సముద్రంలో అలలు... తీరంలో జన తరంగాలు స్వర మాంత్రికుడు ఏఆర్ రహమాన్ మ్యూజిక్ మ్యాజిక్ తో కాకినాడ తీరం మైమరిచిపోయింది. కాకినాడ సాగర సంబరాల సందడి గురువారం ఏఆర్ రెహమాన్ షో తో ఘనంగా ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా కాకినాడలో 'అందరికీ ఆహ్వానం అంటూ రెహమాన్ సంగీత విభావరి ఏర్పాటైంది. దీంతో కాకినాడతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాలు, పక్క జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో సంగీతాభిమానులు కాకినాడకు తరలివచ్చారు. దాదాపు 3 లక్షల మంది ప్రజలు పాల్గుంటే, మన హైదరాబాద్ మీడియా చానల్స్ కనీసం ఒక సెకండ్ల న్యూస్ కూడా ఇవ్వలేదు...

rahman 22122017 2

పలువురు రాష్ట్ర స్థాయి అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు తమ కుటుంబ సభ్యులతో సహా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. షో ప్రారంభమయ్యే సరికి సుమారు మూడు లక్షల మంది జనం ఎన్టీఆర్ బీచ్ కు చేరుకున్నారు. రెహమాన్ వేదిక పైకి రాగానే ఒక్కసారిగా ఉర్రూతలూగారు. రాత్రి 7.30 గంటల నుంచి మూడున్నర గంటలపాటు రెహమాన్ షో సాగింది. తెలుగు, హిందీ పాటలతో రెహమాన్, ఆయన బృందంలోని గాయకులు ప్రేక్షకులను మంత్రముగుదుల్ని చేశారు.

rahman 22122017 3

ఈ సందర్భంగా అత్యద్భుతమైన సాంకేతిక తతో వేదికపై స్క్రీన్ లు, ఆధునిక సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రెహమాన్ నీ మంత్రులు యనమల , నిమ్మకాయల చినరాజప్ప అయ్యన్నపాత్రుడు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సత్కరించారు. అయితే, ఈ విషయం తెలిసిన చాలా మంది సామాన్య ప్రజలు, ఏ ఛానల్ అన్నా లైవ్ ఇస్తారేమో అని చాలా ఆశగా చానల్స్ మార్చి మార్చి చూసినా, పనికిమాలిన లైవ్ చర్చలు ఇచ్చారు కాని, ఒక్కరు కూడా ఈ ఈవెంట్ లైవ్ ఇవ్వలేదు... కనీసం న్యూస్ ఐటెంగా కూడా వెయ్యలేదు... ఏమి చేస్తాం మన ప్రాప్తం అంత వరుకే...

ఆర్టీసీకి కొత్త అస్త్రాలు వచ్చి చేరుతున్నాయి... నగరాల్లో కాలుష్యం తగ్గించేందుకు ఆర్టీసీ ఇంతకు ముందు గ్యాస్ తో నడిచే బస్సులు నడిపింది... వివి విజయవంతం అవ్వటంతో, వాటి కంటే సమర్ధవంతమైన, ఎలక్ట్రిక్ బస్సుల వైపు ఆర్టీసీ చూస్తుంది... దీని కోసం గోల్డ్‌స్టోన్‌ కంపెనీకి చెందిన ఎలక్ర్టిక్‌ బస్సును కొనుగోలు చేసింది. నూరుశాతం ఎలక్ర్టిక్‌ ఆధారితంగా మార్కెట్లోకి వచ్చిన ఈ బస్సును ప్రయోగాత్మకంగా ఆర్టీసీ నడపాలని నిర్ణయించింది. బుధవారం ఈ బస్సు విజయవాడ డిపో గ్యారేజీకి వచ్చింది.

apsrtc 22122017 2

రిజిస్ర్టేషన్‌ పూర్తయిన తర్వాత గన్నవరం, వెలగపూడి మధ్య ఆర్టీసీ ప్రయోగాత్మకంగా నడుపుతుంది. ట్రయల్‌ విజయవంతమైతే.. మరిన్ని ఎలక్ర్టికల్‌ బస్సులు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులను తిప్పనుంది... ఎలక్ర్టికల్‌ బస్సు కాబట్టి పొగ రాదు. దీనికి ప్రత్యేక ఇంజిన్‌ అంటూ ఏమీ ఉండదు. పూర్తిగా విద్యుత్‌రీ ఛార్జితో పనిచేస్తుంది. ఈ బస్సులో శక్తివంతమైన బ్యాటరీలు ఉంటాయి. ఈ బ్యాటరీలకు నాలుగు గంటల పాటు ఛాంగ్‌ పెడతారు. విజయవాడ డిపో గ్యారేజీలోనే తాత్కాలికంగా ఛార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశారు.

బ్యాటరీ బస్సుల ప్రత్యేకతలు ఇవీ... వాయు కాలుష్యానికి దోహదపడే ఎలాంటివి ఈ బస్సు నుంచి విడుదల కావు... బస్సు ఆకర్షణీయంగా, సౌకర్యవంతంగా ఉంటుంది... క్యాతోడ్ మెటీరియల్ తో శక్తివంతమైన బ్యాటరీల తయారీ... శక్తివంతమైన చార్జింగ్ వ్యవస్థను కలిగి ఉండటం వల్ల వేగంగా చార్జింగ్ అవుతుంది... ఒక్కసారి చార్జింగ్ పెడితే 350 కిలోమీటర్లు నడుస్తుంది... బస్సులో మొత్తం 47 సీటింగ్‌ ఉంటుంది. ..ఈ బ్యాటరీ మేనేజ్ మెంట్ సిస్టమ్ (బీఎంఎస్) ఉంది... బ్యాటరీ సేఫ్టీని ఇది పరిసీలుస్తుంది... ఫైర్ సేఫ్టీ బ్యాటరీలు ఏర్పాటు చెయ్యటం మరో ప్రత్యేకత.... కుదుపులు లేని ప్రయాణం కోసం ఎయిర్ సస్పెన్షన్ వ్యవస్థ... ఆన్ బోర్డు మ్యాప్, నేవిగేషన్ వ్యవస్థలు ఉంటాయి... సిసి కెమెరా పర్యవేక్షణ... ఇది పూర్తిగా శబ్ద రహిత బస్సు. ఈ బస్సు స్టార్ట్‌ చేసినది మొదలు.. ప్రయాణంలో ఎక్కడా కూడా శబ్దం రాదు...ఈ బస్సుకు డోర్స్‌ అన్నీ పడితేనే స్టార్ట్‌ అవుతుంది.

వర్చ్యువల్ రియాలిటీ, ఇంటర్నెట్ అఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ... ఇవన్నీ మాట్లాడుతుంది, ఈ టెక్నాలజీలు వాడుతుంది, ఏ మైక్రోసాఫ్ట్, గూగులో అనుకునేరు... ఇవన్నీ మాట్లాడుతుంది, ఇంప్లిమెంట్ చేస్తుంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి... మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు... టెక్నాలజీ పట్ల, ఆయనకు ఉన్న అవగాహన, టెక్నాలజీ ఉపయోగించుకుని సమర్ధవంతమైన పరిపాలన చెయ్యటం, టెక్నాలజీతో ఉద్యోగాల కల్పన ఇవన్నీ చూశాం... ఇప్పుడు, ఈ టెక్నాలజీతో ప్రజలను అనుసంధానం చేస్తూ, ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఈ నెల 27న భారత రాష్ట్రపతి అమరావతిలో ప్రారంభించనున్నారు.. రాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తి, ఒక రాష్ట్ర కార్యక్రమానికి రావటం అంటే చాలా అరుదు... ఇంతలా పరిపాలనలో సాంకేతికతను జోడించిన రాష్ట్ర ప్రభుత్వ పనితీరు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను విశేషంగా ఆకట్టుకుంది. అందుకే ఆయన స్వయంగా రావటానికి ఒప్పుకున్నారు.

rastrapati 22122017 2

రాష్ట్ర పర్యటనకు వస్తున్న రాష్ట్రపతి, రాష్ట్రంలో చంద్రబాబు అవలంభిస్తున్న టెక్నాలజీ అంశాలపై ప్రత్యేకంగా ఆరా తీయబోతున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలను రాష్ట్రపతి ఇప్పటికే ఆయన తెప్పించుకున్నారు. రాష్ట్రపతి పర్యటనలో పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనులను రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ ద్వారా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వీక్షించనున్నారు. అదే విధంగా ఫైబర్‌గ్రిడ్‌ ప్రారంభించే సమయానికి ఆయా ఇళ్లల్లో టీవీలు ఆన్‌చేసుకుని ఉన్నవారితో రాష్ట్రపతి ముఖాముఖి మాట్లాడే వీలుంది. అటు నుంచి కూడా, ప్రజలు రాష్ట్రపతితో మాట్లాడతారు..

rastrapati 22122017 3

తరువాత, ఉండవల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టిన వర్చువల్‌ క్లాస్‌రూంని పరిశీలిస్తారు. ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి రాష్ట్రపతి విద్యుత్‌ కారులో వెళ్తారు. సచివాలయంలో ఉండే రియల్‌టైమ్‌ గవర్నెర్స్‌ కార్యాలయంలో రాష్ట్రపతి దాదాపు గంటసేపు ఉంటారు. సాంకేతికతను ఉపయోగించి ఉద్యోగులు, సంక్షేమ పథకాల లబ్దిదారులతో ఎలా మాట్లాడుతున్నది చంద్రబాబు వివరిస్తారు. పాలనలో వేగం, కచ్చితత్త్వం తెచ్చేందుకు ఈ కేంద్రం ఎలా ఉపయోగపడిందన్న విషయాలను వివరిస్తారు.

పోయిన నెలలో, దేశ ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడు పర్యటనలో, డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని కలిశారు. ఆయన ఇంటికి వెళ్లి మరీ కరుణానిధి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్న మోదీ.. దాదాపు 15 నిముషాల పాటు డీఎంకే అధినేతతో ఆయన మాట్లాడారు. అంతే కాదు, కరుణానిధిని, ఢిల్లీలో ఉన్న ప్రధాని నివాసంలోకి వాచ్చి కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమన్నారు మోడీ... ఈ కలయిక అప్పట్లో సంచలనం అయ్యింది... ఒక పక్క 2జీ లాంటి పెద్ద కేసులో నిందితులగా ఉన్న వారి దగ్గరకు మోడీ ఎలా వెళ్తారు అని విమర్శలు వచ్చాయి... అయితే నిన్న అసలు 2జీ స్కాం జరగలేదు అని సిబిఐ కోర్ట్ తేల్చి చెప్పటంతో, అందరికీ విషయం అర్ధం అయ్యింది...

jagan 22122017 2

నిన్నటి నుంచి జగన్, మోడీ-కరుణానిధి కలిసి ఉన్న ఫోటోలు చూసి, ఒకటే విషయం ఆలోచిస్తూ, తన సహచరులు దగ్గర, ఒక విషయం చెప్తున్నారు అంట... మా తాత రాజా రెడ్డి కూడా ఉండి ఉంటే, ఈ కరుణానిధి లాగే ఒక నల్ల కళ్ళ అద్దాలు పెట్టి కూర్చోబెడితే, ఎదో ఒక రోజు మోడీ గారు, లోటస్ పాండ్ వచ్చి, రాజా రెడ్డి గారు, మీరు వచ్చి ఢిల్లీలో నా ఇంట్లో రెస్ట్ తీసుకోండి అని ఉండే వారు, అని జగన్ అంటున్నారు అంట... ఆ ఫోటో చూసిన ప్రతి సారి జగన్ రియాక్షన్ అదే అంట... అందుకే ఆ ఫోటో కనపడనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు...

jagan 22122017 3

ఏది ఏమైన జగన్ కు ఆ ఆశ ఉండటంలో తప్పు లేదు అనిపిస్తుంది... అప్పుడు తాను A1గా ఉన్న 11 కేసుల్లో కూడా ఏమన్నా సేఫ్ అవుతాడు ఏమో అని ఆశ.. ఇప్పడు రాజ రెడ్డి లేడు కాబట్టి, ఆ బాధ్యత విజయసాయి రెడ్డికి అప్పచెప్పారు జగన్... విజయసాయి దగ్గరకు ప్రధాని వచ్చి ఇంటికి రమ్మని రెస్ట్ తీసుకోమని చెప్పటానికి కాదు, ఢిల్లీలో విషయలు చక్కబెట్టటానికి... ఇప్పటికే అదే ప్రయత్నంలో ఉన్నారు విజయసాయి... ఆయన A2 కదా, జగన్ లాంటి A1 ఏమి చెప్తే అది వినాలి మరి... లేకపోతే ఇద్దరికీ కలిపి పడుద్ది...

Advertisements

Latest Articles

Most Read