి నియోజకవర్గం.. శెట్టివారిపల్లె గ్రామం... తమ ఊరిలో ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తుంది అని, సమస్యలు తీరుతాయి అని, అధికారులని, నాయకులని స్వాగతం పలుకుతూ ప్లెక్సీలు కట్టారు.. అది వారు చేసిన పాపం... నర నరానా ఫ్యాక్షన్ వారస్త్వంతో ఉన్న ఆ మనుషులు ఇది తట్టుకోలేక పోయారు... వారిని రక్త గాయాలు అయ్యేట్టు దాడి చెయ్యడం కాకుండా తెల్లవారే లోపు తొలగించకపోతే చంపేస్తామని బెదిరించారు... దళితులు మా పార్టీకే అనుకూలం అని, మీరు తెలుగుదేశం ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గునకూడదు అని బెదిరించారు...

kadapa 03012018 3

ప్లెక్సీలు వేస్తావా అంటూ వైసీపీకి నాయకులు తమపై దాడి చేశారని శెట్టివారిపల్లెకు చెందిన నాగిపోగు లక్ష్మీ నరసమ్మ ప్రొద్దుటూరు ఔట్‌ పోస్టు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శెట్టివారిపల్లె దళితవాడలో జన్మభూమి గ్రామసభ సందర్భంగా టీడీపీ ఇన్‌చార్జ్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు ఆహ్వానం పలుకుతూ ప్లెక్సీలు వేశామని, దీంతో గ్రామంలోని వైసీపీ నాయకులు పందిటి రమేష్‌, రాజశేఖర్‌, భద్రి, ప్రేమ్‌కుమార్‌, ధీరజ్‌, రాజు, రాజేష్‌ మరి కొందరు కలసి ఇనుపరాడ్లతో మా వాడలోకి వచ్చి కులం పేరుతో దూషిస్తూ నాపై దాడి చేశారన్నారు. తెల్లవారేలోపు ప్లెక్సీలు తీయకపోతే చంపుతాం అంటూ బెదిరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లక్ష్మీ నరసమ్మ పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పని చేసినా వ్యతిరేకించాలి అనే ఆదేశాలు ఒక పక్క... ప్రజా సమస్యలు తీర్చే వేదిక ఒక పక్క... రెండిట్లో ఎదో తేల్చుకోలేక ప్రతిపక్ష పార్టీ ఎమ్మల్యేలు ఇబ్బంది పడుతున్న వేళ, గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మల్యే ప్రజలు సమస్యలు తీర్చే వేదికకే నా ఓటు అని చెప్పి, అధినేత జగన్ కు షాక్ ఇచ్చారు... నిజానికి లోటస్ పాండ్ నుంచి, జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మల్యే నుంచి, క్రింద స్థాయి కార్యకర్తలు దాకా, ఎవరూ పాల్గునకూడదు అనే ఆదేశాలు వెళ్ళాయి... ఇది ప్రభుత్వ కార్యక్రమం అని, తెలుగుదేశం కార్యక్రమం కాదని, మనం కూడా ప్రజలకు దగ్గర అవ్వచ్చు అని కొంత మంది సీనియర్లు చెప్పినా, వారు వినకుండా, ఇది జగన్ ఆదేశం, పాటించాల్సిందే అని చెప్పారు.. అయితే ఈ ఎమ్మల్యే మాత్రం, రివర్స్ లో చేసారు...

lotus pond 03012018 1

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమం మంచిదేనని వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. జన్మభూమి - మా ఊరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని మంగళ్‌దాస్‌నగర్‌, అహ్మద్‌నగర్‌లో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది ఐదో జన్మభూమి అన్నారు. వృద్ధులు, వితంతు, దివ్యాంగులకు పింఛన్లు, రేషన్‌ కార్డులు అందజేశారని, అయితే ఇంకారాని వారు ఎందరో ఉన్నారని వారందరికీ న్యాయం చేయాలన్నారు. ఇదే విధంగా పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు.

lotus pond 03012018 1

అయితే ముస్తఫా వ్యాఖ్యల పై లోటస్ పాండ్ ఆరా తీసింది... మీరు జన్మభూమిలో పాల్గునవద్దు అని ఆదేశాలు ఇచ్చినా ఎందుకు పాల్గున్నారో చెప్పాలి అని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని చెప్పినట్టు సమాచరం... దీనికి ఎమ్మల్యే వివరణ ఇస్తూ, ప్రభుత్వం కోసమో, నా కోసోమో కాదు అని, ఇది ప్రజల వేదిక అని, దీంట్లో ప్రతిపక్షం, అధికార పక్షం అనే తేడా లేదు అని భావించి, ప్రజల సమస్యలు అధికారులకి చెప్పవచ్చు అనే ఉద్దేశంతో పాల్గున్నాను అని వివరణ ఇచ్చారు... దీనికి సంతృప్తి చెందని లోటస్ పాండ్ వర్గాలు, పార్టీ ఏది చెప్తే అది వినాలి అని, మీకు వెళ్లిపోవాలి అని ఉంటే వెళ్ళిపోండి అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం... అయినా ఉన్న నలుగురుని కాపాడుకోవాలి కాని, ఇలాంటి మాటలు ఏంటో...

Advertisements

Latest Articles

Most Read