వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పాదయాత్రకు ఇవాళ అనుకోని బ్రేక్ పడింది... క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు విరామం ప్రకటించారు.. జగన్ సిబ్బంది ఎక్కువ మంది క్రైస్తవులు కావటంతో, పండుగ రోజు కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.. ఇది అన్కోకుండా తీసుకున్న నిర్ణయం కావటంతో, జగన్ శిబిరం రిలాక్స్ అయ్యారు... ప్రతి శుక్రవారం మాత్రమే బ్రేక్ అని ఫిక్స్ అయిన సిబ్బందికి, క్రిస్మస్ పండుగకు సెలవు తీసుకోవటంతో కొంచెం సేద తీరుతున్నారు.. ప్రస్తుతం జగన్ పాదయాత్ర అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. 3వేల కిలోమీటర్లు, ఆరునెలల పాటు జగన్ పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

jagan 25122017

ఇవాళ జగన్ బస చేసిన శిబిరంలోనే జగన్ క్రిస్మస్‌ను జరుపుకోనున్నారు. ఆదివారం రాత్రి ఆయన బస చేసిన శిబిరం వద్దకు తల్లి విజయమ్మ, సతీమణి భారతి, బాబాయి వివేకానందరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు వచ్చి జగన్‌ను కలిశారు. క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పి వారు ఇడుపులపాయకు వెళ్ళిపోయారు. క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా క్రైస్తవ వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు

jagan 25122017

43వ రోజుకు చేరిన జగన్ ప్రజాసంకల్ప యాత్ర గాండ్లపెంట మండలం కటారుపల్లి క్రాస్ రోడ్స్ వద్దకు చేరుకోగానే 600 కిలోమీటర్లకు చేరుకుంది. ఇందుకు గుర్తుగా జగన్ అక్కడ వేప మొక్కను నాటారు. అనంతరం గాండ్లపెంట శివారులో ఏసు కృప చర్చి వద్ద నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. జగన్ పాదయాత్ర రేపు తిరిగి గాండ్లపెంట నుంచి ప్రారంభం అవుతుంది.

ప్రశాంత్ కిషోర్... ఈయన జగన్ ముఖ్యమంత్రి అవ్వటం కోసం, ఎన్నో ప్లాన్లు వేస్తున్నాడు... ఈ నిమషాన జగన్ ఎవరి మాట అన్నా వింటున్నాడు అంటే అది ప్రశాంత్ కిషోర్ మాటే... ప్ర‌శాంత్ కిషోర్ తీసుకునే నిర్ణయాలతో పార్టీకి లాభం కంటే న‌ష్టమే ఎక్కువు జ‌రుగుతుంద‌ని వైసీపీ నేత‌లు వాదిస్తున్నా, జగన్ మాత్రం ఆయన్ని వదలటం లేదు... ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీం, ఏకంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మల్యేలతో సమావేశం అవ్వటం చర్చనీయంసం అయ్యింది. స్థానిక వైసిపి నాయకులని కాదు అని, ప్రశాంత్ కిషోర్ టీం తెలుగుదేశం వాళ్ళ దగ్గరకి వెళ్ళటం వైసిపి నాయకులకి కూడా కోపం తెప్పించింది..

pk tdpo 24122017

వివరాల్లోకి వెళ్తే, ప్రకాశం జిల్లలో బూచేపల్లి కుటుంబం వచ్చే ఎన్నికలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించి వైసీపీకి షాక్‌ ఇచ్చింది. అది పుడ్చుకోవటానికి ఏకంగా తెలుగుదేశం ఎమ్మల్యేనే కలిసింది ప్రశాంత్ కిషోర్ టీం. ప్రకాశం జిల్లా టీడీపీలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల్లో పలువురు నేతలు ప్రత్యర్థి పక్షం వైపు చూస్తున్నట్లు అనుమానాలు రావటంతో ప్రశాంత్ కిషోర్ టీం రంగంలోకి దిగింది.. అధికార పార్టీకి చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలను కలిసి అనేక అంశాలపై ముచ్చటించారు. వైసిపిలోకి రావాలి అని కూడా అడిగారు...

pk tdpo 24122017

అయితే వారి నుంచి సరైన స్పందన రాకపోవటంతో, ప్రశాంత్ కిషోర్ టీం వెనుదిరిగినట్టు సమాచారం. ఆ ఎమ్మల్యేలని కలిసే ముందు, టీడీపీలోని కొందరు నాయకులను వైసీపీలోకి రాబట్టుకుంటే ఒనగూరే ప్రయోజనాలపైపీకే బృందం సర్వే చేసుకుని మరీ వాళ్ళ దగ్గరకు వెళ్ళింది... అయితే, ఈ పరిణామంతో అందరూ అవాక్కయ్యారు... సలహాదారులని, వ్యూహకర్తలని ఇలా కూడా వాడుకుంటారా అని ఆశ్చర్యపోయారు... అవతలి వారు ఎమ్మల్యేలు అన్న విషయం కూడా మర్చిపోయి, ప్రశాంత్ కిషోర్ టీంలో వాళ్ళని పంపటం ఏంటి అని ఆశ్చర్యపోయారు... ఎదో ప్రచారానికి ఇలాంటి వారని ఉపయోగించుకోవటం చూసాం కాని, ఇలా ఏకంగా రాజకీయ చర్చలు కోసం కూడా జగన్ వీళ్ళని వాడటం చూస్తుంటే, ఆయనకు తన సొంత పార్టీ నాయకుల పట్ల ఎంత గౌరవం ఉందో అర్ధమవుతుంది అని అంటున్నారు... మరో వైపు టిడిపి అధిష్టానం, ఈ పరిణామాల పై ఆరా తీస్తుంది...

గుజరాత్ ఎన్నికల్లో, చావు తప్పి కన్ను లొట్ట పోయినా, రాష్ట్ర బీజేపీ నాయకులకు జ్ఞాదోయం అవ్వలేదు... కనీసం వార్డ్ మెంబెర్ గా కూడా గెలవలేని బీజేపీ నాయకుడుగా పేరు ఉన్న సోము వీర్రాజు విర్రవీగుతూ, నేను 2019లో ఏపి ముఖ్యమంత్రి ఎవరో నేను డిసైడ్ చేస్తా అంటూ, గుజరాత్ ఎన్నికల గెలుపు, ఈయన వల్లే అన్నంత బిల్డ్ అప్ ఇచ్చాడు.. కట్ చేస్తే, ఇవాళ తమిళనాడులో బీజేపీ స్థానం ఏంటో చూపించారు... దక్షినాది రాష్ట్రాల్లో బీజేపీ అంటే ఎంత కోపం ఉంది మరో సారి అర్ధమైంది... తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగర పరిధిలోని ఆర్కే నగర్ నియోజకవర్గ ఓటర్లు బీజేపీకి ఊహించని తీర్పు ఇచ్చారు... కనీసం నోటా మీటకు దక్కిన ఓట్లు కూడా సదరు జాతీయ పార్టీకి దక్కకపోవడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది.

veerraju 24122017 2

ఈ రిజల్ట్ చూసి చివరకు సొంత పార్టీ బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి ‘‘తమిళనాడులో బీజేపీ రికార్డు : ఓ జాతీయ పార్టీ ‘నోటా’లో మూడో వంతు ఓట్లతో సరిపెట్టుకుంది. బాధ్యత తీసుకోవాల్సిన సమయం ఇది...’’ అని వ్యాఖ్యానించారు. టీటీడీ దినకరన్ గెలుపు ఖరారైన నేపథ్యంలో, అతి త్వరలోనే అన్నాడీఎంకే, శశికళ వర్గాలు కలుస్తాయని తాను భావిస్తున్నానని, రెండు వర్గాలూ కలిసి 2019 పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తాయని తాను అంచనా వేస్తున్నట్టు కూడా వ్యాఖ్యానించారు.

veerraju 24122017 3

అయితే ఎన్నికల్లో నోటాకు 935 ఓట్లు పడగా.. బీజేపీకి కేవలం 519 ఓట్లు మాత్రమే దక్కాయి. ఇది ప్రజల స్పష్టమైన తీర్పు... 2జీ కేసు తీర్పుతో పాటు, బీజేపీ తమిళనాడు రాజాకీయాలను తన గుప్పిట్లోకి తీసుకోవాలి అనుకోవటం కూడా ప్రజల ఆగ్రహానికి గురైంది.. అందుట్లో ఆర్కే నగర్ నియోజకవర్గ పరిధిలో తెలుగు వారు కూడా చాలా ఎక్కువ... మొన్న ఒకాయిన కాకినాడ వచ్చి మీది 13 జిల్లాల పార్టీ అని హేళన చేసాడు... ఆ సార్ కి ఇప్పుడు అర్ధమైందో లేదో, 29 రాష్ట్రాల పార్టీకి, నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి... అయ్యా వీర్రాజు గారూ, ముఖ్యమంత్రి ఎవరు అనేది తరువాత డిసైడ్ చేయవచ్చు, ముందు కొంచెం జ్ఞానోదయం పెంచుకోండి...

మీరు గమనించారో లేదో, మొన్న పవన్ పర్యటన అయిన దగ్గర నుంచి వైసిపి ఎమ్మల్యే, జగన్ ప్రియ శిష్యురాలు రోజా, చంద్రబాబుని తిట్టటం మానేసి, కేవలం పవన్ మీదే ఫోకస్ పెట్టింది... రోజా మీడియాలో ఫోకస్ అయ్యింది అంటే అది బూతులుతోనే... కాని చంద్రబాబుని తిడుతుంటే రొటీన్ అయిపోయింది.. అందుకే మీడియా కూడా లైట్ తీసుకుంది... అందుకే ఇప్పుడు రోజా ఫోకస్ షిఫ్ట్ చేసి పవన్ పై పెట్టింది... ఇక్కడ రెండు బెనిఫిట్స్ అటు మీడియాతో పాటు, ఇటు పవన్ అభిమానులు కూడా రోజాకి రియాక్ట్ అయ్యి బజ్ క్రియేట్ చేస్తారు. అందుకే రోజా పవన్ ని ఎంచుకుంది... తాజాగా పవన్ ట్వీట్స్ పై స్పందించింది...

roja 24122017 2

నిన్న పవన్ కళ్యాణ్, పెందుర్తి లో దళిత మహిళ పై దాడి చేసిన అంశం పై వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే... అయితే ఇది ఒక బీసీ మహిళ, ఒక దళిత మహిళ కొట్లాట అయినా, సాక్షి మీడియా తప్పుడు ప్రచారంతో, తెలుగుదేశం వాళ్ళ దాడిగా ప్రచారం అయ్యింది.. పవన్ కూడా అదే నిజం అని ట్వీట్ చేసారు. ఇది ఎలా ఉన్నా, పవన్ ఒక విషయం మీద స్పందించారు... దాంట్లో కూడా తప్పు వెతుకుతుంది రోజా... నువ్వు ఇప్పుడు ఎందుకు ట్వీట్ చేసావ్, ఆ విషయం పై ముందు నేను స్పందించా, ఆ క్రెడిట్ అంతా నాదే అని హడావిడి చేస్తుంది..

roja 24122017 3

వెరైటీగా రోజా కూడా సోషల్ మీడియా వేదికగానే రెచ్చిపోయారు.. నీకు ఇప్పుడు విషయం తెలిసిందా... సిగ్గు చేటు.. ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నావ్.. మేము పోరాటం చేస్తే, మా పోరాటం హైజాక్ చెయ్యటానికి వచ్చావా అంటూ, పవన్ పై విమర్శలు గుప్పించింది... దళిత మహిళకు న్యాయం జరిగితే ఆ క్రెడిట్ వైసిపిదే అంటూ రోజా ముందు జాగ్రత్తగా ఖర్చీఫ్ వేసారు. ప్రజా జీవితంలో వున్న ఎవరికైనా జనం ఇబ్బందులు, ప్రభుత్వ వైఫల్యాల మీద స్పందించే అవకాశం ఉంది అనే స్పృహ రోజాకి లేకుండా, మేము మాత్రమే ప్రభుత్వం మీద పోరాడాలి, అంటూ ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలి అనుకుంటున్న వైసీపీకి ఎప్పుడు బుద్ధి వస్తుందో ఏంటో...

నేనే కాబోయే ముఖ్యమంత్రి అంటూ, ముఖ్యమంత్రి కుర్చీ కోసం పాదయత్ర చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, నోటికి ఏమి వస్తే అది చెప్పేస్తున్నారు... అన్నీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ... ఇది ఎంత వరకు వెళ్ళింది అంటే, 45 ఏళ్ళకే మీకు పెన్షన్ ఇస్తా ఇంట్లో కూర్చోండి అనేదాకా వెళ్ళింది...క పక్క కంటెంట్ రైటర్స్, గ్రాఫిక్ డిజైనర్స్, ఫోటోషాప్ ఎక్స్పర్ట్స్ కి తోడు, బీహార్ బ్యాచ్ ఇచ్చిన స్క్రిప్ట్ కి తగ్గట్టు, డ్రామాలు, డైలాగ్స్ రాసే స్క్రిప్ట్ రైటర్స్ కి కూడా మాంచి డిమాండ్ ఉంది.. వీళ్ళు అంతా పెర్ఫార్మన్స్ బాగానే ఇస్తున్నారు కాని, జగన్ మోహన్ రెడ్డి దగ్గర నుంచి, కింద స్థాయి కార్యాకర్తల దాకా, అందరూ లాజిక్ మర్చిపోయి, దొరికిపోతున్నారు...

jagan 24212017 2

ఇప్పుడు తాజాగా, జగన్ ఆరోగ్య శ్రీ పథకం అంటూ కొత్త పధకం అని చెప్పి, వెయ్య రూపాయలు డాక్టర్ బిల్ దాటితే చాలు, ఆరోగ్య శ్రీ పథకం కింద వర్తిస్తుంది అని ప్రకటించేశారు... మీరు అందరూ గెట్టిగా ప్రార్ధన చెయ్యండి, నేనే ముఖ్యమంత్రి కావాలని దేవుడిని కోరుకోండి, నేను ముఖ్యమంత్రి అవ్వగానే, వెయ్య రూపాయలు డాక్టర్ బిల్ దాటితే చాలు, ఆరోగ్య శ్రీ పథకం వర్తింప చేస్తాను అనేసారు..ఈ రోజుల్లో ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళినా, వెయ్య రూపాయలు అవ్వకుండా ఉండదు.. అంటే, దాదాపుగా ఇక డాక్టర్ దగ్గరకు వెళ్తే చాలు, మీకు అన్నీ ఫ్రీ...

jagan 24212017 3

ఇప్పటికే చంద్రబాబు అంత అనుభవం ఉండి కూడా, ఆయన చెప్పిన పధకాలు తీర్చటానికి ఎంతో శ్రమిస్తున్నారు... ఒక పక్క రాష్ట్రానికి డబ్బులు లేవు, మరి జగన్ ఇవన్నీ ఎక్కడ నుంచి తెచ్చి ఇస్తారు ? 45 ఏళ్ళకే పెన్షన్ అంటేనే ఈయన చిత్తశుద్ది అర్ధమవుతుంది, మరి, ఇప్పుడు వెయ్య రూపాయలు దాటికే ఆరోగ్య శ్రీ అంటే, ప్రజలు అసలు నమ్ముతారా ? ఇప్పటి వరకు, అన్నీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ అంటున్నారు కాని, ఒక స్కూల్ కడతాం, ఒక హాస్పిటల్ కడతాం, ఒక రోడ్ వేస్తాం, రాజధాని ఇలా కడతాం, ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు ఇలా కడతాం, అనే మౌలికమైన సమస్యల జోలికి వెళ్ళకుండా, ఫ్రీ ఫ్రీ ఫ్రీ అంటే, ప్రజలు నమ్ముతారా ? ఇవన్నీ ఇవ్వాలి అంటే ప్రభుత్వం ఆదాయం పెంచాలి, నువ్వు అలా ప్రభుత్వ ఆదాయం పెంచుతావ్ అనే భరోసా కూడా ప్రజలకు ఇవ్వాలి కదా ? నువ్వు ప్రజలకి బిస్కట్ వేస్తే, ప్రజలు నీకు క్రీం బిస్కట్ వేస్తారు...

More Articles ...

Advertisements

Latest Articles

Most Read