నవ్యాంధ్రకు మరో కార్ల తయారీ కంపెనీ వస్తుంది... జర్మన్ స్టార్ట్ అప్ కంపెనీ మాగ్నమ్ పిరెక్స్ (Magnum Pirex) అనే కంపెనీ భారతీయ మార్కెట్లోకి ప్రవేశించడానికి , ఆంధ్రప్రదేశ్లో సుమారు $ 15.5 మిలియన్ (INR 100 Cr) పెట్టుబడితో ఎలక్ట్రిక్ కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. బ్యాటరీ శక్తితో తయారైన స్పోర్ట్స్ కార్లు, ఫ్యామిలీ కార్స్ మరియు చిన్న ట్రక్కులను ఇక్కడ తయారు చెయ్యనున్నారు. మాగ్నమ్ పిరెక్స్ CEO హుబెర్ట్ మేన్చెర్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసారు. ఈ సమావేశంలో, చంద్రబాబు నాయుడు సమగ్ర ప్రాజెక్ట్ ప్రతిపాదనను సమర్పించమని కోరారు.

car 19122017 2

మాగ్నమ్ పిరెక్స్ CEO చెప్పిన ప్రకారం, ఈ కంపెనీ సంవత్సరానికి 12,000-15,000 ఎలక్ట్రిక్ కార్లను ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. భారతదేశంలో సంవత్సరానికి 1,00,000 యూనిట్లు వరకు తయారు చేయడం మా లక్ష్యం అని ఈ సంస్థ చెప్తుంది. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లో 22 ఎకరాల భూమిని కోరుతోంది. సులభంగా దిగుమతులు మరియు ఎగుమతులకు, పోర్ట్ దగ్గరగా ఉండే భూమి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడుగుతుంది. సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక వచ్చిన తరువాత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నీ పరిశీలించి, భూమి ఇవ్వనుంది.

car 19122017 3

ఇప్పటికే నవ్యాంధ్రలో ఇసుజు, హీరో మోటోకార్ప్, కియా మోటర్స్ వంటి ఆటోమోటివ్ జెయింట్స్ తో పాటు, ఇటీవల టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ తో జరిగిన ఒప్పందంలో అమరావతి నగరంలో ఎలక్ట్రిక్ వాహనాలను అందించేందుకు ముందుకు వచ్చాయి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలను ఆకట్టుకుంటానికి ప్రత్యేక విధానాలను ప్రవేశపెడుతున్న కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ వంటి రాష్ట్రాలకు ధీటుగా, ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టిన నూతన విధానంతో, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు మన రాష్ట్రం వైపు ఆకర్షితులు అవుతున్నాయి.

గుజరాత్ లో బీజేపీ గెలిచింది అంటే, అది నా వల్లే అన్నంత బిల్డ్ అప్ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత, ఎమ్మల్సీ సోము వీర్రాజు... 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనేది మేమే నిర్ణయిస్తామని కామెడీ చేశారు.. ఎవరు ఆపినా ఇది ఆగదు అని, ఇది జరిగి తీరుతుంది అని అన్నారు.. తెలుగుదేశంతో పొత్తు ఉన్నా, మేము వారికి ఎన్ని సీట్లు కావాలో ఇస్తాం కాని, వారు ఇస్తే మేము తీసుకోము అని అన్నారు... గుజరాత్ లో 8 శాతం ఓట్లతో గెలిచామని, ఇక్కడ తెలుగుదేశం ముక్కి మూలిగి 2 శాతం ఓట్లుతో మాత్రమే గెలిచింది అని అన్నారు.... తెలుగుదేశంతో కలిసి వీరు పోటీ చేసింది మర్చిపోయారు.. సోము మాటలకు, తెలుగుదేశం పార్టీ నాయకుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ మండిపడుతూ, తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

cbn 19122017 2

‘ఏదో సినిమాలో హీరో అంటాడు ‘ఎప్పుడొచ్చామనేది కాదు అన్నయ్యా, బులెట్ దిగిందా? లేదా?’ అని.. అలానే, ఎంత పర్సంట్ కాదు కావాల్సింది వీర్రాజు గారు.. గెలిచామా? లేదా? అనేది ముఖ్యం. ఎవరు ఎలా గెలిచారనే దానిని ప్రజలు చూస్తున్నారు. గుజరాత్ ఎన్నికలు ఎలా జరిగాయి? అక్కడ ఏం జరుగుతోంది? ఆంధ్రాలో ఏం జరుగుతోంది? అనేవి పత్రికల్లో, మీడియాలో వస్తున్నాయి. టీడీపీని ఎక్కడ పెట్టాలి? బీజేపీని లేదా ఇంకెవరినైనా ఎక్కడ ఉంచాలనే దానిని అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు’ అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ వ్యాఖ్యలు తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఊహించని విధంగా స్పందించి, తన పెద్దరికాన్ని నిలబెట్టుకున్నారు...

cbn 19122017 3

సోము వీర్రాజుని లైట్ తీసుకుని, సొంత పార్టీ నేత వైవీబీ రాజేంద్రప్రసాద్‌ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సోము వీర్రాజు లాంటి వారు చేసే వ్యాఖ్యలను వారి విచక్షణకే వదిలివేయాలని, మనం మిత్ర ధర్మం పాటిస్తున్నాం అని, ఇలా మాట్లాడవద్దు అని చంద్రబాబు అన్నారు. పార్టీ అనుమతి లేకుండా బీజేపీ నేతలపై ఎవరూ స్పందించవద్దని టీడీపీ నేతలకు చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు. సోము వీర్రాజు తెలుగుదేశం పార్టీ బలంతో ఎమ్మల్సీ అయిన విషయం మర్చిపోయారు అని తెలుగుదేశం పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆయనకి వ్యక్తిగత ఎజెండా ఉంది అని, ఆయన ట్రాప్ లో పడవద్దు అని పార్టీ వర్గాలకు చెప్తున్నాయి.. ఇంత దిగజారి మాట్లాడినా, చంద్రబాబు ఎంతో హుందాగా స్పందించారు అని, చంద్రబాబు లాగే, ఆయన వాగుడుని, ఆయన విచక్షణకే వదిలెయ్యాలి అని తెలుగుదేశం పార్టీ నాయకులకి ఆదేశాలు వెళ్ళాయి..

హైదరాబాద్‌ వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎల్బీ స్టేడియంలో ఇవి జరుగుతున్నాయి. కానీ తెలుగు మహాసభలకు ఆంధ్రప్రేదేశ్ ముఖ్యమంత్రికి ఆహ్వానం లేక పోవటం ఆశ్చర్యం కలిగించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకదానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తోన్న చంద్రబాబు పేరు రాష్ట్రపత్రి ప్రసగించనున్న ముగింపు సమావేశాల్లోనూ కనిపించకపోవడం ఆశ్చర్యకరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధికి, తెలుగు భాష వికాసానికి తన వంతు కృషి చేశారు. హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి చంద్రబాబు ఘనతే అని కేటీఆర్ ఇటీవలే బాబుపై ప్రశంసలు గుప్పించారు. కానీ తెలుగు మహాసభలకు మాత్రం ఆయన్ను ఆహ్వానించక పోవడం గమనార్హం.

kcr 18122017 2

అయితే ఇప్పటికే, ఈ విషయం పై, అందరూ కెసిఆర్ ని విమర్శిస్తూ వస్తున్నారు... ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు అయితే, చాలా కోపంగా ఉన్నారు.. గరికపాటి లాంటి అవధానులు కూడా, మా ముఖ్యమంత్రిని పిలవకుండా, నేను ఎలా వస్తాను అంటూ, వారి ఆహ్వానాన్ని కూడా తిరస్కరించారు... ఇది ఇలా జరుగుతూ ఉండగానే, స్వయంగా తెలంగాణా రాష్ట్రంలోనే ఈ విషయం పై కెసిఆర్ పై విమర్శల దాడి మొదలైంది... తెలంగాణా రాష్ట్ర పరువు తీస్తున్నారు అంటూ, సొంత మనుషులే కెసిఆర్ ని తిడుతున్నారు... కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ వీహెచ్, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును తెలుగు మ‌హాస‌భ‌ల‌కు ఆహ్వానించ‌క‌పోవ‌డంపై మండిప‌డ్డారు...

kcr 18122017 3

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమరావతి శంకుస్థాపనకు పొరుగు రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను చంద్రబాబు ఆహ్వానించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇలాంటి మంచి సంప్ర‌దాయాన్ని ప్రోత్స‌హిస్తూ తెలుగు మహాసభలకు చంద్రబాబుని కేసీఆర్ ఎందుకు ఆహ్వానించలేదని ఈ సందర్భంగా వీహెచ్ ప్రశ్నించారు. ‘పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు వారు కాదా?` అని వీహెచ్ సూటిగా ప్ర‌శ్నించారు. తెలుగు మ‌హాస‌భ‌ల‌ను తాము త‌ప్పుప‌ట్టడం లేద‌ని తెలిపిన వీహెచ్ అవి జ‌రుగుతున్న తీరు ప‌ట్ల‌నే త‌మ అభ్యంత‌ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

విజయవాడ వాసుల మరో కల త్వరలోనే తీరబోతోంది... పని సైలెంట్ గా సాగిపోతుంది... విజయవాడ తూర్పు MLA గద్దె రామ్మోహన్ కృషితో, నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి, ఎన్నో వ్యయ ప్రయాసలు తట్టుకొని, కృష్ణ నది ఒడ్డున ఉన్న కృష్ణలంక ప్రాంత వాసుల ముంపు శాశ్వతమైన నివారణకు కరకట్టకు రిటైనింగ్ వాల్ పనులను జోరుగా సాగుతున్నాయి. దీనికి ముఖ్యమంత్రి సహకారం ఉండటంతో, కల ఫలిస్తుంది. విజయవాడ నగరంలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో లక్ష మంది ప్రజల చిరకాల స్వప్నం ఇది. నదికి వరదలు వస్తే, కృష్ణాతీరం ఒణికి పోతుంది.

krishna lanka 18122017 2

నీట మునిగిన ఇళ్లను వదిలి, రోజుల తరబడి పునరావాస శిబిరాల్లో మగ్గుతూ అంతులేని వ్యధను అనుభవించే లోతట్టు ప్రాంత ప్రజలకు రక్షణ ఇది. వీరి కషాలకు చరమగీతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన మహా యజ్ఞం ఈ రక్షణ గోడ. ఎన్నికల హామీగా మిగిలిపోయిన ఈ రక్షణ గోడను నిజం చేస్తూ చేపట్టిన నిర్మాణ పనులు మొదటి దశ ముగింపు దశకు వస్తున్నాయి. యనమలకుదురు నుంచి కనకదుర్గ వారధి వరకు ఈ గోడను నిర్మిస్తున్నారు. యనమలకుదురు నుంచి కనకదుర్గ వారధి వరకు ఐదు కిలోమీటర్ల మేర భారీ రక్షణ గోడను నిర్మించటానికి ఇరిగేషన్ శాఖ ప్రణాళికలు రూపొందించింది.

krishna lanka 18122017 3

రక్షణ గోడను నిర్మించటానికి రూ. 545 కోట్ల వ్యయంతో అంచనాలను రూపొందించింది. తొలిదశలో దాదాపు సగ దూరం (2.1 కిలోమీటర్ల) రక్షణ గోడ నిర్మాణానికి రూ. 164 కోట్ల నిదులను ప్రభుత్వం విడుదల చేసింది. తొలిదశలో భాగంగా యనమలకుదురు నుంచి బాలాజీ నగర్ వరకు 2.1 కిలో మీటర్ల మేర రక్షణ గోడ నిర్మాణ పనులు చేపట్టారు. కనకదుర్గ వారధి నుంచి యనమలకుదురు వరకు పాతిక వేల కుటుంబాలు ఉన్నాయి. లక్ష మంది ప్రజలు నివసిస్తున్నారు. రక్షణ గోడ నిర్మాణంతో వరద భయం ఈ ప్రాంత ప్రజలకు ఉండదు.

Advertisements

Latest Articles

Most Read