ఒక పక్క రాజ్యసభలో కేవలం పోలవరం మీద లిటిగేషన్ ప్రశ్నలు అడిగించారు... అయినా లాభం లేదు... మరో పక్క సాక్షిలో విషం చిమ్ముడు... మరో పక్క సోషల్ మీడియాలో ప్రశాంత్ కిషోర్ బ్యాచ్ తప్పుడు ప్రచారం... ఇన్ని చేసినా, పోలవరంలో చంద్రబాబుని ఫిక్స్ చెయ్యాలి అనే పన్నాగం వర్క్ అవ్వలేదు.. అందుకే నేరుగా రంగంలోకి దిగారు... ఏకంగా కేంద్ర మంత్రితో సమావేశం అయ్యారు.. బయటకి పోలవరం పూర్తి చెయ్యటానికి ఇబ్బందులు ఏంటి అనే విషయం కోసం కలిసాము అని చెప్పినా, లోపల మాత్రం చంద్రబాబుని ఎలా ఫిక్స్ చెయ్యాలి అనేదాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు...
చివరకు పోలవరం మీద కేంద్ర మంత్రి గడ్కరకీ మరిన్న ఫిర్యాదులు ఇచ్చారు... ఆ తలా తోక లేని ఫిర్యాదులు చూసి గడ్కరీ ఫైర్ అయ్యారు... ఇది రాజకీయం చేసే విషయం కాదు.. ఒక్క రోజు కూడా ఈ మహా యజ్ఞం ఆగ కూడదు అని మీ ముఖ్యమంత్రి తపనకు, మా ప్రోత్సాహం అందిస్తున్నాం, మీరు వచ్చి ఎమన్నా సలహాలు ఇస్తారు అనుకుంటే, ప్రాజెక్ట్ మరంత లేట్ చెయ్యాలి అనే విధంగా ఇలా మరిన్ని లిటిగేషన్లు పెడతారు ఏంటి ? మీకు ప్రాజెక్ట్ అవ్వాలి అని లేదా అని వారి మీద ఫైర్ అయ్యారు...
ఈ లోప మరో ఎంపి, సార్ పోలవరంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున అవినీతి చేసింది అని ఆరోపణలు వస్తున్నాయి, ఆ లెక్కలు మాకు ఇస్తారు అని అడగగానే, గడ్కరీ మరింత ఫైర్ అయ్యారు... ప్రతి పైసా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది.. ఖర్చు పెట్టిన బిల్లులు మాకు ఇస్తుంది... ఆ బిల్లులు అన్నీ పరిశీలించి, స్క్రూటినీ చేసి నాబార్డ్ ద్వారా నిధులు ఇస్తున్నాం... మీకు దీంట్లో అవినీతి ఏమి కనిపిస్తుందో నాకు అర్ధం కావట్లేదు.. ఇది రాజకీయం చేసే విషయం కాదు... దయచేసి అర్ధం చేసుకోండి అంటూ, వైసీపీ ఎంపీలకు చురకలు అంటించారు.. 2019 లోపు ఎలా అయినా ఈ ప్రాజెక్ట్ పూర్తి చెయ్యాలి అనే సంకల్పంతో ఉన్నాం, మీకు ఎమన్నా సందేహాలు ఉంటే అడగండి, అంతే కాని, ఇలా ప్రాజెక్ట్ ని అడ్డుకోవటానికి చూడవద్దు అని చురకలు అంటించారు...