విభజన మూలంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని కొత్తగా నిర్మించుకోవాల్సి రావడం రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు శ్రమించడం, ఇది చంద్రబాబు వర్క్ స్టైల్... ఏడాదిలో నాలుగు రోజులు మాత్రమే ఆయన కుటుంబ సభ్యులతో విహారానికి వెళ్లడంతో కొద్దిపాటి ఆటవిడుపు కలుగుతోంది.. ఈ సంవత్సరం కూడా, కుటుంబ సభ్యులతో కలిసి నాలుగు రోజులు మాల్దీవుల పర్యటనకు వెళ్లారు... అక్కడ ఉన్నా, ఎప్పటికప్పుడు అక్కడ నుంచి టెలి కాన్ఫరెన్స్ లో, తగు సూచనలు ఇస్తున్నారు.. ఇవాళ రాత్రి చంద్రబాబు వ్యక్తిగత పర్యటన ముగించుకుని వస్తున్న తరుణంలో, ఆయనకు మూడు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి..
ముందుగా పోలవరం విషయంలో జరుగుతున్న పరిణామాల గురించి రివ్యూ చెయ్యనున్నారు... మొన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య పోలవరం పై రివ్యూ చెయ్యటం, రేపటి నితిన్ గడ్కరీ పోలవరం పర్యటన వాయిదా పడటం, ఇవన్నీ సమీక్షంచి తగు సూచనలు చెయ్యనున్నారు... రెండోది, రాష్ట్ర బీజేపీ నాయకులు, ముఖ్యంగా సోము వీర్రాజు లాంటి నాయకులు పెట్రేగిపోయి మాట్లాడుతున్న వ్యాఖ్యలతో, ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందించటం, ఇవన్నీ సమీక్షంచనున్నారు...కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారం పంచుకుంటున్న భాగస్వామ్యపక్షం పొత్తులపై బహిరంగంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం ఇద్దరికి మంచిది కాదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనూ వినిపిస్తోంది..
ఇక మూడో సమస్య సొంత పార్టీ నేతలు అనంతపురంలో చేస్తున్న రచ్చ... ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి , ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మేయర్ మధ్య విభేదాలు రోడ్డుకు ఎక్కి, సంకటంగా మారాయి. ఇప్పటికే చంద్రబాబు వీరికి అనేక వార్నింగ్ లు ఇచ్చారు... కాంగ్రెస్ నుంచి వచ్చిన సంప్రదాయం పార్టీలో కొనసాగడం అంత మంచిదికాదని పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సొంత పార్టీలోనే ఇలాంటి పరిస్థితిని నివారించడానికి ఏం చేయాలన్నదానిపై చంద్రబాబు దృష్టి సారించే అవకాశం ఉంది... ఇక యధావిధిగా రేపటి నుంచి, పొద్దున్నే 6 గంటల నుంచి, రాత్రి 11 గంటల వరకు, ఆయన ఫ్లోలో పని అహర్నిశలు శ్రమించడం మొదలవుతుంది...